2, డిసెంబర్ 2012, ఆదివారం

గమనం - గమ్యం

"విహంగ" లో.. నా కవిత    ఈ లింక్ లో 

స్త్రీమూర్తిలోని మాతృ హృదయం ఇగిరిపోయిన వేళ
డబ్బు కోసం తమ పాపలని అమ్ముకునే తల్లులు 
మనిషిలోని
మానవత్వం మంటగలసి
దానవ రూపంలో అభం-శుభం తెలియని
పసిపిల్లలపై అరాచకాలు
పైసల బేరంలో లాభాలార్జించే
అంగడి బొమ్మలుగా మారిపోతున్న అబలలు
వరకట్నపు వేధింపులతో.
అతివకి అత్తింట్లో మృత్యు వేదనాభరిత లోక
సాక్షాత్కారాలు
విషపు స్రావాలు  పుక్కిలి పట్టి
ప్రేమ పేరిట వంచించే పురుషుల పాలిటబడి
సమిధలవుతున్న పడతులు
                 
పతనమైన మానవత్వపు చివరి అంచున నిలబడి
కన్నీరు మున్నేరు అవుతున్న మగువా?
నీ పయనం ఎటు వైపు!?
అఖిలవిశ్వంలో
అర్ధభాగపు ప్రగతి మాదేనంటూ..
ఎలుగెత్తి చాటుతూ..
ఆర్ధిక స్వాతంత్ర్యపు స్వావలంబనలో
హక్కులపోరాటంలో
విశ్రాంతి ఎరుగని యోధురాలివా?
నాగరికత వెల్లవేసుకుని
వలువలూడి నేలజీరాడినట్లు 
మాన మర్యాదలు లుప్తమై ..
కనకపు సింహాసనంపై అందాల రాణివై 
వెలుగొందాలని ఆకాంక్షతో
అజ్ఞాన అంధకారంలో..మునిగి తేలుతున్నావా?  
నీ జాతి మనుగడ మృగ్యమై పోతుంటే..
అది గుర్తించ జాలక
సమానత్వపు బావుటా ఎగరవేయాలని
నీ మహత్తు గొప్పదని ఎంచి
పైకెగురలేక చతికలబడ్డావా .?
కబళించిన కరాళ దంష్ట్రలను తుదముట్టించి
బంధించిన శృంఖలాల్ని చేదించి 
                                            జ్వలితవై, ప్రజ్వలివై,దేదీప్యవై వెలుగొందు*

9 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

Baagundi vanaja garu.

Unknown చెప్పారు...

స్త్రీ గమనం ఏమిటో..సున్నితంగా విమర్శించారు.
గమ్యం ఏమిటో చెప్పారు.నానాటికి దిజారిపోతున్న స్త్రీ విలువని పెంచుకోవడానికి కంకణం కట్టుకోవాలి.
చక్కని సందేశం తో నిండి ఉండి వాత పెట్టినట్లు ఉంది. చిన్న చిన్న అచ్చుతప్పులు ఉన్నాయి.
ఇక్కడే కాదు చాలా చోట్ల అచ్చుతప్పులు కనిపిస్తున్నాయి. సరిచేస్తే బాగుంటుంది.

Harsha చెప్పారు...

అజ్ఞాన అంధకారంలో..మునిగి తేలుతున్నావా? ఈ ప్రశ్న ఎవరికీ వారు వేసుకోవాలేమో?

ఇంకొకటి మన మర్యాదలు లుప్త మయి అన్నారు ?? ఇది అందరికి వర్తిస్తుందేమో ?

చెప్పాలంటే...... చెప్పారు...

baavundi chaalaa congrats andi vanaja garu

శ్రీ చెప్పారు...

చాలా బాగుంది వనజ గారూ!...అభినందనలు మీకు...@శ్రీ

శశి కళ చెప్పారు...

chala bagundi vanjkka.congrats

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కుసుమ కనుపర్తి గారు. మీ స్పందనకి ధన్యవాదములు. మీరన్నది నిజమే! అచ్చుతప్పులు లేకుండా చూస్తాను Thank you!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Jalataaru vennela gaaru

Thank you so much!

@cheppaalante ..Manju gaaru.. Thank you!

@Shashi kala gaaru.. Thanks Nestham.

@ Sree gaaru.. Once again Thank you!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

హర్ష గారు.. మీరు అన్నట్లు ఎవరికీ వారు వేసుకోవాల్సిన ప్రశ్నలే! అందుకే... ఈ కవిత.

ఈ కవిత 2002 లో వ్రాసినది. .మీ స్పందనకి ధన్యవాదములు.