తృతీయ ప్రకృతి -వనజ తాతినేని
"అమ్మా నే చెపితే వినవేమ్టి ! నేను ఇప్పుడు మధు ని కాదు, మధుబాలని . నేను అమ్మాయిగా మారిపోయి మూడేళ్ళు అయింది మీరందరూ ఇప్పుడిట్టా మదూ మధూ... అని పిలుస్తా ఉంటే నాకు ఎలర్జీ ! నేను అమ్మాయిని మధుబాల అని పిలువు " చెప్పింది ఆమె
చేతిలో ఉన్న కొత్త పేంటు చొక్కాని విసిరి పారేసి “నా ఖర్మ రా.. పుట్టినప్పుడు మగ లంజ కొడుకువుగానే పుడితివి గదరా,పదేళ్ళు వచ్చేదాకా తాడిచెట్టుని నిలబెట్టినట్టు నిలబెట్టి నేనే నీళ్ళు పోసినాను కదరా! గడ్డలు మీసాలు వచ్చినాయి ఇంకా నువ్వు ఆడగా ఉండింది ఎక్కడరా .." అడిగింది .
" నేను బొంబాయిలో ఆడదానిగా మారిపోయా .." చెప్పింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి