అసిధార ..గారు..ఓ..మారు ఇటువైపు చూసి వెళ్ళండి...ప్లీజ్!!
మీకు మనసారా ధన్యవాదములు. ఎందుకంటారా..? అజ్ఞాత గా వచ్చి అన్యోపదేశం చేసి వెళ్ళారు కదా! అందుకు మీకు ధన్యవాదములు.
మార్చి మాసంలో మీరు నా బ్లాగులో వ్రాసిన మూడు కామెంట్స్ ని నేను ప్రచురించలేదు. మీ ప్రొఫైల్ సరిగా లేని కారణంగా.
అయినా మీరు వ్రాసిన కామెంట్స్ నేను మర్చిపోలేదు. గాయపరచడం వేటగాడి లక్షణం అయితే.. గాయం ని పూడ్చుకుని మళ్ళీ పైకి ఎగిరే ప్రయత్నం చేయడం..పక్షి లక్షణం.
మీరు తెలుగు బ్లాగులలో నలుగురు మాత్రమే అసలు సిసలైన బ్లాగర్లు అని నొక్కి వక్కాణించారు.నేను నిన్ననే విన్నాను. మరో రెండు రోజులలో తెలుగు బ్లాగరుల దినోత్సవం జరుపుకుంటాము అని. నాలువేల అయిదు వందల పైనే తెలుగు బ్లాగులు ఉన్నట్లు విన్నాను. {సరి అయినదో..కాదో మరి}
అంతమంది బ్లాగర్స్ ఉండగా.. మీరు మీకు నచ్చిన వారి పేర్లు మాత్రమే సూచించి.. వాళ్ళే బ్లాగర్స్ మిగిలిన వాళ్ళు కాదు అంటే.. మిగతావారు ఒప్పుకుంటారా? ఒకసారి మళ్ళీ మీరు ఉదాహరించిన వారి పేర్లు ని మళ్ళీ ప్రకటించండి.
మీరు.. నా బ్లాగ్ చూస్తారో లేదో తెలియదు. కానీ మారు పేరుతొ ప్రొఫైల్ సృష్టించుకుని వచ్చి.. నన్ను ఎద్దేవా చేసి వెళ్ళారు. మీ మాటలకి నొచ్చుకుని.. నేను కామెంట్స్ ఆప్షన్ వద్దనుకున్నాను. తర్వాత మళ్ళీ కామెంట్స్ ఆప్షన్ ని ఓకే.. చేసాను. అందుకు కారణం మీ వ్యాఖ్యలే!
నిజంగానే మీరన్నట్లు నేను పెద్ద బ్లాగర్ని ఏమి కాదు. ఎదో ఉబుసుపోక వ్రాసుకుంటూ ఉంటాను. కామెంట్స్ విషయంలో నేను చాలా మంది బ్లాగర్స్ మనసులోమాటని, కొందరి బ్లాగర్స్ వైఖరిని విమర్శించాను. అందుకు వివరణ ఇచ్చాను. ఆ పోస్ట్ లో నేను చేసిన వ్యాఖ్యలకి ఈ రోజు కట్టుబడి ఉంటాను.
అసలు గొప్ప బ్లాగర్స్ అని మీరు ఎలా లేక్కించగలరు ..చెప్పండి? వ్రాసిన పోస్ట్ లా? లేక పేజ్ హిట్స్?
లేదా విజిట్ చేసిన తోటి బ్లాగర్స్ సంఖ్యా? లేక వచ్చిన వ్యాఖ్యలా? ఎలా లేక్కిస్తారో..చెప్పి పుణ్యం కట్టుకోండి. నాకు అసలు ఆవిషయం పై అంతా అజ్ఞానమే! నేను అయితే రాంక్ ఆధారంగా ఏమో..అనుకుంటున్నాను.
మీరు అనవసరంగా నా బ్లాగ్‌లో జొరబడి నాకు మేలు చేసారు. అది ఏమిటంటే..నన్ను ఎద్దేవా..చేయడం వల్ల మీకు సంతృప్తి కల్గిందేమో..కాని..నాకు ఆ వ్యాఖ్యలు చాలా ఉపయోగ పడ్డాయి. నేను సీరియస్ గానే బ్లాగింగ్ చేస్తున్నాను.రెండు సార్లు ఇండీ బ్లాగర్ 80 రాంక్ ఒకసారి.. 79 రాంక్ ఒకసారి లో నిలిచి ఉన్నాను.
అలాగే ఒక లక్షా పదునెనిమిది వేలకి పైగా పేజీల వీక్షణ అక్షరాల 60 ,416 బ్లాగర్స్ నా బ్లాగ్ ని విజిట్ చేసారు. 603 పోస్ట్‌లు ఉన్నాయి.మీరు ఉదాహరించిన నలుగురు బ్లాగర్స్ ఖచ్చితంగా నేను సాధించిన రాంక్ కన్నా తక్కువలోనే ఉన్నారు.
ఈ విషయమని ఉదహరించడం ఎందుకంటే.. వాళ్ళ కన్నా నేను గొప్ప బ్లాగర్ ని అని చెప్పడానికి కాదు సుమా..!
బ్లాగ్ వ్రాసుకోవడం పదుగురు మెచ్చితే గర్వంగా ఫీల్ అవడం నిరంతరం వ్రాయకపోతే రాంక్ దిగజారడం అనేవి "వైకుంఠపాళీ " ఆట లాంటివి. మీరనుకున్న గొప్ప బ్లాగర్లు ఆగస్టు మాసంలో నాకన్నా వెనుకబడే ఉన్నారు.ఆగష్టు లో ఇండీ బ్లాగర్ హైయ్యెస్ట్ రాంక్ 83..అయితే నా బ్లాగ్ రాంక్ 80.నేను ఆరోగ్యం బాగోలేక 15 రోజులు వ్రాయలేకపోతే మరుసటి నెలలో 73 కి జారిపోయాను. అలా ఉంటాయి మరి బ్లాగ్ రాంక్స్ అని అర్ధం అయి మళ్ళీ ప్రయత్నించాను.
ఎవరు ఎప్పుడూ..ఒకే స్థాయిలో ఉండరు .అందరికి బ్లాగులకి అంటి పెట్టుకునే తీరిక ఉండదు. అందరికన్నా.. మిన్న అయిన జ్ఞాన సముపార్జన ఉండదు. వినడం,చదవడం,సేకరించడం,వ్రాయడం..వీటివల్లనే లభ్యం అవుతుంది."అపరిమిత జ్ఞానానికి పరిమితులు లేవు" అని మీరు తెలుసుకుంటే బావుంటుంది. ఇంకెప్పుడు ఎవరిని ఇలా ఎద్దేవా చేయకుండా ఉంటే బావుంటుంది అన్న ఉద్దేశ్యంతోనే ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.
అందరం అక్షరంతో..ప్రయాణం సాగించడానికి వచ్చినవారమే! మీకు నచ్చినవాళ్ళే వట వృక్షాలు..అని
మిగతావారందరూ.. గడ్డిపోచలుగా .. తీసి పారేయకండి అని మనవి. మీకు బాగా నచ్చిన బ్లాగర్స్ నలుగురిలో ఇద్దరు ఇండీ బ్లాగర్ సభ్యులు కారు కూడా.
మీరు ఉదాహరించిన నలుగురు బ్లాగర్స్ వ్రాసే విషయాలు నాకు బాగా నచ్చుతాయి.నేను కామెంట్స్ కూడా పెడుతూ ఉంటాను. అనవసరంగా మీరే మీ దురభిమానాన్ని ప్రకటించుకున్నారు. :):)
నేను మీపై ద్వేషంతో.. ఈ పోస్ట్ వ్రాయడం లేదు. నాకు పట్టుదలని పెంచిన మీకు మనసారా ధన్యవాదములు తెలుపుకుంటూ..
ఇకపై వ్రాస్తానో..వ్రాసుకుంటూ ఉంటానో.. కూడా తెలియదు. మీకు ఒక సమాధానం ఇవ్వాలనుకున్నాను. ఇస్తున్నాను..అంతే!
అసిధార గారు.. మీకు నచ్చినట్లు నా బ్లాగ్ ఉండక పోవచ్చు.కానీ ఈ బ్లాగులో.. సజీవ మైన జ్ఞాపకాలు ఉన్నవి.ప్రశంసలు పొందిన కవితలు ఉన్నవి. మదిని మీటి వెళ్ళిన రచనలు ఉన్నాయి.. అని నేను గర్వంగా చెప్పుకోగలను. అది.. అతి విశ్వాసంగా మీకు కనబడితే అందుకు నేను ఏమి చేయలేను. మీరు నా బ్లాగ్ ని గుర్తించక పోవడం వల్ల కూడా నాకు వచ్చిన బాధ ఏమి లేదు. అయితే నాలో ఉన్న extra -ordinary ని వెలికితీసుకునే కసి రగిలించిన మీకు మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదములు.
{ద్వేషించే శత్రువునైనా మెచ్చుకోమన్నారు కదండీ! అందుకే మీకు మనసారా ధన్యవాదములతో ఈ పోస్ట్)
(తోటి బ్లాగ్ మిత్రులకి నొచ్చుకునే విధంగా ఉంటె క్షమించండి. కొన్ని వ్యాఖ్యలకి నేను నొచ్చుకుని వ్రాసుకున్న పోస్ట్ ఇది.. ఒక అజ్ఞాత కి నేను ఇచ్చే సమాధానం మాత్రమే! ముమ్మాటికి ఇక్కడ గొప్ప,చిన్న బేధాలు ఏవీ లేవని చెప్పడమే నా ఉద్దేశ్యం కూడా)
18 కామెంట్లు:
Oh my god,
నేను అంటే అప్పట్లో ఒక అజ్ఞాత నన్ను ఎదో అన్నారని చాల personal గా తీసుకుని ఇలానే post చేసాను,
నాకు ఒక విషయం అర్థం అయ్యింది వనమాలి గారు, బ్లాగు మన జీవితాల్లో భాగం అయిపొయింది.
ఇది మన ఇంటి ముందు వేసే ముగ్గులాగా, ఇంట్లో తెల్లవారు ఝామునే తాగే కాఫీ లాగా
కాసేపయ్యాక వచ్చే న్యూస్ పేపర్ లాగా, ఇంకా ఇలా చెప్పు కుంటూ పోతే అన్ని విధాలుగా మన జీవనం లో చేరిపోయింది.
అందరికి ఎలా ఉంటుందో నాకు తెలియదు కాని....
ఎ పని చేసేప్పుడు ఆ పనిపైనే ధ్యాస ఉంచాలి అంటారు
కాని నేను నడుస్తున్నా, పాలు కాస్తున్న మెట్రో ట్రైన్ లో ఆఫీస్ కి వెళ్తున్నా
ఐపాడ్ లో మ్యూజిక్ వింటున్నా?
నాకు నా బ్లాగుకి చెందిన నేను నిరంతరం వీక్షించే బ్లాగుల కు చెందినా అంశాలు అను నిత్యం నా మనసులో మెదులుతూ ఉంటాయి
అందుకే బ్లాగ్గింగ్ పోస్టింగ్ ఆపేసి జస్ట్ కామెంట్స్ తో సరిపెడుతున్నాను
మీ పోస్టు ప్లస్ చూసి ఇటు వచ్చి చూసాక అర్థం అయ్యింది
అందరు నాలా పెర్సోనల్గా తీసుకుంటారని......
మొత్తాని నాకు నా బ్లాగు కి వచ్చిన అజ్ఞాత ఎలా స్పూర్తిని రగిల్చారో మీకు అలానే
ఒక ప్రేరేన ను ఇచ్చారు
మంచో చెడో వారిలో ఆ క్రియకు సహకరించింది కూడా ఆ దైవమె అని సరిపెట్టుకోవటమే మనం చేయవలసినది
అని నా అభిప్రాయం !!
?!
ఈర్ష్యపుడుతుంది ముందు అది ద్వేషంగా మారి ఒక పని చేయిస్తుంది. అదే ఇది. ఎవరి ఓపికతో వారు రాస్తారు. అందరూ చదువుకునే ఉండరు. అందరూ గొప్పవారే ఉందరు. ఎవరు రాసినా బగుంటే చదువుతారు. ఒక కామెంట్ పెట్టిపోతే సంతోషిస్తారు, ఇది సామాన్య బ్లాగరుగా నా ఉద్దేశం. వారెవరో అన్న మాట మీరు పట్టించుకుని మంచి పై చేస్తున్నందుకు అభినందనలు.
వనజగారు, మనచుట్టూ ఉండే మనుషులందరో ఒక్కలా ఉండరు. సో అందరినీ సమానంగా రిసీవ్ చేసుకోండి. వాళ్లు అన్నంతమాత్రాన బాధపడడం ఎందుకు? అఫ్పుడప్పుడు ఇలాటి మాటలవల్ల మనం కృంగిపోకుండా గోడకు కొట్టిన బంతిలా మరింత కసిగా, పట్టుదలగా మన పని చేసుకోవాలి. ఎంధుకంటే మనమేం చేస్తున్నామో మనకు తెలుసు. జస్ట్ ఇగ్నోర్ అండ్ కారీ ఆన్ విత్ యువర్ వర్క్.. మాడరేషన్ ఉందికదా. చాలు..
ఎందుకో ఏమో ..(శివ) గారు.. మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం అండీ! ఎగతాళి చేయబడ్డ వారు ఎదిగి చూపిస్తారు కదా! అలాగే నాలో పట్టుదలని పెంచిన మిత్రునికి ధన్యవాదములు చెప్పానండీ!! :) మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదములు.
కష్టేఫలె మాస్టారూ.. మీ సూచనలు,మీ మార్గదర్శకత్వం ఎప్పుడూ..శిరోధార్యమే! ధన్యవాదములు.
ఈ లోకం లో ఎవ్వరూ ఎప్పటికీ అందరినీ సంతృప్తిపరచలేరు. ఇలాంటివన్నీ మనం రాటుదేలడానికి ఉపయోగపడతాయి. మీరూ అదే చేశారు. కసి కూడా ప్రేరణగా ఉపయోగపడుతుందంటారు కదా! నాకు నచ్చిన బ్లాగర్లలో మీరొకరు. ఇలాంటివి వదిలేయమని చెప్పడం తేలికే గానీ ఆచరణలో అనుభవం మీద మాత్రమే సాధ్యమవుతుంది. ఆ కసిని మీలా పాజిటివ్‌గా మలచుకోవడం మంచిదే. అయితే రేంకులు - పేజి వ్యూస్ కొలమానంగా పెట్టుకోవడం సరయినది కాదని నా అభిప్రాయం.ఈర్స్యాపరులు - అసూయాపరులు ఎల్లవేళలా ఉంటారు. మనం రాటుదేలాలి తప్ప రాలి పోకూడదు. మీరన్నారే వేటగాడు గాయపరిస్తే దానిని పూడ్చుకుని తిరిగి విహరించడం పక్షి లక్షణమని. మీరు మీ స్వేచ్చా భావాలతో విహరిస్తూ ఎప్పటిలాగే మరిన్ని మంచి పోస్టులు వ్రాయాలి.
జ్యోతి గారు.. మీ సూచనకి,అభిమానానికి ధన్యవాదములు. కొన్ని జరిగిన విషయాలు నేను విన్నాను.
కొన్నిసార్లు అలాంటివి ఎదురవుతూ ఉంటాయి. మనసు బాధపడుతుంది. సమాధానం చెప్పి తీరాలి అనుకున్నాను. బయట ప్రపంచం లో ఏమో..కానీ ఈ నెట్ ప్రపంచంలో మహిళల పట్ల,వారి తెలివితేటల పట్ల,అధిక సామర్ధ్యాల పట్ల ఎగతాళి ,చిన్న చూపు.అది కొంచెం బాధించింది.
