4, ఫిబ్రవరి 2012, శనివారం

కలవని స్నేహమా! మరణం సత్యమా?

కాలం   బహు చిత్రమైనది. 
ఎవరిని ఎప్పుడు కలుపుతుందో .. ఎప్పుడు ఎందుకు   విడదీస్తుందో.. అంతా అదో అంతు తెలియని నిగూడ రహస్యం 
ఓ.. ఇద్దరి మనసుల మధ్య స్నేహాన్ని చిగురింపజేసి ఆలోచనలని ఆత్మీయతని కలబోసుకునుని ఎన్నటికి   వీడని చెలిమి బలిమితో ముందుకు సాగాలనుకుంటారు. కానీ ఎందుకో  హటాత్తుగా  దారులు వేరవుతాయి   ఆ చెలిమి చేయి జారుతుంది. చేజారిన చెలిమి కై  జీవితాంతం వెతుక్కుంటూనే ఉంటారు. తాము వెతుకుతున్న చిన్న నాటి స్నేహం చేరువైతే..ఆ ఆనందం చెప్పనలవి గాదు.

అందుకే ..ఎవరైనా  స్నేహితులు ఎవరైనా వారు మిస్ అయిన స్నేహితుల గురించి చెపుతుంటే.. వారిని వెదకడాని   నేను సహాయం చేస్తుంటాను. ఆ స్నేహితులు కలుసుకున్న     అపురూప క్షణాలని కళ్ళ చెమరింపల మధ్య,హృదయ ద్రవిన్పుల మధ్య ఆనందంగా వీక్షిస్తాను . 

"కొప్పర్తి" గారు ప్రస్తుతం ఆంద్ర ప్రదేశంలో ప్రముఖంగా పేర్కొన్న   దగ్గ  పది మంది కవులలో ఒకరు . వారిని నేను రెండు మూడు సభలలో చూడటం..వారి ప్రసంగాన్ని శ్రద్దగా వింటూ చాలా నెలల పాటు మననం చేసుకుంటూ కవిత్వంని మరింతగా  లోతులు గా చూడటం నేర్చుకుంటున్నాను . 2010 డిసెంబెర్ నెలలో జరిగిన 'తానా" కవిత్వం  పోటీలను "మా ఎక్సరే  సాహితీ సంస్థ నిర్వహించినప్పుడు నేను  ఆ   కవిత్వం ప్రోగ్రాం ని నిర్వహించాను. అప్పుడు "కొప్పర్తి" గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.అప్పటి పరిచయంలో.. మాటల్లో మా వూరి ప్రస్తావన వచ్చింది. మాది పోరంకి .. వూరు ఆనగానే కొప్పర్తి   గారి కళ్ళల్లో  లో ఓ.. సంతోష వీచిక కదలాడటం చూసాను. వెంటనే.. నాకు   పోరంకి లో  ఒక స్నేహితుడు ఉండాలి. అతని అడ్రస్స్ కొంచెం   కనుక్కుని   చెప్పమని వివరాలు అందించారు. నేను వారు ఇచ్చిన వివరాలు ప్రకారం రెండు మూడు సార్లు వెతికి   చూసాను. కానీ సఫలం కాలేక పోయాను.

అదే విషయం ని మళ్ళీ కొప్పర్తి   గారు..ఓ..సభలో కలసి   అడిగే వరకు నేను వారి స్నేహితుడి చిరునామా కనుక్కుని ఇవ్వలేకపోయాను . నిజానికి నేను కనుక్కోలేకపోయాను   అని చెప్పడానికి కూడా  సిగ్గు పడ్డాను.  
మొన్నీ మధ్య డిసెంబర్ 25 న మళ్ళీ వారు మా ఎక్సరే అవార్డ్ల పంక్షన్ కలసినప్పుడు .. నాకు  వారి స్నేహితుల గురించి మరింత వివరాలు అందించారు. నేను వెంటనే ఒక   పేపర్ పై వ్రాసుకుని నా హాండ్ బాగ్ లో భద్ర పరచుకున్నాను. 

