4, ఏప్రిల్ 2013, గురువారం

FB గాయం

ఒక మనిషికి ఎన్నో నాల్కలు.  పది మంది దగ్గర పది రకాలుగా మాట్లాడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. మరి వారి అవసరాలు అలాంటివి. ఏం  చేస్తాం చెప్పండి. !?

అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలంటే అందరి దగ్గరా నటిస్తున్నట్లే ! కదాఆఆఆఆఆఅ !!!

నిజం చెపితే నిష్టూరంగా ఉంటుంది "యదార్ధవాది లోక విరోధి "అంటారు కదా .. అలాగన్నమాట. ఎవరికీ ఏమి చెప్పనే కూడదు. విమర్శని తట్టుకోలేనప్పుడు వాళ్ళు తమలో లోపాలు ఎలా తెలుసుకుంటారు !?

వారి భావాలు ఆలోచనలు అభిప్రాయాలు అన్నీ వారి కవిత్వం లో రచనలలో తొంగి చూస్తాయి. అవి పబ్లిక్ అయినప్పుడు పాఠకుల అభిప్రాయాలను హుందాగా తీసుకోవాలి. అలా తీసుకోవడం మానేసి వ్యంగం తో మాటలు విసరడం చూసి నవ్వుకున్నాను. విమర్శని అంగీకరించలేనివారు  ఎన్నటికి ఎదగలేరు కదా!

అప్రయత్నంగా ఒక పాట  గుర్తుకు వస్తూ ఉంది

వేషమూ మార్చెను భాషను  మార్చెను మోసం నేర్చెను
అసలు తానె మారెను అయినా మనిషి మారలేదు
అతని మమత తీరలేదు
మనిషి మారలేదు అతని కాంక్ష తీరను లేదు ... అన్నది తలచుకుంటూనే ఉన్నాను

నిన్నటి నుండి నా ప్రమేయంలేకుండా కొన్ని లైక్ లకి కొన్ని వ్యాఖ్యలకి  కొన్ని వ్యంగ బాణాల కి నొచ్చుకుని..
ఫేస్ బుక్ అకౌంట్ డిలీట్ చేయాలనుకున్నాను . ఫ్రెండ్స్ లిస్టు లోనుండి కొందరిని నిర్దాక్షిణ్యంగా తొలగించాను. మరి కొందరూ లిస్టు లో ఉన్నారు కూడా. మంది ఎక్కువైతే పిర్యాదులు ఎక్కువే!  ఆచి తూచి వ్యవహరించినా  సరే  .. నా ప్రశాంతతని  పోగొట్టుకున్నాను :(:(

 అంతకీ రాత్రి నా ఫ్రెండ్  సున్నితంగా హెచ్చరించింది కూడా  .జాగ్రత్త అని .
 హే .. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు ? నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అన్నాను. తాటి మట్ట నువ్వు డీసెంట్ అని చూడదు. దాని పని అందరిని చీరడమే! పైగా అవసరం లేకపోయినా     ఇతరుల మాటలు వినిపిస్తారు ఏం  మాట్లాడాలో తెలియక "నొప్పించక తానొవ్వక " ఉండటం చాలా కష్టం సుమీ ! అని హెచ్చరించింది

విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకి కోపం !? హె.. భగవాన్ ఈ కష్టాలు ఏమిటి తండ్రీ! అన్నానా !!?

ఫేస్ బుక్ గొడవల్లోకి నన్ను లాగొద్దు తల్లీ ! నా చిత్రాలకి భయం భక్తి లతో లైక్ కొట్టక పోయినా సరే! అంటూ ఆయన మాయం . హతోస్మి .

మరి నా మదికి తగిలిన గాయం ఎవరికీ చెప్పేది ఏమని చెప్పేది!?

అందుకే నా అంతరంగం కి చెప్పుకుని .. ఇప్పట్లో ఫేస్ బుక్ వైపే చూడకూడ దనుకుని  ఒట్టు పెట్టుకున్నాను.

ఇక బ్లాగ్ లోనే ఉంటాను

ఎవరి రాజ్యాలు వారు ఏలు కోండి . నేను అసలు ఎవరికీ పోటీ కాను. నేను ఒట్టి అహంకారిని సుమా !  నా బ్లాగ్ నాకు చాలు చాలు చాలు. అంటాననుకున్నారా? ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఉంటానని చెప్పడం అన్నమాట

11 వ్యాఖ్యలు:

Sag చెప్పారు...

ఫేసు బుక్ వల్ల మానసిక రుగ్మత, అనవసరమయిన ఆందోళన, ఈర్ష్య భావజాలం, వ్యంగ్యాత్మక దారిని పెరుగుతున్నాయి అని ఒక సర్వే ఘోషిస్తున్నది....

అందరికి ఇందులో కొన్ని కొన్ని అనుభవంలోకి వచ్చినా addict అవ్వడం మూలంగా ignore చేసేస్తున్నారు.

అజ్ఞాత చెప్పారు...

ఈ పోస్ట్ చదవడానికి పది నిమషాల ముందు ..ఒకాయన్ ఫోన్ చేసి “ఫలానా“ వ్యక్తి తో జాగ్రత్తండీ, ఇంకో ఆయన చెప్పాడన్నాడు..
ఏం? ఇంకో ఆయనకి,“ఫలానా“..వల్ల ఏమయినా హాని జరిగిందా? జాగ్రత్త చెప్పాడూ.. అంటే.....ఆయనకు ఏమీ జరగలెదట గానీ, “ఫలానా“ ఆయనతో మాత్రం జాగ్రత్త అన్నాట్ట..వీడు వెంటనే “ఫలానా“ ఆయన గురించి అందరికీ చెప్పటం మొదలు పెట్టాడు..నాకు మిగతా ప్రపంచం ఎలా ఉందో తెలియదు కానీ మనవాళ్లంత వెధవల్ని మాత్రం...ఎక్కడా చూళ్ళేదండీ.....నీట్లో నిప్పు పుట్టించేస్తారు...అసహ్యం వేస్తుంది మన జనాన్ని చూస్తుంటే...

జలతారు వెన్నెల చెప్పారు...

గాయాలెన్నైనా తట్టుకుని నిలబడడమేగా మన జీవిత ధ్యేయం? కాదంటారా?

చెప్పాలంటే...... చెప్పారు...

nenu vennela gari to ekibhavistanu....ninnane chusanu nenu kudaa...naaku baadha anipinchi nenu rasukunte enkokaru vere gaa rasaru...mire chepparu gaa mana pani manam chesukundaam vanaja garu be HAppy andi

buddhamurali చెప్పారు...

వనజ వనమాలి గారు ఇలాంటి సంఘటనే ఒకటి నాకు ఎదురయింది .. ఒకావిడ కవిత్వం అని ఏదో రాస్తుంది ... భలే రాస్తున్నారని ఆమె అభిమానులు ( బహుశ వాళ్ళు ఆమె ఫోటో అభిమానులు అయి ఉంటారు ..) ఏదో కామెంట్ రాస్తే ఆమె తిక్కగా రాసింది దాంతో గొడవ ఎందుకని కమ్న్త్ డిలిట్ చేశాను , ఆమె పేరు తొలగించాను . శ్రీ శ్రీ పేరు ప్రస్తావించినా ఆయనెవరు అని ప్రశ్నించెంత గొప్ప మేధావిగా ఆమె వ్యవహరిస్తున్నారు .. fb లో ఇలాంటి మేధావులకు కొరత లేదు

జ్యోతి చెప్పారు...

ఇలాటి మనుషులు మనకు ప్రతీ చోట ఎదురవుతూనే ఉంటారు. అలాటివారిని సింపుల్ గా బ్లాక్ చేసి మన పని మనం చేసుకోవడమే ముఖ్యం. అది నిజజీవితమైనా, బ్లాగైనా, ఫేస్ బుక్కైనా. ఎవరి కోసమో మనకు నచ్చిన పనులు మానుకోవడం మంచిది కాదంటాను.....

Meraj Fathima చెప్పారు...

వనజా, పైన సాగర్ గారు చెప్పినట్లు కేవలం ఓ మానసిక రోగులు మాత్రమే ఉండగలిగింది, మంచి పని చేశావు, నేనూ ఆ దిక్క్కమాలిన ఫేసుబుక్ వదిలేస్తాను

వనజ తాతినేని చెప్పారు...

సాగర్ గారు .. మీరు చెప్పినది నిజమే నండీ! నేను చాలా కాలంగా ఇగ్నోర్ చేస్తున్నాను ఇప్పుడు తీవ్రంగా స్పందించక తప్పలేదు.

ధన్యవాదములు


@ మేరాజ్ ... మన లిస్టు లో చేర్చుకున్న కొంతమందిని భరించలేమండి. వారికి పని పాత ఏమి ఉండదు

వాళ్ళే వస్తారు వాళ్ళే అన్ ఫ్రెండ్ ని చేస్తారు వాళ్ళు ఆశించినట్లు మనం ఉండకపోవడమే వారికి ఆశా నిఘాతం అనుకుంటాను. ఇంకొంతమందినైతే మనం అస్తమాను పొగడాలి వీలయితే వాళ్ళు కుక్కని చూపి నక్క అని అన్నా మనం సపోర్ట్ చేయాలి అనే మేధావి వర్గం ఉన్నారు . అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి తప్పదు మీరు FB తగ్గించుకోండి కవిసంగమం ని విడనాదకండి అని సూచన

వనజ తాతినేని చెప్పారు...

జలతారు వెన్నెల గారు థాంక్ యు సో మచ్

@ మంజు గారు థాంక్ యు సో మచ్ అండీ! కొంతమందిని వదిలించుకుని రిలీఫ్ గా ఉన్నాను

వనజ తాతినేని చెప్పారు...

బుడ్డా మురళీ గారు మీ వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను

అక్కడ ఫోటో చూసే ఎం చెప్పినా ఆకాశానికి ఎత్తెస్తున్నారు అలాంటి వారు గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది కూడా నండీ ! మీ స్పందనకి ధన్యవాదములు

వనజ తాతినేని చెప్పారు...

జ్యోతి గారు నేను వెనుకడుగు వేసినప్పుడల్లా మీరు ప్రొత్సహిస్తారు థాంక్ యు సో మచ్ . మీ సూచనని పాటిస్తున్నాను