29, డిసెంబర్ 2012, శనివారం

స్త్రీలపైనే అత్యాచారాలు ఎందుకు?





డిల్లీ లో జరిగిన అత్యాచార సంఘటన తో దేశం అట్టుడుకి పోతుంది.  భావి భారతం అంతా కాముక భారతం గా మారనుందా ?

తగ్గుతున్న బాలికల సంఖ్యా , పెరుగుతున్న వికృత కోర్కేలా?

మానవ  జాతి చరిత్రలో  స్త్రీ  పై అనాదిగా జరుగుతున్న అతి హేయమైన అత్యాచార ఘటనలకి అంతం లేదా!? నానాటికి ఎక్కువైపోతున్న ఈ పరిస్థితుల్లో ఆడదానిగా పుట్టడమే శాపంగా పరిగణించాలి  ఏమో!

అసలు స్త్రీలపైనే అత్యాచారాలు ఎందుకు?  బలహీనురాలు అనా..? లేక అహంకారమా!?

మన వార్తా పత్రికలూ  నిత్యం జరుగుతున్న అత్యాచారాల సంఖ్య ని  ఇతర దేశాల సంఖ్యలతో..పోల్చుకుని  మన దేశమే నయం అనుకుని  సంతృప్తి పడుతున్నట్లే కనిపించింది నాకు.

ఇదెక్కడ దిక్కుమాలిన పోలికో నాకు అర్ధం అయి చావలేదు. అదేమన్నా అభివృద్ధి సూచకమా.. వాళ్లతో మనం పోల్చుకుని తృప్తి పడటానికి తగ్గితే బాధ పడటానికి.

భారత దేశంలో స్త్రీలకి లభించే గౌరవం ఏపాటిదో.. వార్తా పత్రికలలో  పతాక శీర్షిక స్థాయిలో కనబడుతుంది. నిరంతర ప్రసారాలలో స్క్రోలింగ్ లో కళ్ళకి కట్టినట్లు కనబడుతుంది.కనుమరుగవుతుంది. పురుష అహంకారుల నోళ్ళలో బబుల్ గమ్ లా నలుగుతున్నది.పోలీస్ స్టేషన్ ల సాక్షిగా మరో సారి అత్యాచారంకి గురి అవుతున్నది. న్యాయ స్థానంలో వందల పైళ్ల  మధ్య నలిగిపోతుంది.

స్త్రీ జాతి పై అత్యాచారాలు పెరగడానికి గల కారణాలని నాకున్న పరిశీలనా దృష్టి తో చెప్పదలచాను.
అది అందరికి సబబుగా అన్పించక పోవచ్చును. నేను చెపుతున్నది నా అభిప్రాయం మాత్రమే.

సుమారు పదేళ్ళ క్రితం ఓ.. ట్రెండ్ తో  ప్రేమ పేరిట  యువతని తప్పు దారి పట్టించడం   మొదలైంది అంటే సినిమా రంగం పై విరుచుకు పడినట్లు ఉంటుందేమో.. కాని అది ముమ్మాటికి నిజం.

అతి శక్తివంతమైన మీడియా సినిమా.  ఆ సినిమాలకే సంబంధించి  కార్యక్రమాలు ప్రసారం చేస్తూన్న టీవి మాధ్యమం కూడా తక్కువేం కాదు.

అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటున్నఈ రెండు జన జీవనం పై అతి నిశబ్దంగా తన ప్రభావాన్ని  చూపుతున్నాయి  సందేశం మాట అటు ఉంచి అక్కడ కనిపిస్తున్నవి అశ్లీల దృశ్యాలు, అశ్లీల సంభాషణలు వయసుతో సంబందం లేని ముదురు ప్రేమలు.. ఇవే కనబడుతూ ఉంటాయి.

నాగరికత పేరిట  స్త్రీలు  యొక్క  వస్త్రధారణ  కూడా ఒక ప్రేరకం గా మారుతుంది. అది గమనించడం మంచిది.