తెల్లవారి మళ్ళీ కొప్పర్తి   గారి నుండి పోన్ వచ్చింది. మర్చి పోకుండా వారి స్నేహితుల వివరాలు అడిగి చెప్పమని రిక్వెస్ట్ చేయడం వల్ల వారు ఎంతగా తన స్నేహితుని కోసం పరితపిస్తున్నారో..అర్ధం అయింది.వెంటనే..నేను నా ల్యాండ్ లైన్  ముందు కూర్చుని అరగంట లోపునే వారి స్నేహితుని వివరాలు కనుక్కున్నాను. ఎక్కడో చిన్న ఆచూకి దొరికింది. అలా రోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఒక స్నేహితునికి తన స్నేహితుని చిరునామా తెలిసి మాట్లాడటం అనే మహత్తర క్షణం కోసం నేను ఎదురు చూసాను. కానీ..ఓ..నాలుగు రోజులకి చిరునామా దొరికింది  మాకు సమీపంలోనే వారు ఉన్నట్లు తెలుసుకుని     కొప్పర్తి గారి స్నేహితుడి  ఇంటికి .. నేను కొన్ని   నిమిషాలలోనే నా తూనీగ పై..  తూనీగ కన్నా ఆనందంగా పరుగులు తీశాను. ఇద్దరి మిత్రుల కలయిక   కళ్ళారా చూడాలనుకున్నాను.

అక్కడికి వెళ్ళగానే నాకు తెలిసిన విషయం చాలా బాధ కల్గించింది.  ఎప్పుడో..బాల్యంలో వీడిన ఆ చెలిమి హస్తం తిరిగి కలవకుండా విధి విడదీసింది అని నాకు   తెలియగానే నేను నిస్సత్తువుగా  కూలబడి పోయాను.అసలు జరిగినది ఏమంటే ..  కొప్పర్తి గారి స్నేహితుడు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మరణించారని చెప్పారు. నాకు  కల్గిన ఆశానిఘాతం కి నేను తేరుకోలేక పోయాను. ఈ విషయం కొప్పర్తి గారీకి  చెప్పాలా వద్దా ..అని ఆలోచించాను.  ఆరోజు జనవరి 1 వ తేది ఆ విషయం చెప్పి వారిని బాధ పెట్టడం ఇష్టం లేక   ఊరుకున్నాను. నేను అసలు విషయం చెప్పడం వల్ల కొప్పర్తి గారు ఎంత బాధపడతారో..నాకు తెలుసు. వారి ఇరువురి స్నేహంపట్ల.. కోవేలకుంట్లలో .. వారు గడిపిన బాల్యం,విజయవాడలో..వాళ్ళ కాలేజి   కబుర్లు కొప్పర్తి    గారి మది పుటల్లో..యెంత గాధంగా ముద్రించుకుని ఉన్నాయో,వారి స్నేహం యెంత గొప్పదో.. వారి చెపుతుంటే విని.. కూడా వారికి  ఈ విషయం చెప్పడం భావ్యం కాదేమో అని నెల్లాళ్లుగా ఆలోచిస్తూనే ఉన్నాను.

కొప్పర్తి గారి మనసులో వారి స్నేహితుడిని బ్రతికి   ఉంచి.. ఎక్కడో  ..ఆచూకి   తెలియని మిత్రుడిలా ఉన్చేయాలని అనుకున్నాను. మరలా నా నిర్లక్ష్యం  వల్లనో లేదా ఎదుటి మనిషి కి చిన్నపాటి సహాయం చేయని మనిషిగా నేను మిగిలిపోవడం మంచిదా అని ఆలోచిస్తున్నాను.  ఈ రోజు కాకపోయినా   ఎప్పుడైనా కొప్పర్తి గారికి విషయం చెప్పడం మంచిదా లేదా..అని ఆలోచిస్తూనే ...

 ఇన్నాళ్ళకి ఈ రోజు నేను  కొప్పర్తి గారికి  మిత్రుడి మరణం తాలూకు  సమాచారాన్ని అందించి.. ఆ నాటి చెలిమి ఒక కలలా ముగిసిపోయింది మిత్రమా.. మరల కలవలేని ఆ చెలిమి..నాలో..ఇంత విషాదాన్ని నింపింది అని అనిపించేలా   వారికి ఈ రోజు తెలియ పరుస్తూ ఉన్నందుకు బాధగాను,బరువుగాను  కూడా ఉంది.  ఆ  మిత్రుడి ఆశల వల ఖాళీగానే మిగిలిపోయింది. కలల అల స్నేహ తీరం ని తాక  కుండానే సముద్ర గర్భంలోనే నిశ్చలంగా ఉండిపోయింది    

జీవన మార్గంలో దారులు వేరైనప్పుడే కాదు మృత్యువు కూడా చెలిమిని విడదీస్తుంది.    " ఒక శాశ్వతమైన వాక్యం కోసం జీవించినంత కాలం వ్రాస్తూనే ఉండాలి"అన్నది కొప్పర్తి గారి  మాట.   అది "స్నేహం  కోసం పరితపిస్తూ ఉండటం కూడా నేమో! 

స్నేహమా!మరణంలో కూడా  నీ నీడగా  నేను లేకుండా చూసుకున్నావా ? నన్ను నీ జ్ఞాపకాలతో జీవించి మరణించమని. ..  అంటుందేమో.. నిజమైన స్నేహం. 
కలవని స్నేహమా! మరణం సత్యమా?   మిత్రుని మరణాన్ని చేరవేసినందుకు   క్షమాపణలతో ..  ఈ   పోస్ట్.      
             

9 కామెంట్‌లు:

జ్యోతిర్మయి చెప్పారు...

వనజ గారూ..చదవగానే చాలా బాధ కలిగింది. పాపం వారెలా తీసుకున్నారో.
మీ కలాన్నిఅనుభూతి సిరాతో నింపేసి వ్రాస్తున్నారు, అందుకే ఏ భావమైనా చక్కగా రూపు దిద్దుకుంటోంది.

అజ్ఞాత చెప్పారు...

So touching andi.. Sneham annadi oka uthkrushtamaina human emotion.

సుభ/subha చెప్పారు...

చివరి వాఖ్యాలతో మనసు మరీ మూగపోయిందండీ!!

Padmarpita చెప్పారు...

"స్నేహమా!మరణంలో కూడా నీ నీడగా నేను లేకుండా చూసుకున్నావా ? నన్ను నీ జ్ఞాపకాలతో జీవించి మరణించమని అంటుందేమో.. నిజమైన స్నేహం" చాలా బాగారాసారు.

కాయల నాగేంద్ర చెప్పారు...

'కొప్పర్తి' గారు తన స్నేహితుడి కోసం పరితపించడం, స్నేహం విలువ తెలిసిన మీరు ఆ స్నేహితులను కలపాలనే తపన, కృషి అభినందనీయం.'కొప్పర్తి' గారి స్నేహితుడు మరణించడంతో మీ ఆశయం
నెరవేరనందుకు బాధగా వుంది.

రసజ్ఞ చెప్పారు...

ఇద్దరు స్నేహితులని కలపడం ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలుసు. చాలా బాధాకరంగా ఉంది, మనసు బరువెక్కింది, కళ్ళలో నీటి పొర నిండింది!

buddhamurali చెప్పారు...

kadilinchindi

CS చెప్పారు...

meeku ela kruthaznathalu thelyacheyalo theliyadam ledu!!! meeru cheravesina nijam ninna sayanthram naa daggariki sms roopamlo chinna sabdam tho cherindi!!
Ratharantha znapakalani nemaruvesukuntu idi nijam kakudadu anukuntu eroju madhyahnam ramanki (kopparthiki) phone chesanu. Kani idi nijjanga nijam ani cheppadamtho , 33 yella tharuvatha vinna ee matalu nijjanga kadhilinchi vesayai!!!
Idi naku jeevithamulo rendo anubhavamu!! Maa engineering mitrudu kosamu manshini pampisthe, 6 savansthrala kritham chanipoyadanna vartha thelisindi!! Ippudu meeru cheravesinia ee nilakadamida nijam rendodi!!!
Nenu aaa mithrthrayam lo moodo manshini!! –Ramana(kopparthy),Chinni babu,Sekhar.
Meeru enchikunna mee pathra sada (mimmalni) jeevithamulo santhoshnga vuchalsini ashisthu.... Sekhar

జయ చెప్పారు...

తెలుసుకున్న వారి కన్న, తెలియ చెప్పిన మీ వేదన నిజంగా భరించలేనిది. ఇదేనేమో, జీవితమంటే...