నిన్న ఉదయం మా "భవ్య " ఒక వీడియో లింక్ పంపి .. ఇది చూడమ్మా ! అంది
"సరే చూస్తాను ".. అని చెప్పాను
మళ్ళీ కాసేపటికి .. "చూస్తున్నావా ..? లాస్ట్ వరకు చూడు" అని చెప్పింది .
నన్ను ఎడ్యుకేట్ చేయడంలో మా పిల్లలు ఎప్పుడూ ముందుంటారు . అమ్మాయి పంపిన లింక్ లో ఉన్న వీడియోని డౌన్ లోడ్ చేసుకుని దాదాపు గంట సేపు నిడివి ఉన్న ఆ వీడియో చూస్తున్నంత సేపు చాలా దుఃఖం వచ్చింది ఆ వీడియో మీరూ చూడండి.
అసలు ఈ వీడియో చిత్రించినందుకు BBC వారిపై కోపం వచ్చింది . ఎందుకు ప్రపంచదేశాలకి మన దేశం గురించి తక్కువది ఎక్కువగా, ఎక్కువది తక్కువగా గా చెప్పి మన దేశం పట్ల భీతీ కల్గిస్తారు . అని అనుకున్నాను కూడా. ఇప్పటికే మన దేశం గురించి ప్రపంచ దేశాలకి చెడ్డ సందేశాలు వెళుతుంటే పర్యాటకులుగా ఈ దేశాన్ని సందర్శించడానికి కూడా భయపడి వారి ప్రయత్నాలని విరమించుకుంటున్నారు అని వింటున్నాం. అది నిజం కూడా అని కొన్ని చోట్ల రూడీగా చదివాను కూడా. అలాంటి మెసేజ్ వెళ్ళడానికి ఇక్కడ పరిస్థితులు కూడా కారణం అయ్యాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు
ఇంతకీ ఈ వీడియోలో చూసింది ఏమిటంటే .... మన భారతీయ సంస్కృతీ సంప్రదాయం అని గొప్పగా చెప్పుకుంటామే .. ఆ సంప్రదాయం ఎగతాళిగా మారిన వైనం ని మనకి దృశ్య రూపంలో చూపించింది. డిల్లీ లో జరిగిన అత్యాచారం కి దేశం అంతా అట్టుడికి పోయి నిరసన చేసిన దృశ్యాల నుండి,అమ్మాయిలని నడిబజారులో వివస్త్రని చేసి ఆడుకున్న వైనాన్ని; యాసిడ్ దాడికి బలైపోయిన అమ్మాయిని, ఆడపిల్లలు పుట్టి మగ పిల్లలు పుట్టకపోతే మొహం మాడ్చుకునే ఇంటి పెద్దలని , మగ సంతానం పుడితే మాత్రమే వేడుకలు చేసే కుటుంబాలని,అదే ఆడపిల్లలు అయితే నడిరోడ్డు పై వదిలేస్తే ఆ వదిలేసిన పాపలని పెంచే తల్లిని , కారణం ఏమిటో చెప్పకుండానే ఉరితీసుకుని మరణించిన యువతి గురించి ఆవేదనగా చెప్పే తండ్రిని, చదువుకుని డాక్టర్ వృత్తి లో ఉండి కూడా అధిక కట్నం కోసం బార్య ని వేదించే భర్తలు .. ఇలా ఎన్నో వాస్తవ సంఘటనలతో కూడిన విషయాలల్తో ఈ వీడియో ఘనత కల్గిన మన దేశంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉందొ చెప్పింది. India A Dangerous Place to Be a Woman -ఇలా
ఏ వార్తా పత్రిక చూసినా అత్యాచారాల వార్త లతో విరాజిల్లుతూ ఉంటుంది . చట్టం తనపని చేయడానికి న్యాయస్థానం నేర నిర్ధారణ చేసి శిక్ష ఖరారు చేయడానికి ఎంత అలసత్వం చూపుతున్నాయో చెపుతుంది ఈ జాతి మూల మూలాల్లో స్త్రీ ల పట్ల ఉన్న వ్యతిరేకతని, వివక్ష ని భ్రూణ హత్యలని, సెక్సువల్ హెరాస్మెంట్ ని , నేరాల చిట్టా తో సహా చూపుతూ .. ఈ దేశంలో ఎందుకింత ప్రమాదకరమో ! ఆలొచించమంటూ ప్రశ్నిస్తూ ముగుస్తుంది .
