21, డిసెంబర్ 2012, శుక్రవారం

ప్రియమైనవి

జీవితంలో ప్రతి క్షణం ..  ఏదో ఒకటి నేర్చుకోవడం లో కరిగి పోతే ఎంత బావుండును అనిపిస్తూ ఉంటుంది. 

అలా కాలాలు కరిగిపోతే ..అనుభూతులకి తావెక్కడ!? అని కూడా దిగులు వేస్తూంది.

అసలే ధనుర్మాసపు రోజులు. మంచులో తడిసి ముద్దయిపోతూ.. మనషులే  కాదు.. మనసు కూడా 

 మనసుతో.. మనకి కల్గిన ఒకో అనుభూతిని అక్షరంగా మలిస్తే ఎలా ఉంటుందంటే.. 

ఇదిగో..ఇలా .. చాలా ఇష్టంగా..

ఒక ప్రభాతం  వస్తుంది నీ జ్ఞాపకం ని వెంటబెట్టుకుని వస్తూ.. 

ఒక ప్రభాతం  వెళ్ళిపోతుంది నీ జ్ఞాపకాన్ని తీసుకుని వెళుతూ..

నేను ఎలాంటి ప్రభాతం  కోసం నిరీక్షిస్తున్నాను అంటే ..

అది వస్తూ వస్తూ తనతో.. నిన్ను కూడా తీసుకురావాలని. 

అనుకుంటూ.. 

మళ్ళీ తరచి చూసుకుంటాను.

ఇంతగా.. 

రాని  వాళ్ళ కోసం  అంతగా  ఎదురు చూడటం 

ఎందుకు  ?

ఎందుకు ..జరుగుతుంది ?

ఎవరి కోసమో ఎదురు చూసే పరిస్థితి ..ఎందుకు కల్గుతుంది..?

బహుశా ఈ ప్రపంచంలో కొన్ని కొన్ని వస్తువులు ఎప్పటికి ప్రియంగానే ఉంటాయి.

దొరకని వాటిపై ఎందుకు ప్రేమ కల్గుతుందో !

అది ఏమిటంటే ...  ఇవిగో.. అవే ఇవి. 




                                                (నగర జీవనంలో దొరకనిది ...ప్రియమైనవి )

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బహుశా ఈ ప్రపంచంలో కొన్ని కొన్ని ఎప్పటికి ప్రియంగానే ఉంటాయి.

నిజం. ఎప్పుడు అంతే.

జయ చెప్పారు...

ప్రతి ఒక్కటి అరచేతిలోనే ఉంటే అప్పుడేదీ ప్రియంగా ఉండదనుకుంటా:) గుప్పిట మూస్తేనే కదా ఆ మజా తెలిసేది, అది తెరవటానికి కలకాలం ప్రయత్నాలు జరిగేది. లేకపోతే అంతా ఏ రుచీ లేకుండా చప్పగానే ఉంటుంది.:))))))

జ్యోతిర్మయి చెప్పారు...

మీ మనసులో మెదిలిన అనుభూతి కళాత్మకంగా మీ వాకిట్లో విరిసినట్లుంది.

శశి కళ చెప్పారు...

ఒక ప్రభాతం వస్తుంది నీ జ్ఞాపకం ని వెంటబెట్టుకుని వస్తూ..

ఒక ప్రభాతం వెళ్ళిపోతుంది నీ జ్ఞాపకాన్ని తీసుకుని వెళుతూ..<< రంగవల్లులు విరిసిన ప్రభాతాలు
యెంత చక్కని జ్ఞాపకాలు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

కొన్ని ఎంత దొరకకుండా తప్పించుకుంటున్నా వాటిని మరింత ప్రియంగా అందుకోకుండా ఉండలేమేమోనండీ..
మీ రంగవల్లి చాలా బాగుంది..