16, ఏప్రిల్ 2013, మంగళవారం

స్త్రీల కవిత్వం లో ఏం ఉంటుంది?
 "స్త్రీలకి  ఏమి తెలియదు వాళ్ళేమి వ్రాస్తారు పురుష ద్వేషం ప్రకటించడం తప్ప" అనుకుంటారు

నేను చెపుతున్నాను స్త్రీలకి అన్ని తెలుసు .ప్రపంచ పటంలో మనం ఎక్కడ ఉన్నాం? మన  చుట్టూ ప్రపంచం  ఎలా  ఉందో !?  అన్నది కూడా  బాగా తెలుసు.

ముఖ్యంగా స్త్రీలు వ్రాసే కవిత్వం గమనిస్తే అర్ధం చేసుకోవాల్సింది చాలా ఉంది.  వారు వారి కవిత్వంలో దార్శనికతని ప్రతిబింబిస్తున్నారు వంటిల్లు గోడలు దాటి అతరిక్షంలోను ప్రయాణించి ఈ రెండింటి మధ్య స్త్రీలు అన్న కారణంగా చూపబడుతున్న వివక్షని, చిన్న చూపుని గమనిస్తున్నారు, గర్హిస్తున్నారు

పురుషులతో  పోలిస్తే ఎంతోకొంత కాదు బాగానే సగభాగం ప్రగతిలో వారి ప్రమేయం ఉంది కానీ పురుషులు కి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు స్త్రీలకి ఉన్నాయి అవి కాకుండా స్త్రీలకి ప్రత్యేక  సమస్యలు  ఉన్నాయి అందుకనే స్త్రీల కవిత్వంలో ప్రత్యేకంగా వారి సమస్యలని చెప్పాలనే ప్రయత్నం జరుగుతుంటుంది

ఆ సమస్యలు కేవలం స్త్రీల సమస్యలే కాదు ప్రతి ఒక్కరి సమస్య ప్రతి కుటుంబంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్య

స్త్రీలు వ్రాసే కవిత్వంలో సున్నితత్వమే కాదు తెంపరితనం ఉంది అక్కసు ఉంది సమస్య వ్యక్తీకరించే దశలో ఆవేదన ఉంది,ఆక్రోశం ఉంది. వారి కవిత్వంలో ద్వేషం ఉంది.ఎందుకంటే  వారు ఎదుర్కుంటున్న సమస్యలు అనేకం.  లింగ వివక్ష, .కుటుంబ  హింస,లైంగిక వేదింపులు,ఇంటా-బయటా చాకిరి, ఆధునికత పేరిట గాడి తప్పి చేజేతులా సమస్యలు కొని తెచ్చుకోవడం లాంటివి చాలా ఉన్నాయి   వాటిని గుర్తించ గల్గిన అర్ధం చేసుకోగలిన పురుష సహకారం ఉంది. అయినప్ప టికీ స్త్రీలు వ్రాసిన కవిత్వాన్ని ఎగతాళి చేస్తున్న కొంత మందిని చూస్తున్నాం అతర్జాలంలో చాలా చోట్ల  గమనించాను కూడా.

స్త్రీల పట్ల సమదృష్టి రావాలి  సమైక్య భావన రావాలి. స్త్రీలు  గమనిస్తున్నారు   వాళ్ళని ప్రత్యేకంగా విడకొట్టి వారి వ్రాసే కవిత్వాన్ని కించపరచడం చేస్తున్నారు. పెద్దలు,మిత్రులు స్త్రీల కవిత్వంలో ఉండే చిన్న చిన్న లోపాలని మీ మీ సలహాలతో సరిదిద్దండి.  మీరు వ్రాస్తున్నది అసలు కవిత్వమే కాదు అన్నట్టు చూడకండి  గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారే దశలోనే  స్త్రీల కవిత్వం ఉందనుకుంటే   ఆ అభిప్రాయం బలంగా ఉంటె స్త్రీలకి తెలుసుకునే అవకాశం కల్పించండి వ్యాసం అయినా కవిత్వం గా మారడానికి కవిసంగమం లో చోటు ఉంది కదా! ఒకప్పుడు పత్రికలలో ప్రచురింప బడ్డ  కవిత్వంలో అవసరమైనంత సవరణలు జరిగి ఉండేవేమో !   బహుశా అందులో లోపాలు కనిపించేవి కావు కానీ అతర్జాలంలో  కవిత్వం ని ఎవరికీ వారు ప్రచురించుకోవడం అనే సౌలభ్యం వల్ల అందులో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటున్నాయి కూడా .

ఇంకొక విషయం ఏమిటంటే సద్విమర్శ ని స్వీకరించాలి  కావాలని చేసే విమర్శలని వదిలేసేయాలి. అత్యుత్సాహంతో ప్రతి అనుభవాన్ని కవిత్వీకరించే కంటే  గాడానుభూతితో,హృదయ స్పందనతో కవిత్వరీకిస్తే ఆ కవిత్వం కి జీవం వస్తుంది ఎన్ని కవితలు వ్రాసాము అనేది లెక్క కాదు కవిత్వం ఆలోచనల్లో ఎంత నానితే అంత క్లుప్తంగా ఉంటుంది అంత లోతుగా ఉంటుంది

ప్రాస కోసం ప్రాకులాడకుండా హృదయం తో స్పందిన్చినప్పుడే కవిత్వం రావాలి ఆ కవిత్వమే దీటుగా నిలుస్తుంది, గీటు  రాయిగా మారుతుంది అని తెలుసు కుందాం

 "కవిసంగమం"  ఈ లింక్

కవిత్వం చదవాలి ,వ్రాయాలి అన్న ఉత్సాహం ఉన్నవారు Facebook  గ్రూఫ్ లలో కవిసంగమం  అనే గ్రూపు లో జాయిన్ అయి కవిత్వం ని ఆస్వాదించవచ్చు

 వ్యాస కర్త : తాతినేని వనజ

( విజయవాడ ఎక్స్ రే  వారి  "నెల నెలా వెన్నెల"  వేదికని ఏడు సంవత్సరాలపాటు  నిర్వహించిన అనుభవంతో వ్రాసిన వ్యాసం )

14 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

స్త్రీ కవిత్వం లో అమ్మదనం ఉంది. అదిచాలదా? ఉతికేసి, పిండేసి, ఆరెయ్యడం మీ వల్లే అవుతుంది :)

శ్యామలీయం చెప్పారు...

మంచి వ్యాసం. నా అభిప్రాయాలు కొన్ని :

- కవిత్వం చదవటానికి స్త్రీపురుషవివక్ష యెలా అసంగతమో, వ్రాయటానికీ వివక్ష అలాగే అసంగతం.
- స్త్రీలకు ప్రత్యేకసమస్యలు ఉండే మాట వాస్తవమే. అలాగే పురుషులకూ‌ ప్రత్యేకసమస్యలు ఉంటాయని సమాజంలో పెద్దగా అవగాహన లేదు.
- యతి ప్రాసలకోసం‌ ప్రాకులాడితే అది కవిత్వం కాదు. కాని తెలుగు కవిత్వంలో‌యతిప్రాసలు సహజాలంకరణాలు. వాటిపట్ల అవగాహన మేలు చేస్తుంది.వాటి వాడుక సహజంగా ఉండాలి.
- కవిత్వం అనేది రసప్రధానమైనది. రసో వై సః అని శృతి. రసోత్పాదకత లేకపోతే ఆడంబరాలు అక్షరరాశిని కవిత్వం చేయలేవు. వాక్యం రసాత్మకం కావ్యమ్ అని సూక్తి.
- భారతీయమైన కవిత్వ సిథ్థాంతం‌ ధ్వని. ఇప్పటి వారికి దానిపై అవగాహన తక్కువగానే ఉంది. సూక్ష్మంగా చెప్పాలంటే కవితలో‌అంతర్లీనమై ప్రవహించే భావస్ఫోరకమైన తత్వమే‌ ధ్వని.
- అన్ని కళలలాగే కవిత్వమూ ఒక కళ. కేవలం‌ ఆవేశం కవిత్వాన్ని సృష్టించలేదు. అధ్యయనమూ అభ్యాసమూ చాలా కూడా అవసరం.
- కవీ విమర్శకులూ పరస్పరగౌరవంతో మెలగాలి. లేకపోతే రంగం కలుషితమై పోతుంది.

Palla Kondala Rao చెప్పారు...

పోస్టు బాగుందండీ. ఏ అంశమూ మీ చేతిలో పోస్టుగా మారకుండా ఉండదనిపిస్తుంది :)) సీతాకొక చిలుకలన్నీ గొంగళిపురుగు రూపాన్ని ఓపికగా భరించాకే కదండీ ఆ రూపం సంతరించుకుంది. ఆ ప్రాసెస్ పోలిక ఏ అంశానికైనా,ఎవరికైనా వర్తిస్తుంది. స్త్రీలకేమి తెలుసొ మీనుండి - ఇందిరాగాంధీ వరకు , కిరణ్బేడీ నుండి - కల్పనా చావ్లా వరకూ చూస్తే తెలియదా? చూడలేని కబోధులకు తప్ప ఇప్పట్లో ఈ సత్యం తెలియనిదెవరికి?

Sharma చెప్పారు...


నిజాల్ని నొక్కి నొక్కి వక్కాణించారు . మంచి పని చేశారు. స్త్రీలలో అమ్మదనం , కవిత్వంలో
కమ్మదనం ఉంటాయి అన్నది అక్షరసత్యం. స్త్రీలను భూదేవితో , సున్నితతత్వానికి ఉదాహరణగా పోలుస్తారు . సహనానికి , సున్నితమైన మనస్తత్వానికి ప్రతీకలు.

madhavarao.pabbaraju చెప్పారు...

శ్రీ వనజగారికి, నమస్కారములు.

శ్రీ శ్యామలీయం గారి అభిప్రాయంతో నేనుకూడా ఏకీభవిస్తాను. కవిత్వం చెప్పటానికి స్త్రీ,పురుష తేడాలతో సంబంధమే లేదు; ఉండకూడదుకూడా.

మీ స్నేహశీలి,
మాధవరావు.

Zilebi చెప్పారు...

ఈ వ్యాఖ్య కొంత కటువు గా అనిపించ వచ్చు

అసలు స్త్రీ లకి కవిత్వం రాదు.

స్త్రీ ప్రకృతి రీత్యా ప్రేమ స్వరూపిణి . ప్రేమ రూపిణి కవిత్వం చెప్పుకుంటూ కూర్చోదు

కార్యాచరణ లో దిగి ప్రేమ ని పంచడానికి ప్రయత్నిస్తుంది

ఇక మగ వాడంటారా ! వారి పనే కవిత లల్లడం ! వేరే ఏ పనీ పాటా లేదు చూడండీ మరి !

కవిత్వానికి స్త్రీ ప్రతిమ కాబట్టి కవిత్వం వారికి కరతలామలకమైన విద్య కాదు


చీర్స్
జిలేబి.

వనజవనమాలి చెప్పారు...

శ్యామలీయం గారు .. మీ స్పందనకి హృదయ పూర్వక ధన్యవాదములు .

చందోబద్దమైన కవిత్వం పాత కాలం కవిత్వం అని త్రోసి పారేయడం లేదండీ ! మీరన్నట్టు కవిత్వం వినిపించేట ప్పుడు లో అంతర్లీనంగా ఒక లయ ద్వనించాలి

కవితా సృష్టికి మాలం శబ్దం శబ్ద ప్రధానంగా సాగే కవిత్వం ఇప్పుడు తక్కువ ఆసక్తి కల్గిన వారు పద్యం గద్యం దేనినైనా అందుకోగలరు. అందులో సందేహం లేదు

ఇప్పటి కవిత్వం . వచన ప్రధానం అయి సాగినప్పుడు ఎల్లప్పుడూ ప్రాస కోసం ప్రయత్నించడం వల్ల పెద్దగా ఆకట్టుకోలేదు సులభంగా పాఠకుడి హృదయాన్ని తాకలేనప్పుడు ఎంత బాగా వ్రాసినా కూడా నిష్ప్రయోజనమే కదా! ముఖ్యంగా మనం గమనించాల్సినది ఏమంటే మాతృబాష వాడుక తక్కువగా ఉంది ఇలాంటి తరుణంలో అరటి పండు ఒలిచిపెట్టినట్లు ఉండాలి కొంతమంది ప్రాస తో కవిత్వం వ్రాసినప్పుడు అర్ధం కాని వాళ్ళు ఉంటున్నారు
పాఠకుడి స్థాయిని బట్టి వ్రాయడం బావుంటుందని నేను చెప్పడం లేదు కవిత్వం ని అందరూ సులభంగా ఆస్వాదింప జేసే,ఆలోచింపజేసే కవిత్వం రావాలి అని భావిస్తున్నాను

ఇక మీరన్నట్లు స్త్రీ పురుష బేధం లేకుండా అందరూ కవిత్వం వ్రాయగలరనే నేను ఈ వ్యాసం ద్వారా చెప్పదలచాను

@ పబ్బరాజు మాధవ రావు గారు మీ స్పందనకి హృదయ పూర్వక ధన్యవాదములు
ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

కష్టేఫలే మాస్టారూ .. మీ స్పందనకి హృదయ పూర్వక ధన్యవాదములు .

వనజవనమాలి చెప్పారు...

కొండలరావు గారు .. మీ స్పందనకి హృదయ పూర్వక ధన్యవాదములు .
కొంత వివక్ష ,చులకన భావం ని గమనించి ఈ పోస్ట్ వ్రాయ వలసి వచ్చింది. కవిత్వం కి కవికి - కవయిత్రికి నిర్వచనాలు వేరు వేరుగా కనబడుతున్నాయి అందుకే ఇలా నా స్పందన

వనజవనమాలి చెప్పారు...

sharma గారు మీ వ్యాఖ్యకి మనఃస్పూర్తిగా ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

జిలేబీ గారు మీ వ్యాఖ్య కఠినమ్ గా ఉన్నా ఎంత బాగుందో! ధన్యవాదములు
మొట్టి మొట్టనట్లు భలే చెప్పారు.
అవును మరి కావ్యాలు వ్రాసుకునే తీరుబడి మహిళలకి ఎక్కడుంది లెండి వర్ణన లు చేసుకోవాల్సిన ఆగత్యం స్త్రీలకి లేదు. ప్రేమించడానికే సమయం చాలదు

కవిత్వం వ్రాయడం రాదనీ మీ కోణంలో ఆలోచించి నేను ఒప్పుకుంటున్నాను :)

జలతారు వెన్నెల చెప్పారు...

ఇంతమంది అనుభవజ్ఞులైన బ్లాగర్స్ తమ అభిప్రాయం పంచుకునేలా ఇంత చక్కటి వైవిద్యభరితమైన వ్యాసం రాసినందుకు ముందుగా మీకు అభినందనలు. చాలా విషయాలు తెలుసుకున్నాను. జిలేబీ గారి వాఖ్య ఎప్పటిలా పంచ్! :)

శ్యామలీయం చెప్పారు...

>తృబాష వాడుక తక్కువగా ఉంది ఇలాంటి తరుణంలో అరటి పండు ఒలిచిపెట్టినట్లు ఉండాలి.
బాగా చెప్పారు. నూరుశాతం యేకీభవిస్తాను. శ్యామలీయం బ్లాగులో పోతన అని ఖండిక వ్రాస్తున్నాను. పూర్తిగా కదళీపాకం కన్నా సులభంగా ద్రాక్షాపాకంలో‌ వ్రాస్తున్నాను. కాని చదువరులు దాదాపు మ్రృగ్యం అని చెప్పటానికి చింతిస్తున్నాను. పాత కాలం కవిత్వం అని త్రోసి పారేయడం బాగానే కనిపిస్తోంది నాకు.

>ప్రాస తో కవిత్వం వ్రాసినప్పుడు అర్ధం కాని వాళ్ళు ఉంటున్నారు.
తప్పకుండా అలాగ జరుగ వచ్చునండి. అందుకే యతి ప్రాసలకోసం‌ ప్రాకులాడితే అది కవిత్వం కాదని ముందే చెప్పాను. వాటి వాడుక సహజంగా ఉండాలీ అనీ‌చెప్పాను. ప్రాసకోసం కృత్రిమప్రయత్నం చేసినప్పుడు కవితాసౌందర్యమూ అర్థసౌందర్యసౌలభ్యాలూ దెబ్బతింటాయి మరి.

చెప్పాలంటే...... చెప్పారు...

బాగా చెప్పారు వనజ గారు అమ్మాయిలు ఒక రకం కవితలు మాత్రమే కాదు అన్ని రాయగలరు అని చక్కగా చెప్పారు మీకున్న అనుభవంతో