27, అక్టోబర్ 2012, శనివారం

జ్ఞానం అజ్ఞాతంలో ఎందుకట..!?

ఏమిటీ..     ఈ మధ్య ..    ఆకట్టు కునే పోస్ట్ లు ఏమి వ్రాయడం  లేదు.. !? అడిగింది నా ఫ్రెండ్ రమ.

ఏది..అసలు తీరిక చిక్కడం లేదు. పని ఒత్తిడి..అన్నాను నేను.

కోతలు కోయకు.. ఎంత ఒత్తిడి అయినా అర్ధరాత్రుళ్ళు మేల్కొని వ్రాసిన పోస్ట్ లు ఎన్నో..గుర్తు తెచ్చుకో..అని నిర్మొహమాటంగా అడిగేసింది.

 నువ్వన్నది..నిజమే ! కానీ ఎందుకో..ఈ మధ్య..కీ బోర్డ్ పైన వ్రేళ్ళు కదలను అంటున్నాయి అన్నాను నిరాసక్తగా .

ఏమైంది..తల్లీ.. సబ్జక్ట్స్ కరువా..అంది.

 కాదు.వ్రాయాలనుకున్నవి చాలా అలా పెండింగ్ లో పది పేరుకు పోయి ఉన్నాయి. నాకే ఒక సందేహం ముంచుకొస్తుంది. నేను బాగా వ్రాయగల్గుతున్నానా..లేదా..అని. అన్నాను.

ఎందుకంత సందేహం..!? నువ్వు బాగా వ్రాస్తున్నావు కదా!అంది.

ఆ..కదా..లోనే కథ అంతా ఉంది. ఉదాహరణకు ..చెపుతాను విను. అన్ని బ్లాగులలో విషయాలు లాంటివి కాదు కదా నాకు బాగా నచ్చిన బ్లాగర్ లా నేను ఒక పోస్ట్ అయినా వ్రాశానా..లేదా..అని నాకు సందేహమే!

"అమయ" సామాన్య గారిలా.. ఆకట్టుకునేలా..అద్భుతంగా నేను వ్రాయ గలనా..!?

"అమృత మథనం " బుద్ధా మురళి గారి లాగా..రాజకీయ వ్యంగం  వ్రాయగలనా?  చదివి అర్ధం చేసుకునే బుర్ర కూడా నాకు లేదాయే!

"కాలక్షేపం కబుర్లు"..అంటూ ఎంతో..ఎదిగిన మనసు..తో..ఒదిగి మరీ.. "కష్టేఫలి"  అంటూ అపరిమితమైన జ్ఞానం కల్గిన శర్మ గారిలా ఒక పోస్ట్ అయినా వ్రాయగలనా!?

అలాగే ఎదురైనా ప్రతి అనుభవాన్ని.. కవిత్వంలో చెప్పగల "కవితాసమాహారం"  "మేరాజ్" లాంటి కవయిత్రిని కాలేను అన్న బాధ ఉంది.

జనరంజకంగా.."జనవిజయం " అంటూ..అనేకానేక సామాజిక సృహని పెంపొందించే వ్యాసాలూ నేను వ్రాయ గలనా!?

సుతి మెత్తగా..ఆహ్లాదంగా అనేక అంశాలను సృశిస్తూ రాజీ పడని రాజీ గారిలా.. :"నా చిన్ని ప్రపంచం" ఇదే అని సగర్వంగా  చాటుకోగాలనా!?

ఇక.. మెరుపులా ఝుళిపిస్తూ..ఉరుములా గర్జిస్తూ...  జడివాన లాంటి  బాదుడుతో   సరి క్రొత్త ఆలోచనాలోచనా ల్లోకి సగటు మనిషి ని తోసుకు వెళ్ళే "పనిలేక " పోస్ట్ ని నా పనికిమాలిన వ్రాతతో  ఒకటైనా వ్రాయగలనా!?

సాదా సీదాగా కనిపిస్తూ..నలుగురికి ఉపయోగ పడితే చాలు అనుకుని నా అనుభవాలని..అంత ఓపికగా ఒద్దికగా.."మై వాల్యుబుల్ లేసేన్స్"  ఉపయోగకరంగా వ్రాయగలనా!?

అందుకే వ్రాయడం తగ్గించి.. ఏ  పాటో..లేక ఏ ఫోటో నో..పెట్టి..అమ్మయ్య ! ఈ రోజు పోస్ట్ పూర్తయ్యింది..అని..ఊపిరి పీల్చుకుంటున్నాను అని ఏకబిగిన చెప్పేసాను {మా అమ్మమ్మ పోసిన వస సార్ధకం అవుతుంటుంది అపుడప్పుడు)

అయిందా..నీ పోలికల ప్రహసనం !?
అయినా నీకిదేం ..పోయే కాలం దాపురించింది..? ఈ మధ్య నీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది అంది రమ.

అదేం  లేదే!  పర్సనాలిటీ డెవెలప్మెంట్ బుక్స్ తెగ .చదివేసాను కూడా..అన్నాను.

ఎదో తేడా అయితే ఉంది..కాస్త మనసు విప్పి చెప్పుకుంటే బాధ తగ్గును కదా ! నాకు తోచిన ఉచిత సలహా కూడా వినవచ్చును అంది.

అంత భరోసా ఇచ్చాక కూడా..నేను పెదవి విప్పక పొతే బాగుండదు.. స్నేహ ద్రోహి నవుతాననుకుని.. మనసులో ఉన్న బాధనంతా వేల్లగ్రక్కేసాను.

ఎవరో..ఒక అపరిమిత జ్ఞాన సముపార్జనుడు.. నన్ను ఎగతాళి చేసాడు.అప్పుడు నాకు సందేహం వచ్చింది. ఆ.. నేను వ్రాస్తున్నదేమిటి?  వ్రాయాలనుకుని ఉన్న ఎన్నో ఆలోచనలని..చేతి దురదతో..వ్రాయడం తప్ప ఇంకోటి కానరాలేదు.

అలాగే ఈ బ్లాగ్ లలో గంటకోమారు..తలదూర్చి.. పని చెడ గొట్టుకునిమరీ తెగ చదివేసి.. జ్ఞానం వచ్చేస్తున్నదని..తెగ మురిసిపోవడం తప్ప..అందుకే.. వ్రాయకూడదు,చదవకూడదు అన్న వైరాగ్యం వచ్చేసింది ..అని నిజాయితీగా చెప్పేసాను.

ఇలాటిది ఏదో ఉంటుందని నేను ఊహించాను. అయినా..అంత సున్నిత మనస్తత్వం అయితే..ఎలా.. !? ఎవరో..ఎదో అన్నారని నువ్వు వ్రాయడం మానేస్తావా!? ఎవరి గొప్ప వారిదే! అందుకు ఉదాహరణగా ఒక కథ చెపుతాను విను.అంది.

ఏ  మహర్షి చెప్పిన జ్ఞాన బోధ  ..ఇది..? అడిగాను ఆసక్తిగా..

"రమ మహర్షి ణి " చెప్పిన కథ అనుకో..అంటూ చెప్ప సాగింది.

ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. అతనికి కొంత తోట ఉంది.అందులో అనేక మహా వృక్షాలు రక రకాల ఫల వృక్షాలు,పూల మొక్కలు కాయ గూరల చెట్లు ఉన్నాయి.

ఆ రైతు ఆ తోటలో మొక్కల మధ్య బోదెలు వేసుకుంటూ ఉన్నాడు. అతనికి కొన్ని మాటలు వినిపించసాగాయి. ఎక్కడ నుండి..ఆమాటలు వినబడుతున్నాయి అనుకుంటూ చూట్టూ పరికించి చూసి.. ఓ.. మామిడి వృక్షం..ప్రక్కనే ఉన్న ఓ..మిరప మొక్కతో మాట్లాడుతున్నదిగా గమనించి.. ఆసక్తిగా వినసాగాడు.

ఒక మామిడి చెట్టు,ఒక మిరప చెట్టు..ఎవరికీ వారు నేనే నీకన్నా గొప్ప అంటూ..వాదులాడుకున్తున్నాయి.

ఆ మామిడి చెట్టు ఇలా అంటుంది.. నేను చూడు.. ఎంత బాగా ఎదిగి ఉన్నానో..నాకు ఎన్నో కొమ్మలు..రెమ్మలు,చివురులు.కవులు నన్ను ఎంత బాగా వర్ణించారో..! ప్రతిచోటా  నా రెమ్మలు విరిచి తోరణం కట్టనిదే ఏ శుభ కార్యం జరగదు. అలాగే నా చివురులు తిని.కోయిల ఎంత కమ్మగా పాడుతుందో!
నా పై..ఎన్ని పక్షులు గూళ్ళు అల్లుకుంటాయో ! అంతెందుకు..!? మానవమాత్రులు కూడా  నా నీడన సేదదీరీన  వారే !.పూత  పూసి పిందెగా మారినప్పటి నుండి.. అందరి దృష్టి నాపైనే! రక రకాల వంటలలో నన్ను ఉపయోగించుకుంటారు.లొట్టలు వేసి తింటుంటారు.రక రకాల ఊరగాయలు వేసి నిల్వ చేసుకుంటారు. పండిన నా పండ్లని జుర్రుకుని తింటుంటారు.  నావల్ల తోట యజమానికి ఎంత లాభం.. నాతొ సాటి రాగలరా వేరేకరు? అని తనని తానూ కీర్తించు కుంటూ..

నువ్వు ఉన్నావ్..చూడు..భూమికి రెండడుగులు..వళ్ళంతా కారం. నిన్ను చూస్తే ఒక్కరైనా దగ్గరికి వస్తారా..అమ్మో! మంట..అంటూ దూరంగా పారిపోతారు.. ఎండి కట్టే అయినా తగలబెడితే కూడా కోరు. మనుషులని ఉక్కిరి బిక్కిరి చేసేస్తావు? నీది ఒక బ్రతుకేనా ?అంటూ.. ఎద్దేవా చేస్తూ.. విరగబడి నవ్వుతుంది.

ఆ మాటలు వింటున్న మిరప చెట్టు చిన్నబోయింది . మామిడి చెట్టు చెప్పింది  నిజమే కదా! అనుకుని తనపై తనే జాలిపడింది. అలాగే..అందరు మెచ్చని దగ్గరకి రానీయని ఈ హీన బ్రతుకు నాకెందుకు ?అని దిగులు పడింది.

రైతు..  వాటి మాటలు వింటూ ఆలోచిస్తూ ఉన్నాడు.అంతలో.. మబ్బులు క్రమ్మి పెద్ద వర్షం పడసాగింది. రైతు.. తన పని ని వదిలేసి.. ముందు మామిడి చెట్టు క్రిందకి వచ్చి నిలబడ్డాడు. అంతలోనే ఈ చెట్టు పై  పిడుగు పడే అవకాశం ఉంది అనుకుని..భయపడి..ప్రక్కనే ఉన్న గుడిసె లోకి పరుగు పెట్టాడు.

 ఒక గంట పాటు పెళ పెళ మని ఉరుములతో,గాల్పులతో..కురిసిన అకాల వర్షానికి మామిడి వృక్షం కొమ్మలు విరిగి,కాయలు రాలి నామ రూపాలు లేకుండా ద్వంసం అయిపొయింది. వాన త్రగ్గాక వచ్చి చూసిన తోట యజమాని.. ఆశ్చర్యపోయాడు. ఛీ.. మామిడి చెట్లు వల్ల ఎప్పుడు ..నాశనమే.. ఒక్క సంవత్సరం అన్నా.. పూర్తి పంట తీస్తామనే నమ్మకమే లేదు. అని తిట్టుకున్నాడు.

మిరప మొక్క వంక చూసాడు. అంత వానలోని.. చెక్కు చెదరక  బుడం కాయల్లాంటి   పండిన ఎర్రటి కాయలతో..నిలిచి ఉంది.

ఈ సృష్టిలో.. అన్నీ సమానం కాకపోవచ్చు.కాని దేని ప్రత్యేకం దానిదే కదా! గొప్పవని అజ్ఞానం తో విర్రవీగుతూ ఉండటం కన్నా  ఉనికిని నిలబెట్టుకుంటూ.. నిలబడే ప్రయత్నం చేయడం అన్నిటికన్నా స్పూర్తినిచ్చే విషయం అని అనుకుంటూ  ..

మొత్తానికి ఈ వాన సాయంత్రం మంచి పాఠం నేర్చుకున్నాను అనుకున్నాడు రైతు. అని చెప్పి ముగించింది. నావంక చూసింది..అర్ధం అయిందా..అన్నట్లు.

బండెడు మేథ్స్ , సైన్స్ పుస్తకాలు,పాలిటిక్స్ ,హిస్టరీ,ఇంకా వేదోపనిషత్తులు చదివి ఉండక పోవచ్చు  అంతగా కంప్యుటర్ నాలెడ్జ్ లేక  పోవచ్చు.  సంస్కృతం,ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం లేకపోవచ్చును.పుస్తకాలు రుబ్బి రుబ్బి మెదడు లో గుజ్జుగా మార్చు కోలేక పోవచ్చును. ఏదో..శ్రుత పాండిత్యం..కాసిని పుస్తకాలు చదివిన  కూసింత జ్ఞానం తో..ఇలా ఉన్నాను.

అపరిమిత జ్ఞానం ఆర్జించాం అనుకునే జ్ఞానులు .. ఎగతాళి చేస్తే మాత్రం నేను ఎందుకు బాధ పడాలి...!?  అది వారి నైజం. నేను బాధ పడను కాక పడను .

జ్ఞానం అజ్ఞాతంగా ఉండి అజ్ఞానం అని ఎగతాళి చేసినా బాధపడను. నాకు తోచినది వ్రాస్తుంటాను సరేనా! అని హామీ ఇచ్చేశాను.

జ్ఞానం అజ్ఞాతంలో  ఉండి ..ఎగతాళి చేయడం కాదు. పదిమంది మధ్య మెలిగి.. పదుగురు మెచ్చుకుంటే..పదుగురికి ఉపయోగపడితే ..పరమార్ధం.అంతేనా..అన్నాను.

 కుశాగ్ర బుద్దికి "విజయీ భవ"  అంది మా రమ మహర్షిణి .. అభయ హస్తం చూపిస్తూ..

ఇంతకీ..ఈ పోస్ట్..అయినా నేను బాగా వ్రాయ గల్గానా.. లేదా..అని సందేహమే..!


5 వ్యాఖ్యలు:

శ్రీ చెప్పారు...

జ్ఞానం అజ్ఞాతంగా ఉండి అజ్ఞానం అని ఎగతాళి చేసినా బాధపడను. నాకు తోచినది వ్రాస్తుంటాను సరేనా! అని హామీ ఇచ్చేశాను.

జ్ఞానం అజ్ఞాతంలో ఉండి ..ఎగతాళి చేయడం కాదు. పదిమంది మధ్య మెలిగి.. పదుగురు మెచ్చుకుంటే..పదుగురికి ఉపయోగపడితే ..పరమార్ధం.అంతేనా..అన్నాను.

చాలా బాగుంది...
వనజ గారూ!
అజ్ఞాతంగానే చెప్పేసారు చెప్పాల్సింది...
కాకపొతే...నా బ్లాగ్ పేరు వ్రాయలేదు...:-(..:-(...
(సరదాకి ఆన్నాను...:-) )
@శ్రీ

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

నేను కూడా ఒప్పుకోను నా పేరు కూడా రాయలే నేను అలిగినా...

రాజి చెప్పారు...

"అపరిమిత జ్ఞానం ఆర్జించాం అనుకునే జ్ఞానులు .. ఎగతాళి చేస్తే మాత్రం నేను ఎందుకు బాధ పడాలి...!?"

మంచి విషయం చెప్పారండీ.. ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు కొన్ని జీవితాలు అంతే..
ఎదుటివాళ్ళని బాధపెట్టటానికి మాత్రమే ఉపయోగపడతాయి అనుకుంటాను..

"జ్ఞానం అజ్ఞాతంగా ఉండి అజ్ఞానం అని ఎగతాళి చేసినా బాధపడను. నాకు తోచినది వ్రాస్తుంటాను సరేనా! అని హామీ ఇచ్చేశాను."

--- సరేనండీ మీరెప్పుడూ ఈ మాట మీదే నిలబడి మంచి మంచి విషయాలు మాకు చెప్పాలి :)

మీ మనసుకు నచ్చిన బ్లాగుల్లో "నా చిన్నిప్రపంచం" కూడా వున్నందుకు,నేను చెప్పే విషయాలు మీకు నచ్చుతున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది..

ThankYou..!

చిన్ని ఆశ చెప్పారు...

మీలో ఆలోచన రేకెత్తించిన "రమ మహర్షి ణి" కి థ్యాంక్స్ :)
ఈ పోస్ట్ లో మీరు చెప్పిన కథ లో చాలా నీతి ఉంది. ప్రతి ఒక్కరిలోనూ జ్ఞానం ఉంటుంది, ఎవరి గొప్పతనం వారిదే అని చాటి చెప్పే కథతో ఆసక్తి గా రాశారు. చూడండీ...మరి...
ఇక రాయటం ఆపకండి!

చెప్పాలంటే...... చెప్పారు...

chivari varaku eka bigina chadivinchesaaru miru raayaleka povatam eantandi chakka rastenu....kullukuni ani vuntaaru evaro....miku ela rayalanipiste alaa rayandi chadavadaaniki memunnam