ఒక్క పది నిమిషాలు వెలుగు చూడకపోతేనే అంధకార బంధరం అంటూ ఉంటాం
చీకట్లో చిరుదివ్వెలు అని అంటూ ఉంటాం.. మనం.
కన్నులుండి చీకటిని చూడటానికి భయపడి.. వెలుగు వైపు వెతుక్కునే మనం..
అసలు వెలుగునే కనలేని ఒక వ్యక్తి.. తన భావోద్వేగాల్ని..వెలిబుచ్చి.. ఇతరుల సాయంతో.. అందమైన కవితలని..మన ముందుకు తెస్తుంటే.. అభినందిద్దామని అనిపించదూ!
"వెలుగుపూలు " పేరుతో.. తన ఆత్మ విశ్వాసాన్ని అక్షరాలగా వెదజల్లే.. ఈ బ్లాగ్ ని చూడండి..మనకి మరో లూయిస్ బ్రెయిలీ,హెలెన్ కెల్లర్, కాంప్‌బెల్ గుర్తుకురావడం లేదు..!
14 కామెంట్లు:
మంచి బ్లాగ్ పరిచయం చేసారండి
వనజ వనమాలి గారు ముందు మీరు నన్ను క్షమించాననండి..
క్షమించారా ..
అమ్మయ్యా.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాను.
మహిళాదినోత్సవం నాడు మీరిచ్చిన బహుమతిని తీసుకుని
చూసారా కనీసం మీకు కృతజ్ఞతలైనా చెప్పకుండా ఎలా వున్నానో చూసారా.
మీ మంచి బహుమతి ఎంత బాగుందో .
ఇప్పుడు నాపేరు నేనే గూగుల్‌లో చూసుకుంటూంటే మీ బహుమతి బయటికొచ్చిందండీ..
సంతోషమూ
దానివెంటే పశ్చాత్తాపమూ ..
మీకు చెప్పేసాగా ఇంకేం పర్లేదు..
హమ్మయ్య
ఓ బరువు దిగిపోయిందండీ
వుండనా..
పుట్టపర్తి అనూరాధ
అనూరాధ గారు.. నమస్తే..బాగున్నారా?
అయ్య.. గారి సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకు రావాలనే ప్రయత్నం తప్పక నెరవేరుతుంది.
మీకొక విషయం చెప్పాలి. ప్రొద్దుటూరులో నాకొక ప్రాణ మిత్రురాలు ఉన్నారు. మేము ఎప్పుడూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటాం. నా స్నేహితురాలి ఇల్లు అగస్తీస్వర ఆలయంకి సమీపంలోనే! అయ్య గారి విగ్రహం,ఆ ఆలయం గుర్తుకు వస్తే చాలు..శివతాండవం కళ్ళ ముందు కదలాడుతుంది.
ఆకాశ వాణి విజయవాడ కేంద్రం వారు.. "శత వసంత సాహితీ మంజీరాలు" లో భాగంగా .. "శివతాండవం" ని పరిచయం చేసారు. ప్రయాగ వేదవతి గారు.. కంచు కంఠం ఇప్పటికి నా చెవుల్లో మధురంగా మారుమ్రోగుతుంటుంది. మిమ్మల్ని తప్పక నేను కలుస్తాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.
శివ కృప కటాక్ష ప్రాప్తిరస్తు!!
svk ramesh gaaru.. Thank you very much.
velugupoolu Blog ni choosthoo undandi.
manchi blog ni parichayam chesaru vanajavanamaligaaru. I am adding this blog to my blog list in Bloglokam. Thanks for sharing again.
వనజ వనమాలి గారు బ్లాగ్ ను పరిచయం చేసినందుకు అబినందనలు ... మీరు దాదాపు అన్ని బ్లాగ్స్ చుస్తుంటారని అనుకుంటున్నాను . వాటిలో మీకు నచ్చిన బ్లాగ్ ను సమీక్షించి పరిచయం చేసే శీర్షిక ప్రారంభిస్తే బాగుంటుందేమో ఆలోచించండి ..
అబ్బ మీ పిలుపు ఆప్యాయత ఎంత బాగున్నాయండీ
ఎందరో మా నాన్న గారి అభిమానులున్నారు..
ఆయన అలా జన్మ ధన్యం చేసుకొని వెళ్ళిపోయారు.
మేమిలా మిగిలాం కాగితపు పూవుల్లా..
వనజ గారు.. మీ ఓపికకి,స్నేహశీలతకి అభివందనం.
మీ పనుల ఒత్తిడిలో కూడా ఇతరులకు టైం ఉంచి వారికి సాయం చేస్తున్నందుకు మీకు అనేక అభినందనలు.
Anuradha gaaru.. once again Thank you very much.
Hitaishi.. Thank you very much for your compliment.
But,I am a simple Women.:)
లాస్య రామకృష్ణ గారు.. వెలుగు పూలు బ్లాగ్ ని బ్లాగ్ లోకం లో చేర్చినందుకు ధన్యవాదములు.
అర్హత ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి చేతనైన సాయం చేయడం.మన వంతు కదా! ఆ బ్లాగ్ నిర్వాహకుల ఆకాన్క్షకి మనమందరం ఉడతా చేయూత నిద్దామని నా ప్రయత్నం.
బుద్దా మురళి గారు.. మీ అభిమాన పూర్వకమైన సూచనకి ధన్యవాదములు. బ్లాగ్ చదవడం మినహా.. బ్లాగర్లతో నాకు ఎలాంటి పరిచయం లేదు. ఇద్దరు ముగ్గురు తప్ప. అయినా.. బ్లాగులని సమీక్షించ గల అనుభవం నాకు లేదు. ఆ పని ఇంకెవరైనా చేస్తే బావుంటుంది. నాకు సమయాన్ని బట్టి చదవడం,వ్రాసుకోవడం ఇష్టం అంతే! :)
ధన్యవాదములు.
"కనులున్న మనసుకు కనిపించే బ్లాగు" ని పరిచయం చేసారు.. అభినందనలు..
బ్లాగ్ పరిచయం బాగుంది .తాంక్ యు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి