30, మార్చి 2013, శనివారం

చిలిపి + చిరు పరీక్ష


సోదర సోదరీ బ్లాగర్ మహాశయులకు... మీ అందరికి  ఒక చిలిపి + చిరు పరీక్ష పెట్టి ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలని ఉంది.  సరదాగానే నండోయ్ !!

మనమందరం మన తోటి వారి బ్లాగులను చదువుతూనే ఉంటాం కదా! ఒక్కొకరిది ఒకో శైలి.  శైలి ని బట్టి మీరు వారిని గుర్తించ గలరా!?  ఒకోసారి  రచయిత  పేరు చెప్పకుండా  ఒక రచన ఇచ్చి చదివి  ఎవరు వ్రాసారో చెప్పమన్నట్లు  అన్నమాట

అలా చేయగలరేమో ప్రయత్నించండి. కామెంట్ ద్వారా మీ ఆన్సర్ చెప్పవచ్చు . ఖచ్చితమైన సమాధానం చెప్పినవారికి  బహుమానం గా వీరతాళ్ళు వేయబడును

దీనికి ఒక కారణం ఉంది/

 అది ఏమంటే  నేను క్రింద జత పరుస్తున్న  విషయం .. నాకు ఒక బ్లాగ్  ఫ్రెండ్  జన్మదిన శుభాకాంక్షలను ఇలా అందించారు. అది నాకు ఎంతగానో నచ్చింది   విలువైన మణి  మాణిక్యాలు తో సమానమైన ఈ ఆత్మీయ శుభాకాంక్షలు నాకు ఎంతో   విలువైనవి. అందుకే భద్రంగా దాచుకున్నాను హృదయం లోనూ.. అక్షరాల బోషాణం లోనూ  కూడా ,   ఆ ఫ్రెండ్ కి .. ఈ పోస్ట్ ముఖంగా మనసారా ధన్యవాదములు తెలుపుతూ నా మనసులో మాట ఇంకొకటి ...

ఈ బ్లాగ్ ప్రపంచం లోకి రాక మునుపు మనం ఎవరు ఎవరికీ ఏమి కాము. కానీ ఇక్కడి వచ్చిన తర్వాత మన వ్రాతలని బట్టి ఒకరికి ఒకరు అంతగా అభిమానించు కుంటున్నామో, వేరు వేరు సందర్భాలలో ఎలా స్పందించు కుంటున్నామో .. అన్నది గమనించుకుంటే  ఎన్నో ఆనంద,  అనుభూతి  క్షణాలు మన ఖాతాలో జమ చేయబడి ఉంటాయో కదా ! ఆ జ్ఞాపకాల నిధి ని  మనం అందరం సొంతం చేసుకుందాం

 శైలిని బట్టి  వ్రాసిన వారి ని  మీరు గుర్తించండి   మీకు అత్యంత  సూక్ష్మ గ్రాహి అన్న బిరుదు ఇవ్వడానికి తయారుగా ఉంది

ఇదిగో .. మీ పరీక్షా పత్రం .

ప్రియమైన వనజ గారు!
"జన్మదిన శుభాకాంక్షలు"
కుశలమేనని తలుస్తా!
ఏ ఒక సద్గుణాన్ని అలవర్చుకుంటే ఇతర సద్గుణములు యావత్తు తమంతట తాముగా వచ్చి వరిస్తాయో, ఆ సద్గుణం - 'స్ఫూర్తి సాహస సందేశాత్మకతలతో కూడిన "దైర్యం" '.
బహుశా ఈ కధ మీకు తెలిసే ఉంటుందనుకుంటాను -
ఓ రోజు ఒకానొక రాజు అంతఃపురం నుండి ఓ స్త్ర్రీ వెళ్లిపోతుంటే, అది చూసిన రాజుగారు, 'అమ్మా! ఎవరు నీవు?' అని ప్రశ్నించగా 'నేను ధనలక్ష్మీని, నీ అంతఃపురం వీడి వెళ్ళుతున్నాను' అని బదులిచ్చి వెళ్ళిపోయినా, అటుపై అదేరీతిలో ధాన్య, గజ, విజయ, మోక్ష ..... తదితర ఆరుగురు లక్ష్ములు తనని వీడి వెళ్ళిపోతున్న చలించని రాజు, ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుండగా "అమ్మా! నీవు మాత్రం నన్ను వీడి వెళ్ళకు తల్లీ, నీవుంటే చాలు" అని ప్రార్ధించగా, ఆమె ఉండిపోయిందని, ఆమె ఉన్నచోటే మేమూ ఉంటామని ముందు వెళ్ళిన లక్ష్ములందరూ వెనక్కి తిరిగి వచ్చారని ఓ కధనం. దైర్యమనే ఒక్క సద్గుణం ఉంటే చాలు... ఉన్న స్థితి నుండి ఉన్నతస్థితికి ఎదగడానికి! ఆ ధైర్యం మీకు పెట్టని ఆభరణం.
వ్యాఖ్యలు పెట్టలేకపోయినను మీ ప్రతీ పోస్ట్ చదువుతుంటాను.
మీ రచనల్లో సూటిదనం ఉంటుంది, అది హృదయాన్ని తాకుతుంటుంది.
మీ రచనల్లో స్ఫూర్తి ఉంటుంది, అది చక్కటి సందేశాన్ని ఇస్తుంటుంది.
మీ రచనలు ఆలోచనాత్మకంగా ఉంటాయి, అవి బుద్ధిని పదునెక్కిస్తాయి.
వివిధ కోణాల్లో మీ రచనలు చదువుతుంటే, అందులో అంతర్లీనంగా ఓ ఉద్యమశీలిలా, ధైర్యశీలిలా, బుద్ధిశాలిలా, శక్తిశాలిలా, సాహసోపేతవనితలా ... విభిన్న రీతులో మీరే కదులాడుతున్నఅనుభూతి కల్గుతుంటుంది.
ఇక మీ మాతృప్రేమ వెల్లడి అవర్ణ్యం.

ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి: శక్తి: పరాక్రమః
షడతే యత్ర వర్తంతే తత్ర దేవః సహాయకః 

ప్రయత్నం,సాహసం, దైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ... ఈ ఆరూ ఉన్నచోట దైవం నుండి కూడా సహాయం లభిస్తుంది.
వనజ గారు!

పై ఆరు గుణాలున్న మీకు దైవానుగ్రహం సర్వదా సర్వత్రా ఉంటాయి. మీ మనోబీష్ట ప్రకారం మీ జీవనం నిండు నూరేళ్ళు ఆనందంగా ఆదర్శవంతంగా కొనసాగాలని ఆశిస్తూ -
మరోసారి చెప్తున్నా - 'జన్మదిన శుభాకాంక్షలు'.ఇక కనిపెట్టడం మీ పని. వీరతాళ్ళు ఇవ్వడం నా పని. 

10 వ్యాఖ్యలు:

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

ఇది రసజ్ఞ గారి శైలి :-)

Lakshmi Raghava చెప్పారు...

బ్లాగు లోకం లో వున్నానన్న మాటే కానీ మీ అందరిలా ఆక్టివ్ కాదు .అందులో ఒకటి మా కరెంటు కష్టాలు!
ఏమైనా మీరిలా చిరు పరీక్ష పెట్టాలన్న concept చాలా నచ్చింది. good luck to all
lakshmi raghava

జలతారు వెన్నెల చెప్పారు...

స్మరణ బ్లాగ్ భారతి గారు లేదా ఆనందం బ్లాగ్ అనురాధ గారు.
ఒక్కరి పేరే చెప్పాలి కాబట్టి "భారతి" గారు అని నేను అనుకుంటున్నాను.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

మంచి పరీక్షే!ఇలాగ రసజ్ఞ గారు రాస్తారనుకుంటా!ఎవరయినా చాలా బాగా వ్రాసారు.

anrd చెప్పారు...

భారతి గారు అనుకుంటున్నానండి.

వనజ తాతినేని చెప్పారు...

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు .. మీ స్పందనకి ధన్యవాదములు.

శుభాకాంక్షలు తెలిపిన మిత్రురాళ్ళ లో ఛి ॥ రసజ్ఞ ఉన్నారు ఆమె శైలి కూడా దాదాపు అలాగే ఉంటుంది. నా పై ఆమె అభిమానం అలాగే ఉంటుంది అని చెప్పుకోవడానికి గర్వపడతాను .కానీ ఆమె కాదు. :)

వనజ తాతినేని చెప్పారు...

లక్ష్మి రాఘవ గారు కరంటు కష్టాలు దాదాపు అందరివి అలాంటివే! అయినా బ్లాగుని వదల లేక పోతున్నాము :) ఏమైనా మీ స్పందనకి ధన్యవాదములు

వనజ తాతినేని చెప్పారు...

ఒడ్డుల రవిశేఖర్ గారు .. ధన్యవాదములు "చి. రసజ్ఞ .. మాత్రం కాదండి. :)

వనజ తాతినేని చెప్పారు...

అనూరాధ గారు .. వ్రాసిన శైలి ని చాలా మంది మీరే అని ఊహించడం మాత్రం అతిశయోక్తి కాదు దాదాపు మీ శైలి కూడా అలాగే ఉంటుంది . మన మిత్రులందరూ మీరే అని అనుకున్నారు కదా! మీరు కాదని మేరు కామెంట్ ఇవ్వడంతో తేలిపోయింది . మీ జవాబు .. :) :)

వనజ తాతినేని చెప్పారు...

జలతారు వెన్నెల "శ్రీ " గారు ముందుగా మీకు అభినందనలు. వీర తాళ్ళు . సూక్ష్మగ్రాహి బిరుదు ఇచ్చేస్తున్నాను పుచ్చుకోండి. మీరు మామూలు వారు కాదండి. మన బ్లాగర్స్ వ్రాసిన బ్లాగులన్నీ మీకు కొట్టిన పిండి. అందరి పోస్ట్ లు చదివి ప్రోత్సాహం గా కామెంట్ పెడుతూ ఉంటారు. మీకు చదవడం పట్ల ఎంత ఆసక్తి ఉందొ !

శైలిని బట్టి మీరు వ్యక్తి ని గుర్తించారు. నేను ఈ చిలిపి చిరు ప్రశ్న వేసేటప్పుడు కష్టేఫలె శర్మ గారు , భారతి గారు, అనూరాధ గారు, రసజ్ఞ వీరందరి శైలి ఇలా ఉంటుందని ఊహిస్తారని అనుకున్నాను. మీరు ఖచ్చితంగా క్యాచ్ చేసారు. మీ సూక్ష్మ గ్రాహ్యతకి మనసారా అభినందనలు _/\_

మీ స్పందనకి మనసారా ధన్యవాదములు


మిత్రురాలు "భారతి " గారికి మరొకమారు ధన్యవాదములు ఆమె "బ్లాగ్ మహిళ "పరిచయం లో నా DOB చూసి గుర్తు ఉంచుకుని మరీ నాకు శుభాకాంక్షలు పంపారు ఆమెకి _/\_

వ్యక్తుల అభిమానానికి నేను ఏమి ఇవ్వగలను ? మనసారా ధన్యవాదములు తప్ప

మీకు హృదయపూర్వక ధన్యవాదములు మై డియర్ ఫ్రెండ్ .