20, మార్చి 2013, బుధవారం

విసిరి పారేసిన ఓ ... చూపు

ఇటీవల కాలం లో మా ఇంటి  ప్రక్కనే బహుళ అంతస్తుల భవనాలు చాలానే  వెలిసాయి. ఎక్కడెక్కడ నుండో  జనం వచ్చి పిట్టల్లా ఆ గూడులలో జొరబడుతున్నారు. ఎప్పుడు ఏదో ఒక కీసర బాసర.   వద్దనుకున్నా ఇతరుల మాటలు మన చెవుల్లో దూరి పోతుంటాయి 

ప్రొద్దు ప్రొద్దుటే  గోడ ప్రక్కనే అవతలి భాగంలో చేరిన పండితులవారు తన కొడుకుకి ఇలా వడ్డిస్తున్నారు.  


చక్కని గ్రంధం ని చదివి అర్ధం చేసుకోకుండా విషయం ఏమి లేదంటావే మూర్ఖుడా! విషయం ఏమి లేకుండా పుంఖాను పుంఖాలు ఎలా వ్రాస్తార్రా  వెధవ ! చదివే  వాళ్ళు అందరూ సన్నాసివెధవలనా  అర్ధం ? 

ముందు ఇతరులలో ఏం ఉందొ , ఏం లేదో తెలుసుకునే ముందు నాకన్నీ తెలుసునా !?అని ప్రశ్న వేసుకో! 

మరు క్షణం  తనకేమి జరుగుతుందో తెలియని జ్యోతిష్యుడు ఇతరుల కేమి జరుగుతుందో   చెప్పే వాడిలా ... నువ్వు ,నీ అసందర్భ ప్రేలాపనలూనూ ... 

నువ్వేమన్నా శంకరాభరణం శంకర శాస్త్రివా ! కోడి మెదడు వెధవా ..!  ఎప్పుడు పురుగులు ఏరుకుతినాలని చెత్తా చెదారం కెలికి నట్లు అందరి మనసులు కెలుకుతావు. అప్రాచ్యపు వెధవ ! నీకు ఈ జన్మకి బుద్ధి  రాదు ... 

మనుషులలో కలవలేని విద్యలు  ఎన్ని వచ్చి  ఉంటే  ఏమిటిరా ..ఎంత  గొప్పవైతే ఏమిటిరా ... ? నీ జన్మకి నీకు  అర్ధం కాని విషయమది  పరమశుంఠ... పరమ శుంఠ ని.. అని నొక్కి తిడుతున్నారు .  

అ లా సాగుతూనే ఉంది  ... ఆ మాటలు వింటూ  ఇదేదో "రుద్ర వీణ " కథ రివర్స్ లో వినబడుతుందే అనుకున్నాను.

అంతకు ముందు ఒక రోజు .. ఆ పండితులవారి కుమార్తె  తన అన్నయ్య పై  తండ్రికి ఇలా పిర్యాదు చేస్తుండ గా  నేను విన్న మాటలు ఇలా ...  

నాన్న గారు ! అన్నయ్య గారికి రోజు రోజు కి వెర్రి ముదిరి పోతుంది.  అన్నయ్య ఆఫీస్ లోనే వేరే సెక్షన్ లో  పనిచేస్తున్న  నా స్నేహితురాలు అన్నయ్య ఎదురు పడితే నమస్కారం అండీ బాగున్నారా ! అని పలకరించింది అట. " అసలు నువ్వెవరు ? నాకు నీతో  పరిచయం లేదే? నన్నెందుకు పలకరిస్తున్నావ్ ? నాకు ఇలాంటివి నచ్చవ్ , అయినా నమస్కారం చేసే పద్దతి ఇదేనా ?  ఎవరు ఏమిటో ఏమి తెలియకుండానే అందరిని కలిపేసు కుందాం అనుకుంటారు ... అని మండి  పడ్డాడంట. 

పాపం ఆమె బిక్క చచ్చి పోయి .అయ్యో ..! అలా  అంటారేమిటండి  నేను మీ చెల్లెలి స్నేహితురాలిని అని చెప్పినా వినకుండా  నాకు ఇలాంటివి నచ్చవ్ అని విదిలించి వేసాడట. పాతికేళ్ళు మీరు ఏం  నేర్పారో వాడు ఏమి నేర్చుకున్నాడో కాని తోటి మనుషులతో మాట్లాడే జ్ఞానం మాత్రం మీరు నేర్పలేదండి... అని  తండ్రిని నిర్మొహమాటంగా చెప్పేసింది 

అవునమ్మా..  దానం కొద్దీ బిడ్డలు అంటారు చచ్చు పుచ్చు దానాలు చేసి ఉంటాను .అందుకే  ఇలాంటి కొడుకు పుట్టాడు  ఉద్దరించడానికి. అయినా వీడి జ్ఞానం వీడిని  ఉద్దరించ లేనప్పుడు  ఇతరులని ఎలా ఉద్దరిస్తుందో తెలుసుకోడు. వీడు అందరిని వెలివేసినట్లు చూస్తే  వీడే మనుషుల లోనుండి వెలివేయబడతాడు .. అని బాధగా నిట్టూరుస్తూ  ఉండటం వినిపించింది 

మళ్ళీ ఈ రోజు సాయంత్ర సమయం లో   ఒక ప్రహసనం చూడాల్సి వచ్చింది 

ఈ సారి మాట విదిలింపు .. పండితులు గారి  కోడలి నోటంట విన్నా... 

అది ఇలాగున  వినబడింది 

మామగారు ...  మీ అబ్బాయితో వేగడం నా వల్ల కాదండి  పప్పు వండితే ఉప్పు లేదంటారు దప్పళం చేస్తే ఇలాగున చేసేది నేను చేసి చూపనా... ! అంటారు. చింత పండు చారులో కొత్తిమీర ఎందుకు దండగ అని ఒకటే నస.    కాపీ వేడి ఎంత ఉండాలో, ఎంత వేడిలో ఉంటే  ఎంత రుచిగా ఉంటుందో నీకు తెలియదంటారు. ఏ రంగు బట్టలు ఎలా ఉతకాలొ నన్ను చూసి నేర్చుకోమంటారు   నాకు వచ్చినట్లు నేను చేస్తాను మీకు నచ్చపోతే మీరే చేసుకోండి అంటే  అందుకు మాత్రం  నాకు ఉప్పుకి పంచదారకి తేడా తెలియదు అంటారు 

పెళ్లి అప్పుడు అందంగా ఉన్నావని  చేసుకున్నా ..ఇప్పుడు  పొత్రంలా తయారయ్యావ్ నిన్నేం చేసుకోను అంటారు, పిల్లలని పెంచే పద్దతి ఇది కాదంటారు మనీ మేనేజ్మెంట్ నీకు తెలియదంటారు నేను అసలు  ఏమి తెలియని శుద్ధ మొద్దుని అయితే   మీ కొడుకుతో కాపురం ఎలా చెయ్యనండీ!? నేను మామూలు మనిషిని నాకు బోలెడు లోపాలు. ఏ లోపం లేకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి ? ఈ సతాయింపులు, ములుకులు లాంటి మాటలు నేను పడలేనండీ 

మీ అబ్బాయి లాంటి .perfectionist, intellectual నాకు వద్దండీ మామగారు . మీకు దణ్ణం పెడతాను మా పుట్టింటికి పోతాను నన్ను పంపించేయండి మీరు అలా పంపక పొతే  ఏ 498A  నో పెట్టి మరీ పోతాను 
అని గట్టి గట్టిగానే ఏడుస్తూ చీదుతూ వాపోతుంది . 

వెంటనే ఆ కొడుకు గబా గబా గుమ్మం దగ్గర కి వచ్చి నిలబడి ...    నిన్ను  బయటకి వినబడే టట్లు  వాగవద్దన్నానా! అప్రాచ్యపు పీనుగా ! లోపలకి వచ్చి ఏడువు ఆ ఏడుపేదో.  బజారున పడతావెందుకే ! నలుగురు వింటున్నారు,  చూస్తున్నారు అనే ఇంగిత జ్ఞానం లేదు  అంటూ అతను మాత్రం గట్టిగానే తిట్ట సాగాడు.అచ్చు "కల్కి"  సినిమాలో " ప్రకాష్ రాజ్ లాగా"   

 ఆ పండిత మామగారు మాత్రం కోడలి వైపు తిరిగి  చేతులెత్తి....  "తల్లీ ! నిన్ను  వేడుకుంటున్నాను వాడి అపరిమిత జ్ఞానం అనే అజ్ఞానం ని సహనం అనే చిరునవ్వు పులుముకుని భరించు తల్లీ !  అని 

ఇదంతా చూస్తున్న ఇంటి ఆడపడుచు మాత్రం ఒకటి అనడం కూడా వినబడింది

  ఒరేయ్ సోదరా !  ఏ నక్షత్రం న పుట్టావురా!? మనిషి అన్నవాడికి  నిన్ను భరించడం ఎంత కష్టం రా ... నీ మితిమీరిన తెలివితేటలు,  నిక్కచ్చి తనం అని నువ్వు అనుకునే అహంకార చేష్టలు, వాగాడంబరం మానుకోకుంటే ... నీకు చిప్ప కూడు మాత్రం ఖాయం నిన్ను ఎవరు కాపాడలేరు అని అంది 

సందె వేళప్పుడు వాకిట్లో ముగ్గు పెడుతూ.. నేను అనుకున్నాను " అవును సోదరా... కాస్త ఒళ్ళు,నోరు అదుపులో పెట్టుకుని సాటి మనుషులని మనుషులుగా చూడటం నేర్చుకుంటే బావుంటుంది కదా ! " అనుకున్నాను 

 తర్వాత స్వగతంలో .. ఏమిటో ఈ  నగర జీవనం లో అన్ని పైత్యాలు వద్దన్నా నా కంట పడేవే ! కళ్ళు మూసుకోవాలో , చెవుల్లో దూది పెట్టుకొవాలో తెలియడం లేదు  అనుకుంటూనే... 


సందె దీపం వెలిగించి  "ఇరుగు చల్లన, పొరుగు చల్లన మనసులో కల్మషాలన్నీ  కరిగి  అందరి మనుగడ  చల్లగా ఉండాలని కోరుకుంటూ "  ప్రొద్దుటనుండి  నే చూసిన చూపులని విసిరి పారేసాను.  మనసు తేలికయిందని వేరే చెప్పక్కరలేదు అనుకుంటాను  

15 వ్యాఖ్యలు:

చెప్పాలంటే...... చెప్పారు...

:)

జలతారువెన్నెల చెప్పారు...

విద్య, వినయం, విధేయత వలన ఒక మనిషి గొప్పతనాన్ని మనం గుర్తిస్తాము. ఈ మూడిట్లో విద్య లేకపోయినా, వినయం, విధేయత, ఇతరులను మెప్పించని గుణం ఉంటే వారు కూడా గొప్పవారే!ఒక విషయం మీద నిర్మొహమాటం గా అభిప్రాయం చెప్పడం వేరు.పరులను కించపరుస్తూ,వారి మనస్సు నొప్పిస్తూ, నిర్మొహమాటం అని చాటి చెప్పడం వేరు.మనం ఒకరి మనసు నొప్పిస్తే,మన మనసు కూడా నొప్పించేవారు ఉంటారు కదా మరి.మీ కథలో పాత్రకి సాధారణ మనుషులకి తెలిసిన విషయాలు కూడా తెలియకపోవటం శోచనీయం.

జలతారువెన్నెల చెప్పారు...

Sorry for the typo earlier.
"ఈ మూడిట్లో విద్య లేకపోయినా, వినయం, విధేయత, ఇతరులను నొప్పించని గుణం ఉంటే వారు కూడా గొప్పవారే!

చాతకం చెప్పారు...

I see one hard working man and 3 dependents making his life miserable ;) , He must be so stressed out that its effecting his work place inter personal communication too. If he is that bad a person, why is he still with them & listen to that every day while supporting them? We don't know what's the real reasons, I say lets give benefit of doubt. ;)

హితైషి చెప్పారు...

వనజ గారు మన పక్కింటి ముచ్చట్లు లో జీవించేసారుగా ! చూసిన వెంటనే కామెంట్ తో కొట్టాలనిపించింది మీ కథనం సూపర్. మీలో మంచిరచయిత్రి దాగి ఉన్నారు. తప్పులు సవరించుకుంటూ ఇంకా ఇంకా వ్రాసేయండి

శ్రీలలిత చెప్పారు...


బాగుందండీ మీ పొరుగింటి మనిషి గురించి వ్యక్తిత్వ పరిశీలన.. అభినందనలు..

Sharma చెప్పారు...

హెలో,

మీ " విసిరి పారేసిన ఓ...చూపు " నన్ను తాకేసింది. నా మనసుని కదిపేసింది. స్వార్ధాన్ని వెలికి తీసేసిందీ సంభాషణలతో " వెంటనే ఆ కొడుకు గబా గబా గుమ్మం దగ్గర కి వచ్చి నిలబడి ... నిన్ను బయటకి వినబడే టట్లు వాగవద్దన్నానా! అప్రాచ్యపు పీనుగా ! లోపలకి వచ్చి ఏడువు ఆ ఏడుపేదో. బజారున పడతావెందుకే ! నలుగురు వింటున్నారు, చూస్తున్నారు అనే ఇంగిత జ్ఞానం లేదు అంటూ అతను మాత్రం గట్టిగానే తిట్ట సాగాడు. "

ఇట్లు,
శర్మ జీ ఎస్
నా బ్లాగ్ : నా ఆలోచనల పరంపర

ధాత్రి చెప్పారు...

:)...మీ పొరిగొంటి కధనం తెగ నవ్వించేసిందండి బాబోయ్

వనజవనమాలి చెప్పారు...

చెప్పాలంటే మంజు గారు.. మీ చిరునవ్వుకి అర్ధం ఏమిటండి :) థాంక్ యు సో మచ్

వనజవనమాలి చెప్పారు...

శ్రీ గారు .. మన మధ్య నే ఇలా సంస్కార హీనంగా, అహంకారంగా ప్రవర్తించే వారు ఉన్నప్పుడు చాలా బాధ కల్గుతుంది. ఇక పై నేను రోజు అలాంటి మూర్ఖ సోదరుడిని చూడాలంటే ఎలా బాబు .ఽని దిగులుగా ఉండండి

పాపం .. ఆమే ఇంటా బయటా పని చేసుకుంటూ పనికన్నా ఎక్కువైనా మానశిక శ్రమ ని పడాల్సి వస్తుంది . ఏమిటో ఈ జివాతాలు అనిపించేలా

మీ స్పందనకి మీ విలువైన అభిప్రాయానికి ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

చాతకం గారు మీ స్పందనకి ధన్యవాదములు . ఆ పండితుల వారి కోడలు వర్కింగ్ విమెన్,అలాగే చెల్లెలు కూడా . పండితుల వారు ఒక్కరే ఖాళీగా ఉన్నది. వ్యక్తుల అంతరంగాన్ని మనం చూడలేం కానీ వారి బాహ్య ప్రవర్తన వారిని పట్టి ఇస్తుంది కదండీ.
ఇలా కూడా ఉన్నారని చెప్పడమే ... నా ఉద్దేశ్యం
ధన్యవాదములు అండీ

వనజవనమాలి చెప్పారు...

Hitaishi Thaank you so much :) :)

వనజవనమాలి చెప్పారు...

Sri Lalitha gaaru Thank you so much

వనజవనమాలి చెప్పారు...

శర్మ గారు నా బ్లాగ్ కి స్వాగతం. ఇలా సార్లు ప్రయత్నించి కామెంట్ చేసినందుకు ధన్యవాదములు. పోస్ట్ మీకు నచ్చినందుకు ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

ధాత్రి గారు థాంక్ యు సో మచ్, అలా నవ్వేసారన్న మాట. కాస్త ఆలోచించండి అలాంటి వాళ్ళు తారసపడితే ఇది గుర్తుకు వస్తుందేమో !