13, సెప్టెంబర్ 2015, ఆదివారం

నలిగే దారి





కలల తీరం వెంబడి ప్రయాణం
అట్టే సాగడం లేదు.

తరిగే మైలురాళ్ళు దిశానిర్దేశకాలు కాలేక
కాళ్ళకి తగిలి పెక్కు గాయాలు చేసి
వికటహాసం తో విరగబడుతున్నాయి.

నలుగురూ నడిచే త్రోవ నలగలేదు ఎందుకో..!?
అది చీకటి మాటున అని తెలిసాక ..
నాలిక్కరుచుకుని నడక, నడత మారాక

వెలుగురేఖల వెంబడి ప్రయాణం
ఎంతకీ ముగియడంలేదు.

చుట్టూ .. ఉన్న చీకటిని తరిమివేయడానికి..
వికాసం పంచుకోవడానికి .
మంచిని పెంచటానికి.. చెడుని త్రుంచ డానికి .
ఇప్పుడు నేను నడిచే దారి.. "నలిగేదారి"

4 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

" అనగననగ రాగమతిశయిల్లుచునుండు - తినగతినగ వేము తియ్యనుండు - సాధనమున పనులు సమకూరు ధరలోన " అన్నారు కదండీ మన వేమన. నలిగేదారి రాటుదేలి గట్టిపడుతుంది. గమ్యాన్నీ చూపుతుంది. గమ్యాన్ని నికరంగా చేరుస్తుంది.

జలతారు వెన్నెల చెప్పారు...

Vnanajagaaru...Lovely andi! chaalaa baagundi

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

kondala rao gaaru.. Yhank you very much!!

@Jalataaru vennela gaaru..
mee manasu Lovely!! anduke..annee mecche hrudhayam kanabadutuntundi. Thank you very much!!

జ్యోతిర్మయి చెప్పారు...

ఈ దారి ఏదో ఒక నాడు రాదారి కావాలి..