కరంట్ బిల్ కట్టడానికి వెళ్లాను. బిల్ డబ్బులు ఇచ్చి నాకు తిరిగి రావాల్సిన డెబ్బయి రూపాయలు కోసం చూస్తున్నాను.
ఏమిటి మేడం !? అన్నాడు అతను
చేంజ్ రావాలి కదండీ ..అన్నాను నేను. అవి దసరా మామూలు క్రింద వేసుకున్నాం ..అన్నాడు.
అదేమిటి.. మీకు కూడా "దసరా మాములా?" ఆశ్చర్యంగా ..అన్నాను.
మాకు కాంట్రాక్టర్ లు బిల్లుకి ఒక రూపాయి ఇస్తారు.అవేం సరి పోతాయండీ! అందుకే అడుగుతుంటాం అన్నాడు.
మాట్లాడ లేక వదిలేసుకుని వచ్చేసాను. నా దగ్గరే కాదు..అందరి దగ్గర డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు.
దసరా.. అంటేనే..సరదా పండుగ అనుకుంటాం కదా!
ఇప్పుడు సరదా ఏమో కాని... ఎవరు పలకరించినా ..గుండె గుభేల్ మంటుంది.
పేపర్ బాయ్ దగ్గర నుండి.. పని చేసేవాళ్ళు , బట్టలు ఉతికే ఆమె, పోస్ట్ మేన్ , టెలిపోన్ లైన్ మేన్ , గ్యాస్ డెలివరీ అబ్బాయి,వీధులు శుభ్రం చేసేవాళ్ళు, మురుగు కాలువలు శుభ్రం చేసే వాళ్ళు,నైట్ వాచ్ మెన్,ఇస్త్రీ వాడు,ఇంకా కరంట్ రీడింగ్ తీసుకువేల్లెవాడు,బిల్ కట్టించుకునే వాడు, నెట్ బిల్ కట్టించుకునే వాడు , వీధి కుళాయికి నీళ్ళు వదిలే వాడు..
అమ్మయ్య.. ఇంతటితో..పూర్తయ్యారు. అందరికి దసరా మామూలు సమర్పించాము.(మనసులో తిట్టుకుంటూనే)
వారి సేవలకి వారు ఎలాగు జీత భత్యాలు పుచ్చుకుంటూనే ఉంటారు. అయినా మనకి సొంత పనులు చేసినట్లు ఫీల్ అయి పోతారు.
ఏదోలే..సంవత్సరానికి ఒకసారి అడుగుతుంటారు. వాళ్లకి ఇచ్చినంతనే.మనకి ఉన్నది తరిగిపోదు. మీ ఆడవాళ్ళు ఒక చీర కొన్న విలువ కంటే తక్కువ ..అంటారు మగవారు.
ఒక మాదిరి ఆదాయం ఉన్నవారికి అయితే పర్లేదు.
మధ్య తరగతి కుటుంబానికి మాత్రం.. ఈ దసరా..మాముళ్లు పీక్కు తినేవే! .సామాన్య మానవుడికి నిత్యావసరాలు తీరడమే కష్టం అయిపోయి.. పస్తులు ఉండటమో..పచ్చడి మెతుకులు తినడమో..మామూలు అయిపోతే..ఈ మాముళ్ళు పీడ తగులుకుని..మొహం చాటేసుకుని..బ్రతకాల్సి వస్తుంది...అంది.. మా ప్రక్క ఇంటి పద్మ గారు.
పేరుకి పాతిక వేలు సంపాదిస్తున్నా.. నెలాఖరికి సరుకులు నిండుకుంటే తెచ్చుకోవాదానికి పైస్సా ఉండదు. ఒకటవ తారీఖు కోసం ఎదురు చూడాల్సిందే! ఇంకెక్కడా దసరా..మామూళ్ళు ఇస్తాం. ఇవ్వమని ముఖం మీదే చెప్పేస్తున్నాను. అంది. ఇంకో ప్రక్కింటి ఆమె.
పండగంటే .. పిండివంటలతో విందు భోజనం చేయడం కాదు.పస్తులు ఉండకుండా..ఉంటె చాలనుకోవాలి
కరంట్ లేదు, శుభ్రమైన మంచి నీరు లేదు. పారిశుద్ధ్యం లేదు. అన్ని ప్రత్యామ్నాయం అయిపోయి. వేరే వాటి కోసం వెదుక్కోవాల్సి వస్తుంది.. అన్నింటిని మించి రోగాల బారిన పడి వేలకి వేలు హాస్పిటల్స్ కి పోయకుండా ఉంటె చాలు అన్నాను నేను. ఎందుకంటే..ఒక నెల క్రితం హాస్పిటల్ బిల్ భారీగా చెల్లించి చేతులు కాలి ఉన్నాను. మళ్ళీ ఈ నెలలో అనుకోని ఈ దసరా మాముళ్ళ ఖర్చులోకటి తప్పని సరి ఖర్చులు ..జాబితాలో.. ఇవి చేరినాయి.
ప్చ్.. ఏం చేద్దాం..? దసరా మాముళ్ళండీ !
మధ్య తరగతి మంద హాసాలు ఇవి.
4 కామెంట్‌లు:
Madyataragathiki inkaa enni maamoollo , idi maamoole, vanajaa manchi post.
బాగుంది వనజ గారూ!...
బ్లాగర్స్ కూడా అడుగుతున్నాము...
మీ బ్లాగ్ రెగ్యులర్ గా చదివే వారికి...
మరో మంచి పోస్ట్ అదనంగా మామూలు రూపంలో ఇవ్వాలి.
దసరా మామూలు ...:-)....@శ్రీ
అన్నింటికీ బలిపశువులుగా మారేది మధ్యతరగతివారే..
నిజం చెప్పారు..
నిజమేనండీ దసరాకి 15 రఒజుల ముందే మొదలయ్యింది మా ఇంట్లో దసరా మామూళ్ళ సందడి :)
గ్యాస్ సిలిండర్ అబ్బాయితో మొదలుపెట్టి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి