14, ఏప్రిల్ 2013, ఆదివారం

పరధ్యానం ..

పరధ్యానం .. ఈ మాట కి అసలు అర్ధం ఏమిటీ అని నాకు ఎన్నోసార్లు  అనుమానం వస్తుంది పరుల గురించి ధ్యానమా లేక వేరే విషయాలని ఆలోచిస్తూ అసలు విషయాన్ని పట్టించుకోకుండా  నిర్లక్ష్యంగా ఉండటమో కాని పరధ్యానం గా ఉంటానని  నా పై  ముద్ర పడిపోయింది

మొన్నీ మధ్య మా చెల్లెలు పుట్టిన రోజు వచ్చింది .. ఫలానా తేదీ చెల్లి పుట్టిన రోజు అని గుర్తే కాని ఆ రోజు వచ్చేసరికి మర్చి పోయాను చెల్లి ఆఫీస్ కి వెళుతూ వాళ్ళ ఇంటి తాళం ఇచ్చి వెళ్ళింది . నేను మధ్యహ్నసమయంలో చెల్లి వాళ్ళ అమ్మాయి "అప్పు" ని కాలేజ్ నుండి పర్మిషన్ తీసుకుని ఇంటికి తీసుకు రావాలి అదే రోజు సాయంత్రం ఆ పిల్లకి కంటి ఆసుపత్రిలో చూపించడానికి అపాయింట్మెంట్ తీసుకుని ఉంది.  చెల్లి ఆ  విషయమే చెప్పి " అక్కా  అమ్మాయిని తీసుకు రా " అని చెపి హడావిడిగా వెళ్ళిపోయింది 

కాసేపటి తర్వాత నా మెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటే ఒక మెసేజ్ నాకోసం కూర్చుని ఉంది ఫ్రెండ్  ఒకరు ఈ రోజు చెల్లి పుట్టిన రోజు విష్ చేసారా? బ్లెస్సింగ్స్ ఇచ్చారా .? అని .. మళ్ళీ అంతలోనే అన్నయ్య  నుండి ఫోన్ కాల్. అమ్మా ! ఈ రోజు చెల్లి పుట్టినరోజు విష్ చేసావా? అని 

అన్నాయ్ ! గుర్తులేదు అన్నాను కొంచెం దిగులుగా.  ఎప్పుడు ఏదో పరధ్యానం లో ఉంటావు ,ఇప్పుడన్నా విష్ చేయి తను ఫీల్ అవుతుంది అన్నాడు  అన్నయ్య . ఆ మాటకి నిజంగానే  చెల్లి  ఫీల్ అయ్యిందేమో అని  బాధ కల్గింది. అయ్యో ! నా మతి మరపు మండి పోను అని అనుకుంటూ 

చెల్లికి రింగ్ చేసాను విషెస్ చెపుతుంటే వినకుండానే అన్నయ్య కాల్ చేసి గుర్తు చేసాడా అని అడిగింది సిగ్గేసింది 
అసలు నా వంకే చూడలేదు నువ్వు నేను క్రొత్త చీర కట్టుకున్నాను,సరి కొత్త నగలు పెట్టుకున్నాను  నువ్వు ఎక్కడో పరధ్యానంలో ఉన్నావు అని చెప్పింది 

అవన్నీ పట్టించుకోలేదు అని చెప్పి కాస్త సంజాయిషీ ఇచ్చి విష్ చేసి కాల్ కట్ చేసుకున్నాను 

ఎక్కడ ఆలోచిస్తున్నాను  నిజంగా పరధ్యానం లో ఉన్నానేమో ! ఈ పరధ్యానం అనే మాట ఒకసారి మా అత్తమ్మ నోటి వెంట వినగానే అప్పుడు తెగ బాధ పడిపోయాను ఇదేవిటీ ఈవిడ ఇలా అంటారు ? నేను పరద్యానం లో ఉండట మేమిటీ  అని నానా రకాలుగా అర్ధాలు తీసుకుని తెగ బాధ పడిపోయాను కూడా. 

నేను చాలా విషయాలని బాగా గుర్తు పెట్టుకుంటాను . కానీ బాహ్య ప్రపంచంలో నా చుట్టూ జరుగుతున్న విషయాలలో నేను ఆసక్తి చూపను ఎప్పుడు కూడా అమ్మలక్కల కబుర్లు, చీరలు వాళ్ళు కొనుక్కున్న వస్తువులు  గట్రా  వాటి పై దృష్టి పెట్టను అంత ప్రాముఖ్యత ఇవ్వను అవసరం అయితే తప్ప. లేదా వాళ్ళంతట వాళ్ళు  చెపితే తప్ప నేను జోక్యం చేసుకోను అది నాపాలసీ 

ఇక ఆప్తుల పుట్టిన రోజు పెళ్లి రోజులు లాంటివి కూడా గుర్తు పెట్టుకోను మనుషులపై ప్రేమాభిమానాలు ముఖ్యం కాని పలానా తేదీనే వాళ్ళని విష్ చేయాలి దీవెనలు ఇవ్వాలి అనేది  నాకు అంత  గుర్తు ఉండదు కూడా .(నా కొడుకు పుట్టిన రోజు తప్ప )   

పండుగలు,  జాతీయ పర్వదినాలు వస్తే విష్ చేయడం అంటే నాకు చిరాకు . ఈ ఫోన్ లు వచ్చాక టింగ్ టింగ్ అన్న మెసేజెస్, సూర్యుడికన్నా ముందే లేచి పోటీ పడుతూ చెప్పే పండుగ విషెస్ అంటే నాకు పరమ రోతేసి  పోయాయి 
నాలుగేళ్ల నుండి జనవరి ఒకటి వస్తే  ముందు రోజు నుండే మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి,లాండ్ లైన్ సైలెంట్ మోడ్ లో పెట్టి 2వ తేదీ మధ్యాహ్నం వాటికి మోక్షం కల్గిస్తాను 

ఇక బ్లాగులలో అందరూ విషెస్ చెపుతుంటే మనం కూడా ఒక విషెస్ పోస్ట్ రాసి పడేస్తే అందరికి విష్ చేసినట్లు ఉంటుంది అందరూ విష్ చేస్తే మనం చేయాలి కదా తప్పదు కదా .అనుకుంటూ ఒక పోస్ట్ రాసి బాధగా, బరువుగా బదులు తీర్చుకుంటాను (దయ చేసి నొచ్చుకోవద్దు ) 

అసలు పండగ అంటే ఏమిటీ !? మనం మన చుట్టుప్రక్కల వాళ్ళు ఆనందంగా ఉండటం  అంతే కదా!అప్పుడే పండగ . నన్ను నేను చూసుకున్నా నా చుట్టూ ప్రక్కల వారిని చూసినా ఆ పండగ పూట ఆనందమే కనబడదు నాకు.ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని పండగ కి కావాల్సిన చేసుకోవాల్సిన పిండి వంటలు చేయడం అన్నీ అదొక అదనపు పని.  చాకిరి తో అలసి పోయి ఉంటాం ..ఈ మొహాలకి సంతోషం వస్తుందంటారా? 

 ఎలాంటి ప్రమోదం కల్గించని ఇలాంటి ప్రమాదకర ఆలోచనలు నావి. ఎప్పుడూ ఏ పుస్తకం  చదువుదామా , ఏ పాటని ఎవరు లేని ఏకాంతంలో వింటూ ఆహా,ఓహో అని ఆస్వాదిద్దామ్మా , ఏ ఫ్రెండ్ తో బాతాఖానీ కొడదామా అనే ఆలోచన తప్ప ఇంకా ఏవి పట్టవు గీకినదే గీకి, తోమినదే తోమి, తుడిచినదే  తుడిచి, సర్ది సర్ది లాంటి పనులు అసలు చేయలేను. 

 ఇంకా చెప్పాలంటే మా ఇంటి చుట్టుప్రక్కల వారిలాగా ఒకోకరు నాలుగేసి ఐదేసి రోజులపాటు కష్టపడి చెమటోడ్చి ఆనందంగా వడియాలు పట్టటాలు నావల్ల కాదు   వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళు నన్ను అసలు హెల్ప్ కి కూడా పిలవరుమరి.  పిలవనందుకు కొన్ని ధన్యవ్వాదములు చెప్పేసి ... కూరలలో నూనె తగ్గించుకుని వడియాలు ప్లేటుల నిండా పెట్టుకుని  డైటింగ్ పాటించే బంగారు తల్లులు మీరు  అని వాళ్ళ ముందే చెప్పి నవ్వేసి వస్తాను  ఈ వంటిల్లు జైలు తప్పదేమిటీ  భగవంతుడా  అని ప్రార్దిస్తూ , నన్ను నేను తిట్టుకుంటూ ఉంటానా? మళ్ళీ  ఈ వడియాల ప్రహసనాలు కూడానా అవి తెగ బాధ పడిపోవడం నా  లక్షణం   

 రెండేళ్ళ నుండి ఇంకో పని పడింది కదా! మీ అందరికి తెలిసిన వ్యాపకమే లెండి .. మనం చూస్తున్న వింటున్న మన అనుభవపూర్వకమైన  విషయాన్ని  ఒక వ్యాసంగా రాస్తే ఎలా ఉంటుంది ఎలాంటి ఎత్తుగడతో మొదలు పెడితే బావుంటుంది విషయ అవగాహన కల్పించాలంటే ఏ విషయాలు చర్చల్లోకి రావాలి  అనే ఆలోచన చేస్తూ ఉంటాను అన్నమాట .  మా ఫ్రెండ్ ఒకరు నేను అసలు కాల్ చేయడంలేదని కోపం వచ్చి నా నంబర్ డిలీట్ చేసేసానని ఇంకో ఫ్రెండ్ తో చెపుతుంటే విన్నాను కానీ  నేను అదే సమయంలో వాళ్ళని తలుచుకుని వాళ్లకి ఈ పాట  చాలా ఇష్టం అని చెపుతుంటేనే వింటూ   తను వారికి కాల్ చేసింది  ఆ విషయం వారికి తెలియదు కదా !

నిజంగా ఈ బ్లాగ్ వ్రాయడం అనే హాబీ  వల్ల నన్ను  నేను చాల మందికి దూరం చేసుకుంటున్నాను అని అనుకుంటున్నారు   నేనైతే అలా కాదనుకుంటాను " ఇది నా పర్సనల్ స్పేస్ " ఇక్కడ నేను అనుకున్నట్లు ఉంటాను ఇక్కడ వ్రాసినట్లు నేను జన బాహుళ్యంలో ఉండలేను అక్కడ ఎవరు నొచ్చుకోకుండా ఎవరిని విమర్శించకుండా ఇతరుల కోసం నటిస్తూ బ్రతకాలి ఇక్కడ అలా అవసరం లేదు " అని నేను అనుకుంటాను వ్రాసుకోవడం అనే నాకత్యంత ఇష్టమైన వ్యాపకం ని కుతి తీరా అనుభవిస్తున్నాను.  అందుకోసమే   నా పరధ్యానం. 

ఒక వారం రోజులుగా అలా ఆలోచిస్తూ బ్లాగ్ వైపు కూడా తొంగి చూడలేదు . కొన్ని వ్రాతలు వ్రాసాను కొన్ని స్పందనల్ని కొన్ని జీవితాలని అక్షరీకరించాను  నిజంగా అవన్నీ నా తాయిలాలు . వాటిని చూస్తే నాకు చాలా సంతోషం వాటిని నలుగురికి పంచాలనే ఆశ 

పరధ్యానం అని ఎవరన్నా అంటే నాకు భలే కోపం వస్తూ ఉంటుంది. నాలుగునాళ్ళ  క్రితం "తాయిలం" దాపెట్టి వచ్చాను  మొన్ననే  ఫెమినిస్ట్ "ధాన్యమాలి" ని పైర్ బ్రాండ్  చేసి వదిలాను నిన్ననే "జాబిలి  హృదయం" వ్రాస్తూ బాధలో తడసి ముద్దయి పోయాను ఇందాకనే "కవులమ్మ "కథ చదివి కరిగి నీరై పోయి వచ్చాను. 

ఇలా అందరూ ఇలాగే ఉండాలని చెప్పడం లేదు ఇతరుల గురించి అతి ఆసక్తి మానుకుని స్పందించాల్సిన వాటికి స్పందించి, అభిమానము  చూపాల్సిన చోట అభిమానం ప్రకటించి,  భాద్యత వహించాల్సిన చోట భాద్యత వహిస్తే .  చాలు . 

మనం పుట్టినరోజులు, పెళ్లి రోజులు,  పండుగలు లాంటి వాటికి  అధిక  ప్రాధాన్యత ఇచ్చి విషెస్ చెప్పకుంటే మాత్రం ఏమవుతుంది  చెప్పుకోకపోయినా కొంపలు మునిగి పోవు కదా ! ఇక్కడ ఫోన్ కాల్  ఖర్చుకు వెనుకాడి కాదు,వ్యక్తుల పట్ల అభిమానమ లేక కాదు  

( పండగ రోజున ... ఎప్పుడు నేనే విష్ చేస్తాను నీకు అవన్నీ పట్టవు అన్న నా ఫ్రెండ్ రమ కోసం  ఈ కోపావేశాల పోస్ట్ కోపంలో నిజాలు బయటకి వస్తాయి కదా ! ) 

ఫ్రెండ్స్ ..పరధ్యానం గా  ఉన్నవాళ్ళు ఇలా ఉంటారట...  ఒక వ్యాసంలో చూసి వచ్చాను లింక్ లో చూడగలరు 

 పరధ్యానంగా ఉన్నవారిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదు. వీరు...సున్నిత స్వభావులై, కళాత్మక హృదయం కలవారై ఉంటారు. ఎక్కువగా ఊహల్లో వివరిస్తుంటారు. చిత్రకారులు, రైటర్లు.. ఈ కోవకు చెందుతారు. తాము చేయబోయే పనిని రకరకాలుగా ఆలోచిస్తూ, ఊహించుకుంటూ, తమలో తాము మాట్లాడుకుంటూ ఉండటం వల్ల దైనందని జీవితంలో చుట్టుపక్కల వారిని పట్టించుకోరు. చాలా మెతకగా, నెమ్మదస్తులై ఉంటారు. రకరకాల కాంపిటిషన్స్‌లో పాల్గొనాలనే ఉత్సాహాన్ని చూపరు. పైగా వీటికి చాలా దూరంగా ఉంటారు. .

వారిని మీరు కూడా ఏమి అనకూడదని .. కోరుకుంటూ  :) హమ్మయ్య నేను అయితే ఇప్పుడు రైటర్ ని అన్నమాట. ఒక సందేహం తీరిపోయింది 

26 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...


"ఎలాంటి ప్రమోదం కల్గించని ఇలాంటి ప్రమాదకర ఆలోచనలు నావి" ఎందుకండీ అలా అన్నారు. మీ ఆలోచనలు మీకు ప్రమోదం కలిగిస్తే చాలు. అవి మీ సొంతం.మీ బ్లాగు రాసే హాబీ వల్ల మీరు మరింతమందిని తలుచుకుంటూ దగ్గర చేసుకుంటున్నారు. వడియాల మీద బ్లాగులో రాసాను కానీ ఒక్క రోజుకే నా వల్ల కాలేదని నీకు పెడుతూంతే చూడడం తప్ప ఎప్పుడు పెట్టావంటూ మా అమ్మ వంటావిడ చేత పెట్టించుకుంటోంది. కనీసం రాసినందుకైనా నా వల్ల కాలేదు.
విష్ చెయ్యడం అనేది పుట్టిన రోజుకీ, పెళ్ళిరోజుకీ, పండగలకీ తప్పనిసరిగా అనిపించేది నాకు కూడానూ. మెల్లిగా మానేసాను. కానీ మళ్ళీ ఇలాంటి చిన్న చిన్నవే అవతలి వ్యక్తులకి సంతోషాన్ని ఇస్తాయని తెలిసింది.మీరూ వీలైతే గుర్తుపెట్టుకొండి. నేను అందరి పుట్టినరోజులకీ మటుకు, సంవత్సరమంతా మాట్లాడకపొయినా ఆ రోజు విష్ చేయడమో, లేక మెయిలు పంపడమో చేస్తాను. వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Alpharetta Geprgia లో మన బ్లాగర్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారు? ప్లీజ్ నాకు వారిని ఎలా కాంటాక్ట్ చేయాలో చెపుతారా?

ranivani చెప్పారు...

Chalabagunadi
First time comment post chestunanu

ranivani చెప్పారు...

Chalabagunadi
First time comment post chestunanu

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అనూ గారు .. మీ స్పందనకి ధన్యవాదములు

వడియాలు పెట్టడం చాలా కష్టం అన్ది. ఆ బాధ ఇలా వచ్చేసింది అంతే!

Karthik చెప్పారు...

వనజవనమాలి గారు..బావుంది అండీ మీ 'పరధ్యానం'.....-:)..

అజ్ఞాత చెప్పారు...

ఒక్కో అప్పుడంతే :)
నెనరుంచాలి.

జలతారు వెన్నెల చెప్పారు...

ఏంటోనండి ఈ మధ్య మీరు భలే పరధ్యానం గా ఉంటున్నారు సుమా...:))
ఇప్పుడు మీ చేతిలో ఉన్న వస్తువులేవి నా మీదకు విసరకండే!

Sharma చెప్పారు...


" పరధ్యానం " అంటేనే పరధ్యాస అని ఒక అర్ధం ఉంది. మనం ఎదుటివారి
విషయాలకు స్పందించకపోవటాన్ని కూడా పరధ్యానంగనే జమకట్టారు .ఇది
మీకు తెలియనిదేం కాదు.మీరు చెప్పిన పరధ్యానులందరినీ మేధావులగా జమ
కట్టవచ్చు.

చెప్పాలంటే...... చెప్పారు...

milaane neu alaane marchi potu vuntanu appudappudu...naa di kaaduanukunnappudu naa mundu matladukuntunnaa vinipinchukonu nannu andarutidutu vuntaru assalu pattinchukoventi pilichinaa ani :) Mi tapaa baavundi naa loni nannu gurtu chesindi

ranivani చెప్పారు...

Chalabagunadi
First time comment post chestunanu

ranivani చెప్పారు...

ఈమధ్య నే వీటిని చూడటంమొదలుపెటాను.ఛాలాకషటపడి కామెంట్ పోస్ట చేసాను మీ చూసినప్పుడు .ఎంతో సంతోషించాను .

ranivani చెప్పారు...

Me blog lo na comment chusI chala santoshincha.e Madhya ne blogs chustuna , me embroidery super.thanks for your reply.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నాగరాణి ఎర్రా గారు .. మీ కామెంట్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీకు మనసారా ధన్యవాదములు

FB లో నన్ను కనెక్ట్ కావచ్చు ID Vanaja Tatineni

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఎగసే అలలు .గారు థాంక్ యు సో మచ్

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు .. నా పరధ్యానం కి ప్రతిఫలం ని చూసి మీరే మెచ్చుకుంటారు లెండి Wait please

థాంక్ యు సో మచ్

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శర్మ గారు థాంక్ సో మచ్ అండీ!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చెప్పాలంటే మంజు గారు థాంక్ యు సో మచ్

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే మాస్టారూ ... ధన్యవాదములు

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

పరధ్యానం లో కూడా ఇంత విషయం ఉందన్న మాట.
నాకు కూడా కళాత్మక హృదయం ఉందండోయ్....దహా.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

బులుసు గారు అయ్యో ! ఎంత మాట !? మీకు కళా హృదయం లేకపోవదమేమిటండి !! అయితే ఒక చిన్న మాట . పరధ్యానంగా ఉండండి కానీ అక్షింతలు వేయించుకోకండి

హితైషి చెప్పారు...

All best . మీ పరధ్యానం కి గుర్తిన్పురావాలని కోరుకుంటూ
వైష్ణవి

Sarada చెప్పారు...

Vanaja garu! I am not a blogger, but I read your blog regularly. I live in Alpharetta , Ga.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శారద గారు చాలా చాలా సంతోషం ! మీ మెయిల్ ID లేదు నాకు FaceBook కనెక్ట్ కాగలరా? మీ కొక ముఖ్య విషయం చెప్పాలి. మరి

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Vaishnavi Thank you so much

Niru చెప్పారు...

Paradyanam aithe,mee abbayi bday kuda wish cheyakudadu..kabatti adi paradyanam kadu ..inko kotta padam kanipettali... :)