7, డిసెంబర్ 2025, ఆదివారం

దుఃఖం ఒక మేల్కొలుపు

 దుఃఖం ఒక మేల్కొలుపు -వనజ తాతినేని 


ప్రేమ దుఃఖాన్ని అనుభవించిన వారు

జీవితంలో వచ్చే ఏ దుఃఖాన్ని అయినా 

ఎదుర్కొనగలరు.


విఫల ప్రేమ కథలు గుర్తున్నట్టు సఫల ప్రేమ

కథలు జ్ఞప్తిలో వుంటాయా?


యుగాల నుండి ప్రేమ మనుషులను ఆటబొమ్మలను

చేసి జీవితాలతో ఆడుకుంటుంది. 


ఎవరో జ్వాలను రగిలిస్తారు. 

మరెవరో దానికి  దగ్ధం అవుతారు. 


ఎండిన చెట్టు కొమ్మలపై పక్షి గూడు కట్టినట్టు 

ప్రేమ ఔచిత్యాన్ని మరిచి వలపు

సౌధాలు నిర్మించి కూలిపోతుంది.


మానవులు శాశ్వత జీవితం కోరుకుంటారని ప్రేమ ద్వేషం

అనే భావాలను శ్వాస నిశ్వాస లగా మార్చి పంపాడు భగవంతుడు. 


ప్రేమికులపై జాలి పడండి. 

శిశిరం తర్వాత వసంతం వస్తుందని దైర్య వచనాలు పలకండి.


వీలైతే కవులతో స్నేహం చేయమనండి.

వారు అక్షరాలపై ప్రేమతో  ఎలా వెలిగిపోతారో చూడమనండి. 


ప్రేమ పొరుగువాని పసి కూన.




కామెంట్‌లు లేవు: