ఏ మలుపులో అయితే వదిలేసి వెళ్ళావో..
అక్కడే ఇంకా ..అక్కడే కూర్చుని ఉన్నాను.
ఆలోచిస్తూనే ఉన్నాను
అంత క్షమించరాని తప్పు ఏం జరిగిందా ..
అని ఆలోచిస్తూనే ఉన్నాను.
ప్రతి క్షణం నీ పరోక్షంలో తపిస్తూనే ఉన్నాను.
నాకు తెలుసు నీకు ప్రేమ లేదని
ద్వేషం మాత్రమే ఉందని..
గాయం ఎంత లోతైనదంటే
గురి పెట్టిన లక్ష్యమే నా హృది.
ఒకమారు.. నా మాట విను
నా ఈ హృదయాన్ని మండించకు
అసలే దప్పిక గొని ఉన్నాను.
ఆహ్లాదాన్ని పంచేందుకు కాకపోయినా
దశాబ్దాలుగా మేలుకుని ఉన్న
ఈ కళ్ళను నిద్ర పుచ్చడానికైనా రా..
నీవు నడచి వెళ్ళిన దారి వైపే చూస్తూ
తుది శ్వాస విడిచానా...
అయినా కళ్ళు తెరుచుకునే ఉన్నాయి.
ఇక ఇంతకన్నా ఏమి ఎదురు చూస్తాను.!?
తెరచి ఉన్న ఈ కన్నులు నా ఆత్మకి ప్రతీకలు
(పిడికెడంత ప్రేమ కోసం..జీవన పర్యంతం వేచి చూసిన ఓ..స్త్రీ మూర్తికి అశ్రు నివాళులతో..)
అక్కడే ఇంకా ..అక్కడే కూర్చుని ఉన్నాను.
ఆలోచిస్తూనే ఉన్నాను
అంత క్షమించరాని తప్పు ఏం జరిగిందా ..
అని ఆలోచిస్తూనే ఉన్నాను.
ప్రతి క్షణం నీ పరోక్షంలో తపిస్తూనే ఉన్నాను.
నాకు తెలుసు నీకు ప్రేమ లేదని
ద్వేషం మాత్రమే ఉందని..
గాయం ఎంత లోతైనదంటే
గురి పెట్టిన లక్ష్యమే నా హృది.
ఒకమారు.. నా మాట విను
నా ఈ హృదయాన్ని మండించకు
అసలే దప్పిక గొని ఉన్నాను.
ఆహ్లాదాన్ని పంచేందుకు కాకపోయినా
దశాబ్దాలుగా మేలుకుని ఉన్న
ఈ కళ్ళను నిద్ర పుచ్చడానికైనా రా..
నీవు నడచి వెళ్ళిన దారి వైపే చూస్తూ
తుది శ్వాస విడిచానా...
అయినా కళ్ళు తెరుచుకునే ఉన్నాయి.
ఇక ఇంతకన్నా ఏమి ఎదురు చూస్తాను.!?
తెరచి ఉన్న ఈ కన్నులు నా ఆత్మకి ప్రతీకలు
(పిడికెడంత ప్రేమ కోసం..జీవన పర్యంతం వేచి చూసిన ఓ..స్త్రీ మూర్తికి అశ్రు నివాళులతో..)
9 కామెంట్లు:
చాలా ఆవేదనగా ఉంది.. ఎదురుచూపులు ఎంత వేదన.? కళ్ళకి కట్టినట్లు ఉంది.
ఇలాంటి కవిత్వం చూడటం చాలా బాధ కల్గిస్తుంది.
కొన్ని జీవితాలకు సంతోషం చాలా దూరం. ఈ అసమానతలెందుకో అర్ధం కావు. కవిత ఆర్ద్రంగా వుంది.
నాకెందుకో చదువుతుంటే మధుబాల గుర్తుకొచ్చింది,కింద మీ అకితం లైన్ చదవగానె .....బాగా సూట్ అయిందే అనిపించింది.
చాల బాగా రాశారు.
maatale levu vanaja gaaru enta baavundo....!!
"దశాబ్దాలుగా మేలుకుని ఉన్న
ఈ కళ్ళను నిద్ర పుచ్చడానికైనా రా.." చాలా ఆర్ద్రంగా, కళ్లు చెమర్చేలా ఉంది వనజ గారు...
మీ కవిత చదువుతుంటే చాలా రోజుల క్రితం ఈ టీవీలో ఎండమావులు సీరియల్ పాట గుర్తుకొచ్చిందండీ..
కొందరి గుండెలలోని ఆశలు ఎప్పటికీ ఎండమావులే..
వైష్ణవి.. కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
వేదన లేకుండా.. జీవన సాగరం దాటగలమా!?
@ జ్యోతిర్మయి గారు.. ఒకోసారి ఇలా వేదనని కవిత్వరీకించక తప్పడంలేదు.
మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములు.
నరసింహ గారు.. నమస్తే! బావున్నారా..?
కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
@ చెప్పాలంటే మంజు గారు.. ధన్యవాదములు.
మీ మెయిల్ ID ఇవ్వగలరా?
రాజీ గారు.. ఎక్కడైనా ఎవరికైనా వేదన ఒకటే! జీవితాలలో ఆవేదనలు సహజమే కదా!
కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి