1, జులై 2011, శుక్రవారం

తరలి రా..జలధరా

ఋతువులు ఆరు. ఆస్వాధన ఉండాలేగాని  ఏ  ఋతువు ప్రత్యేకం ఆ ఋతువుదే.. వసంతం  మోడులపై చిగురులతో.. కొంగ్రొత్త ఆశల తో.. మనసుకి ఆహ్లాదం కల్గించినా, గ్రీష్మం మండించినా, వర్ష రుతువు..  తన చినుకులతో..ఒడలు..పులకరింపజేసినా, శరత్..చల్లని వెన్నెలలో సేద దీర్చినా, హేమంతం.మనని.. ముగ్ధ మనోహర రూపంలో వణికిన్చినా, శిశిరం..పగబూనినా..అన్నీ..మనవే! ఆరు కాలాలో.. మనం  ఒదిగి  పోవలసిందే! 

మానవ వికాసం నడక నేర్చి నడత మార్చి తను కూర్చున్న చెట్టు కొమ్మ తనే నరుక్కున్నట్టు ..ప్రకృతిని నాశనం చేస్తుంటే..ఋతువులు  గతులు తప్పుతాయి. వానచినుకు కోసం అల్లాడుతూ.. ఉన్న తరుణంలో.. వరుణుడిని ఆహ్వానిస్తూ.. దేవుల పల్లి వారు వ్రాసిన గీతాన్ని.. సాహిత్యంతో..సహా పరిచయం చేస్తున్నాను. . 


ఈ పాట ఎవరికైనా తెలుసా.?చెప్పండి ప్లీజ్..అన్న నా వేడుకోలు మన్నించి..(నా బ్లాగ్ ని సందర్శించినప్పుడు యాధృచికంగా  అయినా  ఆ..పోస్ట్ చూసి) .. హైదరాబాద్  నుండి వేణుగోపాల్ గారు.. ఈ..సాహిత్యాన్ని, పాటని నాకు మెయిల్ ద్వారా పంపారు. నాకు ఎంతో ఇష్టమైన సాహిత్యాన్ని పంపిన వారికి హృదయపూర్వక ధన్యవాదములు..తెలుపుకుంటూ ఈ పాటను.. మీ అందరికి  పంచుకుంటున్నాను. పాట  నంబర్  : అయిదు  వద్దనుండి ఈ పాట సాహిత్యం ప్రారంభం.

పాట  వింటూ సాహిత్యం గమనించండి. ఎంత ఘాడత.ఉంటుందో.. ఆ భావం ఎంతగా..మనసుని తాకుతుందో.మనకి..వర్షం ఎలా  వస్తుందో..ఎలా కురుస్తుందో..సాహిత్యంలో.. ఎంత అందంగా..చెప్పారో కవి  గారు.దయ చేసి గమనించండి.పాట అంతా.. వేడుకోలు తో..మొదలై..ఆవేశంతో..సాగుతూ..,  ..వీర రసం..గా ఉత్తేజకరం తో సాగుతుంది. చిత్రం లో..ఆ పాట.. ఎంతో..కీలకం. ఈ.టీవి  చానల్ లో..అప్పుడప్పుడు ప్రసారం అవుతుంటుంది.. నేను కేవలం పాట కోసమే ..మేలుకుని.. చూస్తూ ఉంటాను . ఆ పాటని వినండి.ఇక్కడ.తరలి  రా! జలధరా!! ..కరుణించి కదలి  రా ..  .      





ఈ పాట అన్నదమ్ముల కధ చిత్రం లోనిది. ఎస్.రాజేశ్వార  రావు గారు స్వరాలూ అందించారు. 
  

సకాలం లో వర్షాలు కురిసి.. సమస్త లోకావని..పచ్చగా కళ కళ లాడుతూ..ఉండాలని కోరుకుంటూ.. 

నేను  ఈ బ్లాగ్ లో.. వాడుతున్న చిత్రాలన్నీ.. అందరికి అవగాహన కల్గించేందుకు,ఆహ్లాద పరిచేందుకు.. గూగుల్  వారి సౌజన్యం తో.. వాడట మైనది. దయచేసి గమనించమనవి.   తరలిరా జలధరా . . ఇక్కడ  వినండీ ! మీకు నచ్చితే  తప్పక ..స్పందన తెలియజేస్తారు కదూ!? 

2 కామెంట్‌లు:

rajiv raghav చెప్పారు...

వరుణుడిని ఆహ్హనిస్తూ వ్రాసిన పై పాటలో ఎన్ని అర్దాలు ఉన్నాయండీ,
ఈ రోజు మానవాళి అభివృద్ది పేరిట ప్రకృతిని నాశనం చేస్తున్నప్పటికి అది మనకు నేటికి కూడా మన పొట్ట కొట్టకుండా చూస్తుంది....
కాని అది ఎంతకాలం....... ఇప్పటికైనా మేల్కోనకపోతే ప్రకృతి ఎన్నటికి మానవజాతిని క్షమించదు....
మనము ప్రకృతిని ప్రేమిస్తే, అది మనకు అమృతంను అందిస్తుంది.....
నేటికి నేను మా పొలాలకు వెళ్ళినప్పుడు నాలో ఉన్న చిరాకులన్ని పోయి సేదతీరతాను..... అది భూదేవి యొక్క లాలన మరియు ప్రకృతి యొక్క కరుణ......
ఆ లాలన వేరే ఎక్కడ పొందలేము....... అదే ప్రకృతి యొక్క గొప్పతనం.....
ఈ సం.రం కూడా నాలాంటి రైతులందరిని కరుణించి ప్రకృతి తన ధర్మమును కొనసాగించలని కోరుకుంటున్నాను......

kadanbari చెప్పారు...

ఈ పాట "తరలి రాద తనే వసంతం...."
రుద్రవీణలోని చిరంజీవి పాట కాబోలును- అని
ముందుగా హెడ్డింగు చూసి అనుకున్నాను.
మంచి పాట అందునా దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి రచన;
@1) మల్లీశ్వరి- లో తెల్లని కొంగలు బారులు బారులు...... అవిగో అవిగో...-
ऽ) పాతాళ గంగమ్మ రారారా! ఉరుకురికీ ఉబుకుబికీ రారారా....
ఇవి కూడా మన భావ కవి పాళీనుండి జాలువారిన తేనెజల్లులే, వీని ఛాయలు ఉన్నాయి కదూ!