కాల పురుషుడు కొరడా ఝళిపించాడు
పువ్వుల బృందగానం ఆగిపోయింది
సీతాకోకచిలుకల ధ్యానం చెదిరిపోయింది
పెళ్ళికూతురిలా శోభిల్లే లోయ కళ తప్పింది
రంగుల ప్రపంచం మటుమాయమైంది
చెట్లన్నీ మోడులై కన్నీటి బొట్లు రాలుస్తున్నాయి
కలత పడ్డ ధర మనసు దుఃఖంతో వశం తప్పింది
జాలి పడ్డ దివి మంచు తెర ముసుగు వేసింది
సాక్ష్యంగా నిలిచిన రవి చంద్రులిరువురు
ఎదురెదురు నిలిచి సన్నగా నవ్వుకున్నారేమో
నక్షత్రాలు తలలూపుతున్నాయేమో
సముద్రం ఉన్ని దుస్తులు ధరించి వెచ్చ బెట్టుకుందేమో
ఋతువులన్నీ ప్రకృతి కే ఊహలన్నీ అర్ధసత్యాలే
మనసు తోట అరుదైన కానుకను పొందింది
క్షణానికోమారు పుట్టి మరణిస్తూ వుంటుంది
అది ఎన్నటికీ వాడని ఐదో ఋతువు
లోన బయటా చుట్టేసిన అడవిపూల సౌగంధం
చుట్టూ రంగు రంగు సీతాకోకచిలుకలు
మధ్య ఒకే వొక్క తెల్ల సీతాకోకచిలుక
అదే నా ఐదో బుుతువు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి