30, సెప్టెంబర్ 2024, సోమవారం

కృతి

శ్రీకృష్ణదేవరాయల పట్టమహిషి తిరుమలదేవి

ఆమెకు రాయల వారితో వివాహం జరిగిన పిమ్మట అతను మరొక స్త్రీ ని వివాహంచేసుకోవడానికి అనుమతి కోరడం ఆమె అంగీకారం లేకపోయినా రాజ నర్తకి చిన్నాదేవిని వివాహం చేసుకోవడం మూలంగా కల్గిన ఎడబాటు ఆమెలో చెలరేగిన భావాలు వ్యధ ఆత్మపరిశీలన గురించి ఉత్తమ పురుష కథనంలో కృతి కథ  నడుస్తుంది. తన  అరణం కవి నంది తిమ్మన రాసిన కావ్యం కృతి (పారిజాతాపహరణం) గురించి  చెపుతూ.. ఆ కావ్యంలో కూడా  ఆడవారు తమ అహంభావాన్ని తగ్గించుకోవాలని వొకవేళ వారు ఆ అహంభావాన్ని తగ్గించుకోకపోయినా భర్త వారిని క్షమించి ఆదరించాలని అన్యాపదేశంగా చెప్పడం తిరుమలదేవికి బాధ కల్గిస్తుంది. అరణపు కవి కూడా ధర్మ అధర్మ విచక్షణ లేకుండా రాజు యొక్క ప్రాపకం ఆదరణ కోసం ప్రాకులాడుతూ కావ్యం రాసి రాజు కు సమర్పిస్తాడు తప్ప తన తరపున నిలబడనందుకు బాధపడుతుంది. రచయిత రాధ మండువ ఈ కథలో నాయిక తిరుమలదేవి స్త్రీ హృదయ వేదనను   ఆత్మపరిశీలన ను  అభిజాత్యాన్ని  నిసృహ ను నిబ్బరాన్ని దృఢచిత్తాన్ని ఏకకాలంలో ప్రతిబింబించారు. తిరుమలదేవి ఆత్మపరిశీలన తోనే తనను తాను సంస్కరించుకుని పట్టమహిషిగా చరిత్రలో నిలిచిపోయారు.  కాలం ఏదైనా స్త్రీలు తమను తామే సంస్కరించుకుని దృఢంగా నిలిచివుంటారని ఈ కథ మనకు చెపుతుంది. 

కథ వినండీ..



కామెంట్‌లు లేవు: