14, నవంబర్ 2012, బుధవారం

విరిగిన వెన్నునిశని  చీల్చుకుంటూ రెండు పట్టాలపై
వరుస పెట్టెలు మంద గమనంతో
నడుస్తుంటాయి తల్లి గర్భం నుండి
బయటపడే శిశువులా

కలవని పట్టాలు ఎన్ని జీవితాలని
గమ్యస్థానం చేరుస్తుంటాయో
కలసిన రెండు తనువుల ఆకళ్ళు
ఓ..చిన్ని ప్రాణాన్ని విసిరిపారేస్తాయి

మరచిపోయిన మానవత్వం
గాలిపాట పాడుతూ ఊరేగుతుంది.
కొన్ని నిర్లక్ష్యాలు కొన్ని భావజాలాలు
వెన్నుని  విరిచేస్తాయి..
విరగబడి నవ్వుతుంటాయి.

ఆకాశంలో సగం నేలమట్టమవుతుంది.
లింగ వివక్ష నిలువెత్తు నిలబడుతుంది
జీవన్మ్రతులుగా మారే  పరిదృశ్యం
సూచికల పట్టీలో దిగజారుతూ ...
ఆడ వలదని వాడు బలమని తలచి
అనాగరిక  ముసుగు జారకుంటే
ధరిత్రి ఎరుగని ప్రమాదాన్ని హెచ్చరిస్తుంది.
చరిత్ర లో చీకటి కోణాన్ని మిగల్చనుంది

 విరిగిన వెన్ను..నాశనం అయిన పంట చిహ్నమే  కాదు..
 నాశనమవుతున్నజాతి  కడుపు పంట  కూడా!!


                                           (చిత్రాలు  గూగుల్ చిత్రాల నుండి సేకరణ )

7 కామెంట్‌లు:

శ్రీ చెప్పారు...

chaalaa baagundi vanaja gaaroo!....విరిగిన వెన్ను..నాశనం అయిన పంట చిహ్నమే కాదు..
నాశనమవుతున్నజాతి కడుపు పంట కూడా!!...baagaa cheppaaru @sri

శశి కళ చెప్పారు...

హ్మ్...యెంత మంది చెత్త కుండీలపై ...
మనసుకు బాధగా ఉంది

Unknown చెప్పారు...

kanna thalli kudaa aadadani thelisi koodaa ee lokaaniki aadavaallante enduko antha chulakana

Unknown చెప్పారు...

కలవని పట్టాలు ఎన్ని జీవితాలని
గమ్యస్థానం చేరుస్తుంటాయో
కలసిన రెండు తనువుల ఆకళ్ళు
ఓ..చిన్ని ప్రాణాన్ని విసిరిపారేస్తాయి

Very good comparison madam.

Unknown చెప్పారు...

కలవని పట్టాలు ఎన్ని జీవితాలని
గమ్యస్థానం చేరుస్తుంటాయో
కలసిన రెండు తనువుల ఆకళ్ళు
ఓ..చిన్ని ప్రాణాన్ని విసిరిపారేస్తాయి

really excellent comparison madam

చెప్పాలంటే...... చెప్పారు...

chaalaa baagundi akharuna cheppina maatalu vastavaanni chupistunnayi...so nice andi vanaja garu kaaka pote o chinna maata mi kanti velugu photo veredi pettandi enduko adi naku sarigaa anipincha ledu

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

చాలా బాధాకర విషయం...