ప్రతి రోజూ మెయిల్ బాక్స్ చెక్ చేసుకునేటప్పుడు.. నవ్వుకోవాలో, ఏడవాలో, జాలి పడాలో తెలియని పరిస్థితి. .
నేను .. మెయిల్ బాక్స్ ఓపెన్ చేసానా .. ఇదిగో.. ఇలా ఉంటాయి విద్యుల్లేఖలు ..
"వనజా ఐ యాం ఆనంద్ 29 ఫ్రం బెంగళూరు, మ్యూజిక్ లవర్ , డు యు మేరీ మీ .." మెయిల్ ఓపెన్ చేయకుండానే పైన కనబడుతూఉంటుంది . వెంటనే గుండె గుబేల్ మంటుంది కానీ కొంచెం సేపటిలోనే తేరుకుని
నేనిలా అనుకుంటాను.." నీ బొంద, నా కొడుకుకి ఇంకో మూడేళ్ళు ఉంటే నీ అంత వయసు ఉంటుంది . నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటిరా ? ఏదో రాంగ్ ID కి పంపినట్టున్నావ్ ! పనిచూసుకో .. వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళూ." డిలీట్ బాక్స్ లోకి పంపేస్తాను.
మళ్ళీ తెల్లవారే .." వనజా ఐ వాంట్ సి యు ప్లీజ్ ! డు యు మేరీ మీ" ఇలా ఉన్న మెయిల్ చూసి చిరాకు వచ్చేస్తుంది .
"ఒరేయ్ నీకు ఒకసారి చెపితే అర్ధం కాదా ! వెర్రి ముండా కొడకా .. నీకేమన్నా పైత్యమంటరా ? ఒకే పాటలు ఇష్టపడినంత మాత్రాన పెళ్ళిళ్ళు చేసేసుకుంటారటరా!? ఇప్పుడు నిజంగా నాముందుకు వస్తే పీలర్ తో తోలు తీసి ఉప్పు, కారంలో పొర్లించి మరీ... బెంగుళూరుకి ప్లైట్ ఎక్కిస్తా .. ముందు నా ముందుకు రారా చూద్ద్దాం ".. అంటూ మళ్ళీ డిలీట్ బాక్స్ లోకి పంపేస్తాను.
ఆ పైనే .. నీకు ఈ రోజు మంచి అవకాశం కలసి వస్తుంది ..కావాలంటే . మీ జాతకంలో ఈ రోజు ఏం జరుగుతుందో ఇక్కడ చూసుకోండి అంటాడు .Horoscop free వాడు .
"నా జాతకం వద్దు, నీ పిండా కూడు వద్దు .. పోరా బాబు పో .. నీ దారి నువ్వే చూసుకోరా" అని వాడిని బలవంతంగా డిలీట్ బాక్స్ లోకి పంపుతాను
ఇంకొకటి .. "వనజా! మీరు సామ్సంగ్ గెలాక్సీ ఫోన్ గెలుచుకున్నారు 664 రూపాయలకే ".అంటాడు ఇంకొకడు .
సామ్సంగ్ గెలాక్సీ .. ఆ .. నాకొద్దు .. నా iphone 5 ఉంది ముద్దు ముద్దుగా .. నువ్వు ఫ్రీగా ఇస్తానన్నా నాకొద్దు పోవయ్యా.. అంటూ గిరాటు వేసినట్లు .. వాడిని డిలీట్ బాక్స్ లోకి పంపుతాను
కేవలం వెయ్యి రూపాయలకే మీరు యెన్ఐఐటి సర్టిఫికేట్ పొందవచ్చు వివరాలకు సంప్రదించండి అని మెయిల్ లో కనబడి మూర్చపోయాను . ఓర్ని! ఇంత సులభమైన పద్దతిలో యెన్ఐటి పూర్తయిపోతుంటే మన ఆంద్ర వాళ్ళు కిండర్ గార్డెన్ స్కూల్ దగ్గరనుండే ఐ ఐ టి కోచింగ్ కోసం కార్పోరేట్ స్కూల్స్ కి, కాలేజ్ లకి లక్షలు లక్షలు ఖర్చుపెట్టేవాళ్ళు కదా ! తెలియక వారికి ఎంత అన్యాయం జరిగిపోయింది . ఇవాళ కనీసం ఒక వందమంది పేరెంట్స్ కైనా.. ఈ విషయం తెలియజేయాలని కంకణం కట్టుకున్నాను .
ఇక తరువాత మెయిల్ చూస్తే .. "వనజా ! మీకు కేవలం 150 రూపాయల ప్యాక్ తో ఐ బ్రోస్ , పేషియల్ , పెడిక్యూర్, మేనిక్యూర్, బాడీ వాక్స్ అన్నీ ఇస్తాం. మా పార్లర్ కి ఒకసారి విజిట్ చేయండి " .. అంటూ ఉంటుంది
ఓర్ని ! ఇంత ఛీఫ్ .ఆఆఆఆఆఆఅ మొన్నీమధ్య నా హెయిర్ స్టైల్ ట్రిమ్ చేయించుకుంటేనే 650 దొబ్బేసారే ! ఎంత మోసం అనుకుంటూనే .. ఓహో .అర్ధమయిందిలే ! పంక్షన్స్ సీజన్ అయిపోయిందిగా తల్లీ .. ఈగలు తోలుకుంటున్నారా .. అనుకుంటూనే .. నాకు ఇలాంటివి అలవాటు లేదండి.. నేనంత నాగరికం కాదులే! పూర్ విల్లెజ్ వుమెన్ ని... అంటూ వారిని సాగనంపేస్తాను
మీ హాస్పిటల్ బిల్ల్స్ ఎవరు పే చేస్తారు? అంటూ అడుగుతారు... ఇంకొకరు
మీకు పుణ్యం ఉంటుంది అదేదేదో మీరు" పే" చేసేయండి . చాలా రోజుల నుండి టోటల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి అనుకుంటున్నా,, అంటూ .. వారిని పంపేస్తాను
"బెస్ట్ ఇన్స్యూరెన్స్ పాలసీ చేయమంటారా? .. అంటారు ఇంకొకరు
అబ్బే ! అవసరం లేదండి ..కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నా..చాలా మందికి లాగానే మాకు రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డ్ ఉందండీ .. మాకు ఆ కార్డ్ ఉన్నదన్నమాట మీకు తెలిసినట్లులేదు. మీతో నాకవసరం లేదండీ .. వెళ్లి రండి .. అంటూ మర్యాదగానే పంపిస్తాను .
డాలర్ రేట్ ఎక్కువైతే ఏమిటండి ? మా ట్రావెల్ పాక్ తీసుకోండి ..ఎంజాయ్ చేసి రండి హాట్ హాట్ బిల్స్ తర్వాత మేమిస్తాం అంటాడు ట్రావెల్ హాట్ వాడు .
ఇంత వరకు ప్రక్కనే ఉన్న పాపికొండలు చూడటానికే వెళ్ళలేదు .. మా రూపాయి అంత ఎత్తు ఎగరలేదులే బాబు .. ఇంకో జంటని వెతుక్కొ.. అంటూ వాడిని బలవంతంగా డిలీట్ బాక్స్ లోకి తోసేస్తాను
"వనజా .గెట్ మేరీడ్ అగైన్ ?" రెండవ పెళ్ళిళ్ళు చేసే ఓ వివాహబంధ డాట్ కమ్ .. వాడు అడుగుతున్నాడు
ఒక్కసారి పెళ్ళి చేసుకోవడానికే చాలా కష్టంగా మా అత్తారింటి వాళ్ళ మెడలు ఒంచేసా .. మళ్ళీ రెండో సారి పెళ్ళా ! మొన్నేగా "స్వాతి వాళ్ళ అమ్మ" పెళ్లి గురించి "సారంగ " లో చెప్పించా.. ఆ కథ నేనే వ్రాసానని నీకు తెలియదా .. బుద్దిలేని వెధవ .. రెండో పెళ్లి అంట రెండో పెళ్లి... అంటూ తిడుతూనే..
మా వారికి ఫోన్ చేసి "ఏమండీ! వీడెవడో నన్ను రెండవ పెళ్లి చేసుకుంటావా ? అని అడుగుతున్నాడండి, ఏం చెప్పమంటారు?" అని అడిగాను . అందుకు ఆయన ఇలా చెప్పేరు "నేనన్నా కొన ప్రాణంతో మిగిలివున్నాను వాడికి బతుకు మీద ఆశ లేకపోతే యిప్పుడే చేసుకోమనవే! నేను వెంటనే విడాకులిచ్చేస్తా!" అని ..
"ఇదిగో.. మా వారి మాటలు విన్నావా..? వెనక్కి తిరక్కుండా పరిగెత్తు" ...అంటూ వాడిని పంపించాను .
అమ్మయ్య ! ఇవాల్టికి ఇక్కడ పిల్టర్ అయిపోయిందికాబట్టి అవసరమయినవి చూసుకుందాం .. అని పనిలో మునిగిపోయాను
ఇంతలో లాండ్ లైన్ మ్రోగింది . అబ్బా.. ఇప్పుడు అక్కడి వెళ్ళాలంటే ఈ సిస్టం ముందు నుండి లేవాలి . లేచి వెళ్ళేటప్పటికి రింగ్ ఆగిపోతే కాల్ బాక్ చేయాలి . ఎవరైనా సోది వేస్తారు వాళ్ళ బిల్ కాదుగా... అనుకుంటూ మోకాలు నొప్పి కలుక్కు మంటున్నా .. గబా గబా వెళ్లి రిసీవర్ తీశాను . ఎవరో అపరిచితురాలు .
మేడమ్ .. కాంతి ఎంటర్ ప్రైజెస్ నుంచి కాల్ చేస్తున్నాం . మీ ఫోన్ నంబర్ లక్కీ నంబర్ గా సెలెక్ట్ అయింది . నాలుగు చిమ్నీస్ ఉన్న గ్యాస్ స్టవ్ 600 రూపాయలకే ఇస్తున్నాం . మీ ఇంటి అడ్రస్ ఇస్తే డోర్ డెలివరీ ఇస్తాం అడ్రెస్స్ చెప్పండి మేడం .. చాలా మర్యాదగా అడిగింది.
ఏమ్మా .. ఫోన్ నంబర్ ఇచ్చిన టెలీఫోన్ డైరక్టరీ ఇంటి నంబర్ ఇవ్వలేదా తల్లీ అని మనసులో అనుకుని .. వద్దమ్మా ! రెండు చిమ్నీలు ఉన్న స్టవ్ పైనే గిర గిర తిరిగి గంట లోపలే వంట చేసి పడే స్తున్నా... నువ్వు నాలుగు పొయ్యిల స్టవ్ తెచ్చి పెడితే అరగంటలో వంట చేసి అక్కడ పడేసి .. ఫేస్ బుక్ లో కూర్చుంటా .. మా ఆయన తిట్లు నుండి కాస్త నన్ను బ్రతకనీ తల్లీ! అంటూ ఫోన్ పెట్టి పడేసాను .
మళ్ళీ ఇలా ఫేస్ బుక్ ముందు కూర్చున్నానా .. మొబైల్ రింగ్ అయింది . ఎవరిదో .. ఈ కొత్త నంబర్ !!??
అనుకుంటూ .. హలో .. అన్నాను.
"మేడమ్ .... ఈ మొబైల్ నంబర్ మీదేనా అండీ? " అడిగింది . "అవునండీ .. తొమ్మిదేళ్ళ నుండి అచ్చంగా నాదేనూ, మీకేమిటి సందేహం?" అనడిగాను .
మీరు చాలా లక్కీ మేడం ! .. హైదరాబాద్ భాగమతి పెరల్స్ వారు .. లక్కీ డీప్ తీస్తే మీ నంబర్ సెలక్ట్ అయింది . మా షాప్ వార్షి కోత్సవం సందర్భంగా మీకు నలబై వేల రూపాయలు విలువ చేసే ముత్యాల హారం కేవలం 3,300 రూపాయలకే వస్తుంది . మీ అడ్రెస్స్ చెపితే మీకు వి.పి.పి లో పంపబడుతుంది మీరు ఆ డబ్బు కట్టి తీసుకొవచ్చు . అని చెప్పింది .
మా బంగారు తల్లే! మీ తెలంగాణా వారిది ఎంత ఉదార హృదయం . నేను సీమాంధ్రా మనిషినని తెలియక నాకు బహుమానంగా ముత్యాల హారం ఇస్తున్నారు కానీ, ముత్యాలు నా ఒంటికి సరిపడవు తల్లీ! మా జగ్గయ్యపేట రంగు రాళ్ళు చాలమ్మా నాకు " అంటూ ఫోన్ కట్ చేసాను .
నేను ఎంత మూర్ఖురాలినో కదండీ! ఎన్ని ఆఫర్లు .. ప్చ్ .. ఒక్కటన్నా ఉపయోగించుకోవడం రావడం లేదు అనుకుంటున్నాను .
మావారు అప్పుడప్పుడూ అంటూ ఉండేవారు .. "తింగరి బుచ్చి" అని
నిజమేనేమో.. అనుకుంటున్నారా ! ఇలాంటి వెధవ ట్రిక్ లకి పడిపోవడానికి .. నేనేమన్నా .."ఒట్టి వనజ " అనుకుంటున్నారేమో .. హా.. నేను బ్లాగర్ "వనజ వనమాలి " అని తెలియదు కాబోలు . :) :)
(రోజూ అనేక రకాల మార్కెటింగ్ మాయాజాలం కి గురి కాకుండా, బలి కాకుండా ఉండటం చాలా కష్టం సుమీ !అనుకుంటూ సరదాగా ఈ పోస్ట్ .. హాయిగా నవ్వేసుకోండి నచ్చితే నాలుగు అక్షింతలు వేయండి)
.

8 కామెంట్లు:
మీరు సరదాగా చెప్పినా వాస్తవం చెప్పారు. ఏదో హక్కులా మన సమయం అంతా లాగేస్తారు. విసిగిస్తారు.
LOL!
ఇది అనునిత్యం దాదాపుగా ప్రతి మెయిల్ స్వంతదారుడుకే కాదు , మొబైల్ స్వంతదారుడుకి కూడా జరుగుతున్నాయి . వీటిని ఆపే వాడే లేడు . ఎందుకంటే ఆబగా డబ్బులు వస్తుంటే ఎలా ఖర్చు చేయాలో తెలియని వాళ్ళ ఆగడాలే . ఈ మొబైల్ సిం కార్డుల స్వంతదారులు , అడ్డదారులు తొక్కుతూ డబ్బు సంపాదననే చూస్తుండటం వలన , సమాజంలోని కొంతమంది యిలాంటి చెడ్డ అలవాట్లకు బానిస అవటం జరుగుతుంది .
పదిమందీ ఆలోచించవలసిన టపా . నివారణ దిశగా ఆలోచించటం ఎంతో మంచిది .
ఓ సారి ఇలానే ముత్యాల హారం గురించి ఓ అమ్మాయి ఫోన్ చేస్తే అది అమ్మేసి సగం నువ్వు తీసుకో, మిగిలిన సగం డబ్బు నాకు పంపించు అన్నాను .. ఇలాంతో మార్కెటింగ్ మాయాజాలం గురించి పోస్టుల ద్వార ప్రచారం చేయడం మంచిది. ఇతరులు మోసపోకుండా ఉంటుంది
మీ అంతర్జాల విద్యుల్లేఖల ఖండన ముండనలు, చెరవాణి సంభాషణల తాలూకు చెణుకులు కడు పసందుగా ఉన్నాయండి :)
:))
shan గారు థాంక్ యూ!
! Narayana Swamy గారు థాంక్ యూ !
Sharma గారు థాంక్ యూ !
buddha murali గారు .. థాంక్ యూ ! అవునండీ ఇలాంటి మార్కెటింగ్ మోసాల గురించి చాలా వివరంగా చెప్పాల్సి ఉంది .
@నాగరాజ్ గారు థాంక్ యూ సో మచ్
పల్లా కొండలరావు గారు థాంక్ యూ ..సో మచ్
Hilarious! Sorry Vanaja gaaru, ee roju chadivaanu. chaalaa navvinchaaru.
కామెంట్‌ను పోస్ట్ చేయండి