ఈ వీడియోలో చూసింది చాలా తక్కువ . ఇంతకన్నా ఎక్కువ మనం చూస్తూనే ఉన్నాం . మన్ను తిన్న పాముల్లా పడి ఉంటున్నాం .
ఒక అజ్ఞాత నాకొకసారి ఒక వ్యాఖ్య వ్రాసారు . మగవాళ్ళు అందరూ చెడ్డవారు కాదు . అందరిని దూషించకండి . ఎక్కడో వెనుకబడిన బీహారీ ప్రాంతపు యువకుడు ఏదో చేసాడని మీరు అందరిని తిడుతున్నారు . అసలు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయంటే అని ఏదో చెపుతూ నా వ్రాతల పట్ల తీవ్ర వ్యతిరేకతని తెలిపారు . ఆ అజ్ఞాత చెప్పిన దానిలో నిజం ఉండవచ్చు . కానీ ఈ దేశంలో ఇన్ని లైంగిక వేదింపులు, అత్యాచారాలు ,వరకట్న హత్యలు ఇవన్నీ చదువుసంధ్యలు లేని మారుమూల ప్రాంతాల వారే చేయడం లేదు కదా ! చట్టం దృష్టికి వచ్చిన కేసుల గణాంకాలకే ఒణుకు పుడుతుంది. ఇంకా చట్టం దృష్టికి రాని కేసులు ఎన్ని ఉంటాయో !
స్త్రీని గౌరవించడం నేర్పని, నేర్పని ఈ దేశంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి వీటికి అడ్డు, అదుపు లేదు కాకుల లెక్కన రోడ్డున పడి నాలుగు రోజులు కూసి గమ్మున ఊరుకుంటాయి అనే అలసత్వం కనబడటం తప్ప. " "సహభాగినిగా సమభాగినిగా " అనే పాటలు వినడానికి బాగానే ఉంటాయి. ఆచరణలో అవి శూన్యం అని తెలుస్తున్నప్పుడు .. భయం భయంగా ఆడపిల్లల్ని బయటకి పంపుతూ చదువు అయ్యి అవగానే పెళ్లి చేసేసి విదేశానికి కాపురానికి పంపించేసి, హమ్మయ్య .. ఇక్కడంత భయం అక్కడ ఉండదు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేకపోతే నన్నెందుకు ప్రేమించవ్ అని యాసిడ్ బాటిల్స్ పట్టుకుని వెంటబడే కాలమిది. ఒంటరిగా ఆడపిల్లలు కనబడితే బ్రతకనివ్వని కాలమిది. వీళ్ళని పువ్వుల మాదిరి ఎక్కడ కాపాడ గలం ? అని భయపడుతున్న కాలమిది.
ప్రతి ఇంట్లో ఒక కూతురు ఉండాలి .అప్పుడే భాద్యత కల్గి సంస్కారంతో నడుచుకునే సోదరుడు ఉంటాడు , ఉండాలి కూడా !.
ఆడదానిగా పుట్టడం కంటే .అడవిలో మానై పుట్టినా బాగుండేదని ఆడవాళ్ళ వెతలు ని చెప్పుకుంటూ ఒక పోలిక చెప్పుకుంటారు. ఇప్పుడంతా అలా పోల్చడం బాగోదు అడవిలో మానై పుడితేను మొదలంటా నరికేస్తారు. ఆడదానిగా పుట్టినా అణచి వేస్తారు, నలిపి వేస్తారు, సమూలంగా పెరికేస్తారు ఇదండీ విషయం
ఇదే విషయం పై .. ఈ లింక్ లో ఈ ఆర్టికల్ కూడా India: a Dangerous Place for Women?
ఈ వీడియో చూసినప్పటి నుండి కొంత దుఃఖం మోస్తూ ..ఉన్నాను. ఈ దుఃఖాలు మనవి కావు కాని సమాజానివి అనుకుంటే ... ఏ రోజైనా కొన్ని దుఖాల బారిన పడే తీరతాము .
మనదేశం గురించి ఇంత చెడ్డ సందేశం ప్రపంచానికి అందుతుంటే ఏం చేయాలో మేధో వర్గానికి తెలుసు. హృదయ సంస్కారం ఉన్నవారికి తెలుసు .
అన్నలారా ..తమ్ములారా.. బిడ్డలారా ! ఆలోచించండి ..

10 కామెంట్లు:
ఏమో! నా దేశం ఎటు నడుస్తోందో!! భయంగా ఉంది. ఏమీ చేయలేమా?
R Damayanthi R Damayanthi says...
పూర్తిగా చూసానండి, ఈ విడియోని. ఇందులోకెక్కిన విషయాలు చాలా తక్కువ అనే చెప్పాలి. మన కళ్ళకి కనిపించని వి ఇంకా ఎన్నో ఘోరాలున్నాయంటె నమ్మబుధ్ధి కాదు. అన్నీ కెమారాకి ఎక్కవు. అన్ని పోలీస్ గడపల వరకూ పోవు. ఇంకొన్ని కోర్టుల్లో నెగ్గవు. ఎన్నో, ఎన్నో నిజాలు స్త్రీల కంఠాలలో..అణగ దొక్కబడి వున్నాయి. మరి కొన్ని ఆత్మ్హత్య చేసుకో బడుతున్నాయి. ఏదేమైన, ఒక నిజాన్ని చూపించారు బిబీసీ వాళ్ళు అనుకుందాం. ఇదొక కోణం లోంచి మన దేశం లో స్త్రీల పరిస్థితి. అందరితో షేర్ చేసుకున్నందుకు మీకు ధయవాదాలు. -ఆర్.దమయంతి.
జరుగుతున్నదానిని పాయింటౌట్ చేసినందులకు , ఆ పాయింటౌట్ చేసినవాళ్ళని దూషించటం కరెక్ట్ కాదు . ఇలా పాయింటౌట్ చేయటం వల్లనే ఈ రోజు మీరింతగా రియాక్ట్ అయి ఏదైనా పరిష్కారమార్గం చూస్తే బాగుండు అన్న ఆలోచనకు పునాది వేసింది .
ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నందుకు మన యావత్ భారతదేశం సిగ్గు పడవలసిన సమయం . ఏ యితర దేశాలలో లేని గొప్పగా చెప్పుకొనే సంస్కృతి స్త్రీలను గౌరవించే విషయంలో ( ఇది ఆచరణలో లేనిది ) మా దేశ నామధేయమే ఓ స్త్రీని తలపిస్తుంది " భరతమాత " .
అత్యున్నతంగా స్త్రీని గౌరవిస్తామంటూ అత్యంత ఘోరంగా అత్యాచార నీడల మరకలలో అట్టుడికిప్[ఓతున్నది . ఈ దుస్థితి నుంచి బయట పడాలంటే మనం మన పిల్లకు బోదించే పాఠ్యాంశాలలో స్త్రీ కూడా , మగవాళ్ళతో సమానమే అన్న విషయాల్ని మాత్రమే బోదించాలి . అంతే గాని స్త్రీకి బయటకెళ్తే రక్షణ లేదు , మొగాడే కాదు కనీసం నువ్వు కట్టుకున్న మొగుడి వద్ద కూడా నీకు రక్షణ వుండదు . అణగి మణగి ఆ మగ మొగుడి కాళ్ళు వత్తుతూ , కాళ్ళతో తన్నినా , నీ వళ్ళు గుల్ల చేస్తున్నా నువ్వెదురు చెప్పకు , చెప్పి నువ్వు పుట్టింటికి వస్తే నిన్ను మీ పుట్టింటి వాళ్ళెవరూ గౌరవించరు అన్న చెత్త విషయాల్ని వాళ్ళ మనసులకు బోధిస్తున్న తండ్రులను ( వీళ్ళు మగ మహారాజులు లెండి ) కూడా శిక్షించాల్సి వుంటుంది . ఇలాంటి ఓ కొత్త చట్టం అమలులోకి వచ్చి , అమలు జరుపుతుంటే కొన్నేళ్ళ కైనా ఈ అకృత్యాలు మరుగున పడి అడుగంటే రోజులు వస్తాయి . దీనికంతటికీ మూల కారణం ఈ ఆడ , మగ లలో భేదం సృష్టి కొరకే గాని , మరే విషయం లోనూ కాదు అన్నది నూరి పోస్తూ , అలా ఆచరించిన నాడే మనదేశం గర్వంగా అని చెప్పుకోగలం . ఇలా ఎవరికి వారు ఆచరించి చరించటం ఆలవాటు చేసుకొంటే ఆ రోజు అతి సమీపంలోనే వుంటుంది .
వనజా, మీ ఆవెదనను నేను అర్దం చేసుకోగలను, మొదట స్త్రీ మారాలి. తల్లిగా, అక్కగా, స్నేహితురాలిగా, గురువుగా, తన జాతి(ఆడ),తనతోటి స్త్రీలను రక్షించుకోగలగాలి. చాలా సందర్బాలలో స్త్రీలేఇతర స్త్రీలను ఊబిలోకి తొసే పరిస్థితులున్నాయి. ఇకపోతే ఇలాంటి వి చూసినప్పుడు మన నిస్సహాయతకు మనమీద మనకే వెగటు కలుగుతుంది. కానీ మనవంతుగా కనీసం అక్షరీకరిద్దాం, అరికడదాం. పైన శర్మ గారు చెప్పిన విషయం చాలా ఉన్నతంగా ఉంది. వనజా మీ టపాలు సామాజిక రుగ్మతులను అరికట్టే మందు బిళ్ళలు.
చట్టాలు ఎన్ని తెచ్చినా మార్పు రావాల్సింది వ్యక్తిత్వం లో అది అందించాల్సింది నాయకులు వారి నిర్ణయాలు(చట్టాలు కావు).
యధా రాజా తథా ప్రజా! నిజమే కదా నారాయణ్ దత్ తివారీ, అభిషేక్ మను సంఘ్వి లాంటి నేతలు పార్లమెంటుల్లో చేరి నాయకత్వం వహిస్తే వ్యవస్థ ఇలానే తయారు అవుతుంది.
వనజా, మీ అవేదనలో అర్దం ఉంది, సమాజాన్ని ప్రశ్నించే ఇలాంటి అంశాలే తీసుకోవాలి. మనం ఆసించే రోజు రావాలి కోరుకుందాం, ఆదిశలో నడుద్దాం.
quick punishment is required no doubt to about it but rape anadi oka india problem kadu every country facing this problem. In USA 89000 RAPE CASES PER YEAR are happening that to 9% rapes on men by men,so their even men don't have safety if u call police their they will come to spot with in mins with full equipment (guns,information sharing equipment)even though rapes are happening there here is official link :http://www.statisticbrain.com/rape-statistics/ here in indian huge population and lack of police we can't do anything.... till last decade our spiritual ethos are very strong but now because of globalization material things become very important in life and most schools and youth give it up their spiritual ethos and values etc when country lose all this
things this rapes ,crimes bound to happen... schools,university's just manufacturing knowledgeable idiots their is know wisdom (ex: i know one person his married earning 1lac per month when his wife is pregnant they spend 3days in a ashram to get baby boy) if a uneducated person believe this kind of this its ok but educate people going ashrams for sake of baby boy its very shame..
http://www.youtube.com/watch?v=tuUOwg6Ay4A
madam watch this
Thanks for da link. Values must be taught by da parents....to both da genders as well.
కష్టేఫలే..మాస్టారూ ..
@Sharma గారు
@ Narasimha గారు
@మేరాజ్ ఫ్రెండ్ ..
@అనూ గారు
@Ram spy గారు
స్పందించిన అందరికి ధన్యవాదములు . Ram గారు మీరు అందించిన లింక్ ఇంకా చూడలేదండి. చూసి తప్పకుండా నా అభిప్రాయం తెలియజేస్తాను . ఈ పోస్ట్ పై స్పందించాల్సింది చాలా ఉంది. మళ్ళీ ఒకసారి వివరంగా చూడ్డామండి. అందరికి మరో మారు ధన్యవాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి