నీ శత్రువు ఎక్కడో ఉండరు. నీలోనే ఉంటారు.
శత్రువుని గుర్తించడం ఏల !?
నిన్ను అతిశయంగా పొగిడి.. నీవు చేరుకున్న శిఖరాల పై నుండి నిన్ను క్రిందికి త్రోసి సంబరపడి పోయే శత్రువును గుర్తించ గల్గే నేర్పు నీలో లేనప్పుడు .. నువ్వు మొదటి అడుగులోనే ఉంటావు.
అది నీ మొదటి తప్పు.
నీలో లోటు పాట్లును చెప్పే హితులను నువ్వు ద్వేషిస్తే, నిర్లక్ష్యం చేస్తేనూ .. ఎన్నటికి ఎదగలేవు.
అది నీ రెండో తప్పు
ఎదుగుతున్న వారి ని.. నువ్వు చాలా గొప్ప. నీతో సరిసమానం ఎవరు కాలేరు. ఎవరు లేరు అంటే చాలు .. సాధించిన దానికే సంతృప్తి పడి విజయ గర్వంతో విర్రవీగుతూ.. ఆ తర్వాత పని చేయడం మానేస్తారు
అది తెలుసుకోలేక పోవడం అన్నది మూడో తప్పు.
నిన్ను నీవు తెలుసుకోలేకపోవడం .. ఆత్మ విమర్శ చేసుకోలేకపోవడం అన్నది.. అది నాలుగో తప్పు
ఈ నాలుగు ఉంటాయని ఊహించకపోవడమే.. మనలో ఉన్న అహం వీటిని గుర్తించక పోవడమే ..ఐదో..తప్పు.
11 కామెంట్లు:
'నీలోను గలడు శివుడు, నాలోను గలడు శివుడు' ----అనుకోటమే:)))(Terms & Conditions apply:)
baagaa chepparu andi...
ఆత్మ విమర్శ చేసుకోవాలి,అతి సర్వత్ర వర్జయేత్. :)
avunnu kadaa vanaja garu nice post andi...
నీ శత్రువు ఎక్కడో ఉండరు. నీలోనే ఉంటారు...
మనలో ఉన్న అహం వీటిని గుర్తించక పోవడమే......
నిజమేనండి... ఇదే అసలైన పెద్దతప్పు.
చాలా చక్కగా చెప్పారు వనజగారు.
nijame satruvu ekkado undadu manalone untaadu.
అవును వనజ గారూ!...అహంకారాన్ని మించిన శత్రువుంతుందా?...చాలా బాగా వ్రాసారు...జస్ట్ కిల్ ద ఇగో...యూ విల్ బీ హాపీ...@శ్రీ
జయ గారు.. అంతే అంతే..నండీ! అప్పుడప్పుడు...అలాగైనా ఒప్పుకుని.. స్థాయి బేధం ని సమానం చేసుకోవాలి. :)
నా పోస్ట్ మొత్తం ని ఒక వ్యాఖ్యలో చెప్పేశారు.చాలా బావుంది. థాంక్ యు సో మచ్.
ప్రిన్స్ ! బాగున్నారా? మీ స్పందనకి ధన్యవాదములు.
@ కశ్తేఫలే మాస్టారూ.. ఇప్పుడు అతి ఎక్కువగానే కనబడుతుంది.మరి.ధన్యవాదములు.
@ చెప్పాలంటే ..గారు ఈ పోస్ట్ మీరే గుర్తుకు వచ్చేసారు పోస్ట్ లు హెవీగా ల్లేకుండా శెనగలు తిని చేయి కడుక్కునట్లు ఉండాలని అనిపించి మీ శైలిని కాపీ కొట్టానోచ్
భారతి గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.
@ మెరాజ్ .. థాంక్ యు సో మచ్..
శ్రీ గారు.. ధన్యవాదములు.అప్పుడప్పుడూ..నాలోకి నేను తొంగి చూసుకుని రియలైజ్ అవుతూ ఉంటాను. నచ్చని వాటికి దూరంగా ఉంటాను. మనకి ఏం కావాలో మనం తెలుసుకుంటే మాత్రమే కాదు. ఏది అవసరం లేదో తెలుసు కోవడం కూడా ముఖ్యం. అందుకే ఈ పోస్ట్ పుట్టింది :) థాంక్ యు సో మచ్. అండీ!
excellent frd
thank u
chala baaga chepparu frd
కామెంట్‌ను పోస్ట్ చేయండి