4, నవంబర్ 2012, ఆదివారం

మామ కబుర్లు
నీ సొగసు  బరువైన మేఘంలా కదిలి వస్తుంది..
నా వైపు..

నా వలపు దాహాన్ని తీర్చడానికన్నట్లు..

వచ్చినట్లు వచ్చి నన్నే నిండుగా కమ్మేసి..

నా వెలుగునే దోచేసాక కాని తెలియలేదు..

నాతో  ఆటలాడటం నీకు అత్యంత ఇష్టమని..

5 కామెంట్‌లు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

మేఘాలు చందమామతో ఆడుకునే ఆడని నాలుగు లైన్లలో చక్కగ రాశారు :-)

జలతారు వెన్నెల చెప్పారు...

బాగుంది వనజగారు.
అలా నీలాకాశం వైపు ఒక్కసారి చూసి, రాసేసి ఉంటారు అశువుగా..కదూ?

హితైషి చెప్పారు...

చిరుత అడుగు వెనకకు వేసిందంటే .... మరింత వేగంతో... ముందుకు లంఘించ టానికే.
welcom బ్యాక్ ఒన్స్ అగైన్ డియర్. అదిరింది కవిత.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అవినేని భాస్కర్ .. తమ్ముడూ.. ! చాలా కాలం తర్వాత వ్యాఖ్య తో.. మీ దర్శనం చాలా సంతోషం.

@ జలతారు వెన్నెల గారు.. భలే క్యాచ్ చేసారు!

నిజానికి నిన్న ఇదే పిక్ ని నిఖిల్ షేర్ చేసాడు. (మేఘాలు కమ్మిన చంద్రుడు) దిగులు గా ఉన్న బిడ్డ మోము గుర్తుకు వచ్చి.. ఇలా తన సంతోషం కోసం అమ్మ వెలిబుచ్చిన వ్రాత ఇది.

మీకు నచ్చినందుకు ధన్యవాదములు

@ వైష్ణవి.. మీ వ్యాఖ్య కి ఆనంద మానందమాయే!
ఈ మధ్య పోస్ట్ లు వ్రాయడం లేదు నిజమే! వ్రుత్తి పరమైన ఒత్తిడి.వ్రాసే మూడ్ లేకపోవడం వల్ల అలా జరుగుతుంది అంతే!

మళ్ళీ వచ్చేస్తున్నాను లే!

Unknown చెప్పారు...

వనజ గారు చాలా చాలా బాగుంది దోబూచులాటపై మీ కవిత