17, ఏప్రిల్ 2013, బుధవారం

పురస్కారాలు

విజయ నామ సంవత్సర మొదటి రోజున  సంప్రదాయంగా  "ఉగాది " పురస్కారాలు అందిస్తారు

చేసుకున్న వాడికి చేసుకున్నంత ఏమో కాని  దక్కించుకున్న వాడికి దక్కించు కున్నంత అనుకుంటాను నేను 

ఉగాది పురస్కారాలకి ఎంట్రీ పంప కూడదా  అని అడిగింది నా ఫ్రెండ్ ఒకరు .

"నాకు అంత అర్హత లేదు ఆసక్తి లేదు"  అన్నాను. 

"ఎదగాలనుకున్నవాడు ముందున్న వారిని తోసుకుని అయినా ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి"  అంది 

"ఎదగడం అంటే " .. అన్నాను

 "అదేనోయి సన్మానాలు చేయించుకోవడం,పురస్కారాలు అందుకోవడం లాంటివి వల్ల    వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి "అంది .

 "చేసిన వాళ్ళకా ! చేయించుకున్న వాళ్ళకా ?" మళ్ళీ నా ప్రశ్న . 

ఇదే నీతో వచ్చిన తంటా ..ఎడ్డెం  అంటే తెడ్డెం అంటావు ఏది సరిగా చెప్పనీయవు, వినవు అని విసుక్కుంది 

కోపం వచ్చేటట్లు ఉందనుకుని  లోలోపల తిట్టుకుంటూనే పైకి నవ్వు పులుముకుంటూ  "ఎవరికో చెప్పలేదు " అన్నాను .

 నా మాట పట్టించుకోకుండా జిల్లా స్థాయిలో "ఉగాది" పురస్కారాలకి ఎంపిక  చేస్తారు  కదా ! నువ్వు ఎంట్రీ పంపు  అంది 

మళ్ళీ అదే మాట అంటావు .. నాకుందా అర్హత !?

"   మరి నాకుందా  అర్హత ? అయినా నేను పంపడం లేదు"  అంది  

 అది నీకు అవసరమేమో ! నాకు ఇంటరెస్ట్ లేదు, వద్దు.  అదే కాదు కథల పోటీలు, కవితల పోటీలు ఇలాంటి వాటిలో కూడా నేను ఎప్పుడు పాల్గొనను నాకు ఆ సత్తా లేదని తెలుసు అన్నాను .. 

  రచయితల సంఘం లో కొందరు నీ పేరుని ప్రపోజ్ చేస్తే చాలు అంది నేను అలాగే పంపాను కదా . నేను చూడు ఉగాది పురస్కారం అందుకుంటాను అంది 

అర్హత లేకుండా లాబియింగ్ చేయించుకుని పురస్కారాలు అందుకోకపోతే ఏమి ? అన్నాను. 

కీర్తి కండూతి అభిలాష మేమేమి సన్యాసిని లేదా యోగిని లిమి  కాదు  కాస్త పేస్ బుక్ లాంటి సోషియల్  నెట్వర్క్ లలో షేర్ చేసుకుని కాసిని కామెంట్ లు మరి కొన్ని లైక్ లు కొట్టించుకోవాలి . అవసరమైతే మెయిన్ పేపర్ లోను, అధమస్తూ జిల్లా ఎడిషన్ లో నైనా ఫోటో రావాలి అప్పుడే కొంచెం సాహితీ సమావేశాలకి, సంగీత కార్యక్రమాలకి హాజరై నందుకు కళా హృదయులు,రచయితలూ , కవులు అన్న ట్యాగ్ వేసుకుని తిరగ వచ్చు అంది 

నువ్వు చెప్పిన బాపతే FB  లో కూడా చూసాను . నాలుగు కవితలు వ్రాశారో  లేదో పోయెట్  ఆర్  పొయెటేస్ అని ట్యాగ్ తగిలించుకుంటారు ఇక పురస్కారాలు, సన్మానాలప్పుడు తీసిన ఫోటోలని అక్కడ  పోస్ట్ చేస్తుంటారు . 

కొంత మందిని చూస్తే జాలి వేస్తుంది.  కవి శివారెడ్డి గారి ప్రక్కన కూర్చుని ఉంటారు వారితో మాట్లాడతారు మీ అంతటి కవితో పరిచయం కల్గినందుకు ధన్యుడిని అయ్యానంటారు 

నా కవిత్వంలో ఏ కవిత నచ్చింది మీకు అనడిగితే  తడబడతారు . మీ గురించి విన్నానండి  అంతే ఇంకా చదవలేదు అంటారు . "సరే చదివి చెప్పండి "అంటారు ఆయన 

" ఎంత మంచి కవితలు ఉన్నా చెత్త కవితలకి బహుమతులు ఎందుకు వస్తాయో, సన్మానాలు ఎందుకు జరుగుతాయో,   పనికట్టుకుని కొంత మందిని  పెట్టుకుని ప్రచురణ కర్తలు పదే  పదే  ఎందుకు  సమీక్షలు చేయిస్తారో, అలాగే ఇష్టం లేని వాళ్ళ రచనలని  చెత్తగా ఉన్నాయని సమీక్షలు రాయిస్తారో అన్నీ తెలుసు నాకు 

పొగిడి నట్టే  పొగుడుతారు,  లోలోపల  గోతులు తీస్తారు .  వెన్నుపోటు పొడుస్తారు  సత్తా లేకపోయినా  ఆదరా బదరా అందలం ఎక్కించాలని చూస్తారు కుల,మత ప్రాతిపదిక పైన  నిచ్చేనలేసి ఎక్కిస్తారు

నువ్వు ఎప్పుడు వినలేదా  సాహితీ రంగం లోను ఎన్నో రాజకీయాలు  ఉంటాయి.  కావలసినవాడు అనుకుంటే అట్టడుగున ఉన్నా ఏడంతస్తుల మేడలో కూర్చో బెడతారు అని చెపుతూ...    ఇదంతా  నీ మీద అక్కసుతోనూ  లేదా ఈర్ష్య తోనూ ఈ మాట  చెప్పడం లేదు నువ్వు అవునన్నా కాదన్నా ఇది నిజం.  మన బెజవాడ లోనే ఇలాంటివి  ఎన్నో చూసాను "  అన్నాను  నేను

అర్ధం అయింది అంటూ ... అవును నువ్వు రెండేళ్ళ పై నుండే బ్లాగ్ వ్రాస్తున్నావ్!  ఎన్నో మంచి వ్యాసాలూ,కథలు ,కవితలు ఉన్నాయి  ఇంత వరకు నీ బ్లాగ్ గురించి  ఈనాడు, ఆంద్ర జ్యోతి, సాక్షి ఆఖరికి ఆంద్ర భూమి, ఆంద్రప్రభ లాంటి వాటిల్లోనూ ఇంకా  చిన్న చిన్న పత్రికలలో కూడా నీ బ్లాగ్ పరిచయం  ఎందుకు రాలేదు?  అంది 

నా ఫ్రెండ్ వి కాబట్టి  ఇదంతా నీకు ఆశ్చర్యం . నాకు ఆశ్చర్యం లేదు,  ఎందుకంటే నాకు పత్రికల లో పనిచేసేవారిలో స్నేహితులు ఎవరూ లేరు కాబట్టి  అన్నాను 

అంతే నంటావా  !  అడిగింది అనుమానంగా . ముమ్మాటికి అంతే ! .అన్నాను 

ఇప్పటికీ  అయినా నేను చెప్పినట్టు విను నలుగురి దృష్టిలో పడతావు అంది.   తల అడ్డంగా ఊపాను ." నీ ఖర్మ " అని వెళ్ళిపోయింది 

 అంతలా వాదించిన ఆమె  ఉగాది పురస్కారం అందుకుంది.  ఎందుకంటే ఎవరు చదవని చూడని నాలుగు పుస్తకాలు అచ్చు  వేయించుకున్నందుకు. రేపో మాపో  ఆ ఫోటో పట్టుకొచ్చి నా FB  లో షేర్ చేయమని  ఇచ్చినా ఆశ్చర్యపడను . అందండీ సంగతి. 

నేటి సాహితీ వాతావరణం లో మోసేవాళ్ళు ఉంటె చాలు తెల్లవారేటప్పటికి మంచి రచయిత్రి or  రచయిత అయిపోతారు 

అది సత్యం . నేను కూడా రాసే సత్తా లేకపోయినా నలుగురు మోసేవాళ్ళ ని  పెట్టుకోవాలి అనుకుంటున్నాను :) 

ఇంకో విషయం చెప్పనా !

అనర్హులకి సన్మానం చేస్తుంటే చూసి నాకు కళ్ళు కడుపు కూడా మండిపోతాయి వాళ్ళకి వేసే దండలు సన్మాన పత్రాలు  అందించడం చూస్తే అవన్నీ చెప్పులు,  చేటలు, కుళ్ళిపోయిన కోడి గుడ్లు వేసినట్లు ఉంటాయి  మరి. 


22 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

నావి కొన్ని ప్రశ్నలు...

1. మోసేవాళ్ళు ఎంతమంది ఉండాలండి?
2. ఇంకా వాళ్ళు మనల్ని మోసేలా ఎలా మచ్చిక చేసుకోవాలి?
3. ఈ మోసే ప్రాసెస్స్ కొద్ది రోజులే, మరియు అప్పుడప్పుడు కాకుండా నిరంతరం మోసే ప్రాసెస్స్
లా మార్చుకోవాలంటే ఏమీ చెయ్యలి?

పై ప్రశ్నలన్నింటికి మీకు సమాధానం తెలిసినా,తెలియకపోయినా.. తెలుసుకుని మరీ చెప్పాలి.అప్పుడే మీ ఈ టపాకి ఒక మెచ్చుకోలు కామెంట్ నా తరపు నుండి వనజ గారు.

పిడక చెప్పారు...

//ఎందుకంటే నాకు పత్రికల లో పనిచేసేవారిలో స్నేహితులు ఎవరూ లేరు కాబట్టి అన్నాను //
మీరు తేనెతుట్టె ని కదిలించలేదు కదా ?
మీరు ఇలా డైరెక్ట్ గా చెప్పేస్తే చాలా మంది హర్ట్ అవుతారండి బాబు

అజ్ఞాత చెప్పారు...

ఈ సన్మానాలూ, సభలకి విలువ చచ్చిపోయాకా కూడా వాటి మీద ఆసక్తి చిత్రం.ఇవన్నీ రాజకీయంగా జరుగుతున్నవన్న సంగతి బహిరంగ రహస్యం. ఒక సారి ఈ కండూతి మొదలయితే.........ఎందుకో నాకు పోతన ఆదర్శం.....నా ఆలోచన సవ్యంగా లేదేమో....

Sharma చెప్పారు...


"కష్టే ఫలి" గారి కామెంట్ తో ఏకీభవిస్తున్నాను .

దురద అయితే కొంతసేపు గోక్కుంటే పోతుంది .
ఏకాటికీ పోలేనిది ,ఆ కాటికి పోతే గాని
పోనిదీ అదేనేనండి ఈ కండూతి.అంతటి శక్తివంతమైనది .
మీరనుకొంటున్నట్లు దీన్ని మన దరిదాపులకి
రానీయకుంటే చాలా చాలా మంచిది.

Karthik చెప్పారు...

nenemi meeku cheppalenu.. endukante naaku inkaa antha nubhavam raaledu..-:)

జయ చెప్పారు...

వనజ గారు, నా వోటు జలతారు వెన్నెల కేస్తున్నాను:)))

భాస్కర్ కె చెప్పారు...

ఇదేదో ఆలోచించాల్సిన విషయమేనండి,..మీరు మరీ ఈ మధ్య మెదడుకి పని పెట్టేస్తున్నారండి,..బాగుంది మీ వ్యాసం,...శ్రీరామ నవమికి మీరే మన బ్లాగ్ లకు అవార్డుల ప్రకటించేయండి,..ఈ సారికి,..

మాలా కుమార్ చెప్పారు...

మన తృప్తి కోసం వ్రాసుకుంటున్నాము . అదిగి వ్రాయించుకునే రాతలు , డబ్బులిచ్చి చేయించుకునే సన్మానాలు ఎందుకులెండి . అవో మోత బరువు :)

హితైషి చెప్పారు...

నాకు ఈ పోస్ట్ ఉతికి ఆరేసినట్లు ఉంది. ఏదైనా నిర్మొహమాటంగా మాట్లాడటం,వ్రాయడం మీ వద్ద నేర్చుకోవాలి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు .ఆశ ,,అప్పడం ,దోసె ...

నాకు తెలియదు ,తెలిసినా చెప్పను ,చెప్పలేను ఎందుక్కంటే నాకు పోటీకి వచ్చేయారు ? అందుకే మౌనంగా బ్ల్లాగ్ చెట్టెక్కి కూర్చున్నా ..


@ జయ గారు .. :) చెప్పాలంటారా ? పై సమాధానమే మీఉ కూడాను .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పిదక గారు మీ పేరు భలే ఉంది . మీ వ్యాఖ్య నాకు నచ్చింది

నేను తేనేతుట్టె ని కదిపానంటారా? నిజమా!?

అది తేనేతుట్టె నాకు తెలియదు అండీ!

చూడండి నాకు అసలు ఏమి చేత కాదు తెలియదు అని ఒప్పేసుకుంటున్నాను .

మీరు కామెంట్ వ్రాయడానికే భయపడ్డారు కాని నాకు అలాంటి భయాలు లేవు. .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మాస్టారూ .. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు . అడుగడుగునా సంస్థ ఉంది . సన్మానం రెడీగా ఉంది అని నేను అప్పుడప్పుడు పేరడీ పాట పాడుతూ ఉంటానండీ! ఆ పాటని ఒక పోస్ట్ గా వేస్తాను ఉందండీ !

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శర్మ గారు మీ స్పందనకి ధన్యవాదములు . ఆసక్తి ఉన్నా అర్హత కూడా ఉండాలండి అనుకుంటాను నేను
అర్హత ఉన్న వారికి ఆలస్యంగా నైనా లభించాలి కూడా .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఎగసే అలలు ..థాంక్ యు !

@ హితైషి థాంక్ యు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మాలా కుమార్ గారు .. మీరు అన్నది నిజమే! బ్లాగులు కూడా ఇప్పుడు ప్రధాన స్రవంతిలో భాగం కాబోతున్నాయి . మనం తక్కువ అని అనుకోవడానికి వీలు లేదు .సభలు,సన్మానాలు,సత్కారాలు అంటే నేను ఆమడ దూరం పారిపోతాను .

మీ స్పందనకి ధన్యవాదములు

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

కడిగేశారు అండి... ఈ మద్య ఈలాంటివి చాలా చూశా... ఆ పేపర్లో వచ్చింది ఈ పేపర్లో వచ్చింది అని... వారిలో చాలా మంది కంటే మన బ్లాగర్స్ చాలా బాగా వ్రాస్తారు అనిపించింది...

శోభ చెప్పారు...

బాగా చెప్పారు (అడిగారు) వనజగారూ.....

సామాన్య చెప్పారు...

Vanaja gaaru baagundi post.inko vishayam cheppedaa manushulaku vipareethamaina keerthi kandoothi vuntundi.prayatninchinaa adi dorakani vaallu chese raajakeeyaalu yetlaa vuntaayo raayaledu meru. Ee madhyanthaa adi raayaalani aalochisthunnaa. Baadha gurinchi badhithule cheppali kadaa...

శశి కళ చెప్పారు...

బాగా చెప్పారు అక్క.ఈ సారి అప్లై చేయండి.మీలాంటి వాళ్ళ వలన అవార్డ్ కు విలువ పెరుగుతుంది కదా

శశి కళ చెప్పారు...

బాగుంది.ఏమిటో కామెంట్ పోస్ట్ అవడం లేదు :(

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Prins @ Shobha gaaru Thank you so much...for your comments

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సామాన్య గారు మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం . బాధితులే అనుభవించిన బాధ గురించి చెప్పగలరు . మీ మనసులో ఉన్న బాధనంతా చెప్పేసి బరువు తీర్చుకోండి ఈర్ష్య ,ద్వేషాలతో చేసే వారికి తప్పు చేసామన్న భావన అయినా కల్గి ఇంకొకరిని అలా బాధపెత్తకుంటా ఉంటారు.