ఓ.. నా ప్రియాతి ప్రియమైన భారత దేశ సోదరీ మణు ల్లారా! ముక్కు పచ్చలారని పసి పాపల్లారా! యువతుల్లారా! గృహిణి ల్లారా ! బామ్మలారా!
మీకు అసలు చదువుసంధ్యలు వద్దనే వద్దు. ఒంటరి ప్రయాణాలు వద్దు. ఎప్పుడూ జన సమూహంలోనే ఉండండి.అన్నదమ్ములతో కూడా కలసి తిరగవద్దు. వారిని కూడా మీ బాయ్ ఫ్రెండ్ అని నమ్మిన్చేస్తారు.
మీరు ఏ మతంకి చెందినవారు అయినా సరే మీ ఒంటి నిండా బట్టని చుట్టుకోండి గాలి కూడా జొరబడనంతగా వేసుకోవాలని మర్చి పోకండి. అన్నట్టు మీ దగ్గర కారం మూటలు తీసుకు వెళ్ళకుండా అడుగు కూడా బయటకి కదపవద్దు..
అలాగే మీ ఒరలలో చురకత్తులు పెట్టుకోవడం మర్చి పోకండి. దబ్బనాలు,గుండు సూదులు మీ పర్సు లో నిత్యావసరాలు అని గుర్తు పెట్టుకోండి.
మగ కుక్కలు శరీరం పై పడి నాకకుండా మైలు తుత్తం పూత పూసుకోవాలి (చనుబాలు మాన్పడానికి అప్పుడెప్పుడో చేసినట్లు) ఇంకా చెప్పాలంటే పూర్వకాలంలో శరీరం లోని అంగాలకి అనుమానం జబ్బుతో పురుషులే రక్షణ కోసం తాళాలు పెట్టేవాళ్ళ ట . అదేదో.. మనమే ఏర్పాటు చేసుకుంటే పోలా!? ఆలా చేతకాకపోతే మహిళా కండోమ్స్ కూడా వెంట బెట్టుకుని తిరిగితే బావుంటుంది. (అత్యాచారం చేసేవాడికి మీ నుండి రక్షణ కల్పించడానికి)
మీరు ఇలా గనుక చేయ గల్గితే ఈ దేశానికి బోలెడంత నిశ్చింత. పాలకులకి ఈ నాన్సెన్స్ ఉండదు. చట్టానికి బోలెడంత పని భారం తగ్గుతుంది. న్యాయ స్థానంలో మూలుగుతున్న కేసులు ఒక కొలిక్కి వస్తాయి.
ఇంకో ముఖ్య మైన విషయం ఏమంటే ఆడజాతి దైర్యాన్ని,త్యాగాలని మీడియా 24 గంటలు ప్రసారం చేసి
"హమారే ఔరత్ మహాన్ " అని కీర్తి పతాకం వేసి విశ్వ వినువీధుల్లో ఊరేగిస్తారు. ఆ పేరు ప్రతిష్ఠ కోసం అయినా మీ పై జరిగే దాడులకి ,అత్యాచారాలకి పెదవి విప్పకండి. పెదవి విప్పకండి.
దిన పత్రికల్లో రోజు వచ్చే న్యూస్ న్యూసెన్స్ ని వీలైనంత తగ్గించి వారికి పని భారం తగ్గించండి. భరించండి. మాన ప్రాణాలని పోగొట్టుకుని బ్రతికి ఉంటే అవమానాలని దిగ మింగండి. అదే అదే ఈ జాతికి మీరిచ్చే గౌరవం .మీ త్యాగం అని మరువకండి.
ఇంతకన్నా ఇంకా నేనేం చెప్పగలను.!!??
వర్ధమాన భారతమా ! స్త్రీలపై వేల అత్యాచారాలు, వందల హత్యలతో దినంబు వర్ధిల్లు.
(ప్రస్తుత పరిస్థితులకి వగచి )
4 కామెంట్‌లు:
ఆడవాళ్ళు ఎప్పుడూ మీరు మంచి అమ్మాయి అనిపించుకోవటానికి ఇలాంటి త్యాగాలు చేయాలని
మన పాలకులు,అలాగే కొందరి ప్రగాఢ విశ్వాసమండీ అప్పుడే "" హమారే ఔరత్ మహాన్ "" అని ఒప్పుకుంటారు
సభ్యసమాజం సిగ్గుపడే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడైనా మీలాంటివాళ్ళు ఇలాంటి వాళ్ళను ఇలాగే నిలదీయాలి..
Well Said వనజవనమాలి గారూ..
హ్మ్...స్త్రీని పూజించే దేశం లో దౌర్భాగ్యం
మీ ఆవేదన అర్ధం చేసుకోవలసిందే. ఇలా ఆవేదన పడితే మాత్రమే సరిపోదు. ఆలోచన కావాలి. ప్రజలను , సమాజాన్ని , ప్రభుత్వాలను చైతన్యం చేసే ఆలోచన మీ అక్షరం కావాలి. అది మదోన్మాదులకు భయం కలిగించే ఆయుధం కావాలి. మీ ఆవేదనను ఆయుధం గా మార్చండి. మీ వంతుగా ఈ సమస్యకు పరిష్కారాలను అక్షరీకరించండి.
కారం మూటలు తీసుకు వెళ్ళకుండా అడుగు కూడా బయటకి కదపవద్దు..
అలాగే మీ ఒరలలో చురకత్తులు పెట్టుకోవడం మర్చి పోకండి. దబ్బనాలు,గుండు సూదులు మీ పర్సు లో నిత్యావసరాలు అని గుర్తు పెట్టుకోండి.
.................
వనజవనమాలి గారు మీరు ఆవేదనతో, ఆగ్రహంతో రాసినా ....
నేను మాత్రం ఈ సలహాలు పాటించడమే మంచిదని చెబుతాను. చట్టాలు ఎన్ని ఉన్న మహిళలు తమ జాగ్రతలో తాముండాలి
కామెంట్‌ను పోస్ట్ చేయండి