15, అక్టోబర్ 2012, సోమవారం

ఆశలు వేరైనా...

నీ కొడుకు కి  అన్నీ నీ బుద్దులే వచ్చాయి..అన్నారు మా వారు.

పొగిడారో.. తెగిడారో .. నాకు అర్ధం కాలేదు. మాట్లాడినది పోన్ లైన్ లో కాబట్టి.. ఫేస్ రీడింగ్ చూసి తెలుసుకునే అవకాశం లేకపోయింది.

నాలుగు రోజుల క్రితం "కష్టేఫలే" మాస్టారు..పోలిక గురించి ఒక పోస్ట్ వ్రాసారు. నాకు వెంటనే అది గుర్తుకు వచ్చింది. పోలిక మంచిదా..చెడ్డదా..అని విశ్లేషించుకుంటూ..నా బిడ్డ ముచ్చట్లు. కొన్ని.

 నా సంగతి ఏమో కాని మా అబ్బాయి మాత్రం చాలా సుతిమెత్తని హృదయం కలవాడు. ఒకసారి మేము ఇద్దరం బ్యాంకు కి వెళ్లి వస్తున్నాం. ఒక చిన్న పిల్లాడు దాదాపు ఆరు ఏడు ఏళ్ళు ఉంటాయేమో.. సైకిల్  నేర్చుకుంటూ.. తనకన్నా ఎత్తుగా ఉన్న సైకిల్ ని హ్యాండిల్ చేయలేక క్రిందకి పడిపోయాడు.. అతని పై సైకిల్ పడిపోయింది. రోడ్డు పై వెళుతున్న అందరు ఆ దృశ్యం చూస్తూనే ఉన్నారు. మా అబ్బాయి వెంటనే తన బండి ఆపి నన్ను హడావిడిగా  దిగమని  బండి స్టాండ్ వేసి ఆ అబ్బాయి దగ్గరకి పరుగుపెట్టి వెళ్ళాడు ఆ సైకిల్ ని లేపి ప్రక్కన పెట్టి ఆ పిల్లాడిని లేపి ప్రక్కన కూర్చోపెట్టి  దెబ్బలు ఏమైనా తగిలాయేమో  అని చూసి..  అలా రోడ్డుపైకి రాకూడదని,జాగ్రత్తగా నేర్చుకోమని సలహాలు చెప్పి  వచ్చాడు.

ఏం నాన్నా! ..ఇంతమంది వెళుతున్నారు కదా.. ఎవరు ఆగలేదు .నువ్వు ఎందుకమ్మా ..అలా పరుగులు పెట్టావ్? అన్నాను.

అమ్మా.! ఆ సైకిల్ బరువు ఎంత ఉంటుందో. నాకు తెలుసమ్మా.. చిన్నప్పుడు అలాంటి సైకిల్ నేర్చుకోవడానికి ఆ వయసులో ఎన్ని సార్లు క్రింద పడిపోయానో.. ఎన్ని దెబ్బలు తగిలాయో..నాకు గుర్తు ఉంది  అని  చెప్పాడు .

నాకు వెంటనే అప్పటి విషయాలు గుర్తుకు వచ్చాయి. ఏడేళ్ళ వయసు అప్పుడు  బరువు ఎక్కువగాకల బి.ఎస్.ఏ సైకిల్ వేసుకుని  మా  నివాస స్థలం నుండి   మూడు కిలోమీటర్లు ఆ సైకిల్ తోక్కుకుని వెళ్లి  పరిచయస్తుల ఇంటిలో ఆ  సైకిల్  ఉంచి..అక్కడి నుండి స్కూల్  బస్ ఎక్కి నెల్లూరు స్కూల్ కి వెళ్ళేవాడు. నా బిడ్డకి ఎప్పుడు కష్టమే! అని బాబు వాళ్ళ నానమ్మ..కూడా ఈ విషయం తల్చుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు . అలా ఒక సంవత్సరం గడిచాక ..ఇలా స్కూల్ కి పంపడం కష్టంగా ఉంది కాని.. తిరుపతి దగ్గర మోహన్ బాబు స్కూల్లో జాయిన్  చేద్దాం,,ఆన్నారు
ఇంట్లో మగవాళ్ళు అందరు.

హాస్టల్  లో .ఉంచడమే..అందుకు నేను ఒప్పుకోను.. కుదరదు అంటే కుదరదు..అని  తీర్మానం చేసేసాను. తర్వాత బాబుకి సౌకర్యంగా స్కూల్కి వెళ్ళే విధంగా మేమే మారిపోయాం అనుకోండి.తర్వాత తన చదువులు అన్నీ పట్టణ పరిధిలోనే పూర్తి చేసుకున్నాడు.

వి.ఆర్ ఎస్.ఈ లో చదివేటప్పుడు.. మధ్యాహ్నం లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్ళేవాడు కాదు. అందరు పిల్లలు అంతే అనుకోండి.  వీలైనంత స్టయిలిష్ గా తయారయి మొబైల్,బైక్  లేనిదే ఇల్లు కదిలి కాలేజ్ కి వెళ్ళని రోజుల్లో కూడా మా అబ్బాయిని చాలా సైలెంట్గా వాచ్ చేస్తూ ఉండేదాన్ని. ఎక్కువగా పాకెట్ మనీ ఇవ్వడం ఉండేది కాదు. రోజుకి ఫిఫ్టీ రూపీస్. అంతే.. ఓ..థర్టీ రూపిస్ పెట్రోల్  కి మిగతా..ట్వంటీ క్యాంటీన్ కి వెళ్ళే ఖర్చులకి. అంతే!

అమ్మా..మనీ ఇవ్వమ్మా ..అంటే..వెంటనే ఎందుకమ్మా..అని అడిగేదాన్ని. ఎందుకు అని అడగకుండా ఇవ్వవా?చిరాకు పుట్టిస్తావ్..అని విసుక్కునేవాడు. అడిగినప్పుడల్లా.. డబ్బు ఇస్తే..అదుపు తప్పి పోతారని నా భయం కూడా.

నేను పనిలో ఉన్నాను కదా.. నువ్వు తీసుకో..అంటే.. బీరువాలో ఎంత డబ్బు ఉన్నా కూడా.. నేను ఎంత ఇస్తానో అంతే తీసుకునేవాడు తప్ప వన్ రూపీ కూడా ఎక్కువ తీసుకునేవాడు కాదు. తోటి పిల్లల  దృష్టిలో  తను ఒక పిసినారి. అని అందరు కామెంట్ చేసినా ఒర్చుకునేవాడు కూడా..  నిజాయితీగా సంపాదించేవాడికి ఒక  హండ్రెడ్ రూపీస్ సంపాదించడం ఎంత కష్టమో..తెలుసా..అంటాడు అని తన ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు.

అలాగే మా అబ్బాయి ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పారు.

వాళ్ళ ఫ్రెండ్స్ అందరు.. క్రికెట్ ఆడటానికి స్టేడియం కి వెళ్ళారు. ఇన్నింగ్స్ మధ్యలో..అందరూ జ్యూస్ తాగుతున్నారు మా అబ్బాయి వెళ్ళే టప్పటికి  ఒక వృద్ద భిక్షకుడు అందరి దగ్గరకి వెళ్లి ఒక రూపాయి ఇవ్వండి  బాబూ..అని అడిగి ఇప్పించుకున్తున్నా.డ ట . మా అబ్బాయిని చూసి ఒక రూపాయి ధర్మం చేయి  బాబు అన్నాడట. మా అబ్బాయేమో..మాట్లాడకుండా వెళ్లి..జ్యూస్ షాప్ ముందు నిలబడి అతనికి ఆర్డర్ చేయడంలో ఉన్నాడట,

ఆహా..  అడగక అడగాక  వీడినే అడుగుతున్నాడు.వీడు కాని ఇవ్వడు..! అని ఎగతాళి చేసుకుంటూనే ఉన్న ఫ్రెండ్స్ కి సమాదానంగా తనతో పాటు ఆ వృద్దునికి కూడా..జ్యూస్ తీసుకువచ్చి ఇదిగో..తాతా ..తీసుకో..అన్నాడట. అంతే..అందరి నోళ్ళు మూతబడ్డాయి.

మనం ఇతరులకి ఇచ్చేటప్పుడు..మనం తినేది ,మనం త్రాగేదే ఇవ్వాలి.మిగిలిపోయ్యాయని..పాడైపోయాయని వాటిని మనకన్నా బలహీనమైన స్థితిలో ఉన్నవారికి  అలాటివి ఇవ్వకూడదు..అని మా అమ్మ చెపుతుంది...అన్నాడట.

ఒకసారి..తన క్లాస్స్ మేట్ "రమ్య"అనే అమ్మాయి {ఇప్పుడు తను తను ఆస్ట్రేలియా లో  ఉంది.) తనకి ఎంబ్రాయిడరీ బ్లౌసెస్ కోసం వచ్చి.."నిఖిల్" మీ అబ్బాయి కదా ఆంటీ..మీరు చాలా గ్రేట్ ఆంటీ..! మీరు మీ అబ్బాయిని  బాగా పెంచారు.ఒక మంచి అబ్బాయి అంటే "నిఖిల్ " అని మా క్లాస్మేట్స్ ఆడపిల్లలు అందరూ చెప్పేమాట ఇది. "నిఖిల్ " లాంటి అబ్బాయి ఉన్నందుకు మీరు చాలా గర్వపడాలి అనిచేప్పివెళ్ళింది.

ఇంతకన్నా ఒక తల్లికి కావాల్సింది ఏముంది.!? నేను ఏం  చెప్పానో.. చేసి చూపించానో..అందుకు అనుగుణంగానే పెరిగి పెద్దయ్యాడు మా అబ్బాయి.

తనకి ఓ..మంచి ఉద్యోగం లభించింది అని చెప్పినప్పుడు చుట్టుప్రక్కల అందరితో.. ,ఇంకా నిజమైన  నా శ్రేయాభిలాషులకి ...ఆ సంతోషకర విషయాన్ని చెప్పినప్పుడు.. "నిఖిల్" కి ఏంటి.. వాడు బంగారం అని మురుసుకున్నప్పుడు  ఆనందం కల్గింది.

కానీ నాకైతే  వెనువెంటనే దిగులు కల్గింది.తనకి ఏరోనాటికల్ ఇంజినీర్ అవ్వాలని కోరిక .అది నెరవేరలేదు.
ఓ.మంచి క్రికెటర్ అవ్వాలని కోరిక. చదువులని వదిలేసి.. పూర్తిగా క్రికెట్ వైపు  మళ్ళ డానికి  నేను ఒప్పుకోలేదు. అలాగే "ప్రేమికుల రోజు " చిత్రం తీసిన డైరెక్టర్ ఖదీర్ ..తన స్టిల్స్ చూసి సినిమా రంగం కి రమ్మని ఆఫర్ ఇచ్చినప్పుడు తనకి ఆ విషయం తెలియకుండానే జాగ్రత్త పడ్డాను.

ఇప్పుడు అయితే.. ఓ..ఇండస్ట్రియలిస్ట్ కావాలనుకుని తనకి నచ్చిన చదువు ని చదువుకుని కూడా.. ఇష్టంలేకపోయినా సరే... అధిక సంపాదన కోసం సాఫ్ట్ వేర్ జాబ్ వైపు మళ్ళిన బిడ్డని చూస్తే..దిగులుగా ఉంది.
లైఫ్ అంటే.. కొన్ని తీరని ఆశలు కూడా నేమో ..చిన్నీ  బంగారం!!  అని  మా  అబ్బాయికి చెప్పాలనిపిస్తుంది.నేర్పాల్సివస్తుంది.

కొంచెం దిగులుగా ..
ఆశలు వేరైనా..లభించింది ..మాత్రం సంతోషమే! భగవత్ సంకల్పం అలా ఉంది.  ఆందుకూ కృతజ్ఞతలు చెబుతూ..
గాడ్ బ్లెస్స్ యూ..మై చైల్డ్..
.

7 కామెంట్‌లు:

జయ చెప్పారు...

మీ అబ్బాయి మీ పోలికే. నిజం. మీ అబ్బాయి విషయం లో మీకు ఎప్పుడూ ఆనందమే తప్ప ఆశ నిరాశ అవ్వదు. నా బెస్ట్ విషెస్ తప్పకుండా అందజేయండి.

Unknown చెప్పారు...

you are so lucky madam ee rojullo alaati pillalu antey nijamga chala great thallini oppinchadam kaadu kadaa kaneesam noppinchakoodadane ingitha gnaanam kooda pillalaki undadam ledu so once again im telling you are so... lucky madam

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీరు మీ చంద్రుడి గురించి మాట్లాడే ప్రతి మాటలో పుత్రోత్సాహం,అమ్మ బిడ్డకోసం పడే తపన కనిపిస్తాయండీ..

మీ దీవెనలు,ఆ దేవుడి దీవెనలు మీ అబ్బాయికి ఎప్పుడూ వుండాలని కోరుకుంటాను..

All The Best..

జలతారు వెన్నెల చెప్పారు...

మీ నిఖిల్ కు ఆశీస్సులు. మీ తల్లి మనస్సు ఇలా అక్షరాలుగా మలిచేసి మా అందరితో పంచుకున్న మీకు ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

నిజంగా మీ అబ్బాయి మీ పోలికే. పెళ్ళి చేసేరా? :)

శ్రీ చెప్పారు...

all the best to your nikhil...
@sri

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జయ గారు.. చాలా సంతోషం..మీ వాక్కులో..తధాస్తు దేవతలు ఉంటారని..నా నమ్మిక.
ధన్యవాదములు.

@ఎస్.వి.కే.రమేష్ గారు.. మీ స్పందనకి ధన్యవాదములు. మీరు చెప్పిన మాటలు నిజమే!
పిల్లలు తల్లిదండ్రుల మనసెరిగి ప్రవర్తిస్తే బావుండును.

@ రాజీ గారు.. ధన్యవాదములు. నిజంగా చెప్పాలంటే.. నా కొడుకే నా ప్రపంచం. అందుకే.. తన గురించిన ప్రతి విషయం అపురూపమే. మీ అందరి అభినందనలు చూసే ఉంటాడు.
నిఖిల్ తరపున మీకు అందరికి ధన్యవాదములు.

@ జలతారు వెన్నెల గారు.. థాంక్ యు వెరీ మచ్!

@ శ్రీ గారు.. థాంక్ యు వెరీ మచ్!!

@కష్టేఫలే మాస్టారు.. ధన్యవాదములు. మీ ప్రశ్నకి సమాధానం.. ఒక ఏడాది తర్వాత. అండీ! మీరు తప్పకుండా రావాలి. మీ ఆశ్శీస్సులు "నిఖిల్ చంద్రుడికి" తప్పకుండా లభించాలి