19, నవంబర్ 2012, సోమవారం

నా బ్లాగ్ - నా సమీక్ష




నా బ్లాగ్  ని ఫాలో అవుతున్న మిత్రులందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు.

నా  బ్లాగ్ లో ఫాలోయర్ గాడ్జెట్ కూడా జతపర్చుకోలేదు. అయినప్పటికీ ఇరవయి ఒక్కరు..నా బ్లాగ్ ని ఫాలో అవుతున్న వివరం తెలుస్తుంది. అనుసరిస్తున్న అందరికి మనఃపూర్వక ధన్యవాదములు. 

ఇటీవలనే  మీకు ఈ బ్లాగ్ నచ్చిందా అని అడిగినాను.  నేను ఎవరికీ ఫాలోయర్ ని కానప్పటికీ కూడా నా వైఖరి ని ఏ మాత్రం పెద్ద  విషయంగా తీసుకోక   అభిమానంగా నా వ్రాతలని మెచ్చి అనుసరిస్తున్న మిత్ర బృందం కి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ..

ఇంకొక విషయం..

నా బ్లాగ్ ని అభిమానంతో చదివి శ్రద్ద తీసుకుని వ్యాఖ్యలు పెట్టిన మిత్రులందరికీ ధన్యవాదములు.
వ్యాఖ్య పెట్టడం అంటే మనం వ్రాసిన పోస్ట్ ని కూలంకషంగా చదివి.. వారి అభిప్రాయం తో పాటు మనం వ్రాసిన వాటిలో లోపాలని గుర్తించి..సహేతుకమైన విమర్శ చేయడం,బాగుంటే ఒక ప్రశంసని అందించడం సంస్కార చిహ్నం.

 ఒకో సారి వ్రాసిన పోస్టల కంటే కామెంట్ లే ఆసక్తికరంగా ఉండే సందర్భాలు ఎక్కువే! ఒకో సారి ఎంత బాగా వ్రాసినా కామెంట్స్ రావు. ఒకోసారి అతి సాధారణంగా వ్రాసిన దానికే కామెంట్ ల వర్షం కురుస్తుంది. ఏమిటో..ఈ కామెంట్స్ ప్రహసనం నాకు అర్ధం కాదు.

ఒకోసారి  ఎంత బాగా ఉన్న పోస్ట్ కి కూడా వీలుకాకపోవడం వల్ల   కామెంట్  చేయలేం. మళ్ళీ వచ్చి చూసుకునే తీరిక కూడా ఉండక పోవచ్చు.అలాటప్పుడు.. అయ్యో ! కామెంట్ ఇవ్వలేక పోయానే అనుకుని బాధపడటం కూడా కద్దు.

ఈ మధ్య నేను కూడా కామెంట్ ఇవ్వడం మానేసాను. (ఎందుకంటే.. బ్లాగులు  చదవడం లేదు కాబట్టి)

అట్టు పెట్టిన వాళ్లకి అట్టున్నర  పెట్టాలి  అంటారు కదా! ఆ విషయంలో నేను చాలా బాగా వెనుక బడి ఉన్నాను.

ఎవరికైనా కామెంట్ పెట్టాలి అనుకున్నా కాని భయం వేస్తుంది. ఒకరు అయితే నేను వ్రాసిన ఒక కవితకి ప్రశంసా పూర్వకంగా కామెంట్ పెట్టారు. నాకు బాగా గుర్తు కూడా. ఈ మధ్య ఆ పోస్ట్ చూస్తే కామెంట్ లేదు డిలేట్ చేసి ఉంది.అలాగే నేను వారి బ్లాగ్ లో  ఒక కామెంట్ పెట్టాను. వారు ఆ పోస్ట్ డిలేట్ చేసి ప్రెష్ గా ఆ చిత్రం ని రీ పోస్ట్ చేసారు.

ఇంకొకరు అయితే మీ పోస్ట్ బావుంది అని మెచ్చుకుంటే.. మీరు అనుకునేంత బాగోలేదు లెండి.. అన్నారు. ఇక నేను ఆ బ్లాగ్ లో కామెంట్ పెట్టడమే మానేసాను.  కామెంట్ చేసేవారు..అవసరం లేకపోయినా పల్లకీ ఎక్కించి మోసే బోయీలు కాదు కదండీ.. !

కొంతమంది ఏం వ్రాసినా బాగుంటుంది. అలా అని రోజూ.. వారి వారి బ్లాగ్లోకి వెళ్లి కామెంట్ చేయడం విసుగ్గా ఉంటుంది.చూసిన వాళ్లకి ఇదేదో భట్రాజు  పొగడ్తల గ్రూప్ లాగా ఉంది అని అనిపించేటట్టుగా  ఉంటుంది  అనిపిస్తుంది కాబట్టి చదివేసి వచ్చేస్తాను. 

ఒకోకరి బ్లాగ్ లో వర్డ్ వెరిఫికేషన్ పెడతారు.అందువల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.కాని వాళ్ళు  వాళ్ళకి వచ్చే కామెంట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది కూడా.. వర్డ్ వెరిఫికేషన్ సరి చూసి కామెంట్ చేసే తీరుబాటు..ఆసక్తి కొందరికి ఉండకపోవచ్చు కూడా. వర్డ్ వెరిఫికేషన్ పెట్టిన  మిత్రులంతా.. ఆ ఆప్షన్ తీసివేస్తే బావుంటుంది.

కొంత మంది కట్టుకున్న పట్టు చీరని చూసి పీటేసినట్లు చేస్తుంటారు. కామెంట్ చేయడానికి కూడా..అర్హత ఉండాలన్నట్లు ఉంటుంది. నిజానికి  వ్రాసిన విషయం వాళ్లకి లైట్ గా తోస్తే ఓకే.. ఓకే ..ఓకే.

గతంలో కూడా ఈ కామెంట్స్ గురించి  నేను వ్రాసినప్పుడు  పెద్ద వివాదాస్పదం అయినందువల్ల నేను ఇంతకు మించి వ్యాఖ్యానించ దలచుకోలేదు. ఈ కామెంట్స్ విషయంలో నేను ఆఛి తూచి..హృదయపూర్వకంగా చేసిన కామెంట్స్ వల్ల  కూడా పోస్ట్ డిలేట్ చేసుకోవడం  చాలా బాధ కల్గించింది.

బ్లాగ్ మిత్రులందరికీ ఓ..మనవి. నేను కామెంట్ పెట్టడం లేదని అన్యదా బావించకండి. స్పందిస్తే తప్పకుండా నా కామెంట్ ఉంటుంది. పోస్ట్ చదవక పొతే కామెంట్ ఉండకపోవచ్చు.(లేదా వీలుకాకపోవడం వల్ల  కూడా)

నా ఈ బ్లాగ్ పోస్ట్ లని చదివి..మీ హిట్స్ ద్వారా నాకు ఉత్సాహాన్ని అందించి.. మీ మీ అభిమానాన్ని కొండంతగా అందించి మీలో ఒకరిగా ఆదరించి నందులకు .. అందరికి మనఃపూర్వక ధన్యవాదములు. చాలా సార్లు.. మీ స్పందనకి నేను ప్రతిస్పందన కూడా అందించలేకపోవచ్చును . అందుకు అందరికి క్షమాపణలు కోరుతూ..

నా బ్లాగ్ ని పునఃసమీక్షించుకుంటూ.. ఈ విషయం ని గుర్తెరిగి.. మీతో ఒక సారి మనసు విప్పి చెప్పాలనిపించి..

నా ఈ పోస్ట్ ..నా బ్లాగ్ - నా సమీక్ష


10 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

వ్యాఖ్యలపై సమీక్ష కదా!
వ్యాఖ్యల గురించి మీరేమి వ్రాసినారో అవన్నీ నా భావాలు కూడా.

అజ్ఞాత చెప్పారు...

నేను చదివే అతి తక్కువ బ్లాగులలో మీ బ్లాగు కూడా ఉందండీ. సమయాభావం వలన, కొంత సోమరితనం వలన అన్ని టపాలకూ వ్యాఖ్యలు పెట్టటం లేదు.. అంతే..

పల్లా కొండల రావు చెప్పారు...

ఇలా బ్లాగు వ్రాతలను కామెంట్లను సమీక్షించుకోవడం మీ సంస్కారం. నాకు తెలిసి బ్లాగును సీరియస్ గా వ్రాస్తూ ఇలా ఆత్మవిమర్శ చేసుకునే కొద్దిమందిలో మీరు మొదటివరుసలో ఉంటారు. మనసు చెప్పిందే చేస్తానన్నారు కదా! ఇలాగే ముందడుగు వేసుకుంటూ మరిన్ని మంచి పోస్టులు వ్రాయాలని ఆశిస్తూ అభినందనలండీ.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వ్యాఖ్యల గురించి,వ్యాఖ్యానించేవారి గురించి,వ్యాఖ్యను స్వీకరించేవారిని గురించి మీరు చెప్పినవన్నీ వాస్తవాలేనండీ..
మీ సమీక్ష చాలా బాగుంది..

ఆత్రేయ చెప్పారు...

మంచి సమీక్ష !!
శుభాకాంక్షలు.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

మీ పోష్టులు చాలా మట్టుకు సామాజిక దృక్కోణాన్ని సంతరించుకొన్న పరిణతి కల్గి ఉంటాయి . మీ నుండి సమాజానికి పనికొచ్చే మరిన్ని రచనలు రావాలని ఆశిస్తూ .....
ధన్యవాదాలతో
----- సుజన-సృజన

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

లక్ష్మి దేవి గారు.. మీ స్పందనకి మరీ మరీ ధన్యవాదములు. మన అందరి అనుభవాలు ఒకటే కదండీ! అందుకే మీ అభిప్రామే నా అభిప్రాయం..కదా!

@ mhs greamspet రామకృష్ణ గారు.. చాలా సంతోషం. మీఎరు నా బ్లాగ్ క్రమం తప్పకుండా చూస్తారని నాకు తెలుసు. మీ అభిమానానికి ధన్యవాదములు. కామెంట్ డి ఏముంది లెండి. :) లైక్ లైట్ సర్ !

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పల్లా కొండలరావు గారు.. మీ పరిశీలనకి, మీ వ్యాఖ్యానానికి ,మీ అభిమానానికి ధన్యవాదములు.

@ రాజీ గారు.. మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఆత్రేయ గారు.. మరీ మరీ ధన్యవాదములు.

@ వెంకట రాజారావు లక్కాకుల గారు.. మీరు నాబ్లాగ్ ని చదివి మీ అభిప్రాయాన్ని అభిమానంతో తెలియజేసి.. మీ విషెస్ తెలిపినందుకు చాలా చాలా ధన్యవాదములు.

చెప్పాలంటే...... చెప్పారు...

pedda comment rasanu enduko poyindi mi tapalu alochinche vidham ga vuntayi. chakkagaa rastaru...keep it up.....Good Luck marinni manchi tapalu mi nunchi korukuntu :)