30, నవంబర్ 2012, శుక్రవారం

అంతర్ పట్టు ..

అంతర్ పట్టు .. ఈ పదం సంస్కృత పదం అని విన్నాను.

వధూవరుల మధ్య తెర  పట్టడం అనే సంప్రదాయం మన హిందూ సంప్ర దాయంలో ఉంది కదా!

మన తెలుగు వారి పెళ్ళిళ్ళలో జీల కర్ర బెల్లం పెట్టె ముందు వదూవరుల మధ్య తెర పట్టుకుంటారు.ఆ పద్దతిని తెరసెల్లా  అని అంటారట.



ఈ మధ్య తెరసెల్లాని ని  కూడా అందంగా అలంకరించి వాడుతున్నారు. మా పెళ్లి అప్పుడైతే కొత్త దుప్పటి పెట్టుకున్నట్లు  గుర్తు లేదా..గోధుమ రంగు పట్టు పంచని తెరసెల్ల గా పట్టుకుంటారు.

ఇప్పుడు జరుగుతున్న  పెళ్ళిళ్ళలో సంప్రదాయం కూడా హంగు ఆర్భాటపు  రంగులద్దుకుని.. తళ తళ మెరిసిపోతుంది.
అందులో భాగంగానే  నాకు చేతికి పని బడింది.

అదేమంటే .. తెర సెల్లా ని ..కలశం డిజైన్ వేసి ఎంబ్రాయిడరీ చేయడం.

సరే ..పనిలో క్రొత్తదనం బావుంది..అని కలశం డిజైన్ చేసి .. ఎంబ్రాయిడరీ  చేయించాను.

ఈ డిజైన్ అలా చేసినవే.. 2.50 మీటర్ల తెరసెల్లా  కి ఉపయోగించిన మెటీరియల్ ,ఎంబ్రాయిడరీ .తెరసెల్లా  చుట్టూర  3 వరుసల లేస్ మొత్తం విలువ  దరిదాపుగా 4,000 రూపాయలు అయింది.

ఇప్పుడు ఈ తెరసెల్లా   డిజైన్ అందరి కంట పడి.. అలరిచనుంది.  మనదేశంలో ఇతరప్రాంతాలలో ,విదేశాలలో అంతర్పట్టుని  కళాత్మకంగా డిజైన్ చేసి వాడుతున్నారు. ఇప్పుడు మా పట్టణం లో కూడా ఉంది.

ఇదిగోండి.. నేను డిజైన్ చేసిన "అంతర్పట్టు"

8 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

డిజైన్స్ అన్ని బాగున్నాయి. "అంతర్ పట్టు" , తెరసాల" రెండు పదాలు ఇంతకుముందు వినలేదు. ధన్యవాదాలు మీకు.

అజ్ఞాత చెప్పారు...

చిన్న సవరణ అది తెర సెల్లా.

Raj చెప్పారు...

తేరా సెల్లా మీద కూడా డిజైనర్స్ - తమ కౌశల్యాన్ని చూపెట్టడం మొదలెట్టారన్నమాట.. ఆడపిల్ల పెళ్ళివారికి మరో నాలుగువేల రూపాయల బడ్జెట్ అదనం అయ్యింది అన్నమాట..అయితేనేం.. పెళ్ళికి ఒక రిచ్ లుక్ వస్తుంది. చక్కగా చేశారు. మీకు అభినందనలు.

మాలా కుమార్ చెప్పారు...

19 ఏళ్ళ క్రితం మా అమ్మయి పెళ్ళికి కోరా బట్ట మీద పెళ్ళికూతురు , పెళ్ళికొడుకు పల్లకీలో వెళుతున్నట్లుగా , ఊలు తో క్రాస్ స్టిచ్ కుట్టు తో కుట్టాను . పల్లకీ , నలుగురు బోయలు , పెళ్ళికూతురు , పెళ్ళికొడుకు అంతా కుట్టటాని కి నెల పట్టింది . పెళ్ళివారి కి పెట్టే చీరలు , గిఫ్ట్స్ అన్నీ కూడా గిఫ్ట్ పాక్ చేసాను . బుట్ట , గొడుగు కూడా డెకరేట్ చేసాను . అప్పుడు అవన్నీ హైలైట్స్ అయ్యాయి :) మా అబ్బాయి పెళ్ళికి పెళ్ళికొడుకు , పెళ్ళికూతురు గుర్రం మీద వెళుతున్నట్లుగా కుట్టాను :)
మీరు తెరసెల్లా ను బాగా డిజైన్ చేసారు .

Harsha చెప్పారు...

తెలియని పదాలు చెప్పి,వాటి అర్ధం వివరించారు థాంక్స్ !!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు.. మీకు డిజైన్ నచ్చినందుకు ధన్యవాదములు. తెరసాల కాదని తెరసెల్ల అనాలని మాస్టారు చెప్పారు. తెరసెల్లా అని అందాము సరేనా!

@కష్టే ఫలే మాస్టారు.. సవరణ చేసినందుకు ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజ్ గారు.. థాంక్ యు సోమచ్. అవునండీ ..పెళ్లి ఖర్చులు ఎలా పెరిగి భారం అయిపోతుంటాయి :)

@ మాలా కుమార్ గారు..మీరు సూపర్ అండీ! మీ కళాత్మక అభిరుచి చాలా గొప్పది. థాంక్ యు వెరీమచ్!

@హర్ష ..థాంక్ యూ సో మచ్!

చెప్పాలంటే...... చెప్పారు...

chese pane chuse vishyame aiyinaa perlu teliyadu baagaa chupincharu chepparu tapaa baavundi vanaja