ఇదిగో..
ఈ మలుపు దారుల్లో యెక్కడైనా కలిసి నాతో పాటు నడుస్తావనుకున్నా..
విన్న పాటలు చదివిన పుస్తకాలు నిలబెట్టేసిన అందాలు
సహృదయుల మంచితనాలు గురించి ముచ్చటించాలనుకున్నా..
ఏమిటో.. సారము లేని జీవితాన తీరని కోరికలెన్నెన్నో
నేను యెన్నటికి తెరవబడని ఖజానా ని
జీవన మధువును మ్రోయలేని మధుపాన్ని
ఆశల రెక్కవిరిగిన సీతాకోకచిలుకని
అవిసిపోయి చతికిలబడిన అంకురాన్ని.
పై వాడు యెంత నిర్దయుడు
యేదో వొక కొరత పెట్టి అలమటించమంటాడు
మంచి కూటి జతకు మంచి కూర దొరకదు అని
అంటా వుంటారు కదా
అట్టా నిజం చేస్తాడన్నమాట
బోధిస్తాడన్నమాట
జీవితం అంటే పూల దారి రంగుల కల కాదని 😊🤔
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి