వనజ గారూ.. మీరు YouTube మాయలో పడ్డారు. మీ ఒరిజినాలిటి మర్చిపోతున్నారు. రాత కదా మిమ్మల్ని మరింత శక్తివంతంగా ఉంచుతుంది అని కొందరు మిత్రులు హెచ్చరించారు. అవునా అనుకుని ఆలోచనలో పడ్డాను.
“ఏం చేస్తున్నావమ్మా” అని పలకరిస్తాడు మా అన్నయ్య.
“ఏముంటుంది రా.. అబ్బాయ్!
వెతకడం చదవడం చదవటం చదవడం అంటాను. “ఓసి.. నీ నోరు పడ! ఎంతసేపు ఆ చదవడం తప్ప ఏమీ ఉండదా! ఈ కతలు గితలు మానేసి రామాయణమో భారతమో చదవొచ్చు కదా!”అన్నాడు.
నేను షాకింగ్. మా కుటుంబం లో నాలుగు తరాల్లో (అటువైపు ఇటువైపు కూడా) మా తాతయ్య (నాన్న నాన్న) తర్వాత అత్యంత సాఫ్ట్ గా లోతుగా వుండే మనిషి మా అన్నయ్య. ఇప్పుడు వీడిలో కూడా టిపికల్ పురుష కోణం కనబడుతుంది ఏమిటబ్బా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఆ ఆలోచనలో వుండే “రామాయణ భారతాల్లో వుండేవే కథల్లో కవిత్వాల్లో వుంటాయి లే “ అన్నాను అన్నయ్య తో.
ఎక్కువ చదివిన రోజు నాకు నిద్ర రాదు. స్క్రీన్ లైట్ ఎఫెక్ట్. ఆ నిద్రలేమి వల్ల ఏవో అనారోగ్యాలు వస్తాయి. కానీ ఏం చేయను. అది దృష్టిలో పెట్టుకుని అన్నయ్య అని వుండవచ్చు… అని సరిపెట్టుకున్నాను.
నేనెప్పుడూ నాకు నచ్చిన పనే చేస్తాను. నేను చేసే ఏ పనికైనా నా వైపు నుండి కార్యకారణ సంబంధాలు తర్కం అనే బలమైన గోడ గట్టిగా నిర్మించుకుంటాను. నా పద్దతి నన్ను ఎదుర్కొనే వారిని అసహనానికి గురిచేస్తుంది.
ఏదో అంటారు. నేను మౌనంగా మరింత శక్తివంతంగా ఉంటాను.
ఎటొచ్చీ..
కథ రాయటం అంటేనే… 1500 పదాలు కి మూడు పేజీలకు కుదించబడటానికి సర్దుకోవాల్సిరావడమే ఇబ్బందిగా ఉంటుంది.
ఎనీ హౌ.. కథలు రాస్తున్నాను, కవితలు రాస్తున్నాను.. YouTube లో విభిన్నమైన శక్తి వంతమైన కథలు వినిపిస్తున్నాను. త్వరలోనే నా కథల పుస్తకం కూడా రాబోతుంది.
నేను చైతన్యంగానూ భావ చైతన్యం తో expressive గానే ఉన్నాను.
ఏ వొక్కరి అంచనాలకు తగ్గట్టు నేను వుండను. 😊😘
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి