15, ఆగస్టు 2012, బుధవారం

వాన వెలిశాక...


వాన వెలిశాక...
నిర్మలాకాశం 
ద్వంసమైన  తోట...  మాత్రమే కాదు.. 

వాన వెలిశాక 
నేలని కడిగినట్లు 
చేట్టుచేమ తానాలాడినట్టు 

వాన వెలిశాక.. 
రంగులన్నీ కరిగి పోయినట్లు 
ఇంద్రచాపమై మిగిలినట్లు 

వాన వెలిశాక 
నీటిముత్యాలు
జారుడు బల్లాట లో జారినట్లు 

వాన వెలిశాక ..
 పూలు బరువుగా వాలినట్టు 
పండ్లు పగలబడి నవ్వినట్లు.. 

వాన వెలిశాక 
నేనేమో..
తడిసిన బట్టలు ఆరేసుకుంటూ..
కురులు ఆరబెట్టుకుంటూ... 

4 కామెంట్‌లు:

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

వావ్ ఎంత అందంగా ఉన్నాయో!వానకు తడిసిన ఆ పుష్పాల సోయగం మీరు వర్ణించిన తీరు.అన్నీ కలిసి మేము వానలో తడిసినట్లుంది.

శ్రీ చెప్పారు...

వాన వెలిసాక...
మీ కవిత చదివాక
అనుభూతి ఒకటే...:-)
చక్కగా ఉంది...చిత్రాలు బాగున్నాయి...
వనజ గారూ!
ఆఖరి వాక్యాలవి ఫోటోలు లేవు...:-))>>(just kidding)
అభినందనలు..
@శ్రీ

nsmurty చెప్పారు...

వనజగారూ
కవితతో పాటు, బొమ్మలు కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇందులో కొన్ని ఎప్పుడైనా నా బ్లాగులో వాడుకోడానికి అనుమతి ఇవ్వండి.
అభినందనలతో.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఒద్దుల రవిశేఖర్ గారు.. కవిత,చిత్రాలు నచ్చినందుకు ధన్యవాదములు.
@శ్రీ గారు.. కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
@nsmurty గారు వానవెలిసాక కవిత,చిత్రాలు నచ్చినందుకు ధన్యవాదములు. ఈ పోస్ట్ లో పొందుపరచిన చిత్రాలు మీరు నిరభ్యంతరముగా వాడుకోవచ్చును. కొంచెం ఆలస్యంగా రిప్లై ఇచ్చాను. మన్నించండి.