ఏకాంతానికి పంచ ముఖాలు
అదేమీ లెక్క అనకండి .. ఇంకెక్కడైనా అంతకన్నా తక్కువ ఉండొచ్చు మీదు మిక్కిలి ఉండొచ్చు ఇక్కడ మాత్రం ఇంతే ! ఈ అయిదు ముఖాలలో నేను ఉన్నాను.
మనందరికీ తెలిసిన విషయమేమంటే ... కొంతమంది సమూహంలో కూడా ఏకాంతం లోకి వెళ్ళిపోగలరు, వేరొకరు ఏకాంతంలో కూడా సమూహాన్ని దర్శించుకోగలరు
ఏకాంతమంటే నేను నాతోపాటు ఊహలలో నాకిష్టమైన వ్యక్తీ అనికూడా కొందరు వ్యక్తీకరించవచ్చు
"జిహ్వకొక రుచి పుర్రెకొక ఆలోచన" అంటారు కదా ! ఏ ఒక్కరి వ్యక్తీకరణ ఒకేలా ఉండదు. అది కవిత్వంలో అయితే మరీ భిన్నంగా ఉంటుంది. భిన్న వ్యక్తీకరణలో ఏకాంతాన్ని అందంగా చెప్పిన ఐదుగురి కవిత్వమే "కవిత్వం లో ఏకాంతం".
ఈ అయిదుగురి కవిత్వాన్ని నిష్పక్షపాతంగా సమీక్షించిన సీనియర్ కవి" శ్రీనివాస్ వాసుదేవ్ "గారు , థీమ్ కి తగ్గ చిత్రాన్ని అందించిన krishna Ashok గారికి హృదయపూర్వక ధన్యవాదములతో
ఈ లింక్ లోని కవిత్వాన్ని చదివి ఈ వినూత్న ప్రయోగం ని చూసి మీ మీ స్పందనల్ని తెలపాలని కోరుకుంటూ మీముందు ఉంచు తున్నాను

2 కామెంట్లు:
చాలా చక్కటి కవితలు పరిచయం చేసారండి వనజ గారు. ఎప్పుడూ చదువుకోవాలనిపిస్తోంది.
ముందుగా
1. సాయి పద్మ
ఏకాంతం గురించి చక్కగ చెప్పారు , అది అడిగితే , ప్రార్ధిస్తే , నెట్టబడితే లభ్యమయ్యేది కాదని ,
సంభవమనిపిస్తూ ,అసంభవంగా యోగంలా మారిందని , చివరగా ఓ
ఒంటరి స్వరంగా మిగిలిపోతుందని .
ఏకాంతం కావాలని అడక్కండి ఎవర్నీ
ఏకాంతం కోసం ప్రార్ధించకండి ఎవర్నీ
ఏకాంతం లోకి తోయబడకండి దయచేసి
ప్రస్తుతం ఏకాంతం సంభవంలా అనిపించే అసంభవ యోగం
అంచెలంచెలుగా అలవోకగా అవరోహిస్తున్నా
షడ్జమ సంయోగం జరగని ఓ ఒంటరి నిషాదం
2 . కవితా చక్ర : ఏకాంతం ఓ కంతగా కాకుండా సామ్రాజ్యంగా భావించవచ్చని చక్కగా తెలియచేశారు .
ఓ(నా)ఏకాంత సామ్రాజ్యమా..
ఈ కాంతకు నువ్వు చెంత ఉంటే ,
కోటిరాగాల అనూరాగ ఝరి!!
3 . పూర్ణిమా సిరి కవితలో పద కూర్పు చాలా బాగుంది .
పగటి వర్షం పరవశింపచేస్తే
రాత్రి వర్షం దిగులురేపుతోంది
ఈ రాతిరికి మరో పగలుందికదా అని
ఆలోచనల ఆత్మీయ అనునయం .
ఊహలా నువుపక్కనున్నా
సమూహంలో కూడా ఏకాంతం
4 . వనజ తాతినేని కవిత ప్రారంభం నుంచే అమిత చక్కగా వర్ణించారు అనటం కంటే ప్రశ్నించారు
అనటం సబబు .
ఏకాంతమంటే
ఏకాకి తనం అని ఎవన్నారు ?
ఏకాంతమంటే ..
నాలోకి నేను తొంగి చూసుకునే
శత సహస్ర దర్శనం
ఆత్మని ఆలింగనం చేసుకున్నప్పటి
అపురూప దివ్య దర్శనం
కాకుంటే , ఈ క్రింద రెండు లైన్లకి పొంతన కుదరలేదు , అనుకున్న భావాన్ని పూర్తిగా వ్యక్తీకరించ
లేకపోయారేమో అన్పిస్తున్నది .
వేదనలెప్పుడూ మనసు పొత్తాన్ని తడిపేసినట్లు
ఏకాంతమెప్పుడూ వెలుగులోకి రాని కాసారమే .
5 . జయశ్రీ నాయుడు
కవిత అంత సులభంగా అర్ధమయ్యే రీతిలో లేదని పరిశీలించిన వారితో ఏకీభవించక తప్పదు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి