రచన రచయిత యొక్క నీడ అంటారు. అది ఒక అభిప్రాయం మాత్రమే కావచ్చు. నేను కొంతమంది కి దూరంగా ఉంటాను.
దూరం / Distance
కొంతమంది మనుషులను చూస్తే ఆధునికత ఉట్టిపడే విధంగా వుంటారు
రాతలు చూసే చాలా ప్రోగ్రెసివ్ గా వుంటాయి. వారి స్వభావం గమనిస్తే ప్యూడల్ కంపు కొడుతుంది.
వారి చేష్టలు చూస్తే పిలుపులు వింటే పితృస్వామ్య భావజాలం జాలువారుతుంది
ఆ దుర్గంధం భరించలేం.
వాళ్ళెవరంటే .. రచయితల్లో మనుషులు
మనుషుల్లో రచయితలు.
దూరంగా వుండండి. ఎంత దూరంగా అంటే.. సత్యానికి అసత్యానికి ఉన్నంత దూరంలో.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి