3, ఏప్రిల్ 2013, బుధవారం

మహిళా బ్లాగర్ గా నా పరిచయం

జాజిమల్లి  బ్లాగు లో కె.యన్. మల్లీశ్వరి  గారు తెలుగు బ్లాగ్ లోకంలో ఉన్న మహిళా బ్లాగర్ లని పరిచయం చేసే అతి పెద్ద బాధ్యతని తలకెత్తుకున్నారు. వంద మందిని పరిచయం చేయడం అంటే మాటలా చెప్పండి !? చాలా కష్టమైన పని. బ్లాగర్ ల ఇంటర్ వ్యూస్ ని తీసుకోవాలి ప్రచురించిన తర్వాత వచ్చే స్పందనల్ని అప్ డేట్ చేయాలి తగిన సమా ధానం ఇవ్వాలి .. ఇదంతా చాలా కష్టం. అయినప్పటికీ ఆ పనిని దిగ్విజయంగా చేస్తున్న మల్లీశ్వరి  గారిని అభినందిస్తూ ..  ఆమెకి హృదయ పూర్వక దన్యవాదములు తెలుపుతూ ... 

బ్లాగర్ గా పరిచయం చేసినవారిలో 6వ బ్లాగర్ నేను పరిచయం చేయబడ్డాను (జనవరి 15,2013 న ) నా ఆ పరిచయాన్ని, మిగతా బ్లాగర్స్ స్పందనల్ని నా బ్లాగు లో భద్రపరచుకోవాలని ఇలా .. ఉంచాను 

బ్లాగ్లోకపు ఉక్కుమహిళ
బ్లాగర్ పేరు : వనజ తాతినేని/Vanaja Tatineni 
బ్లాగ్ పేరు;వనజ వనమాలి
బ్లాగ్ చిరునామా;https://vanajavanamali,blogspot.com

పుట్టిన తేదీ; 12/03/1967

పుట్టిన స్థలం; కుంటముక్కల (నియర్ మైలవరం ) కృష్ణా జిల్లా

ప్రస్తుత నివాసం; విజయవాడ

వృత్తి, వ్యాపకాలు; గృహిణి,మరియు స్వయం ఉపాధి

బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ; నవంబర్ 21/2010

మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి);600 పైన

బ్లాగ్ లోని కేటగిరీలు;కథలు,కవిత్వం,వ్యాసాలు,అనుభూతులు-అనుభవాలు,సినిమా పాటల పై వివరణబ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?
ఓ..నాలుగేళ్ళ క్రితం.  బావాలని వెల్లడించుకునే వారికి చక్కని వేదిక. . అందరూ నదులు కానవసరం లేదు. పిల్ల కాలువలు అయినా నయమే కదా !


బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?

సంతృప్తికరం గా ఉన్నప్పటికీ  ఏదో లోపం. బ్లాగర్స్ లో అధిక మంది విద్యాధికులు ఉన్నారు. కాని కొత్త వారికి ప్రోత్సాహం తక్కువ. అబ్బ.. వచ్చారులే! వ్రాసారులే ..అన్న ధోరణి ఉంటుంది. బ్లాగ్ అంటే  సాధారణ అవగాహన ఉన్న వ్యక్తులు కూడా నిర్వహించుకోలరు కదా! విద్యాధికులు,సీనియర్ బ్లాగర్స్ మాత్రమే  వ్రాయాలి మిగతా వారు చదివి పొగడ్తలు కురిపించాలి అనే దోరణి అంతర్లీనంగా ఉంటుంది. చాలా సార్లు కొత్త బ్లాగర్స్ బాధ పడ్డ సందర్భాలు ఉన్నాయి. కవిత్వం అంటే విద్యాధికులు వ్రాసినదే కవిత్వం ,వారు వ్రాసినవే కథలు కాదు. ఓ.. టైలర్ కూడా మంచి కవిత్వం వ్రాయగలరు వారు కూడా బ్లాగ్ నిర్వహించుకోగలరు అని అర్ధం కావాలి..కావాల్సింది సృజనాత్మకత, చదివించ గల్గే  శైలి.
నేను రెండు సంవత్సరాలు క్రితం బ్లాగ్ లోకం లోకి వచ్చి పడ్డాను. సాహిత్యం అంటే ముఖ్యంగా కవిత్వం అంటే  ప్రాణం.  నిర్మొహమాటంగా చెప్పాలంటే ఇందరి బ్లాగర్ల మధ్య నేను పెద్దగా నేను సాధించినది ఏమి లేదు.ఇక్కడా భావ చౌర్యం ఉంది. ఇక్కడా పెద్ద బ్లాగర్,చిన్న బ్లాగర్ అన్న తేడాలు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే గ్రూపిజం ఉంది.ఎగతాళి చేసేవారు ఉన్నారు.అనామకులుగా వచ్చి  కామెంట్స్ తో బాధ పెట్టేవారు ఉన్నారు. స్త్రీల సమస్యలపై స్పందించితే వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవారు ఉన్నారు.  అవన్నీ పరిగణ లోకి తీసుకోకుండా.. వ్రాసుకుంటూనే ఉన్నాను. కొన్ని చేదు  అనుభవాలు ఉన్నాయి. చాలా సంతృప్తినిచ్చిన సంతోష సమయాలు ఉన్నాయి.. చాలా బ్లాగ్ లని నేను ఎప్పుడు చదువుతాను.అది నాకెంతో ఇష్టమైన వ్యాపకంగా మారింది. నాకై నేను కేవలం నా కోసమే నేను  గడిపిన ఘన సమయాలు ఇక్కడ నాకు సొంతం. చిన్న చిన్న అసంతృప్తులు తప్ప  అంతా బహు బాగు.

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?

మనం  వ్రాసినదానిని ఎవరికో పంపి ప్రచురణ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇదో చక్కని వేదిక మనం వెలిబుచ్చిన భావాలు నచ్చిన వారు మళ్ళీ మళ్ళీ బ్లాగ్ కి విచ్చేసి చదివి మెచ్చుకుని అభిప్రాయాలని తెలిపి వెళుతూ ఉంటారు. బయట పత్రికలలో ప్రచురింప బడ్డ రచనల పై స్పందన కన్నా.. ఇక్కడ స్పందన ఎక్కువ. అయితే ఇక్కడ అందరూ చదివే అవకాశం లేదు కనుక బాహ్య ప్రపంచానికి బ్లాగ్ రచయితలు తెలిసే అవకాశం లేదు.

మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?

సామాజిక సృహ కల్గిన కథలు,కవిత్వం వ్రాయగల్గ డం. నిత్య జీవనంలో మనకి ఎదురయ్యే  ప్రతి అనుభవాన్ని.ఇంకా  సమాజాన్ని పరిశీలించి.. ఆ విషయాలని వ్యాసాలుగా వ్రాయగలగడంసాహిత్యంతో మీ పరిచయం?
ఓ.. పదేళ్ళు. ఎక్స్ రే సాహితి సంస్థ తో.. “నెల నెలా వెన్నెల” వేదిక నిర్వహించడంలో ఏడేళ్ళ కి పైగా మమేకం.స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?
నాకున్న సమయాన్ని సద్వినియోగ పరచుకుని బ్లాగ్ వ్రాయగల్గుతున్నాను. ఒక గృహిణిగా తీరిక సమయాల్లో బ్లాగింగ్ చేయగలను. కానీ కొందరికి ఉపాధి కల్గించే వృత్తిలో ఉన్నాను. వాళ్ళ తర్వాతే బ్లాగ్. అలాంటప్పుడు నేను అసహనంకి గురి  అయిన రోజులు ఉన్నాయి. ఎంతో  నచ్చిన పోస్ట్  లని చదవడానికి, వ్యాఖ్య ఇవ్వదానికి సమయం ఉండేది కాదు. ప్చ్.. అంతే! ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడం కూడా కష్టం.  కొన్ని అంశాలు గురించి వ్రాసేటప్పుడు నేను ఒకటికి పది సార్లు ఆలోచించాను. ఉదాహరణకి..సైబర్ సెక్స్  పై  నేను  వ్రాసిన పోస్ట్ ఒకటి.   నేను  వ్రాసిన పోస్ట్ లని నా కొడుకు చదువుతాడు. అలాగే మా కుటుంబ సభ్యులు చదువుతారు. నాకున్న భావ స్వేచ్చ ని అడ్డుకోలేదు కాని కొన్ని రచన లలో.. వ్యక్తి గత అనుభవాలు ఉన్నాయి. ఆ రచనలని వాళ్ళు చదివినప్పుడు అవన్నీ ఎందుకు వ్రాయడం అంటారు. నేనైతే.. నా అనుభవాల తో.. మరియు సామాజిక సృహ తోనూ..కలగలిపి కవిత్వం,కథ,వ్యాసం వ్రాసాను.అవన్నీ  నా వ్యక్తిగతం అని అనుకునే వారు ఉన్నారు తప్ప రచయిత/ రచయిత్రికి  పరిమితులు లేవు అని అర్ధం చేసుకోకపోవడం కొంచెం ఇబ్బంది కల్గిస్తుంది. నా కుటుంబ సభ్యులు  కూడా నా భావ స్వేచ్చని హరించి నట్లు  ఉంటుంది. అలాంటప్పుడు.. నన్ను నేను వ్యక్తీకరించుకోవడంలో (రచయిత్రిగా) విఫలం అయ్యాను కూడా.


జీవన నేపధ్యం?
పుట్టినిల్లు, మెట్టినిల్లు కూడా సంప్రదాయ వ్యవసాయ కుటుంబాలు.  చదవడం,వ్రాయడం, సమాజ పరిశీలన,ఆత్మావలోకనం. (నా గురించి మాత్రమే)


ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?
ఎవరి ఒత్తిడి లేకుండా జీవితాంతం వ్రాసుకుంటూనే ఉండాలని కోరొక

సరదాగా ఏవైనా చెప్పండి?
బ్లాగ్ ప్రపంచం నుండి  కాస్త బయటకి రండి.. కిరణ్ బేడి లాగా మారి నడివీదుల్లో సంచరించండి

సీరియస్ గా ఏవైనా చెప్పండి?

నిన్ను నీవు తెలుసుకో, తర్వాత ప్రపంచం నీకు అర్ధమవుతుంది అని నేను అనుకుంటాను.  సమస్యలని ఎదుర్కుంటున్న స్త్రీమూర్తులకి నా పరిధిలో నేను సాయం చేయాలని తాపత్రయం.యూత్ కి కౌన్సిలింగ్ క్లాస్స్ తీసుకోవాలని అభిలాషమీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ గానీ వ్యాసం గానీ ఒకటి,కవితలైతే రెండు


నాకు ఎంతో ఇష్టమైన కవితలు రెండు

 
2. దేహ క్రీడలో తెగిన సగం 

3.ఓల్డ్ లవ్  లెటర్ (కథ)

తోటి బ్లాగ్ మిత్రుల స్పందనలు 


88 THOUGHTS ON “బ్లాగ్లోకపు ఉక్కుమహిళ"   

జాజిమల్లి బ్లాగ్ లో  ఈ పరిచయం యొక్క లింక్  అక్కడ  మిత్రుల స్పందన లని చూడండి 

మహిళా బ్లాగర్ గా నా పరిచయం  బ్లాగ్లోకపు ఉక్కు మహిళ 

8 కామెంట్‌లు:

సామాన్య చెప్పారు...

Congrats Vanaja garu.mee vyakthitvaanni ilaa chaduvukovadam baagundi.

Sag చెప్పారు...

మీ పరిచయానికి సంతోషం !! శుభాకాంక్షలు !!

అజ్ఞాత చెప్పారు...

అభినందనలు వనజగారు
మీ గురించి తెలుసుకోవటం బావుంది. మీదీ వ్యవసాయ కుటుంబమేనా ! మీరు సమాజాన్ని పరిశీలించే తీరు వ్యక్తపరిచే అభిప్రాయాలు , మీ పోస్టులు చూస్తే మీరు సామాజిక కార్యకర్త అనిపిస్తుంది. సమస్యని ఎత్తి చూపడం, చర్చకుపెట్టడం కూడా ఒకవిధంగా సమాజ సేవే అనుకుంటాను .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సామాన్య గారు హృదయ పూర్వక ధన్యవాదములు మీ వ్యాఖ్య నాకు చాలా విలువైనది

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సాగర్ గారు థాంక్ యు వేరి మచ్

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

లలిత గారు .. మీ స్పందనకి హృదయపూర్వక ధన్యవాదములు

మా ఇంటి నుండి ఇంకో సామాజిక కార్యకర్త కూడా బాహ్యప్రపంచం లోకి వెళ్లి వస్తారండి. ఆ ఇంకో వేరెవరో కాదు. నాలా ఉన్న నేనే!

ఈ స్త్ర్రీ-పురుష బేధాలు, అనవసర అతిహీన వాగ్భాణాలు ఎదుర్కోవాలని భయపడటం తప్ప ప్రతి గృహిణి ఒక సామాజిక కార్యకర్త. కాదంటారా ? .

Dantuluri Kishore Varma చెప్పారు...

వనజా వనమాలి గారు, మీ ఇంటర్వ్యూ, ఆ టపాకి వచ్చిన వ్యాఖ్యలకి మీ ప్రతిస్పందన చాలా బాగున్నాయి. అభినందనలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

దంతులూరి కిషోర్ వర్మ గారు .. ధన్యవాదములు
చాలా ఓపికగా చదివినట్లు ఉన్నారు. :)