కలగంటి కలగంటి... యిపుడిక వలదంటి.... 🙂
మనదంతా విచిత్రమైన అభిరుచి.(నాదే)
చిన్నప్పుడు వొక కలగంటిని. గోదారొడ్డున విశాలమైన ప్రదేశంలో చుట్టూరా వెదురుబద్దలతో లేదా కొబ్బరాకు తడికలతోనో కట్టిన స్థలం మధ్యలో ఓ రెండు నిట్టాడుల రెల్లు గడ్డి యిల్లు ఆ యింటి ముందు అనేక పూల మొక్కలు చుట్టూరా కట్టిన దడులకు పాకిన తీగజాతి కూరగాయ మొక్కలు వుంటూ.. నూతిలో నీళ్ళు తోడే పనిలేకుండా.. చక్కగా ఓ బిందె పట్టుకెళ్ళి గోదారిలో బుడుంగున ఒకసారి ముంచి బిందెను వయ్యారంగా నడుమ్మీద పెట్టుకుని మొక్కలకు నీళ్ళు పోయాలని పూల మొక్కల మధ్య తిరుగుతూ సోలో పాటలు పాడుకోవాలని.. పనిలో పనిగా.. చీకటి వెలుగుల కౌగిటలో చిందే కుంకుమ వన్నెలు .. అనే డ్యూయెట్, నిదురించే తోటలోకి పాట వొకటి వచ్చింది లాంటి బరువైన పాటలు పాడుకోవాలని కోరిక వొకటి ఆలోచనలలో విత్తై పడి మనసులో నాని నాని మొలకెత్తి ఆకులు తొడిగి కొమ్మలేసి ఆఖరికి వటవృక్షమై కూర్చుంది.
ఆ కోరికకంతటికి కారణం ముత్యాలముగ్గు సినిమా అని శోభన బాబు నటించిన సంపూర్ణ రామాయణం అని చీకటి వెలుగులు సినిమాలని చెప్పక్కర్లేదు 🙂 కళ్ళు మూసినా తెరిచినా నది వొడ్డు పూలతోటలు పాడుకున్న పాటలు యివే కనబడేవి. మా ఇంటిచుట్టూ ఖాళీ స్థలంలో కూడా బాగానే మొక్కలు వేసి పోటీపడి పెంచేవాళ్ళం. కానీ ఈస్టమన్ కలర్ సినిమా పాటల ముందు .. అవి మనకంటి్కి ఆనేవి కాదు, పైగా నది వొడ్డు కూడా లేదు. ఆ విధముగా సుడులు తిరుగుతూ పెరిగిన కోరిక వల్ల ఇంటర్మీడియట్ లో బై పి సి గ్రూఫ్ తీసుకున్నాను. మొక్కలతో పాటు కప్పలను కూడా కోయాల్సివచ్చినందుకు డ్రాయింగ్ బాగా వేస్తానని ఫ్రెండ్స్ రికార్డ్ లు కూడా నేనే పూర్తి చేయాల్సినందుకు అసలు బాధ అనిపించేది కాదు. ఆఖరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ తప్పి.. పెళ్ళి గండం నన్ను ముంచేస్తే నేను రికార్డ్స్ రాసి యిచ్చినవాళ్ళు అగ్రికల్చర్ బియెస్ సి చదివి వ్యవసాయశాఖలో వుద్యోగం సంపాదించి అధికారులు అయ్యారు. నేనేమో నలబై యేళ్ళకు పైగా నదివొడ్డున చిన్న కుటీరం చుట్టూరా పూలతోట కలలు కంటూనే వున్నాను.
ఈ మధ్యనే తీరికగా కూర్చుని కాస్త ఆలోచన చేస్తూ జీవితం అనే సినిమాలో సోలోలు డ్యూయెట్ లు విషాదంగా పాటలు పాడుకునే అన్ని సందర్భాలు అయిపోయాయి కదా... అయినా నా కల తీరనేలేదు. ఆ సినిమాలు చూసిన కాలం లోనే " నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం" లాంటి పాటలున్న సినిమాలు చూసాను కదా... అలాంటి కలలెందుకు కనలేదు... అలాంటి కలలు కంటే అవి నిజమయ్యేవేమో... కలలు కనడం కూడా రాదు అని.... ఓ మొట్టికాయ వేసుకున్నాను గట్టిగా.
అయినా కృష్ణా వాళ్ళు గోదారొడ్డు కలలు కనకూడదబ్బా... అచ్చిరాదు 🙂 🙂
ఇప్పటిదాకా సరదాగా రాసినా .. అది నిజమే. నా చిరకాల కల కూడా అదే !
సరే ...కలైతే నెరవేరలేదు కానీ ప్రయత్నాలు మాత్రం కుంటుపడలేదు. ఉన్న ఊరులో అయితే అంత విశాలమైన స్థలం కొనడమో లేక యిప్పటికే వున్న స్థలంలో అభిరుచి ప్రకారం ఇల్లు కట్టుకోవడమో తలకి మించిన భారం సంగతి అటుంచి ... నీ తర్వాత యెవరు వుండబోతారు యీ యింట్లో అన్న వ్యాపార దృక్కులు నా చుట్టూ అల్లుకుంటాయి. కొంతమందికి పెదవులు మాట్లాడకుండా కళ్ళు లేక నొసలు మాట్లాడతాయి . నా యింటి చుట్టూ అల్లుకున్న ఆశలకు మొదట్లోనే యాసిడ్ పొసే ఈర్షాద్వేషాలున్న మనుషులు నా కల నెరవేరకుండా అడ్డుపడుతూ వుంటారు. అలా రెండుసార్లు చేదాకా వచ్చిన అదృష్టం వెనక్కి జరిగి పాతాళంలోకి జారిపోయింది.
ఈ మధ్య ఒక ఆలోచన చేసాను. మెట్టినిల్లు అయిన వూళ్ళో నా యింటి కల నెరవేరడంలేదు. కనీసం పుట్టినూరులో నా కల నెరవేర్చుకుందాం అని ఆలోచన వచ్చినదే తడవు.. మా నాన్నగారికి ఫోన్ చేసి ... మన వూరిలో ఇళ్ళ స్థలాలు యెంత రేటు వున్నాయి నాన్నా అని అడిగాను. ఆయన యధాలాపంగా సెంటు లక్షరూపాయలు దాకా వుండొచ్చు ఇప్పుడు రేట్లు పడిపోయినాయి కదా అన్నారు. వెంటనే నేను లెక్కలు వేసుకున్నాను. పది సెంట్లు స్థలం,ఒక నలభై లక్షలలో ఇల్లు అయిపోతుంది కదా ! నేను ఈ ఊర్లోనే వుండాలని యేముంది. ఇంటర్ నెట్ కనెక్షన్ వుంటే యెక్కడ వుంటే యేమిటీ.. టూ వీలర్ వుంది కారు వుంది. హాస్పిటల్ అవసరాలకు విజయవాడ వెళ్ళడమే కదా అన్నాను.
మానాన్నగారు వెంటనే ..యిక్కడా? ఈ ఊరులో యెందుకులే అమ్మా ... ఈ ఊరులో రైతు కుటుంబాలు యేమీ లేవు. వున్నా అందరూ బెజవాడలో హైదరాబాద్ లో అమెరికాలో వుంటుంటే ..నువ్వు యిక్కడికి రావడం యెందుకు ? ఒక అపార్టుమెంటు కొనుక్కుని అక్కడే వుండు అన్నారు. మొత్తానికి ఆయనకు ఆడపిల్లలు ఒకింటికి వెళ్ళిపోయాక మళ్ళీ పుట్టినవూరుకు రావడం యిష్టం లేదని అర్ధమయ్యింది. జీవితంలో క్లిష్టమైన సమస్యలు యెదురైనప్పుడే పుట్టింటికి వెళ్ళని నేను అక్కడ యిల్లు కట్టుకుని పైగా పుట్టిన ఊరులో వుండే అదృష్టం యెంతమందికి వుంటుంది అని కలలు కంటూ యెన్నో ఆలోచనలు చేసిన నా ఉత్సాహం అప్పటికప్పుడే గాలితీసిన బుడగలా నేలబడింది.
అమ్మ చనిపోయి ఇరవై ఒక్క ఏళ్ళయితే ఒకే ఒకరోజు పుట్టింటిలో నిద్ర చేసిన ఘనత నాది. అదీ మా మామగారు చనిపోయినప్పుడు భర్తతో కలిసి నిద్రకు వెళ్లడం. ఇక రెండవది భర్త చనిపోయిన తర్వాత అన్న యింటిలో ఇంకొకరోజు నిద్ర. ఇవన్నీ మనసుకు ముల్లులా గుచ్చుకుంటాయని అనుకోను నేను. చాలా యధాలాపంగా తీసుకుంటాను.అమ్మలేని పుట్టిల్లు యెవరికైనా అంతే కదా !
ఇక ఇప్పుడైతే పూర్తిగా వైరాగ్యం ఏది నా యిల్లు.. దేహమున్నంతవరకు దేహమే ఒక యిల్లు. ఈదేహంలోకి అద్దెకి ఉండటానికి వచ్చిన ఆత్మకి దేహమే అద్దె యిల్లు. ఈ దేహానికి మాత్రం సొంత యిల్లు లేకపోతే యేమీ అని తేలికగా తీసి పడేస్తున్నాను.
నేనెప్పుడూ ఒకమాట అంటూ వుంటాను. జీవితంలో పెళ్ళి ఇల్లు కలలాంటివి. కొందరికి నెరవేరతాయి కొందరికి అసలు నెరవేరవు. ఊపిరి వున్నన్నాళ్ళూ యెలా రాసి వుంటే అలా జరగడమే.అందరికి అన్నీ పెట్టి పుట్టి ఉండవు. స్వయంగా నెరవేర్చుకునే శక్తి ఉండదు. ముఖ్యంగా స్త్రీలకు భర్త అమర్చలేకపోతే బిడ్డలు కూడా ఆ కోరిక తీర్చలేరు. వాళ్ళ జీవన పోరాటం వాళ్ళది కదా! పిల్లలను తప్పు పట్టలేము. ముఖ్యంగా ... ఆస్తులకు వారసులే తప్ప కలలకు వారసులు కారు
తల్లిదండ్రులు... తమ జీవితకాలం పెట్టుకునే భ్రమలు పిల్లలు. physically mentally emotionally... అయినా తల్లిదండ్రులకు బుద్ధి రాదు.ఈ తల్లిదండ్రుల వయసు వస్తే తప్ప బిడ్డలకు తల్లిదండ్రులు అర్ధం అవరు. అప్పటికి వాళ్ళు వుండరు. జీవనచక్రం తిరుగుతూనే ఉంటుంది అంతే! ఒక కలను సమూలంగా తుడిచేసాను.
చిన్నప్పుడు ఇసుకలో ఆడుకుంటూ పిచ్చుకగూళ్ళు కట్టుకుంటాము. ఇంటికి వెళ్ళేటప్పుడు వాటిని కూల్చేయడమో లేకపోతే వెనక్కి వెనక్కి తిరిగి చూసుకుంటూనో వెళతాము. తర్వాత ఎవరో ఒకరు వాటిని తొక్కేస్తారు. లేకపోతే గాలికి చెదిరిపోతుంది. నా కల కూడా అలాంటిదే! వాస్తవంలో జీవించడం నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా వుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి