13, సెప్టెంబర్ 2015, ఆదివారం

చినుకు కోసం






నెఱ్రులు వారిన పుడమి తల్లిని జూచి

ఓ..కారు మేఘం కరుణ జూపింది

చినుకు చినుకు రాలి సందడి చేసాయి.

ఇల గొంతు తడిపిన చినుకు అమృతమే అయింది.

ఎండిన కొమ్మ రెమ్మలకి ప్రాణ శక్తి పుంజుకుంది

నాగలి భూమిని చీల్చింది..

పల్లె పాదాలు పొలం బాట పట్టాయి

విత్తనాల గంప చంకకెక్కింది

ఆశలని నారుగా చల్లబడ్డాయి.

నాటి నుండి ఆశగా ఆకాశం వైపు

నేలవైపు తడుముకుంటుంది చూపు

ఇది ఎండా కాలం కాదు

ఇది వానా కాలం కాదు

ఇది చలి కాలం కాదు.

మదిని ఒణికించే ఆశల కాలం

ఇది చినుకు కై నిరీక్షించే కాలం.

ఆశ ఆనే తల్లి వేరు పోసుకుని

బీడు భూముల మధ్య

మొండిగా ఎండిన చెట్టు లా

నిలబడి ఉన్న రైతన్నకనులు

మరల వచ్చే చినుకు కోసం

కాయలు కాచే కాలం

(ఇటీవల ఓ..పల్లె ముఖ చిత్రం ఇలా కనిపించింది)

8 కామెంట్‌లు:

భాస్కర్ కె చెప్పారు...

మదిని ఒణికించే ఆశల కాలం

ఇది చినుకు కై నిరీక్షించే కాలం.
avvunu nijam, avvunu nijam
meerannadi, meeranndi,
nijam, nijam.
good one, keep writing.

అజ్ఞాత చెప్పారు...

కృష్ణా, గోదావరి జిల్లాలిక బీడే!

జలతారు వెన్నెల చెప్పారు...

కదిలించిందండి కవిత వనజ గారు. బాగుంది. చినుకు కోసం రైతు వేచి చూడడం..

కాయల నాగేంద్ర చెప్పారు...

రాష్ట్రంలో అక్కడక్కడ జల్లులు పడటంతో రైతులు ఆశగా దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. ఇక అప్పటినుంచి
ఋతుపవనాలు ముఖం చాటేయడంతో రైతన్నలు చినుకు కోసం ఎదురు చూస్తున్నారు. వాతావరణం చూస్తుంటే మళ్ళీ ఎండాకాలం వచ్చినట్టుంది. పాపం రైతన్నల కలలు నెరవేరేదేలా?

అజ్ఞాత చెప్పారు...

farmer is the lone loser in India.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

భూమి నోరు తెరిచి చూస్తుంది ఆకాశం వైపు.మీ కవిత దానికి అద్దం పట్టింది.మంచి కవిత.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

The tree Bhaskar gaaru..

@KashtEphalE gaaru..

@jalathaaru vennela gaaru..

@Kayala Nagendra gaaru..

@Puraanapanda Phani gaaru..

@Oddula Ravi shekhar..gaaru..
వర్షాభావం పై.. రైతన్నల వెతల పై మీ అందరికి ఉన్న సానుకూల భావానికి,స్పందించిన మీ అందరకి హృదయ పూర్వక ధన్యవాదములు.

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

baagundi