10, మే 2011, మంగళవారం

గున్న మామిడి కొమ్మ మీద

ఒక జ్ఞాపకం .. 
నేను నా స్నేహితురాలితో.. ఫోన్ లో మాట్లాడుతున్నాను...శుక్రవారం రాత్రి సమయం.. పదిగంటలకి ప్రసారమయ్యే..అభిరుచి కార్యక్రమం వచ్చే సమయమైనది.

ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసారం అవుతున్న "అభిరుచి" వస్తుంది..ప్రసారమవుతున్న పాటలకి..అందంగా వాఖ్యానం చెప్పే "రవి కుమార్ రెడ్డి " గారి వాయిస్ తో.. పాటలు వినడం ఒక మంచి అనుభూతి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి.. ఒక గూటిలోన రామ చిలుకుంది.. ఒక గూటిలోన కోయిలుందీ!.. పాట మొదలయింది.." వనజా.. మంచి పాట వస్తుంది.. విను "అంటూ.. రేడియో.. వాయిస్ పెంచి వినిపించే ప్రయత్నం చేసింది.. ఇక్కడ కి కూడా వినవస్తుంది..లే! నేను రేడియో పెట్టాను.. అన్నా ఊరుకోదు.. 

తనకి.. పాటలన్నా..స్నేహితులన్నా..ఎంత ఇష్టమో...! ఈ..పాట కూడా అంత ఇష్టం. తనకి..ఇష్టమైనది.. తనకిష్టమైన వారికి.. వినిపించడం ఇంకా ఇష్టం..సడన్ గా ఎప్పుడో ఒకప్పుడు తన నుండి కాల్ రాగానే వెంటనే లిఫ్ట్ చేస్తే.. నాకు ఇష్టమైన పాట వినవస్తుంది.. అలా..అపురూపమైన కానుకలు ఇవ్వడం మా.. మొద్ధుకి అలవాటు. నేను తనని.. ముద్దుగా అలా పిలుస్తూ..ఉంటాను..అన్నమాట. "గున్న మామిడి కొమ్మ మీద "పాటలో..కలకూజితం  జానకమ్మ స్వరాన ఆ స్వరాలూ.. ఒకింత విషాదంతో.. మనల్ని.. ఆకట్టుకుంటాయి.. మౌనం గా పాట వినడం కుదరదు..తను గొంతు కలుపుతూ..ఉంటుంది.రెండు స్వరాల మధురిమలు వింటూ..పాటని.. ఆసాంతం ఆస్వాదించాను.

ఎంత చక్కని సాహిత్యం.. ఇద్దరి మిత్రుల ఎడబాటు..ని.". డా.సి .నా.రే.". ఎంత బాగా.. హృదయానికి హత్తుకునేలా వ్రాసారు!!! అప్పట్లో.. ఈ..పాటకి.. వాడ  వాడనా అభినందన మందారమాలలు.. అట.  నా చిన్నప్పటి విషయాలు చెపుతూ.. ఈ విషయం మా అమ్మ చెప్పేవారు. అమ్మ పరిజ్ఞానం కూడా.. రేడియో.. వినడం ద్వారానే మరి. పాటకి పట్టాభిషేకం మా ఇంట్లో..ఎప్పుడూ..ఉంది.  చిన్నారి  స్నేహితుల మద్య కులాల మతాల,ఆర్ధిక పరమైన వ్యత్యాసాలు..వారిని ఎలా విడదీస్తాయో... ఆ పసి మనసుల బాధ ఏమిటో.. ఆ పాటలో.. ఎంత హృద్యంగా ఉంటాయో..కదా!! ఆ పాట తెలియని..వారు ఎవరు ఉండరు..కదా! సత్యం గారి స్వర కల్పనలో.. ఆ పాటకి..ఒక విశేషం ఉంది.. అని నాకు..ఈ మద్యే తెలిసింది.. "పండిట్ హరిప్రసాద్ చౌరాసియా" ..వేణువు.. ఆ పాటలో.. మనలని.. మధుర భావనలో.. ఓలలాడిస్తుంది..అని.. ఆహా.. ఆ.. స్వరం వారిదా ?అనుకుని.. ఇప్పుడు ఇంకా ఇష్టంగా  ఆపాటని వింటున్నాను... 

ఇన్ని మంచి గుణాలున్న ఈ పాటని గుర్తు  చేసుకుంటూ.. . నా నెచ్చెలి "లక్ష్మి" కి  ఈ..పాట .. గుర్తు చేస్తూ.. మా స్నేహవనం లో.. ఇలాటి పాటల పూల పరిమళాలు ఇంకా.. వెధజల్లబడాలని.. మా స్నేహ సుగంధం ఇంకా కాలం కౌగిలి లో.. అరుగుతూ.. సమీర పవనాలుగా.. అందరి ని తాకి తాకి వెళ్లాలని  కోరు కుంటూ.. ఆకాశవాణి.. కడప కేంద్రం  వారికి.. కృతజ్ఞతలతో.. ఎందుకంటే..  ఈ పాట మా ఇద్దరికి.. సంయుక్తంగా ఇష్టం. ఆ పాటల కార్యక్రమమే.. నన్ను తనని కలిపింది.. లైవ్.. ఫోన్ ఇన్  ప్రోగ్రాం..  "అభిరుచి" మమ్మల్ని కలిపింది.. అందుకే.. ఈ కృతజ్ఞతలు... తో.. ఈ స్నేహితుల దిగులైన మాట.. ఆ పాట ..ఈ..పూట.  . గున్న మామిడి కొమ్మ   మీద  (sad)  పాట   .. నా కిష్టమైన నా నెచ్చెలి కోసం.

3 కామెంట్‌లు:

ఆత్రేయ చెప్పారు...

నా చిన్నప్పుడు ఆ సినిమా లో ఆ పాట (పాథోస్) చూసి ఎక్కెక్కి ఏడ్చిన విషయం ఇప్పటికీ గుర్తు.
అందులో చౌరాసియా గారి వేణువు మిళితమై ఉందన్న విషయం మీ టపా ద్వారా తెలిసింది.
మీ స్నేహ సుగంధం నూరేళ్ళు విరజిల్లాలని కోరుకుంటూ -నేను

అజ్ఞాత చెప్పారు...

మంచిపాట. కడప స్టేషన్ విజయవాడ వరకూ వస్తుందాండి? చిన్నప్పుడు ఆదివారం రాత్రి 10గంటల ప్రాంతంలో 'మధురస్మృతులు' లో అనుకుంటా చాలా మంచి పాటలు వేసేవారు. అనంతపురం నుంచి విజయవాడ స్టేషన్ దొరకడం కష్టంగా వుండేది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

snkr ..గారూ.. ధన్యవాములు.. కడప కేంద్రం విజయవాడ చాలా బాగా వినబడుతుంది... నేను.. అభిరుచి,మహిళా భారతి.. కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను.. వింటూ ఉండండి