21, నవంబర్ 2012, బుధవారం

ఇంతలోనే కరిగి పోయావా!?

నాకైతే అసలు నమ్మశక్యంగా లేదు.

ఏం  చేయను..? రెండు సంవత్సరాలు ఎలా గడచి పోయాయో..ఏమో!

ఎన్ని అనుభవాలు,ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని భావాలు వెలిబుచ్చి నిన్ను పరిపుష్ట్యం చేయడానికి నిద్రాహారాలు మానాను.

పాలు పొంగళ్ళు, మాడి మసిబొగ్గుగా మారిన వంటలు,  హాజరు కాని విందు వినోదాలు..అన్నీ నీవల్లనే !

నువ్వు పరిచయం కానప్పుడు ఎలా గడచిందో..గుర్తుకు రావడంలేదు. పరిచయం అయిన కొద్ది రోజులకే అందరిని మరపించావు. నీ మాయలో పడేసావ్!

ఎక్కడికైనా వెళ్ళానా..అక్కడ ఉండగల్గానా!?  వచ్చేయి వచ్చేయి..అంటూ ఉండేదానివి.ఎంత త్వరిత గతిని ఇల్లు చేరి..నిన్ను కళ్ళ నిండుగా చూసుకోవాలని ఒకటే ఉబలాటం.

నువ్వు పరిచయం అయ్యాక ఒక్క అక్షరం ముక్క వ్రాస్తే ఒట్టు. ఎంత మంది స్నేహితులని ఇచ్చావు. పాత వాసనలు లేకుండా నీవే  నా శ్వాస ,నీవే నా ధ్యాస గా మారిపోయావు.

ప్రతి రోజు నిన్ను కొత్త విషయాలతోముంచెత్తే యాలని ఆలోచనలకి పదును పెట్టడమే సరిపోయింది.

నా ఆలోచనలని పంచు కున్న ప్రియ నేస్తానివి.నా మనసులో మాటని ఆత్మీయులకి అందించిన వారదివి.
నన్ను నాకే సరి క్రొత్తగా పరిచయం చేసిన జాణవి.

నా అనుభూతులని, భావాలని,కోపతాపాలని,నిరసన ని,ఆవేశాన్ని,అన్ని రకాల పైత్యాలని  అన్నింటిని భరించిన ఒకే ఒక నేస్తానివి.

నీకు మించిన నెచ్చెలి  వేరవరు ఉంటారు.. అందుకే నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

నన్ను ఎప్పుడు ఇలాగే అంటి ఉండాలని,వెన్నంటి ఉండాలని .. ఆకాంక్షిస్తూ..
                                                హమారే  యే సఫర్ దో  బరస్ పూరా  కర్లీ
                                                                                                                             ప్రేమతో... నీలో నేను.

35 కామెంట్‌లు:

ఆత్రేయ చెప్పారు...

Happy Birth Day

Wish Many more tens of Happy Birth days..

Meraj Fathima చెప్పారు...

vanajaa mee maro vanaja tho enni muchhatlo kadaaa. ilaa nindu noorellu maa vanajamma happygaa undaalani manasaaraa korukone nechhali ..Meraj

సిరిసిరిమువ్వ చెప్పారు...

అభినందనలు వనజ గారూ. మీ నెచ్చెలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Manasa Chamarthi చెప్పారు...

Congratulations, Vanaja Garu. I always liked your spirit and discipline in writing wonderful posts regularly. You are a versatile writer too.
I wish your blog many more happy returns..:)

హితైషి చెప్పారు...

మా ఛుర కత్తి పాళీ (కీ బోర్డు) ఇంకా పదును పెంచుకుని... బోలెడు పుట్టిన రోజులు జరుపు కోవాలని కోరుకుంటూ... ప్రియమైన వనజవనమాలి కి జన్మ దిన శుభాకాంక్షలు.

జలతారు వెన్నెల చెప్పారు...

Vanaja gaaru, Happy birthday to your blog!
The topics you choose and the way you write is a unique skill. The best part is the expression. Many of your posts are very inspiring too! Never stop writing.

అజ్ఞాత చెప్పారు...

వనజ గారు
మీ బ్లాగ్ పుట్టిన రోజు శుభకామనలు.
జీవశ్చ శరదాం శతం.

అజ్ఞాత చెప్పారు...

Hearty congratulations andi..

Unknown చెప్పారు...

మీ బ్లాగుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వనజా గారు.....

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీకు అభినందనలు.

Harsha చెప్పారు...

వనజ గారు మీ బ్లాగుకి జన్మదిన శుభాకాంక్షలు !

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

congratulations..

మీ,మా ప్రియనేస్తం "వనజవనమాలి"
మరెన్నో సంతోషకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలండీ ..


భారతి చెప్పారు...

వనజా గారు!
మీ మనస్విత "వనజవనమాలి"కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీ మనోస్పందనలు, భావవ్యక్తీకరణ ఎప్పటికప్పుడూ వినూత్నంగా ఉంటాయి. మీ ప్రతీ పోస్ట్ చదివే మౌన ఆరాధకురాలిని నేను.

మాలా కుమార్ చెప్పారు...

వనజగారు ,
మీ బ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు .

అజ్ఞాత చెప్పారు...

మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు .

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ఒకచో నవోన్మేష ముదయించు ధిషణకు
అక్షర రూప హృద్యంగమమ్ము
ఒకచోట దర్శించి వికలమై హృదయమ్ము
స్పందించి వ్రాసిన బడుగు బొమ్మ
ఒకచో మనోల్లాస చకిత జీవన చిత్ర
రమణీయ భావనా రస విశేష
ఒక్కచో బ్లాగర్ల కొక్కింత మార్గ ద
ర్శనము చేయంగల ప్రతిభ గల్గు

‘ వనజ వనమాలి బ్లాగు ‘ భావనలు జూడ
‘జాణ ‘ కాదది ‘ శేముషీ జ్ఞాన ’ గాని
‘థ్యాస’ కాదది ‘ ప్రతిభ కాశ్వాస ’ గాని
‘మాయ’ కాదది ‘ సత్య సంథాయి ’ గాని .

బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలతో .....
-----సుజన-సృజన

చెప్పాలంటే...... చెప్పారు...మీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీకు అభినందనలు.

జయ చెప్పారు...

మీ ప్రతిబింబం వనజవనమాలి. కాబట్టి మీకే హార్దిక శుభాకాంక్షలు...అభినందనలు వనజగారు.

Sai Kiran చెప్పారు...

వనజ గారు

మీ బ్లాగుకి జన్మదిన శుభాకాంక్షలు..

మోపూరు పెంచల నరసింహం చెప్పారు...

వనజ గారు .. మీ బ్లాగ్ పుట్టిన రోజు ..శుభా కాంక్షలు

పల్లా కొండల రావు చెప్పారు...

నిరంతరం మరింత పురోగమించాలని కోరుకుంటూ మీ బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు వనజగారు.

Raj చెప్పారు...

వనజ గారూ.. మీ బ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు..

భాస్కర్ కె చెప్పారు...

మరన్ని పుట్టినరోజులతో బ్లాగులలోకంలో వెలగాలని కోరుకుంటున్నానండి, అభినందనలు.

Unknown చెప్పారు...

"వనజ వనమాలి" బ్లాగు రెండవ జన్మదిన శుభాకాంక్షలు!
మరిన్ని మంచి పోస్ట్ లతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటూ...
- చిట్టి, పండు

శోభ చెప్పారు...

మీ ఆత్మీయ నేస్తానికి ఇవే మా ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ.. పుట్టినరోజు జేజేలు... :)

vishnu చెప్పారు...

ప్రియమైన వనజవనమాలి కి జన్మ దిన శుభాకాంక్షలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఆత్రేయ గారు.. మీ శుభాకాంక్షలకి మనః పూర్వక ధన్యవాదములు.

@ ప్యారీ మెరాజ్ ..బహుత్ షుక్రియా యార్

@ వరూధిని గారు.. మీ శుభాకాంక్షలకి చాలా సంతోషం.ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మానసా మీ అభిమాన పూర్వక శుభాకాంక్షలకి మనః పూర్వక ధన్యవాదములు. మీ స్పందన ,మీ వ్యాఖ నాకు చాలా ఆనందం ని ,ఉత్సాహాన్ని ఇస్తుంది.థాంక్ యు!


@ వైష్ణవి.. :) చురకత్తి.. తన పదునైన ధన్యవాదములు తెలుపుతుంది.(అభిమానంతోనే)

@ ప్రియ నేస్తం జలతారు వెన్నెల .. మీ శుభాకాంక్షలకి చాలా సంతోషం.ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే ..మాస్టారూ..మీ ఆశీర్వచనానికి బహుదా సంతోషం. వినయ పూర్వక నమస్శులు . మరీ మరీ ధన్యవాదములు.

@mhs greamspet రామకృష్ణ గారు హృదయపూర్వక ధన్యవాదములు.

@ సునీత మన్నే ..గారు.. థాంక్ యూ వెరీమచ్.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

బులుసు సుబ్రహ్మణ్యం గారు... మరీ మరీ ధన్యవాదములు.

@హర్ష గారు హృదయపూర్వక ధన్యవాదములు.

@ రాజీ గారు .గారు.. థాంక్ యూ వెరీమచ్. మీ పేరు మార్చుకున్నా.. మీరు మాకు రాజీనే కదా!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మాలా కుమార్ గారు... మరీ మరీ ధన్యవాదములు.

@భారతి గారు మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదములు.

@ లలిత గారు .గారు.. థాంక్ యూ వెరీమచ్.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వెంకట రాజారావు లక్కాకుల గారు... మీ వ్యాఖ్యకి చాలా సంతోషం. మరీ మరీ ధన్యవాదములు.

@చెప్పాలంటే.. మంజు గారు మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదములు.

@ జయ గారు :) నెచ్చెలి నేనే కదా! థాంక్ యూ వెరీమచ్.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పల్లా కొండలరావు గారు... మీ వ్యాఖ్యకి చాలా సంతోషం. మరీ మరీ ధన్యవాదములు.

@మోపూరు గారు.. హృదయపూర్వక ధన్యవాదములు.

@ సాయి కిరణ్ గారు.. గారు థాంక్ యూ వెరీమచ్.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అచ్చంపేట్ రాజ్ గారు... మీ వ్యాఖ్యకి చాలా సంతోషం. మరీ మరీ ధన్యవాదములు.

@the tree భాస్కర్ గారు .. హృదయపూర్వక ధన్యవాదములు.

@ చిన్ని ఆశ గారు.. థాంక్ యూ ! థాంక్ యూ వెరీమచ్.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శోభ గారు బాగున్నారా!? డి.ఎస్.సి లో సెలక్ట్ అయ్యారా?మీ విషెస్ కి చాలా సంతోషం. మరీ మరీ ధన్యవాదములు.

@విష్ణు.. హృదయపూర్వక ధన్యవాదములు.