ఇంగ్లీష్ అంతగా రాని నేను ఇక్కడ మనగల్గాను అని చెప్పడం కూడా నా ఉద్దేశ్యం కాదు కాని.. చీడ పురుగుల్లా కొంత మంది ఉన్నారు. గడ్డిపోచల కన్నా హీనంగా తీసి పారేస్తారు. అందుకే ఆన్సర్ చేసాను. ఇది ఆరోగ్యకర వాతావరణం కాదు కూడా.
అన్ని మరచిపోతాను. మరీ మరీ ధన్యవాదములు జ్యోతి గారు..
ఎంత చేయి తిరిగిన బ్లాగరైనా ఒక్కోసారి బాగుంటాయి, ఒక్కోసారి బాగుండవు. అలాగే ఎంత నోరుతిరిగిన కామెంటర్ల కైనా. మొదటి రాంక్ అనేది ఒక్కటే అశాశ్వితంగా వుంటుంది, దాన్ని చేరుకోవాలనే అందరి తపన అని ఆ అజ్ఞాత అసిధారకు నా మాటగా చెప్పండి. :D
"గోడకు కొట్టిన బంతిలా..." కసితో కాక, మంచి పోస్ట్‌లు రాసేయండి. కామ్రేడ్ కొండల రావు గారన్నట్టు, "పోరాడితే పోయేదేమీ లేదు కొన్ని కిలోబైట్ల బ్లాగ్ స్పేస్ తప్ప" :))
SNKR garu.. :) చాలా సంతోషం.మీ వ్యాఖ్యకి ధన్యవాదములు.
పల్లా కొండలరావు గారు.. మీ అభిమానానికి ధన్యవాదములు. నేను ప్రతి పోస్ట్ మనసు పెట్టి వ్రాస్తాను.మీ సూచనలు తప్పక పాటిస్తాను.
miku nachindi miru rastunnaru evariko nachaalani kadu.....manchi vimarsani tisukondi migillinavi vadileyandi....nannu annaru aavakaya pachallu ela pattukovaalo raasukondi ani....-:) miru chakkagaa miku nachindi rastaru alaane raayandi memu chadutamu...sare..naa vanaja garu....good luck
చెప్పాలంటే మంజు గారు.. మీ అభిమానానికి ధన్యవాదములు.
ఏమిటో..నండీ కొంతమందికి కొంత మంది అంటే చిన్న చూపు. ఆవకాయ పెట్టడం కూడా ఒక కళ (పాక శాస్త్ర కళ ).చతుషష్టి కళ లలో.. అది ఒక భాగమే!
అంత కన్నా అద్వానంగా వ్యాఖ్యానించిన వారు ఉన్నారు. ఏం చేద్దాం..? చెప్పండి.
మన నడకలో కలసినవారితో కలసి నడవడమే!
మీరెలా అర్ధంచేసుకుంటాటారో తెలీదుగానీ."సజీవ మైన జ్ఞాపకాలు ఉన్నవి.ప్రశంసలు పొందిన కవితలు ఉన్నవి. మదిని మీటి వెళ్ళిన రచనలు" me thinks... these are the factors that make a blog valuable. I repeat... blog is a journal of personal evolution. ర్యాంకులూ, హిట్టుల భాష మనం intermediateతోనే వదిలేసుండాల్సుంది.
విడుదలైన అన్ని సినిమాలూ, ప్రచురించబడ్డ అన్ని పత్రికలూ చదివే ప్రత్నం చెయ్యంకదా అలాగే listచేయబడ్డ ప్రతిబ్లాగూ చదివే ప్రయత్నాలు చెయ్యకుండా ఉంటే, మనల్ని busyగా ఉంచేందుకు ఇతరాలు కూడా ఉంటే మీ అజ్ఞాతగారిలాగా seriousగా reactఅవ్వాల్సిన పనుండదు.
హాయ్ వనజ గారు, నా వరకు నేను బ్లాగు అంటే మనకి తెలిసింది,మన అనుభవాలు నలుగురితో పంచుకోవటం అనుకుంటానండి....అవి ఎవరికీ నచ్చినా,నచ్చకపోయినా పెద్దగా పట్టించుకోవద్దు....శర్మ గారు చెప్పినట్ట్టు...ఎవరో ఈర్ష్య తో చేసిన పని......
"నాలో ఉన్న extra -ordinary ని వెలికితీసుకునే కసి రగిలించిన మీకు మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదములు" అనే positive thinking ఉంది చూడండి....బాగా నచ్చిందండి.....బాగా నచ్చేసారు :)
ఇండియన్ మినర్వా ..గారు.. మీ స్పందనకి మరీ మరీ ధన్యవాదములు.
నిజమే రాన్క్స్,హిట్స్,కామెంట్స్ గురించి ..వదిలేయాల్సిందే! ఇకపై అదే పని చేస్తాను.
బ్లాగులకే అంటిపెట్టుకునే ఎన్నో విలువైనవి కోల్పవడం నాకు ఇష్టంలేదు కూడా! నేను వ్రాసుకున్న బ్లాగ్ నాకు ఎప్పుడో సంతృప్తిని ఇచ్చేసింది కూడా..
మరలా ధన్యవాదములు.
కావ్యాంజలి గారు.. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు. నేను ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటాను. పాగితివ్ గా ఉంటేనే నెగిటివ్ థాట్స్ మన దరిచేరవు. అశాంతిని దరి చేరనీయవు. ఎప్పుడూ..ఒప్పుకోవద్దురా .ఓటమి..అన్నది నాకు స్ఫూర్తి నిచ్చే గీతం ..
మీ ప్రశంసకి హృదయపూర్వక ధన్యవాదములు.
"గాయపరచడం వేటగాడి లక్షణం అయితే.. గాయం ని పూడ్చుకుని మళ్ళీ పైకి ఎగిరే ప్రయత్నం చేయడం..పక్షి లక్షణం."
చాలా మంచి మాట చెప్పారండీ.. ఎవరి మాటలకు ఎంతవరకు స్పందించాలి అన్న విషయం మీద అవగాహన ఉన్నవాళ్ళకి ఇలాంటి వాళ్ళ మాటలు పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సినవి కాదని మరొక్కసారి చెప్పారు...
అలాగే నేను కూడా ఒక్కోసారి అనుకుంటాను ఎవరి ప్రవర్తన గురించో మనం ఎందుకు బాధపడాలి ఈ బ్లాగులే ప్రపంచం కాదు కదా ఇంకా ఎన్నో ముఖ్యమైనవి వున్నాయి మనజీవితంలో ... అని..
రాజీ గారు.. అవును కదా..ఎంతో గొప్పదైన ప్రపంచాన్ని మన ముందు ఉంచుకుని బ్లాగు లే ప్రపంచం అనుకోవడం అవివేకం కదా!
రెండేళ్లలో.. నేను సీరియస్ గానే బ్లాగింగ్ చేసాను. నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది కూడా. నా బ్లాగ్ చూసేవాలు ముఖ్యంగా యూత్. వాళ్ళు వాళ్లకి ఏ పోస్ట్ నచ్చిందో..చెపుతుంటే..నాకు చాలా సంతోషంగా తృప్తిగా ఉంటుంది. మా అమ్మా-నాన్నలు మీలా చెప్పరు..ఆంటీ.. మీలా చెపితే మాకు ఇప్పుడు వచ్చిన రియలైజేషన్ అయిదారేళ్ళ క్రితమే వచ్చి ఉండేది..అని మా అబ్బాయి friends నాకు చెప్పినప్పుడు.. వాళ్ళ కోసం అయినా బ్లాగ్ వ్రాయాలి అనిపిస్తూ ఉంటుంది.
మనం నిరంతర విద్యార్ధులం మనం నేర్చుకుంటూ.. మరికొందరికి నేర్పే ప్రయత్నం చేద్దాం.సరేనా.. !
నేను బ్లాగ్ మొదలెట్టినప్పటి నుండి.. నన్ను ఎంకరేజ్ చేసే విధంగా ఉన్న మీ కామెంట్స్ కి మనసారా ధన్యవాదములు.
13 డిసెంబర్ 2012 8:37 సా
కామెంట్‌ను పోస్ట్ చేయండి