29, మార్చి 2013, శుక్రవారం

మగువ మనసుకే తెలుసును


 మన భారతీయ మహిళ లకి  ఓ  నాలుగైదు ఏళ్ళగా  పరిచయం అయి ఉన్న చీరలు  ఇప్పటి కాలం లో స్త్రీల ఒంటి పై ఎక్కువగా కనిపించే చీర  " ఉప్పాడ " చీర

ఈ చీర ముచ్చట....

ఆ చీర చూస్తే చాలు ఆడవాళ్ళకి అమితమైన ప్రేమ పుట్టుకొస్తుంది. ఆహా.. ఏమి సొగసు,ఎంత నాణ్యత పట్టుకుంటే పాము కుబుసం లా జారిపోతూ ఉంటుంది పైగా ఒక కేజీ బరువు కూడా లేకుండా నాజూకుగా ఉంటుంది

ప్రపంచ ప్రఖ్యాతి  గాంచిన  కొన్ని వస్తువుల జాబితాలో "ఉప్పాడ చీర" కూడా చేర్చబడింది (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ) జి .ఐ కూడా లభించింది

మన ఆంద్ర ప్రదేశ్ లో వెంకటగిరి, ధర్మ వరం, పోచంపల్లి ,గద్వాల్ చీరలకి ప్రసిద్ది చెంది నట్లు ఉప్పాడ చీర కూడా ప్రసిద్ది పొందింది

నేను ఓ  రెండు నెలల కాలం లో మూడు సార్లు ఉప్పాడ వెళ్ళాను. అక్కడ చీరలు సేకరించి వాటిని అందంగా ఎంబ్రాయిడరీ కళతో అలంకరించి విదేశాలకి ఎగుమతి చేసే దిశలో ఆ ఊరికి నాకు ఒక అనుబంధం ఏర్పడింది

ఉప్పాడ ఒక గ్రామం. కానీ అక్కడి గ్రామీణుల జీవితాలలో అనుకోకుండా వెలుగు వచ్చింది సాదారణంగా చేనేత వృత్తిని వంశ పారంపర్యంగా కొనసాగిస్తూ వస్తున్న వారి జీవితాలలో ఓ చిన్న వృత్తి  పరమైన మార్పు వల్ల వారు తయారు చేసిన చీరల ప్రత్యేకత వల్ల ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఇంకా చెప్పాలంటే మన భారతీయ  చీర కట్టునే  ఉప్పాడ చీరతో నింపేశారు

గత రెండేళ్ళు గా ప్రముఖుల పెళ్ళి సందడి లో ఉప్పాడ చీర ప్రత్యేకంగా నిలబడింది. మా నేత చీర కట్టుకుని ఆ పుత్తడి బొమ్మ పెళ్లి కూతురిగా మారింది, మేము నేసిన పట్టు వస్త్రాలు ధరించి ఆ హీరో పెళ్ళికొడుకు గా ఎంతందంగా సంప్రదాయంగా కనిపించాడో !  అని మురిసి పోవడం పరిపాటి అయిపోయింది

ఉప్పాడ  లో తయారు చేయబడ్డ  పెళ్ళి  చీర  లక్ష రూపాయలు పై మాటే ధనవంతులకి హోదాని పెంచి సామాన్యులకి అందని చిటారు కొమ్మన ఉన్న అందని ద్రాక్ష అయిపోయే చీరలని చూస్తే ఈర్ష్య కూడా బయటపడుతుంది మళ్ళీ అంతలోనే "అబ్బ ఏముందిలే  ఆ చీరలో అంతా జరీ తప్ప . ఆ జరీ అసలు సిసలు వెండి జరీ కూడా అయిఉండదు. ఈ చీర చూడు పాతికవేలు అయితే ఏమిటీ ? ఆ లక్ష రూపాయల చీరకన్నా ఎంత అందంగా ఉందో " అనుకుంటూ మనసుని సర్ది పుచ్చుకునే మాటలు

ఓల్డ్ ఏజ్ వాళ్ళ  చీరలు అని ముఖం చిట్లించుకోకు. ఆ జార్జెట్ చీరలు ఏం బాగుంటాయి? పట్టు వస్త్రాలు ధరించడం  మన సంప్రదాయం. పట్టు చీర అందం ఇక ఏ చీరలోను కనబడదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు
టీ విలలో పెళ్ళిళ్ళు చూసి గాగ్రా చోళీ ఏమిటి అసహ్యంగా ..  ఈ వయొలెట్ పింక్ కలనేత జమ్ధాని చీర చూడు ఎంత అందంగా ఉందో ...  ఇది తీసుకో అని  ఒక అమ్మ కూతురితో మాట్లాడే మంద లిపు మాటలు భలే ఉంటాయి అచ్చు తెలుగులా అందంగా


త్రీడి చీరలు కావాలి , త్రీ కలర్స్ చీరలు కావాలి, అడ్డపట్టెలు వేసిన చీరలు కావాలి,  సెవెన్ కలర్స్ చీరలు లేవా! అయ్యో! వాటి కోసమే వచ్చాను. ఫుల్ పట్టుకు పట్టు వేసి నేసిన చీరలు కావాలండి .. జామ్ధాని చీరలు ఏడూ వేలకన్నా తక్కువలో దొరకవా !? ఇలాంటి సంభాషణలు

 ఆయ్ ! అంతేనండీ !! ఇందులో బోలెడు రకాలు ఉండాయండి. ఒరెయ్.. అమ్మ గారికి బుటా పల్లు చీరలు, ఫుల్ డిజైన్ చీరలు చూపించు" యజమాని  సమాధానాలు, ఆదేశాలూ నూ వినబడతాయి

మరి ఇది ఎంత ? పదివేలు !?   చాలా ఎక్కువ  గా ఉంది అన్న అనుమానపు  ప్రశ్నలు. ఇదే చీర మీరు షో రూం కి వెళ్లి కొంటె 15,000 పెట్టాలి అమ్మగారు. మళ్ళి అందులో డూప్లికేట్  చీరలు వచ్చేసాయండి. మా నేత చీరలని నకిలీ చేసేసి పవర్ లూమ్  చీరలు తయారు చేసేసి ఎక్కువ లాభాలకి అమ్ముకుంటు న్నారండి. ఈ చీరలు  మీరు ఎన్ని కావాలి అంటే అన్ని మేము ఇవ్వలేమండి ఒక్కో చీర నేయడానికి ఒక మనిషికి   పదిహేను రోజులు పడుతుంది. అని అంటూ  వారి ప్రత్యేకతని సింపుల్గా చెబుతూ ఉంటారు


ఇరవై మంది ఒక షాపులో కూర్చుంటే పది చీరలే పడతాయి ఆ చీరలు తీసుకోవడం  కోసం  అన్ని చేతులు  పోటీ పడతాయి.  నచ్చిన చీర దొరక బుచ్చుకుంటే మహిళ ముఖం లో ఎవరెస్ట్ ఎక్కిన ఆనందం తాండవిస్తుంది  లేకపోతే ఇంత దూరం వచ్చినా నచ్చిన చీర దొరకలేదు  అసలిక్కడ చీరలే లేవు మాల్స్ కి వెళితే నచ్చిన చీర ఒక్కటైనా దొరుకును అనే అసంతృప్తి సెగలు

ఇలా ఉంటాయండి అక్కడ మాటలు

ఉప్పాడ చీరకి విపరీత మైన డిమాండ్ ఏర్పడింది. దూర ప్రాంతాల నుండి కారులు కట్టించుకుని మరీ ఉప్పాడ కి చేరుకుంటున్నారు ప్రొద్దుగూకే వేళకైనా సరే నచ్చిన చీర దక్కించుకుని తిరిగి వెళతారు లేదా మళ్ళీ మళ్ళీ వస్తారు

ఇది ఈ చీరల ముచ్చట.

ఇక ఈ సంప్రదాయమైన వృత్తి  గురించి

మనరాష్ట్రం లో వ్యవసాయం తర్వాత చేనేత పని చేసేవారు ఎక్కువ ఉన్నారు. రోజంతా పని చేసినా సరే 150 రూపాయలు కి మించి ఆదాయం రాని  జీవితంలో ఎదుగు బొదుగు  లేని వృ త్తి అది.  నేత పనివారాల జీవితాలని శాసించే వ్యాపార ధోరణి  తక్కువ ఏమి  కాదు

 పట్టు నూలుని ఏక మొత్తం లో కొనుగోలు చేసి  దానిని చేనేత పనివారికి తూకం ప్రకారం ఇచ్చి మళ్ళీ తూకం ప్రకారం నేసిన చీరని తీసుకుని వారికి కూలిని ఇచ్చి ఆ చీరలని రెట్టింపు ధరలకి అమ్ముకునే  మాస్టర్ వీవర్ లు ఉంటారని చెపుతారు ఓ  డెబ్బయ్యి ఏళ్ల పెద్దాయనని చూసి మాట్లాడాను  చక్కగా నుదుటిన త్రిపుండం ధరించి ప్రసన్నంగా కనిపించి ఆప్యాయంగా పలకరించారు. ఏ వూరమ్మా మనది అని విజయవాడ అంది చెప్పాడు మా డ్రైవర్

మేము చాలా చీరలు కొని  అవి కారులో పెట్టుకుంటుంటే .. ఇలా వ్యాఖ్యానించారు కష్టం మాది ఫలితం వాళ్ళది. ఏం చేత్తాం !?


"మరి మీరు కూడా  నూలు  కొనుగోలు చేసి చీరలు తయారు చేసి అమ్మవచ్చు కదా ..తాతగారూ"  అని అంటే .. మా దగ్గర డబ్బు లేదమ్మా .. అప్పోసోప్పో చేసి నూలు కొనుక్కొచ్చి చీరలు తయారు చేసినా   ఎవరు కొంటారు మీలాంటి వాళ్ళు అందరూ వాళ్ళ దగ్గరే కొంటారు. వాళ్ళకి పోటీగా  చీరలు తయారు చేయడం మొదలు పెట్టామని తర్వాత పని కూడా దొరకదు అని వారి కష్ట నష్టాలు చెప్పుకొచ్చారు


అలాగే అలా సొంతంగా పెట్టుబడి పెట్టి వ్యాపారం ని విస్త రించుకున్న యువతరాన్ని నేను చూసాను

తండ్రి సంప్రదాయ చేనేత కళాకారుడు అతను  రాజస్థాన్,డిల్లీ  వైపు వెళ్లి అక్కడ చేనేత వస్త్రాల తయారీలో మెలుకువలు డిజైనింగ్ నేర్చుకుని వచ్చి అంతకు క్రితం వారికి తెలిసిన పనికి మెరుగులు దిద్దుకుని అద్భతమైన డిజైన్స్ తో చీరలు చేయడం మొదలు పెట్టారు. అవే జామ్దాని చీరలు

ఈ జామ్ధాని చీరలులో ప్రత్యేకత ఏమిటంటే పట్టులో జరీ  కలసిపోయి చీర వెనుక వైపు ముందు వైపు ఒకేలా ఉండటం అంటే జరీ తోనే డిజైన్ రావడం మరియు అది కట్ చేయకుండా ఉండటం వల్ల జరీ పోగులు గట్టిగా పట్టుకుని పీకినా కూడా బయటికి రావు శరీరానికి గ్రుచ్చుకుని ఇబ్బంది పెట్టవు అలాగే రకరకాల రంగుల్లో డిజైన్ ని నింపేస్తారు. డిజైన్ లో మలుపులు తిరిగిన దానిని బట్టి ముప్పయి మలుపులు, ఏబై మలుపులు వంద మలుపులు ఉంటాయి . ఆ తయారీ విధానం ని బట్టే చీర రేటు ఉంటుంది

 నేను 20,000 రూపాయల ఖరీదు అయిన  చీరల కొరకు  కొనుగోలు చేసాను. పట్టు పినిషింగ్, డిజైన్స్ అంతా బాగున్నాయి అలాగే మరొకటి గమనించాను "ఉప్పాడ " షాప్ లలో కూడా నకిలీ చీరలు  ఉన్నాయి అక్కడ కూడానా?  అనకండి.  అధిక లాభాల కోసం, డిమాండ్ ఎక్కువ ప్రొడక్ట్ తక్కువ కారణంగా "కంచి" లో తయారయ్యే ఉప్పాడ తరహా పవర్ లూమ్ శారీస్ ని  కొనుగోలు చేసుకుని వచ్చి ఉప్పాడ చీరలుగా చెలామణీ చేసుకుంటూ ఉండేవారు ఉన్నారు  నిజాయితీగా సప్లయ్ లేదమ్మా టైం పడుతుంది మళ్ళీ రండి అని మర్యాదగా చెప్పేవారు ఉన్నారు. అలాగే పట్టు నూలు కిలోధర మొదటి రకం కి రెండవ రకంకి   ఏడూ ఎనిమిది  వందల రూపాయలు తేడా  ఉంటుంది .  రెండవ రకం నూలుతో చీర తయారు చేసేవాళ్ళు ఉన్నారు అది నిశితంగా గమనిస్తే తప్ప తెలియదు. ఒక చీరకి ఒక కేజీ బరువు వస్తే  నూలు ధరలోనే ఏడెనిమిది వందలు మిగుల్చుకునే వ్యాపార మెలుకువలు అక్కడ రాజ్య మేలుతున్నాయి

మనం నాణ్యత రంగు డిజైన్  చెప్పి చీర తయారు చేయిన్చుకోవాలంటే కనీసం మూడు నెలల ముందు ఆర్డర్ పెడితే తప్ప మనకి సప్లై చేయలేమని చెప్పారు. అది కూడా ఎక్కువ  మొత్తం లో కొంటేనే  తయారీ చేసి ఇవ్వగలం అని చెప్పారు.

ఒక చేనేత కార్మికుని కొడుకు కొత్త దారులు వెదుక్కుంటూ చేసే పనిలో అంకితభావం చేకూర్చుకుని సంప్రాదాయ వృత్తికి హంగులు అడ్డుకుని కాస్తంత కళాత్మకత జోడించి నాణ్యత అనే నమ్మకాని జొప్పించి తన ఇంటి ప్రక్కనే కొన్ని షెడ్ లు వేసి తన తోటి కార్మికులతో చీరలు తయారు చేయించి ఉప్పాడ రాజ వీధిలో షాప్ నిర్వహించుకుంటూ అతి సాధారణంగా ఉండే ఈ యువకుడిని చూస్తే ముచ్చట వేసింది

వ్యాట్ టాక్స్  పై నిరసనగా సమ్మె జరిగే సమయంలో మేము కావాలనే ఉప్పాడ వెళ్ళాము . ఎందుకంటే అప్పుడైతే జన సందోహం ఉండదు కావలిసిన రంగులు,అసలు సిసలు అయిన చీరలు దొరుకుతాయని మాస్టర్ వీవర్స్ కి ఫోన్ చేసి గృహం లో అమ్మకం జరుపుతామని చెప్పిన తర్వాతే అక్కడికి వెళ్ళాం. అక్కడ వారి నిర్వహణా సామర్ధ్యం,పని తనం ఇంకా అక్కడ ఉన్న స్టాక్ చూసి ఆశ్చర పోయాము. వర్తకం  నడిచే రోజుల్లో అన్ని రంగులు డిజైన్స్ దొరకడం అసాధ్యం కూడా  "వెంకట రమణ " అనే ఈ యువకుడు తన ఇంటిలో వ్యాపారం నిర్వహించారు

రాత్రి ఏడూ గంటలు సమయం అప్పుడు అతని  స్వంత మగ్గాలు చూపించారు (వర్క్ షాప్ ) అక్కడ కొంత మంది బాల కార్మికులు కనిపించారు . లేబర్ యాక్ట్ ప్రకారం నేరం కదా అంటే .. లేదు మేడం గారు వాళ్ళు పగలు స్కూల్ కి వెళతారు ఇప్పుడు నేత పని నేర్చుకుంటారు. అలా నేర్చుకోకపోతే పని రాదు కదండీ . పని నేర్చుకోకపోతే ముందు తరాలకి చేనేత వస్త్రాలు అంటే తెలియవు కదండీ అని చెప్పాడు . నిజమే కాదా! ఆ మగ్గం పని నేర్చుకుంటున్న వీళ్ళే భావితరాల నేతగాళ్ళు. వీళ్ళ చేతుల్లో ఎంత అద్భుతమైన పని తనం దాగుంటుందో అనిపించింది ప్రతి చోట నిబంధనలు చట్టాలు గిరిగీసుకుని ఉంటె ఏమి చేయలేం, ముందు తరం వారు నేర్చుకోలేరు అని చెప్పారు. అందుకే అలా రాత్రి సమయాలలో పిల్లలు కనబడతారు

అలాగే  నాకు తెలిసిన ఒక యువకుడు మద్రాస్ లో సాఫ్ట్ వేర్  ఉద్యోగం  చేస్తూ నెలకి 65000 జీతం పుచ్చుకుంటున్న ఉద్యోగాన్ని వదిలేసి తండ్రికి సాయంగా ఉండటానికి వచ్చేసాడు. వారికి ముప్పై సొంత మగ్గాలు ఉన్నాయి

మన సంప్రాదాయ వృత్తులని వదులుకోకూడదవి  ఉద్యోగం వదిలేసి  వచ్చేసాను. మనం ఉపాధికోసం ఎక్కడెక్కడో  వెదుక్కుంటున్నాము, డబ్బు సంపాదించడం కన్నా మన జీవన విధానం ముఖ్యం కదా ! బహుళజాతి సంస్థల ఆధిపత్యం కి మనమే రాచబాట వేస్తున్నాం,  మనం ఇంకా ఎక్కడ అభివృద్ధి చెందుతాము.? అందుకే నేను ఇలా వచ్చేసానని ఆ యువకుడు చెప్పాడు

అవును కదా!  తరతరాల మన సంప్రదాయ వృత్తులని నిర్లక్ష్యం చేసి పరుగులేత్తుతుంది  మనం కాదా!? అనిపించింది

ప్రభుత్వ సాయం,ప్రజల ప్రోత్సాహం లేకుంటే ఏ కళ  అయినా ఏ వృత్తి అయినా కనుమరుగవుతాయి. అది నిజం

కేవలం ఉప్పాడ ఖరీదు అయిన చీరలే కాదు సాధారణమైన నూలు చీరలు ఉన్నాయి అవి కూడా కొనుక్కుని మనం కట్టుకోవడం అలవాటు చేసుకుంటే బావుంటుంది కూడా. చేనేత కార్మికులకి పని లభిస్తుంది కేవలం పట్టు చీరలు కొంటె వ్యాపారులకే లాభం మరి లాభాలలో అణాకాణీ  కూడా పనివారాలకి వెళ్ళదు అన్నది నిజం

అలాగే నేను గమనించిన విషయం మరొకటి ఉంది  ఉప్పాడ  లో మాస్టర్ వీవర్స్ దగ్గర బయట షాప్ లలోను కూడా ఒకే విధమైన ధరలు ఉన్నాయి అందరూ అక్కడ ధరవరల ల విషయం లో ఒకే విధానం తో నడుచుకుంటారు. నాణ్యత., పనితనం  చూసి చీరలు కొనుక్కోవాలి లేకపోతే  మోసపోగలరు  చేనేత వారి గురించి ఇంకా కొన్ని విషయాలు వారి మనసులో మాట వ్రాయాలని ఉంది.  మరి కొన్ని విషయాలు మరొక పోస్ట్ లో చెప్పుకుందాం . ఇప్పటికి స్వస్తి

(ఇక్కడ నేను చీరల ధరలు పొందు పరచడం లేదు అది వ్యాపార దృకోణం. నాకైతే ఇబ్బంది లేదు కాని నా తోటి వ్యాపారస్తుల కి హాని చేయకూడదు కదా! ఇప్పటికే ఉప్పాడ చీరలు ఓపెన్ మార్కెట్ అయిపొయింది అక్కడ ఎంత? బయట ప్రాంతాలలో  షాపులలో   ఎంత అన్నది తెలిసిపోతూనే ఉంది. అందుకే వెంటనే ఇమిటేషన్ చీరలు వచ్చి రాజ్యం యేలుతున్నాయి ఉప్పాడ  లో షాప్ లలో సహా!  అలాగే  అక్కడ  ప్రస్తుతం ఉన్న రకాలు అన్ని పరిచయం చేసాను  ఇంకా ఎక్కువ పరిచయం చేయాలని ఉన్నా కూడా మీరు చూసేటప్పుడు బ్లోగ్ ఓపెన్ అవడం ఆలస్యం అవుతుంది  కష్టం అవుతుంది కాబట్టి )

 దేశ విదేశాల లో ఉన్న సోదరీ మణులారా ! మీకు ఏమన్నా గైడ్ లైన్స్ కావాలంటే  ఈ e చిరునామా కి మెయిల్ చేయవచ్చు harivillucreations7@gmail .com  నా వీలుని బట్టి మీకు సమాచారం అందజేయగలను


జామ్దానీ చీరలు 


కలనేత చీర 3 రంగులు 




ఇక చాలండి .. మరి కొన్ని ఇంకో పోస్టులో . (అచ్చు తప్పులు ఉంటే  క్షమించేయండి .. ప్లీజ్ ప్లీజ్ !! బాగా బిజీ )

12 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

మీ పోస్ట్ చూసి నేనిప్పటి వరకు ఒక్క ఉప్పాడ చీరైనా కొనుక్కోలేదే అని ఫీల్ అవుతున్నాను .

జయ చెప్పారు...

ఉప్పాడ చీరలా! ఎంత అందమైన చీరలో, బాగానే పోగేసా. మీరు చూపించిన చీరలు కూడా చాలా బాగున్నాయి.ఈ సారి మీదగ్గిర కొట్టేస్తా ఉండండి:)

జలతారు వెన్నెల చెప్పారు...

కళ్ళు జిగేల్ మనిపించే రంగులు, డిసైన్స్. ఎప్పటిలాగే ఉప్పాడ చీరల మీద మీ పోస్ట్ లో చాలా విషయాలు చెప్పారు.
మగ్గల మీద నేసే నేతగాల్లను చిన్నతనం నుంచి చూసాను మా ఊరిలో.ఈ ఉప్పాడ చీరల బూం వలన, మా ఊరిలో కూడా,అకస్మాత్తుగా చాలా మంది వీరి దగ్గరకి వెళ్ళి మూడు నెలలు ముందుగా ఆర్డర్స్ ఇచ్చి వస్తున్నారు.

హితైషి చెప్పారు...

మొదటగా మీకు జేజేలు. ఉప్పాడ చీర అంతు చూసినందుకు అభినందనలు. మీ వ్రాసే విధానమే ప్రత్యేకం. కలెక్షన్ చాల బావున్నాయి. అంశం" చీర " ఐనా.. సమాజంలోని కళాత్మకమైన జీవన విధానాన్ని మీదైన శైలిలో పరిచయం చేసారు. మీ ఓపికకు మరోసారి జేజేలు పలుకుతూ .. ఓ మాట... నాకు ఏ చీర ఇవ్వాలనుకుంటున్నారు? కామెంట్ కో చీర బహుమతి పెట్టండి.

Padmarpita చెప్పారు...

మీ పోస్ట్ తో పాటు చీరల సెలక్షన్ కూడా చాలా బాగుందండి.

రాధిక(నాని ) చెప్పారు...

చాలా బాగుందండి బాగా చెప్పారు .ఏ ఫంక్షన్ లో చూసినా ఈ చీరలే .మొదట్లో రేట్లు బాగా ఎక్కువ వెరైటీ తక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు అన్నీ రేట్లలోను అందుబాటులో ఉంటున్నాయి.చీరలు బాగున్నాయి

Dantuluri Kishore Varma చెప్పారు...

ఎప్పటిలాగే చాలా బాగా రాశారు. మీకు అభ్యంతరం లేకపోతే నా బ్లాగ్ లో రీ పోస్ట్ చేస్తాను.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మాలా కుమార్ గారు అర్జంట్ గా ఒ.ంఅంచి ఉప్పాడ చీర కొనేసుకొండి తర్వాత మీ వార్ద్రోబ్ అంతా ఉప్పాడ చీరలతో నిండి పోతుంది :)

జయ గారు .. తప్పకుండా ! ఇప్పుడు సెవెన్ కలర్స్ ప్యాషన్. ఆర్డర్ లో ఉంది తప్పకుండా మీకు ఇస్తాను అయితే మా ఇంటికి మీరు రావాలి. నా ఆతిధ్యం అందుకోవాలి కూడా !

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీ గారు . (జలతారు వెన్నెల ). అయితే మీకు మన చేనేత పరిచయమేనన్న మాట. గుడ్ . మరి మీరు తళుక్ మనండి.

మీ స్పందనకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పద్మార్పిత గారు థాంక్ యు! ఈ సారి మీ చిత్రంలో ఉప్పడ చీర కట్టిన స్త్రీ మూర్తి చిత్రం కనబడాలి. లేకపోతె నేను ఊరుకోను . :) థాంక్ యు సో మచ్ .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాధిక నాని గారు .. మీరన్న మాట నిజమ్. మీ స్పందనకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వైష్ణవి .. ఈ పోస్ట్ వ్రాయడానికి పిక్స్ పెట్టడానికి నాలుగు గంటలు పట్టింది. మీ ప్రశంస తో నా శ్రమ అంతా మర్చి పోయాను.

ఉప్పాడ చీరలపై ఒక వ్యాసం వ్రాడ్డామనుకున్నాను కానీ వ్రాయడం మొదలెట్టాక రూపం మారిపోయింది

ఈ పోస్ట్ మీకు నచ్చినందుకు ధన్యవాదములు

కామెంట్ కి ఒక చీర !? బాబోయ్!!!!! :)