3, ఆగస్టు 2012, శుక్రవారం

నిరీక్షణ




నిరీక్షణ


స్వప్నసౌధాల వాకిట్లో నిలబడి..
నీతో కలసి నడవడమే లక్ష్యంగా ఎంచుకుని
నీ
కోసమే నిరీక్షణ ..

నీవు
మాత్రం నీవు-నేను మరచి..
మనమందరం
అనే సమాజం కోసం
వేయి
శిశిరాలతో పోరాడి
ఒక
వసంతం కోసం నిరీక్షించే ఆశావాదివి.

ప్రియతమా
..!
నిజంగా.. నువ్వు రావని నాకు తెలుసు..
అయినా
.. నీ కోసమే..నిరీక్షణ.

ఆరాటాల
పోరాటాల జీవన గమనంలో
మన
ఇద్దరం ఒకే లక్ష్యం కోసం
సమాంతరంగా
పయనించే బాటసారులం
గమ్యంలోనైనా
.. కలవకపోతామా !.
అని.. నిరీక్షణ.

నీ
.. జ్ఞాపకాల అంతఃపురంలో బందీనై
ఆశ
-నిరాశ సరిహద్దురేఖపై నిలబడి
రోజూ
.. రేపు నీ కోసమే అనుకుంటూ ..
చూసే
మధురమైన నిరీక్షణ .

ప్రేమంటే
.. క్షణికమైన మోహం  కాదని ..
ప్రేమంటే
ఎడతెగని నిరీక్షణ అని ఎందరికి తెలుసు ..

నిరీక్షణలో అలసి-సొలసి ..
నా
.. బ్రతుకు ..నీ లిఖితకావ్యం
అన్న
నమ్మకంతో
దిగంతాల అంచులలోనైనా ..
మనం
కలుస్తామనే .. నిరీక్షణ.
ఇదీ
.. దివారాత్రాల నిరీక్షణ.

( కరీంనగర్ వారి శరత్ సాహితీ సంకలనంలో ..పోటీ కవిత)

17 కామెంట్‌లు:

సీత చెప్పారు...

వనజ గారు
కవిత చాలా బాగుంది..హృద్యం గా..!

Sai చెప్పారు...

చాలా బాగా రాసారండీ... బాగుంది

అజ్ఞాత చెప్పారు...

wonderful

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

నీ .. జ్ఞాపకాల అంతఃపురంలో బంధీనై
ఆశ -నిరాశ సరిహద్దురేఖపై నిలబడి
పై వాక్య ప్రయోగం బాగుంది.నిరీక్షణలో మధురమైన ప్రేమ మరింత పెరుగుతూ పోతుంది.ప్రేమ ఎప్పటికైనా ఫలిస్తుంది అన్న మీ కవితా నిరీక్షణ చాలా బాగుంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"సమాంతరంగా పయనించే బాటసారులం
గమ్యంలోనైనా .. కలవకపోతామా !"

ఆకాంక్షలతో నిరీక్షణ
చాలా బాగుందండీ "ఓ..కవిత"..

భాస్కర్ కె చెప్పారు...

చక్కగా రాశారండి, పోటీలో విజయం సాధించాలని కోరుకుంటున్నామండి.

Mamtha Naidu చెప్పారు...

Aunty kavitha chala bagundi mere rasara??

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సీత గారు.."నిరీక్షణ " నచ్చినందుకు ధన్యవాదములు.
@సాయి గారు..థాంక్ యు వేరి మచ్!!
@ కష్టేఫలె ..గారు.. మీ ప్రశంసకి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఒద్దుల రవి శేఖర్ గారు.. కవిత లోని సారాంశాన్ని క్యాచ్ చేసారు. ధన్యవాదములు.
నా కవితలలో నాకు చాలా ఇష్టమైన కవిత అండీ ఇది.
@ రాజీ గారు బాగున్నారా? నిరీక్షణ నచ్చినందుకు ధన్యవాదములు.
@ ట్రీ భాస్కర్ గారు.. ఈ కవిత ఓ..ఆరేళ్ళ నాటిది. సంకలనం లో ప్రచురితమైనదండీ!
బహుమతి అయితే రాలేదు కాని.. ఇదిగో..ఇలా మీ అందరి ప్రశంసలే నాకు విలువైన బహుమతి.
నిజానికి ఈ కవిత నేను బ్లాగ్ మొదలెట్టినప్పుడు పోస్ట్ చేసాను అప్పుడు అందరికి పరిచయం కాలేదు. అందుకే ఇప్పుడు రీషేర్ చేసాను. ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మమత నాయుడు .. చాలా సంతోషం. నా బ్లాగ్ visit చేసినందుకు అలాగే కవిత నచ్చినందుకు.
ఈ కవిత నేను వ్రాసినదే.. దాదాపు ఓ..పదేళ్ళ క్రిందట వ్రాసాను.
ఉద్యమ ప్రభావంతో.. ప్రేమించిన ప్రియురాలిని వదిలి.ప్రేమికుడు ఉద్యమం వైపు వెళతాడు.
అతని రాక కోసం ఆమె నిరీక్షణ.
ఆ నిరీక్షణ నెరవేరుతుందో లేదో..తెలియదు. కానీ ఆమె దివారాత్రాలు అతని కోసం నిరీక్షిస్తూనే ఉంటుంది.
మీ బ్లాగ్ చూసాను.చాలా బాగుంది.
మమత..థాంక్ యు వెరీ మచ్.. ..

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

>>ప్రేమంటే .. క్షణికమైన మొహం కాదని ..
ప్రేమంటే ఎడతెగని నిరీక్షణ అని ఎందరికి తెలుసు ..<<

సూపర్...నిజంగా చాలా నచ్చింది మీ కవిత...చాలా బాగా వ్రాశారు వనజా గారు... అభినందనలు!

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలాబాగుందండీ..

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

" ప్రేమంటే .. క్షణికమైన మొహం కాదని ..
ప్రేమంటే ఎడతెగని నిరీక్షణ అని ఎందరికి తెలుసు .."

నిర్మలమైన ప్రేమ - నిబధ్ధమైన నిరీక్షణ
పటుత్వమైన పదబంధాలతో
పరవశింప జేసే కవిత .....
----- సుజన-సృజన

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నిరంతరమూ వసంతమూ.. సురేష్ గారు నిరీక్షణ నచ్చినందుకు ధన్యవాదములు.
@ వేణు శ్రీకాంత్ గారు.. ధన్యవాదములు.
@వెంకట రాజారావు లక్కాకుల గారు..ప్రేమలోని నిస్వార్దాన్ని,గొప్పదనం రెండింటిని ప్రశంసిస్తూ మీరు పంపిన వ్యాఖ్యకి ధన్యవాదములు.

శ్రీ చెప్పారు...

నీ .. జ్ఞాపకాల అంతఃపురంలో బంధీనై
ఆశ -నిరాశ సరిహద్దురేఖపై నిలబడి
రోజూ .. రేపు నీ కోసమే అనుకుంటూ ..
చూసే మధురమైన నిరీక్షణ .
చాలా చక్కని భావం వనజ గారూ!
అభినందనలు...
@శ్రీ

హితైషి చెప్పారు...

మీ ఎడతెగని నిరీక్షణ చాలా బాగుంది. బహుశా ఇది నెరవేరని నిరీక్షణ లా ఉంది. అద్భుతంగా వ్రాసారు.అభినందనలు వనజ గారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీనివాస్ గారు.. కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
హితైషి.. మీకు నిరీక్షణ నచ్చిందా!? థాంక్ యూ!!!