ఇప్పుడు మనుషులు సమూహాలుగా విడివడిపోతున్నారు
అందరూ అన్నింటిలోను ఉంటున్నారు
ఎవరికీ వారు ప్రత్యేకంగా ఉండటానికి
గుర్తింపబడటానికి , ఆరాటపడి పోతుంటారు
ప్రతి ఒక్కరు
సమూహం లో ఇమిడి ఉండలేకపొయినా
నాలుగు గోడల మధ్య ఇమిడి ఉండాల్సిన
తప్పనిసరి బంధం అయితే ఉంది కదా!
అదే కుటుంబం.
ప్రతి కుటుంబం కుటుంబంగా లేకపోయినా
సమూహంలో ఒదిగిపోతుంది
అవసరాలకి కాదు కాలక్షేపాలకి
నా సమూహం ఎలా ఉండాలని అనుకున్నానంటే...
నీ సమూహం నా సమూహం వేరు వేరు కాదనుకున్నాను
మనకి మనమే ఓ సమూహం గా ఉన్నామనుకున్నాను
అయినా నీ సమూహంలో నాకు చోటు లేదని తోసేసాక
నీ ఇంకో సమూహంలో మాత్రం ఎలా ఉండగలను ?
ఎవరి సమూహాలు వారివి.
ఎవరి అభిరుచిలు వారివి అస్తిత్వమో , అస్థిరత్వమో
మేలుకోమంటూ హెచ్చరిస్తుంది
అందుకే ఉక్కిరి బిక్కిరి అయ్యే సమూహాల నుండి
నన్ను నేను వెలివేసుకోవాలనిపిస్తుంది
ఒంటరి నక్షత్రం తళుకులీనుతూనే ఉన్నట్లుగా
నేనొక ఒంటరి సమూహం నయి... తుంటరి ప్రవాహమై
కాలం సాక్షిగా, జాలం సాక్షిగా
నాలో నేనే కరిగిపోవాలని ఉంది.
అందరూ అన్నింటిలోను ఉంటున్నారు
ఎవరికీ వారు ప్రత్యేకంగా ఉండటానికి
గుర్తింపబడటానికి , ఆరాటపడి పోతుంటారు
ప్రతి ఒక్కరు
సమూహం లో ఇమిడి ఉండలేకపొయినా
నాలుగు గోడల మధ్య ఇమిడి ఉండాల్సిన
తప్పనిసరి బంధం అయితే ఉంది కదా!
అదే కుటుంబం.
ప్రతి కుటుంబం కుటుంబంగా లేకపోయినా
సమూహంలో ఒదిగిపోతుంది
అవసరాలకి కాదు కాలక్షేపాలకి
నా సమూహం ఎలా ఉండాలని అనుకున్నానంటే...
నీ సమూహం నా సమూహం వేరు వేరు కాదనుకున్నాను
మనకి మనమే ఓ సమూహం గా ఉన్నామనుకున్నాను
అయినా నీ సమూహంలో నాకు చోటు లేదని తోసేసాక
నీ ఇంకో సమూహంలో మాత్రం ఎలా ఉండగలను ?
ఎవరి సమూహాలు వారివి.
ఎవరి అభిరుచిలు వారివి అస్తిత్వమో , అస్థిరత్వమో
మేలుకోమంటూ హెచ్చరిస్తుంది
అందుకే ఉక్కిరి బిక్కిరి అయ్యే సమూహాల నుండి
నన్ను నేను వెలివేసుకోవాలనిపిస్తుంది
ఒంటరి నక్షత్రం తళుకులీనుతూనే ఉన్నట్లుగా
నేనొక ఒంటరి సమూహం నయి... తుంటరి ప్రవాహమై
కాలం సాక్షిగా, జాలం సాక్షిగా
నాలో నేనే కరిగిపోవాలని ఉంది.
4 కామెంట్లు:
ఓహ్ .....ఎంత బాగుందో....."నక్షత్రం లా తళుకుమంటూ, తుంటరి ప్రవాహమై ......నాలో నేనే...."
Too good vanaja gaaru. Loved it.
ఒంటరి సమూహం నయి...బాగుందండి
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదోవొక సమయంలో కదిలాడే ఒకానొక భావాన్ని చక్కగా వ్యక్తీకరించారు. మీ భావప్రజ్ఞకు జోహార్లు.
మనోభిప్రాయాలను ఎంత చక్కగా విప్పిచెప్పారండి.చాలా బాగుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి