18, మార్చి 2013, సోమవారం

వంద వేల మందిని ఆకర్షించిన " బ్లాగిణి "

గత సంవత్సరం ఇదే రోజున "బ్లాగర్ గా నా అనుభవాలు " అనే పోస్ట్ వ్రాసాను. 

ఆ పోస్ట్ ఈ రోజు చదువుకుని కొంచెం సిల్లీ గా అనిపించి నవ్వుకున్నాను. ఎందుకంటే గత సంవత్సరపు అనుభవం  కంటే  ఈ రోజు నా అనుభవం సీనియర్ కదా! :) అందుకు .

గత సంవత్సరం కంటే ఇప్పుడు పరిణితి చెందినది అయితే నిజం  

మనసు విప్పి బోల్డ్ గా చెప్పేయడం నా అలవాటు. ఏ విషయం  అయినా దాచుకోవడం, గుభనంగా ఉండటం  నా వల్ల  కాదనుకుంటూ ఉంటాను. 

గత సంవత్సరం  ఈ బ్లాగ్ ప్రపంచం అందరూ మనవారే అనుకున్న  భ్రమ లో ఉండేదాన్ని. అందుకే నా పుట్టిన రోజు కూడా విష్ చేయలేదు అని ఉక్రోషం వెళ్ళ గ్రక్కినట్లు చదువరులకు అనిపించినా అక్కడ నేను నిజమే మాట్లాడాను కూడా. 

ఈ సంవత్సరం అయితే చాలా మాములుగా నా పుట్టిన రోజు జరుపుకున్నాను బ్లాగ్ లో ఎనౌన్స్ చేసుకోకుండా కూడా 

అయినప్పటికీ నా ఆత్మీయులు (మన బ్లాగర్ ఫ్రెండ్స్ ) వ్యక్తిగతం గా  అందించిన  ఆత్మీయ శుభాకాంక్షలు  చాలా చాలా మధురమైనవి. వారికి ఈ ఠపా ముఖంగా హృదయ పూర్వక ధన్యవాదములు   

ఒక సంవత్సర కాలంలో  నా బ్లాగ్ ని  అక్షరాల లక్ష మంది (100000) వీక్షకులు దర్శించారు అలాగే బ్లాగర్ లుగా ఉండి వీక్షించిన వారి సంఖ్య 53,000 మంది. 

 రోజు వారి  సమీక్షించుకుంటే   అత్యధిక వీక్షణా పేజీలు  ఒక రోజు కి 745 పీజీలతో అత్యధికంగా ఉన్న రోజు ఉంది 

ఏమి వ్రాయక పోయినా 300 పీజీలు వరకు వీక్షించిన రోజులు ఉన్నాయి. 

ఒక సంవత్సర కాలంలో నేను వ్రాసిన పోస్ట్లు లింక్స్ తో సహా..  268

సరదాగా ,కాలక్షేపంగా మొదలు పెట్టి సీరియస్ గా తీసుకుని వ్రాయడం మొదలెట్టి రెండేళ్ళు అయింది. 

ఈ రెండేళ్ళ లో నా జీవితం లో  బ్లాగ్ ఒక భాగం అయిపొయింది.  నా మనసులో మెదిలే భావాలు, 
హృదయానుగతాలు, నా భావేశం, మానసిక సంఘర్షణ, ఆలోచనలు - అనుభవాలు ,స్పందనలు అన్నీ  నా బ్లాగ్ తెల్లకాగితం పై అక్షరాలుగా మారి .. నాకొక పెద్ద  డైరీని మిగిల్చాయి. 

ఇక్కడ బ్లాగ్ - నేను వేరు వేరు కాదు రెండు నేనే ! నేనే బ్లాగ్ గా ఒకటిగా కలసి మెలసి ఉన్నాం విడదీయనంతగా  పెనవేసుకుని  ఉన్నాం . 

ఈ రెండేళ్లలో చాలా కథలు వ్రాసాను, కవితలు వ్రాసాను, వ్యాసాలూ వ్రాసాను  సింహావలోకనం చేసుకుంటే నేనే ఇవన్నీ వ్రాసానా !? అని ఆశ్చర్యం కల్గుతుంది. 

 పదునైదు సంవత్సరాలుగా వ్రాసిన   నా కవితలన్నింటిని కలిపి రెండు కవితా సంకలనాలుగా, కథలని ఒక కథల సంపుటిని తెచ్చే ప్రయత్నం లో ఉన్నాను. 

బ్లాగ్ వ్రాయ కుండా ఉండి  ఉంటే  నేను కథలకి అక్షర రూపం ఇచ్చేదాన్ని కాదు  కాగితం పై వ్రాయడం అంటే  అంత చికాకు నాకు. ఇంకా ఆలోచనలు లో మెదిలే అనేక   భావావేశాలు, జీవన సంక్లిష్టతలు నాలో అగ్ని కణాలుగా రగులుతూనే ఉన్నాయి  వాటికి అక్షర రూపం తెచ్చే ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నానికి అవరోధం నాకున్న spondylitis

నా బ్లాగ్ ని చదివి నన్ను అభినందించి , నన్ను ప్రోత్సహించిన బ్లాగర్ మిత్రులందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు 

బ్లాగ్లోకపు ఉక్కు మహిళ  గా పరిచయం చేసిన జాజిమల్లి మల్లీశ్వరి  గారికి 

ఆ శీర్షిక ని అభిమానించి బలపరిచిన ఆత్మీయ మిత్రులందరికీ  మనసారా ధన్యవాదములు . 

గత ఏడాది కాలంగా నా బ్లాగ్ అందరిని ఆకర్షిస్తున్నా కూడా ఒక బ్లాగర్ గా  ప్రింట్ మీడియా లో  నా పరిచయం రాలేదని అనుకునేదాన్ని . ఆ లోటు తీర్చి " తెలుగువెలుగులు "  లో నన్ను పరిచయం చేసిన " వలబోజు జ్యోతి " గారికి  మనసారా  కృతజ్ఞతలు 

అందరిని అభిమానించడమే తప్ప మరొకటి తెలియదు నాకు. 

ఈ బ్లాగ్ ప్రపంచం "  ప్రపంచం ' ని మరింత దగ్గరగా చూపింది. నన్ను నేను ఇంకా బాగా అర్ధం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరించింది. అందుకు "   చాలా చాలా సంతోషం. " 

ఆఖరిగా ఒక చిన్న మాట. 

నా అరచేతి మధ్య " మౌస్ "అమర్చి నాకు  అంతర్జాలం ని పరిచయం చేసి  నా ఒంటరి తనాన్ని అక్షర సమూహం చేసిన నా కొడుకు " నిఖిల్ చంద్ర " కి   మనసారా దీవెనలు. 

నాకు ఆత్మీయతని పంచిన అనేకానేక బ్లాగ్ మిత్రులకు హృదయ పూర్వక అభివందనం. నన్ను భరిస్తున్నందుకు  మరీ మరీ ధన్యవాదములు  

నా బ్లాగ్ ని పరిచయం చేసిన  అగ్రిగేటర్స్  "హారం "  జల్లెడ "   బ్లాగర్స్ వరల్డ్ "   బ్లాగిల్లు "   100 తెలుగు బ్లాగర్స్ "   బ్లాగ్ లోకం "    కూడలి "    సంకలిని  "    మాలిక "    తెలుగు బ్లాగులు "  అందరికి  మనః పూర్వక ధన్యవాదములు  

నా  లోకాన్ని అందంగా, అనుభూతి మయంగా మార్చిన  నాలో ఉన్న "బ్లాగిణి " కి  ధన్యవాదములు చెప్పకుంటే ఊరుకుంటుందా చెప్పండి !? 

 వేయి వందల మంది  ని ఆకర్షించిన "బ్లాగిణి" కి ధన్యవాదములు.  వంద వేల మందిని ఆకర్షించిన బ్లాగిణి  కూడా అనొచ్చు కదా!  :) 

(ఈ పరిచయం గర్వం తో కాదు. సంతోషం తో కాదు .. ఇంకా బాగా వ్రాయాలి అనే  భాద్యత పెరిగినందుకు కించిత్ భయం తో )

ఇండీ బ్లాగర్ ఇన్ లో నా బ్లాగ్ ప్లేస్ 82
నా బ్లాగ్ రద్దీలని చూపే మరో వివరం ..ఈ లింక్ లో      StatusCrop . com


61 వ్యాఖ్యలు:

జలతారువెన్నెల చెప్పారు...

లక్ష వీక్షణలు పూర్తిచేసుకున్న మీ బ్లాగ్ కి (మీలో ఉన్న "బ్లాగిణి కి") శుభాకాంక్షలు.
జహాపనా తుస్సి గ్రేట్ హో! ...:))

Jokes apart, keep writing. your posts most of the times are very inspirational.

Green Star చెప్పారు...

శుభాకాంక్షలు వనజ గారు.

శశి కళ చెప్పారు...

నువ్వు నిజంగా గ్రేట్ అక్క.బ్లాగ్ మనలో ఉన్న సామర్ధ్యాన్ని బయటకు తీస్తుంది అనేది నిజం .
లక్ష వీక్షణాలు ....అభినందనలు
పదునైదు సంవత్సరాలుగా వ్రాసిన నా కవితలన్నింటిని కలిపి రెండు కవితా సంకలనాలుగా, కథలని ఒక కథల సంపుటిని తెచ్చే ప్రయత్నం లో ఉన్నాను. <<<<ఎదురు చూస్తూ ఉన్నాను.ఆల్ ధి బెస్ట్

జ్యోతి చెప్పారు...

అభినందనలు ...

Sunita Manne చెప్పారు...

శుభాకాంక్షలు వనజ గారు....

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అభినందనలు. శుభాకాంక్షలు.

anrd చెప్పారు...

అభినందనలు వనజవనమాలి గారు.
మీరు మరిన్ని చక్కటి పోస్టులను వ్రాయాలని కోరుకుంటున్నాను.

మానస వీణ చెప్పారు...

అభ్యాసము కూసు విద్య-సాహిత్యం మీద మమకారం వుంటే మనం వ్రాసే బ్లాగులుకూడా పరిమళాలు వెదజల్లుతాయి.అప్పుడు పాఠకులు ఎక్కువమంది ఆస్వాదిస్తారు.మీలాంటివాళ్ళ అడుగుజాడలలో ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న చిన్ని బ్లాగర్ని నేను.

శ్యామలీయం చెప్పారు...

కనీసం ఒక లక్ష అభినందనలు - హృదయపూర్వకమైన అభినందనలు.

లక్షమంది వీక్షించారంటే ఒక సంవత్సరకాలంలో, మీ బ్లాగు లక్షణంగా ఉంది కాబట్టే. మీ‌బ్లాగు ఇంకా దినదినాభివృధ్ధి గాంచాలని ఆశిస్తున్నాను. అందరికీ నచ్చేటట్లు వ్రాయగలగటం అసామాన్యమైన ప్రతిభగల మీ బోటివారికే చెల్లు.

(నేనంత మరీ ఆహ్లాదకరంగా యేమీ వ్రాయటంలేదు కానీ, నా బ్లాగును కూడా యేదో రోజుకో కొద్దిమంది వీక్షిస్తున్నందుకూ సంతోషిస్తున్నాను.)

Dantuluri Kishore Varma చెప్పారు...

ఒక్క సంవత్సరంలో లక్ష పేజ్‌రివ్యూలని పొందడం సామాన్యమైన విషయంకాదు. అలాగే మీరు రాసిన పోస్టులు కూడా వారానికి ఐదు చొప్పున ఉన్నట్టున్నాయి. మిమ్మల్ని ఎక్స్‌ప్రెస్ బ్లాగర్ అని కూడా అనవచ్చు. అభినందనలు.

kri చెప్పారు...

You write very well Vanajagaaru
Krishna Veni

మాలా కుమార్ చెప్పారు...

అభినందనలు వనజగారు .

Lakshmi Raghava చెప్పారు...

బగారాసే వాళ్ళు ఎప్పుడూ గుర్తింప బడతారు . హృదయపూర్వక అభినందనలు వనజా వనమాలిగారు

కాయల నాగేంద్ర చెప్పారు...

అభినందనలు...వనజగారు!

జయ చెప్పారు...

వనజ గారు హృదయ పూర్వక అభినందనలు. ఇలాగే ఇంకా ఎన్నో వేల వీక్షణలు పెంచుకోవాలని నా ఆకాంక్ష.
I wish you & Nikhil all the best.

RAJ A చెప్పారు...

లక్ష వీక్షణాల మీ బ్లాగుకి మరియు మీకూ లక్ష అభినందనలు. త్వరలో మీ బ్లాగు కోటి వీక్షణలు చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను..

Y.V.Ramana చెప్పారు...

శుభాకాంక్షలు.

మీరు టచ్ చెయ్యని అంశమంటూ లేదు. చాలా నిజాయితీగా, ఎంతో నిబద్దతతో రాస్తుంటారు. మీ ఎనర్జీ లెవెల్స్ ఇదే స్థాయిలో కంటిన్యూ అవ్వాలని ఆశిస్తున్నాను. మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

అజ్ఞాత చెప్పారు...

అద్భుతః అభినందనలు.

భారతి చెప్పారు...

లక్ష వీక్షణలు పూర్తిచేసుకున్న మీ బ్లాగ్ కి శుభాకాంక్షలు. మీలో ఉన్న "బ్లాగిణి కి" అభినందనలు.
మీ ప్రజ్ఞకు దర్పణమే ఇన్ని వీక్షణలు.
హృదయపూర్వక అభినందనలు వనజ గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

అందుకోండి అభినందనలు వనజ గారు ఎప్పటికి మీతోనే మేము ఉంటాము మరిన్ని మంచి టపాలు మీ నుండి కోరుకుంటూ

శోభ చెప్పారు...

మనస్ఫూర్తి శుభాకాంక్షలు వనజగారూ...

కమనీయం చెప్పారు...

మీకు నా అభినందనలు.శుభాకాంక్షలు.

సామాన్య చెప్పారు...

congrats vanaja garu

Sujata చెప్పారు...

Congratulations Vanaja garu. I appreciate your Son's encouragement and your hardwork.

వనజవనమాలి చెప్పారు...

జలతారు వెన్నెల "శ్రీ " గారు మనసారా ధన్యవాదాలు.. మీ ప్రోత్సాహమే నాకు దన్ను . థాంక్ యు సో మచ్ !

వనజవనమాలి చెప్పారు...

గ్రీన్ స్టార్ గారు మనసారా ధన్యవాదాలు..

వనజవనమాలి చెప్పారు...

శశి కళ గారు థాంక్ యు సో మచ్ ! కవితా సంపుటి తెచ్చే పనిలో ఉన్నాను. మీరంతా తప్పక చదవాలి మీ అభిమానం ఎల్లప్పుడూ కోరుకుంటూ .. .

వనజవనమాలి చెప్పారు...

జ్యోతి గారు .హృదయ పూర్వక ధన్యవాదములు. మీ నుండి ఎంతో నేర్చుకున్నాను అందుకు ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

సునీత మన్నే గారు ధన్యవాదములు. బాగున్నారా?

వనజవనమాలి చెప్పారు...

బులుసు సుబ్రహ్మణ్యం గారు హృదయ పూర్వక ధన్యవాదములు. ఎలా ఉన్నారండి ? మీ హాస్య రచనలు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నేను బ్లాగ్స్ బాగా గమనించడం లేదు కొత్త బ్లాగ్ ఏమైనా మొదలెట్టారా మాస్టారూ !/

వనజవనమాలి చెప్పారు...

అనూరాధ గారు ధన్యవాదములు మేడం . మనమందరం ఎవరి అభిరుచిల మేరకు వారు వ్రాస్తున్నాం . అందరివి ఒకేలా ఉన్నత సంస్కారంతో మన బాణీ ని బ్లాగులలో చూపుతున్నం . మీ బ్లాగ్ ప్రభావం నా పై చాలా ఉంది థాంక్ యు అనూరాధ గారు

వనజవనమాలి చెప్పారు...

మానసవీణ బ్లాగర్ గారు మేము ఒకప్పుడ్డు మీలా ఈ బ్లాగ్ లోకం లో ప్రవేశించిన వారమే! మీరు చక్కగా వ్రాయడం మొదలెట్టేయండి మరి. మీ స్పందనకి ధన్యవాదములు .

వనజవనమాలి చెప్పారు...

శ్యామలీయం గారు .. నేను మీ కన్నా చిన్నదానిని మీ విద్వత్ తో నేను ఏ పాటి ? మీలాంటి పెద్దలకి పాదాభి వందనం

మీ శుభాకాంక్ష లకి ,అభినందనలకి, మీ పెద్ద మనసుకి మనసారా ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

Dantuluri Kishor varma గారు ధన్యవాదములు. ఈ 268 పోస్ట్స్ లోనే 100 డేస్ 100 పోస్ట్స్ ఉన్నాయండి :) ఏదో అలా జరిగిపోయింది. మీ పరిశీలన కి ధన్యవాదములు అండీ!

వనజవనమాలి చెప్పారు...

కృష్ణవేణి చారి గారు ధన్యవాదములు

malli చెప్పారు...

వనజ గారూ,
మీ పుస్తకాల కోసం ఎదురు చూస్తాం... అన్నింటినీ కలిపి చదువుకోవడం బావుంటుంది
అభినందనలు

వనజవనమాలి చెప్పారు...

మాలా కుమార్ గారు ధన్యవాదములు మనందరివి కుడి ఎడంగా ఒకే అనుభవాలు అండీ! ఏదో మన పిల్లల ప్రభావం తో ఇలా వచ్చి పడ్డాం కదా! అల్ హాపీ ! :)

వనజవనమాలి చెప్పారు...

లక్ష్మి రాఘవ గారు ధన్యవాదములు అండీ ! మీ మాటే నా మాట అంటూనే మన బ్లాగర్ల అభిమానం ఉంది కదండీ. ఇందరి సహృదయుల మధ్య ఇలా ఉన్నాను. మరొక మారు ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

కాయల నాగేంద్ర గారు మనఃపూర్వక ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

జయ గారు .మీకు మనసారా ధన్యవాదములు నా తరపునా & నిఖిల్ తరపున కూడా . specially Thanks a lot .

వనజవనమాలి చెప్పారు...

A. RAJ గారు .మీ అభిమానం నన్ను కోటి దాటిస్తుంది :) మనసారా ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

Y V . Ramana గారు హృదయ పూర్వక ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

కష్టే ఫలే మాస్టారూ .. హృదయ పూర్వక ధన్యవాదములు. అంతా మిధునం .. మాయ లా ఉంది. :)

వనజవనమాలి చెప్పారు...

భారతి గారు హృదయ పూర్వక ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

చెప్పాలంటే మంజు .గారు ..థాంక్ యు సో మచ్ అండీ!

వనజవనమాలి చెప్పారు...

శోభ గారు మనసారా ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

కమనీయం గారు హృదయ పూర్వక ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

సామాన్య గారు .. మీ అభినందనలకి హృదయ పూర్వక ధన్యవాదములు
ఎలా ఉన్నారు?

బదిలీ వల్ల పనుల ఒత్తిడి ఉన్నా కూడా మీరు నా బ్లాగ్ చదివి కామెంట్ ఇవ్వడం చాలా సంతోషం . మరీ మరీ ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

గడ్డి పూలు .. బ్లాగర్ సి సుజాత గారు థాంక్ యు సో మచ్ మేడం . మీ అభిమానం అంతా మీ కామెంట్ లో ప్రవహిస్తూ నన్ను చేరింది హృదయ పూర్వక ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

malli ... గారు హృదయపూర్వక ధన్యవాదములు . తప్పకుండా నండీ ఆ సంపుటాల పై మీ నుండి సమీక్ష చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను . ధన్యవాదములు

Mauli చెప్పారు...

ఒక గృహిణి గా కుటుంబం చూసుకొంటూ , సెల్ఫ్ ఎంప్లాయీ గా నలుగురికి ఉపాధినిస్తూ ఇంత వేగంగా బ్లాగ్ ను కొనసాగించడం మీ గొప్పతనం. మరింతమంది మిమ్మల్ని అనుసరించాలని కోరుకుంటున్నాను .

Congrats

వనజవనమాలి చెప్పారు...

మౌళి గారు ... మీరు అన్న ప్రతి మాట సంతోషం కల్గించింది. మీరు నా పరిచయం అప్పుడు నేను చెప్పిన ప్రతి విషయం గుర్తు పెట్టుకున్నారు . నిజమండీ! నేను వేగవంతంగా బ్లాగ్ నడపడం అన్నది నా పట్టుదల కూడా.
కుటుంబం కోసం ప్రాముఖ్యత నిచ్చి కొన్ని లక్ష్యాలని చేరుకోలేకపోయాను.

కనీసం ఇలా అయినా తృప్తి కల్గేలా వ్రాయాలనుకుని ... నడక సాగిస్తున్నాను. హృదయ పూర్వక ధన్యవాదములు

హితైషి చెప్పారు...

వనజ గారు మీ పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తుంది.
మీ బ్లాగ్ ప్రస్థానం లో ఎన్నో ఆణి ముత్యాలు లాంటి పోస్ట్ లు ఉన్నాయి. పగలంతా క్షణం తీరిక లేకుండా తిరిగే మీరు తెల్లవారేటప్పటికి మురికి మనసు ,ప్రియమైన శత్రువు, పాలబువ్వ తీపి,వెన్నెల లో విషాదం,ఓల్డ్ లవ్ స్టోరీ లాంటివి రాస్తే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉండేదో! మీరు ఏదైనా సాధిస్తారు.
మీ మంచి మనసు,మీ పట్టుదల ఎల్లెడలా స్పూర్తికరమే. శుభాకాంక్షలు __ వైష్ణవి

Zilebi చెప్పారు...

వనజ వనమాలీ గారు,

ఆ వీక్షణముల అంకెల లో సున్నలన్నీ మీవండీ, మరేమో మొదట్లో ఆ ఒక్కటి ఉంది చూడండి,ఆ ఒక్కటి మావండి!ఇక ఆ ఒకటి రెండు మూడు అట్లా వెయ్యి రెట్లు కావాలని ఆశిస్తూ


శుభాకాంక్షల తో

జిలేబి.

Narsimha చెప్పారు...

Congratulations....ఘాట్టిగా చప్పట్లు....ఈ సంధర్భంగా మీకు నా అభినందనలు లక్షలు రెట్టింపు అవాలని ఆశిస్తూ...

వనజవనమాలి చెప్పారు...

వైష్ణవి అభిరుచులని బట్టి ఆసక్తి. వృత్తి జీవనం కోసం. వ్రాయడం అనేది ఒక తపన అందులో మానసిక ఆనందం ఉంటుందని మీకు నేను చెప్పాలా? మీకు తెలియనిదా? :) థాంక్ యు సో మచ్

వనజవనమాలి చెప్పారు...

జిలేబీ గారు మీ రాక బహు సంతోషం. హృదయపూర్వక ధన్యవాదములు

ఇంతకీ మీరు విలువ కట్టిన విధానం బహు ముచ్చటగా ఉంది అందుకు ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

నరసింహ గారు .. మీ చప్పట్లు కి, మీ అభిమాన పూర్వక వ్యాఖ్యకి మనఃస్పూర్తిగా ధన్యవాదములు

Palla Kondala Rao చెప్పారు...

బ్లాగులోకంలో మీరు మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అభినందనలు వనజ గారు.

వనజవనమాలి చెప్పారు...

పల్లా కొండలరావు గారు .హృదయ పూర్వక ధన్యవాదములు
బ్లాగర్స్ వరల్డ్ ద్వారా మీరు ఇచ్చిన ప్రోత్సాహం కి మనసారా కృతజ్ఞతలు

oddula ravisekhar చెప్పారు...

మీ బ్లాగు గురించి తెలుగు వెలుగు లొ చదివాము.మీ రాయాలనే తపన మిమ్మల్ని ఈ స్థాయిలొ నిలబెట్టింది.మీకు అభినందనలు.