28, నవంబర్ 2012, బుధవారం

"హిమ్మత్ హై జీనే కి" నిర్మల

మనమైతే చేయగలమా ..ఇలా..? అభినందించి స్ఫూర్తి పొందుదాం రండి ... వనజ తాతినేని


"హిమ్మత్ హై జీనే కి"  నిర్మల

ఆడపిల్ల పుడితే విసిరి పారేసే ఈ సమాజంలో.. ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోవడం విచారకరమే కాదు అమానుషం కూడా!

కంటేనే తల్లి అని అంటే ఎలా.. !? డా ||  సి.నా.రె .. గారి గీతం ఎంత అర్ధవంతంగా ఉంటుందో..అన్నది.. ఈ స్పూర్తికరమైన వాస్తవ కథ చదివినప్పుడు నాకు అనిపించింది.

ఈ వాస్తవ కథ చూడండీ!!..

అది అక్టోబర్ 2010 లో ఒక చల్లని ,  నిశ్శబ్దంగా  ఉన్న మధ్యాహ్న  సమయం.

నిర్మల అనే ఆమెది  Savansa  అనే ఒక చిన్న గ్రామం.  ఉత్తరప్రదేశ్  రాష్ట్రంలో జౌంపూర్ జిల్లా లో  ఈ  గ్రామం ఉంది. (కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC), Maharajganj బ్లాక్ దగ్గర)

నిర్మల  తల్లి ఒక 'డై', లేదా శిక్షణ పొందిన మంత్రసాని  ఆరోగ్య కేంద్రంలో పని చేస్తూ ఉంటుంది. ఆమెని కలవడానికి నిర్మల నడుచుకుంటూ వెళుతుండగా  ఆమెకి ఒక శిశువు రోదిస్తున్న శబ్దం  వినవచ్చింది.

ఆ ధ్వని ఎక్కడ నుండి వస్తుందో..అర్ధం కాలేదు.  ఆమె చుట్టుప్రక్కల చూస్తూ ఉంది. ఆ శబ్దం ఆ ఆరోగ్య కేంద్రం లోపల ఉన్న స్టోర్ రూమ్ వైపు నుండి వినవస్తుందని  తెలుసుకుంది. అక్కడికి వెళ్లి చూసింది.

ఆ గది ఉపయోగంలో కూడా లేదు. కిటికీలు విరిగిపోయి..చుట్టూత ఉన్న చెట్ల నుండి రాలిన ఆకులు,చెత్త చెదారంతో నిండి ఉంది.ఆమె ఆ గది తలుపు తెరిచి చూసి కెవ్వున  కేకవేసింది.

అక్కడ చూస్తే అప్పుడే పుట్టిన బిడ్డ చిరిగిన పాత చొక్కాలో చుట్టబడి..పగిలిన గాజు పెంకులపైకి విసిరివేయబడి ఉంది. ఆ పసి బిడ్డ చాలా సేపు నుండి ఏడ్చి ఏడ్చి ఉన్నట్లు నీలంగా మారిన శరీరం. ఎండిపోయిన నోరు చెపుతుంది. వెంటనే ఆమె ఆబిద్దని చేతిలోకి తీసుకుని ఆ బిడ్డకి తన స్తన్యాన్ని అందించింది.. అప్పటికి నిర్మలకి ఒక ఆరునెలల వయసు ఉన్న పాప ఉంది  అందుకే ఆమె తన స్తన్యం ఇవ్వడం వీలయింది.

.తర్వాత ఆ పాడుబడిన శిదిలాల మధ్య పడి  ఉన్న ఆ పసి పాపని తీసుకుని ఆ బిడ్డ ఎవరి బిడ్డో.. అని కనుగొనే ప్రయత్నం చేసారు.ఆ బిడ్డ తల్లి దండ్రులు ఎవరైనది ఎవరు చెప్పలేక పోయారు.దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకు వెళ్లి బిడ్డ గూర్చిన సమాచారం అడిగి అడిగి అలసి పోయారు.

చివరికి, నిర్మల బిడ్డ ని ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఆమె ఉంటున్న గ్రామం లో  (Savansa వద్ద)  పిల్లల సంరక్షణ కోసం సరైన సౌకర్యం లేకపోవడంతో ఆమె నగరంలో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోం వద్ద  ఆ పాపకి చికిత్స చేయించింది. అందుకు ఆమె కి  తన కుటుంబం నుండి భారీ సవాలుని   ఎదుర్కోవాల్సి వచ్చింది.  ఆమెకి  అప్పటికే ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు. ఆమె భర్త మరియు అతని కుటుంబం మరొక బిడ్డని పెంచాలి అనే  ఆలోచన ని  తీవ్రంగా వ్యతిరేకించారు.. ఈ విషయం పై నిర్మల కి  ఆమె భర్త  కి మధ్య తీవ్రమైన అసమ్మతి  కి దారితీసింది, ఆమె తన పిల్లలతో కలసి   వైవాహిక జీవితం నుండి తెగతెంపులు చేసుకుని ఇంటి నుంచి బయటపడింది.

అయిదుగురు పిల్లలతో పుట్టింటికి వెళ్ళిన ఆమెకి అక్కడ ఆశ్రయం దొరకలేదు.అయినా ఆమె దైర్యం కోల్పోలేదు. కష్టపడి పనిచేయడానికి ఇష్టపడింది. ఆ పని ద్వారా వచ్చే డబ్బు..కుటుంబం నడపడానికి సరిపోవడంలేదు. ఎట్టకేలకు  ఆమెకి తన పుట్టింటి మద్దతు లభించి..ఆ పసి పాపకి ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు ఆపాప ఆ ఇంట్లో ఒక సభ్యురాలు. ఆ పాప పేరు "అంకిత"

నిర్మల ఒక పసి పాపని కాపాడటానికి తన కుటుంబ సభ్యులతో.. పోరాడి గెలిచింది. ఆడపిల్లలు పుడితే విసిరి పారేసే ఈ సమాజంలో  ఓ..మాతృ మూర్తి..ఆ  ఆడపిల్లని మానవత్వంతో చేరదీసి.. ఆదర్శంగా నిలిచింది. "Himmath hai jine ki " (జీవన దైర్యం)సత్కారాన్ని అందుకున్నారు..

అంకిత తో..నిర్మల 
ప్రేరణ కలిగించే విషయం కదండీ ఇది. "నిర్మల" గారిని మనఃస్పూర్తిగా అభినందిద్దాం.

ప్రస్తుత జనాభా సంఖ్యలో 1000 మంది పురుషులకి 899 మంది స్త్రీల నిష్పత్తి ఉండటం వల్ల  అనేక సమస్యలని ఎదుర్కోవలసి వస్తున్నా.. కూడా.. ఆడ శిశు వులని .. .మూర్కత్వంతో కాలరాస్తున్న సమాజానికి అవగాహన కల్పించే దశలో  Action Aid పనిచేస్తుంది. ఈ సంవత్సరం. నిర్మలతో పాటు మరికొందరు మహిళలను ఈ సత్కారంతో..గౌరవించారు. అందులో ఇద్దరు పురుషులు కూడా ఉన్నారు.

ఈ నిరక్షరాస్యులైన మహిళలు అట్టడుగు మరియు పితృస్వామ్య వ్యవస్థలో కొడుకు  ప్రాధాన్యత నియమం పేరు పేరుతొ.. ఆడపిల్లలని  బతికి బట్టకట్ట నీయడం  లేదు. . తాజా సెన్సస్ ఫిగర్ ప్రకారం, చైల్డ్ సెక్స్ నిష్పత్తి 914/1000
 UP లో అయితే 899 /1000  ఉంది.

Action Aid  సత్కరించిన వారి వివరాలు.. మరికొందరు స్పూర్తికరమైన వ్యక్తుల గురించి ఈ లింక్ లో చూడండి.

6 కామెంట్‌లు:

హితైషి చెప్పారు...

Inspiration .. vanaja gaaru.

Dhanyavaad.

అజ్ఞాత చెప్పారు...

మనసున్న మాతృ మూర్తికి, ఆ సంగతిని హృద్యంగా చెప్పిన మరో మాతృమూర్తికి సాష్టాంగ దండప్రణామాలు. తల్లులకే కనక నేను వందనం చెయ్యచ్చు.

చెప్పాలంటే...... చెప్పారు...

chaalaa manchi manasunna nirmala ki vandanam....mi post ki abhinandanalu vanaja garu

కాయల నాగేంద్ర చెప్పారు...

గొప్ప మాతృమూర్తి 'నిర్మల' గారికి అభినందనలు.
మంచి పోస్ట్ వనజ గారు!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Hitaishi .. Thank you very much!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే ..మాస్టారు.. మనమందరం.. నిర్మల గారికి అభినందనలు చెబుదాం. గొప్ప మనసుకి, వ్యక్తిత్వానికి కూడా!

@ చెప్పాలంటే గారు.. మాటల్లో చెప్పేవారినే చూస్తుంటాం. ఆచరణలో చూపిన ఆ తల్లికి అభివందనం చేద్దాం. థాంక్ యు ఫర్ యువర్ కామెంట్

@ నాగేంద్ర గారు.. ఈ విషయం చదివినప్పుడు నాకు ఎంత గొప్పగా అనిపించిందో! స్పందనకి ధన్యవాదములు.

@ జలతారు వెన్నెల గారు ధన్యవాదములు.