ఇక పెరిగిన  టెక్నాలజీ పుణ్యమా అని బూతు చిత్రాలు అరచేతుల్లో రాజ్యం యేలుతున్నాయి. పదే  పదే ఆ దృశ్యాలు చూస్తూ కామంతో కళ్ళు మూసుకు పోయి తల్లి,చెల్లి,కూతురు తేడా లేకుండా పోతుంది.


అత్యాచారాలు పెరగడానికి కారణం ఏమిటంటే తల్లి దండ్రుల ప్రేమరాహిత్యం,పెరిగిన వాతావరణం,  నైతిక విలువలు  నేర్పించని విద్య,వ్యక్తిగత దురలవాట్లు, మత్తు మందులు,మద్యం ప్రభావం, పరిస్తితు లు అనుకూలించడం..  లేదా అనుకూలంగా మలచుకోవడం,చెడు ఆలోచనల ప్రభావం తో పాటు, ప్రేరేపించే అంశాలు కూడా దోహదం చేస్తున్నాయి.

పల్లె పట్టణం ఎక్కడైనా సరే అత్యాచారాల శాతం పెరగడానికి     స్త్రీ జాతి అనుకూలంగా వారికి దొరకడం. లేదా ఒంటరిగా ఉన్న వారిపై చూపు పడటం, బలహీనంగా ఉన్న వారిపై మృగత్వాన్ని చూపడం. చదువు సంస్కారం ఇవన్నీ ఉన్నా కూడా కళ్ళు మూసుకు పోయి అత్యాచార యత్నంకి  ఒడి గడుతున్నారు.

వాళ్ళు జరుపుతున్నది అత్యాచారం అని తెలిసినా కూడా భయ  పడనీ నేర ప్రవృత్తి, విచక్షణా జ్ఞానం ని కూడా తలెత్తనివ్వని మధాంధ కారంతో కూరుకు పోతున్న వారిని కఠిన శిక్షలు విధించి మిగిలిన వారికి శిక్ష భయం కల్గించడం కూడా  శాశ్వత పరిష్కారం అని చెప్పలేం.

స్త్రీ ఇష్టా ఇష్టం తో పని లేకుండా వావి వరుస వయస్సు తారతమ్యం లేకుండా అతిక్రూరంగా ,కిరాతకంగా,  హేయంగా జరిపే  ఈ చర్యపై కారణాలు కాదు వెదకవలసింది.బూతద్దం లో చూడటం కాదు కావాల్సింది.

ప్రేరేపించే అంశాలని  గుర్తించి మూలాలని కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అత్యాచారం నెరిపిన వారిని కఠినంగా   శిక్షించడంతో పాటు,  మధ్య పాన నిషేధం,  సెన్సార్ బోర్డ్ కఠిన మైన ఆంక్షలు విధించడం, దృశ్య ప్రసారాల్లో నియమ నిబందనల తో పాటు, అశ్లీల చిత్రాల ప్రదర్శన కి కఠిన నియమాలు అవలంభించడం తో పాటు.. మెమరీ కార్డుల ద్వారా అశ్లీల చిత్రాల వ్యాప్తి అడ్డుకోవడం పై దృష్టి సారించాలి.

అలాగే.. స్త్రీలు కూడా ఒంటరిగా వెళ్ళాక పోవడం మంచిది. వస్త్ర ధారణ విషయంలో ఇష్టా ఇష్టాలని ప్రక్కన బెట్టుకుని నిండుగా బట్టలు ధరించి, సాధ్యమైన విధంగా సమూహంలో ఉంటూ ఉండాలి. సంస్కార వంతమైన సభ్య సమాజంలో మనం లేం  కాబట్టి  పువ్వు లాంటి వారు..ముళ్ళ పాలు కాకుండా కాపాడుకోగల్గాలి తప్పదు.

దుష్టులుకి దూరం  ఉంటూ తమని తాము కాపాడుకునే విద్యలు నేర్చుకోవాలి తప్పదు.
మంచిగా చెపితే విననప్పుడు దండన తో.. కాపాడుకోవడం తప్పు కాదు.

అంతకి మించి మరో దారి లేదు.   స్త్రీ కామ్య వస్తువు కాదు,భోగ వస్తువు కాదు,వ్యాపార వస్తువు కాదు.. చైతన్యం నింపే  మానవి.

గతంలో నేను వ్రాసిన పోస్ట్.. లింక్ ఈ క్రింద ఉంది చూడండి. ఇంకా కొన్ని వివరంగా వ్రాసి ఉన్నాను.

ఇది ఒక విష వలయం.పిల్లలని కాపాడుకోవడం...ఎంత కష్టం?


9 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

స్త్రీ కామ్య వస్తువు కాదు,భోగ వస్తువు కాదు,వ్యాపార వస్తువు కాదు.. చైతన్యం నింపే మానవి.

పువ్వులాంటిది కాదు.పువ్వులాగా ఉండకూడదు.అబల అనే ధోరణి పెంచే ఏ అంశమూ మంచిది కాదు. స్త్రీ చైతన్యం నింపే మానవి మాత్రమే కాదు ప్రస్తుత సమాజం లో చైతన్యం నింపుకోవలసిన అవసరం కూడా అడుగడుగునా కనిపిస్తుంది. మగాళ్లు మాత్రమే కాదు స్త్రీలు కూడా చైతన్య రహితమైన వ్యాఖ్యలు చేస్తుంటారిలాంటి సమస్యలపైనా. స్త్రీలలో చైతన్యం పెరగడం కీలకమైన అంశం.

మీ సూచనలు మీ అభిప్రాయాలు బాగున్నాయి. కానీ అవి మాత్రమే సరిపోవు. ఇంకా మూలాలోకి వెళ్లాలి.

Praveen Mandangi చెప్పారు...

రేప్ జరిగినప్పుడు స్త్రీని మాత్రమే చెడిపోయినదానిలా చూడడం వల్ల పవిత్రత అనేది మగవాళ్ళకి అవసరం లేదనే అభిప్రాయం కలగదా? అలాంటి అభిప్రాయం ఉండబట్టే కదా మగవాళ్ళు ఎలాంటి సంకోచం లేకుండా రేప్‌లు చెయ్యగలుగుతున్నారు. శీలం, పవిత్రత లాంటి నమ్మకాలు ఉన్నంత వరకు రేప్‌లు జరుగుతూనే ఉంటాయి.

శ్రీ చెప్పారు...

వనజ గారూ!...మీ అభిప్రాయం సరైనదే..."యత్ర నారీ అస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా"...
అని చెప్పే మనుస్మృతి పుట్టిన దేశంలో ఇలాంటి దురాగతాలు నిందనీయం...
ఆ అభాగిని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ....

Manjusha kotamraju చెప్పారు...

well said Praveen Mandangi garu,,,

Manjusha kotamraju చెప్పారు...

well said Praveen Mandangi gaaru,,
http://www.indiatimes.com/india/delhi-gang-rape-why-did-the-men-rape-her-50805.html

ఈ article చదవండి,,.. తాగిన మైకం లొ అతను వివెకం కొల్పొయి ఉంటాడు ,,అందులొను అమ్మాయి కొరికింది చేతి మీద అని రాసి ఉంది article లొ. సొ విచక్షన కొల్పొయి మ్రుగం లా ప్రవర్తించాడు ,,,అమ్మాయి వాల్లు మ్రుగాల్లు అలా మట్లాడుతున్నారు అన్నప్పుడె అమ్మయి,ఆ friend ఇద్దరూ బస్సులొ నుండి దిగివెల్లిపోయి ఉంటె ఎంతొ బాగుండెది ,,,ఇంత ఘొరం చుసే వాల్లం కాదు,,,

Manavu చెప్పారు...

ముఖ్యమంత్రికి, పోలిసులకు పొసగని చోట నేరస్తులకు భయం ఉంటుందా?

ఉండదు గాక ఉండదు. డీల్లీ రేప్ కేస్ విషయం లో జరిగింది అదే.అక్కడి మహిళా ముక్య మంత్రి షీలా దీక్షిత్ గారికి డీల్లీ పోలిసులకు మద్య ఎందుకో బేదాభి ప్రాయాలు ఉన్నట్లు అనిపిస్తున్నాయి. పాలనా పరంగా డిల్లీ పోలిస్ భారత రక్శణ శాఖా మంత్రి షిండే గారి కంట్రోల్ లో పని చేస్తుందట. అందుకే వారికి ముఖ్యమంత్రి ని పెద్దగా పట్టించుకోరనుకుంటా!

మొన్న ప్రజలు ఆందొళన చేసిన విషయమ్ లో, బాదితురాలి మరణ వాంగ్మూలం తీసుకునే సమయం లో పోలిసులు ప్రవర్తించిన తీరు మీద సాక్షాతు, రాష్ట్ర ముఖ్య మంత్రియే పొలిసుల మిద హోమ్ మంత్రికి పిర్యాదు చేసారంటే పరిస్తితి ఎంత దారుణం గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరి అటువంటి పాలనా వ్యవస్తలొ స్త్రీల మీద అత్యాచారాలు చెయ్యాలనుకున్న దుండగలకు ఏ మాత్రం భయం ఉంటుంది చెప్పండి. ప్రతి వాడు తమ మీదకు రాకుండా బాద్యతను ప్రక్క వాడి మీదకు నెడదామని చూసే వారే. ఇటువంటి అదికారులు స్త్రీలకు రక్షణ కల్పించ గలరా? వీరీ రక్షణా బరోసాను నమ్మి భయటకు వెళ్లిన స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రాగలరా? రాలెరని "అమానత్" ఉదంతమే చెపుతుంది. ఏన్ని కటిన చట్టాలు చేసినా అమలు చేసే వారికి చిత్తశుద్ది లెకపోతే వాటి వల్ల ఒరిగేది ఏమి ఉండదు.

@ మంజుష గారు మీరు చెప్పిన జాగర్తలు వారు తిసుకొ లేదు అంటే మ్రుగాల్ల చెష్టలు, విద్యార్దులు చేసే ఈవ్ టిజింగ్ లాంటిదే అని బాదితులు పొరపడి ఉంటారు. అందుకే వారిని గట్టిగా ఎదిరించి ఉంటారు. సెక్స్ దోపిడి గురించి పెద్దగా భయమ్ లేని వారు కావచ్చు. ఒక ఉదాహరణ ఏమిటంటే, ఆ బాదితురాలు మానసికంగా బలవంతురాలు.అందుకె అమె స్ప్రుహలొకి వచ్చాకా తన మీద జరిగిన రెప్ గురించి కాక నేరస్తులను శిక్షించారా అని అడిగిందట. పాపం రేప్ మాత్రమె అయితే అమే బ్రతికి హాయిగానే ఉండేది.కాని నీచులు కసితో దాడి చేసారు. అందుకే చనిపోయింది. సాదారణ ఆడపిల్ల అయితే మీరు చెప్పినట్లు దిగిపోయే వారే. నవతరం కాబట్టి వాస్తవ ద్రుక్పదమ్ కొరవడింది. ఏది ఏమయినా నెల రోజుళ్ళో దుండగలను ఉరి తీసి అమె అత్మకు శాంతి చెకూర్చాలి.

Praveen Mandangi చెప్పారు...

Read this article: http://tehelka.com/the-rapes-will-go-on/

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

@శ్రీ గారు.. అందరు విచారించ తగ్గ విషయం . ఆమె ఆత్మకి శాంతి కల్గించాలని ప్రార్దిస్తూ.. :(

@ ప్రవీణ్ గారు.. శీలం ,పవిత్రత లాంటి భావజాలం నుండి బయటకి వస్తే అత్యాచారం జరుపబడిన వారు పడిన బాధ గురించి ఏమనాలి? అంత హింస ని మాత్రం తట్టుకోగలరా!?
దానిని కూడా నిరసించాలి కదండీ!!

@ సార్వ భౌమ గారు.. ఈ ఒక్క ఉదంతం చాలండి. మన దేశంలో ప్రజల దుస్థితి ఎలా ఉందొ తేటతెల్లం చేయడానికి.

@ మంజూష గారు.. ఆపద వస్తుందని ఊహించి పారిపోవడం ఉత్తమమే! కానీ అసలు క్షణ క్షణం ఆపదలు ముంచుకొచ్చే సిగ్గు లేని సమాజంలో ఉన్నాం ఎక్కడికని పారిపోగలం.. నట్టడవి లోకి తప్ప. అక్కడే నయమేమో.. ఏ మృగాల దాడిలో కూడా ఇంట వేదన ,హింస ఉండవు.

ఇలాంటి సంఘటనలు చూసి చూసి నిస్తేజం అవుతున్నారు. ఆ నిస్తేజంలో నుండి ఆక్రోశం వెల్లడిస్తున్నారు. ఆవేశం లోకి వెళితే అందరికి నష్టమేమో! ఆరోగ్య కర సమాజం కోసం అంటూ.. చేయి చేయి కలిపే పరిస్థితి అటు ఉంచి అనుమానంతో.. అడ్డంగా నరికి పారేసే రోజులు వస్తాయి.కూడా.

స్పందించిన అందరికి ధన్యవాదములు.

y.v.ramana చెప్పారు...

వనజవనమాలి గారు,

మీరు వ్యక్తీకరించిన అభిప్రాయాల్ని సమర్ధిస్తూనే..

రేప్ అనేది సెక్సువల్ ప్లెజర్ కోసం మాత్రమే అనుకోకూడదు. చాలాసార్లు రేపుల్లో సెక్సువల్ ఇంటర్ కోర్స్ కన్నా.. శరీరంపై గాయాల శాతం చాలా ఎక్కువ. ఇది శాడిజం అనబడే ఒక మానసిక స్థితి.

మీలో ఎంతమంది రేప్ బాధితురాల్ని చూశారో నాకు తెలీదు గానీ.. నేను చూసిన ఒక కేస్ ఇప్పటికీ నన్ను డిస్టర్బ్ చేస్తుంది. చాలా భీతి గొలిపే కేసది.

రేప్ బాధితుల్ని కౌంసెలింగ్ చెయ్యడం సైకియాట్రిస్ట్ కి కూడా చాలా దుర్భరంగా ఉంటుంది.

మన తెలుగ్ బ్లాగర్లు రేప్ ని సమాజంలోని కొన్ని అంశాలకి ముడిబెట్టి చూస్తున్నారు. రాస్తున్నారు. అయితే అందుకు సాక్ష్యాలు (నాకు తెలిసినంతమటుకు) లేవు.

ఈ రోజుల్లో మగపిల్లల్ని కూడా రేప్ చేస్తున్నారు. నిన్ననే ఒక కేస్ చూసి షాకయ్యాను. ఒక స్వామీజీ నీలో ఒక ఆడదెయ్యం ఉంది. దాన్ని నా శక్తితో లాగేస్తానని నమ్మబలికి.. ఒక పదిహేనేళ్ళ కుర్రాడికి sodomy చేశాడు. Anal tears చాలా ఉన్నాయి. ఆ అబ్బాయికి జ్వరం, కడుపు నొప్పి.

HIV, Hepatitis risk మర్చిపోరాదు.

PTSD (post traumatic stress disorder) జీవితాంతం వెంటాడుతుంది. మానసికంగా.. జీవచ్చవం అంటారే.. అలా అయిపోతారు.

రేప్ అనేది ఏదో సెక్స్ దాహం ఉన్నవాళ్ళు చేస్తారనే భావం కరెక్ట్ కాదు. ఆధిపత్యాన్ని చూపించుకోడానికి, కసిని వ్యక్తీకరించడానికి కూడా రేపులు జరుగుతుంటాయి. అందుకే యుద్ధంలో గెలిచిన పక్షం సైనికులు ఓడిన పక్షం వైపు ఆడవారిని, పిల్లల్ని పాశవికంగా రేప్ చేస్తుంటారు. ఇది హత్య కన్నా తీవ్రమైన, క్రూరమైన నేరం. దురదృష్టవశాత్తు ఇండియాలో స్టడీస్ పెద్దగా లేవు.

ఇప్పటికే పెద్ద కామెంట్ రాశాను.