9, జులై 2011, శనివారం

కలలు కనేందుకు.. కరిగి పోయేందుకు..



అందరికి ఏమో కానీ..నాకు  రోజు ఓ..పాట గురిచి మాట్లాడకపోతే.. ఏదో..వెలితి.. ఈ రోజు అయితే .. 
తెలవారు వేళ కనుమూత పడక  కను ముందు నీ రూపు కనిపించి పోగా.. 
అంటూ.. ఓ..రూపం ఏమి కనబడలేదు కానీ..  ఓ..పాట టక్కున గుర్తుకు వచ్చింది. ఈ మద్య.. ఘోస్ట్ రైటర్స్ ని     పెట్టుకోకుండా  స్వయంగా..వ్రాసుకున్నారు  అని మన బ్లాగ్ లలో.. మధన పడిపోయినప్పుడు  ..ఈ పాట గుర్తుకు వచ్చింది.

ఎందుకంటే  ఈ..పాట నాకు   చాలా ఇష్టం.ఈ పాటకి లిరిక్స్  దాసరి గారు అందించారని..ఉంటుంది. అవునా అని తెగ ఆశ్చర్య పడిపోయే దాన్ని. ఏక కాలంలో..మనుషులు ఎలా..ఇంత గొప్పగా వ్రాయడం..ఇంకా ఏవేవో..చేయడం అని.  నిజాలు కొన్నాళ్ళకి తెలిసిపోయాయి లెండి. బావిలో..కప్పల్లా  ఎప్పుడు ఉండం కదా..! ఈ పాట.."జయసుధ" చిత్రం లో పాట.  జయచంద్రన్..సుశీలమ్మ  కలసి పాడారు. నా ఫేవరేట్ సాంగ్ ఇది.

ఈ సినిమా వచ్చిన కొత్తల్లో కలలు కానీ..కలల్లో  ..రూపాలు..కనిపించే వయసు ఉండేది కాదు కనుక  ఒక వేళ కలలు వచ్చినా.. అబ్బాయిలు వచ్చే వారు కాదు బతికి పోయాను. లేకపోతే  ..నీకు జయసుధ  పిచ్చి,పాటల  పిచ్చి పట్టి  చదువుకోకుండా  .. ఏమిటి అని..మా అమ్మ .. మజ్జిగ కవ్వం తో..కొట్టి ఉండేది.

జయసుధ అంటే పడి చచ్చే దాన్ని కాదు కానీ  ..జయ సుధ గార్ని బాగా దగ్గరగా.. చూసి..ఆవిడ ఆటోగ్రాఫ్  తీసుకుని.. మురిసిపోయాను. ఆవిడ ఓ..సంతకం నాకు ఇచ్చేసి.. పెన్ అక్కడ పడేసి వెంటనే.. సింక్ లో చెయ్యి కడుక్కోవడం..ఇంకా గుర్తు ఉంది నాకు. ఆవిడ   జీవితంలో..ఆ.. ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఊరు..తో ఉన్న సంబంధం ఏమిటో..చెప్పి..ఆమెని చిన్నబరచలేను. కానీ.. అ ఊరు.. నేను..పుట్టినవూరు.  జయ సుధ గారి పై  ..నాకు బోలెడు అభిమానం.(ఇప్పుడు తగ్గిపోయింది లెండి.)  

పాట చెప్పకుండా.. ఏమిటో..ఏదో  ..చేపుతున్నానా? కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని..నాలాటి వాళ్ళని చూసే.. నానుడిగా, వాడుకగా..మారి ఉంటుంది లెండి. నన్ను  ఎవరు అనుకున్న అనుకోక పోయినా..నన్ను నేనే అనుకుని.. నేను యెంత బోల్దో..అనుకోవడం..నా వీపు నేనే తట్టుకుని ప్రోత్శాహించుకోవడం అలవాటు అయిపోయింది. నేను ఇప్పుడు ఎక్కడ  ఉన్నాను అనుకున్నారేమిటి..? బ్లాగ్ లోకంలో.. చాలా నేర్చుకోవచ్చని ఆరు నెలల్లో..తెలిసిపోయిందోచ్!  ఐ యమ్ లక్కీ...కదండీ..?.   

కనురెప్ప పాడింది కను సైగ పాట కనుసైగ పాట. 

తెలవారు వేళ కనుమూత పడగా కనుముందు నీ రూపు కదలాడిపోగా.. ఆ  కనులెందుకు.. ఆ కనులెందుకు  .. కలలు కనేందుకు.. కరిగి పోయేందుకు..     .


వినెయండీ!పాట చాలా బాగుంటుంధి.పాట సాహిత్యానికి.. సినిమాలొ పాట చిత్రీకరణకి పొంతనె ఉండదు.పాట విని విని.. సినిమాని చాలా ఇష్తంగా చూస్తే పరమ చెత్తగా ఉంది అని తెగ బాధ పడిపొయాను.ఏం చెస్తాం?చెవులు మనవే కళ్ళు మనవే అనుకుని..ఫాట పై..అభిమానం అలాగె ఉంచేసుకుని మీ అందరికి..ఈ పరిచయం.kanureppa paadindhi kanusaiga paata

7 కామెంట్‌లు:

Tejaswi చెప్పారు...

ఆమె మొదటి భర్తది నందిగామ అని అందరికీ తెలిసిన విషయమేకదా.

అజ్ఞాత చెప్పారు...

చక్కటి పాట ... నాకు చాల కాలం తరవాత గుర్తు చేసారు ..thnx
రామకృష్ణ

ఆత్రేయ చెప్పారు...

(పాట విని విని.. సినిమాని చాలా ఇష్తంగా చూస్తే పరమ చెత్తగా ఉంది అని తెగ బాధ పడిపొయాను.)
కారణం ఆ పాట రాసినాయనకి, తీసినాయనకీ బరువు లో పాతిక కేజీలు తేడా ఉండటమే !!
అదే చిత్రం లో
గోరువెచ్చని సూరీడమ్మా
పొద్దు పొడుపులో వచ్చాడమ్మా
పాట కూడా బాగుంటుంది !!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Tejaswi garu.. nandhigaama kaadhu. Kuntamukkala. Bhale nenu cheppani vishayam catch chesaaru. Thank you.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Rmakrishna garu Thank you very Much
@ aathreya gaaru..manchi paata gurthu chesaaru.Thank you very much Sir.

Tejaswi చెప్పారు...

ఆయన శోభన్ బాబుగారి చుట్టం అని కూడా గుర్తు. నిజమేనా?

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

ఈ పాట నాకూ ఇష్టమే! ఇన్నాళ్ళూ ఇది నాకు దాసరి గారు రాసినపాటగానే తెలుసు. మరెవరు రాశారు ఈ పాటని?