26, అక్టోబర్ 2012, శుక్రవారం

ప్రయాణం అంటూ ..



ప్రయాణం అంటూ

గాయపడని మనసు
వేటు పడని  మాను
లేకుంటే..
చింతకి చిగురాశకు తావెక్కడ !?


కరదీపం లాంటి స్నేహం తోడుంటే..
రాళ్ళు ఉంటేనేం,ముళ్ళు ఉంటేనేం!


అలసిన మనసుకు
తీరని ఆశకు ...
తీరం చేరలేని నావకు
తప్పని కల్లోల పయనం

ప్రయాణం అంటూ మొదలయ్యాక
చేరాల్సిన గమ్యం 
దూరమైతేనేం..దగ్గరైతేనేం?
కొనసాగించాల్సిందే కదా!

8 కామెంట్‌లు:

Anita చెప్పారు...

chaalaaa baagundi Vanaja

Anita చెప్పారు...

chaala baagundi

అజ్ఞాత చెప్పారు...

మొదలయినది ముగింపుకురాక తప్పదు

Padmarpita చెప్పారు...

అలా సాగిపోతుంటేనే విజయాలు మన వెన్నటి వస్తాయండి. బాగుంది!

పల్లా కొండల రావు చెప్పారు...

విజమనేది గమ్యం కాదు! అదొక నిరంతర ప్రయాణం!!

శ్రీ చెప్పారు...

ప్రయాణం అంటూ మొదలయ్యాక
చేరాల్సిన గమ్యం
దూరమైతేనేం..దగ్గరైతేనేం?
కొనసాగించాల్సిందే కదా!....
chala baagaa vraasaaru vanaja gaaroo!...@sri

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అనిత గారు.. మీ ప్రశంసకు సంతోషం. ధన్యవాదములు.

@ కష్టేఫలె మాస్టారు.. ముగింపు రాక తప్పదు. నిజమండీ! ధన్యవాదములు.

@పద్మార్పిత.. మీరు ఎన్నో మంచి కవితలు అలఓకగా అల్లేస్తారు .. మీకు నచ్చింది అంటే.. విశేషమే! థాంక్ యు వెరీమచ్ .

@ గమ్యం కాదు నిరంతర ప్రయాణమే! అవునండీ..గమ్యం చేరుకున్నాక ప్రయాణం ఉంటుంది కదా!.. మీ అభిప్రాయం బాగుంది. స్పందనకి ధన్యవాదములు.

@ శ్రీ గారు.. అలా.. ఆక్షణం లో మెదిలింది. మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

శశి కళ చెప్పారు...

చేరాల్సిన గమ్యం
దూరమైతేనేం..దగ్గరైతేనేం?
కొనసాగించాల్సిందే కదా!>>> అవును వెళ్ళాల్సిందే.