23, జనవరి 2011, ఆదివారం

నేనెందుకు వ్రాస్తున్నానంటే..

నేను ఎందుకు వ్రాస్తున్నాను అంటే..!?  

మన మనసులోని భావాలు కొందరితో  మాత్రమే పంచుకోగలం.అలా పంచుకోలేని భావాలను వ్రాసుకోవడం తప్ప ఏమి చేయజాలము. ఆ వ్రాసుకోవడం కూడా చేయలేక పోతే... ఏదో తెలియని అనిశ్చితి. 

స్వీయ అనుభవాల్ని,మన ఆలోచనలని,నేర్చుకున్న జ్ఞానాన్నినలుగురితో పంచుకోవాలి కదా! పంచుకుంటే పెరిగేది జ్ఞానం.మనిషి పుట్టిన దగ్గరనుండి నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవాలంటే ప్రశ్నించాలి. 

ప్రశ్నించడమంటే.. కొందరికి నచ్చదు.  ఎందుకని నచ్చదు అంటే.. జెండర్  సేన్సిటివిటి .నిజం! ఎంతో  సున్నితనైన  ఆలోచనలు, గాడమైన అనుబంధాలు ఉన్న కుటుంబ సభ్యులకి  కూడా..ఆడవాళ్ళూ ప్రశించడం నచ్చదు. 

ఆడవాళ్ళ ఆలోచనలు గడ్డిపరకలతో సమానం. ఆడవాళ్ళూ ఇప్పటికి చీరలగురించి,కుటుంబాల గురించి మాట్లాడుతూనే ఉండాలి ప్లస్ ఇంకా  మాట్లాడుతున్నారు. 

ఆడవాళ్ళు  అంతకన్నా ఎదగడం అసంభవం  అనే భావన కొందరి పురుషులది, మరి కొందరి  ఆడవాళ్లది కూడా.

జీవితంలో.. వాటికీ భాగం ఉన్నప్పుడు  మాట్లాడితే తప్పు ఏమిటి? ఇన్ క్లూడింగ్ వాటితో ..సహా.. స్త్రీలు చాలా తెలుసుకుంటున్నారు. వాటి గురించి చెప్పుకోవడానికి... ఒక వేదిక కావాలి..  ఆవేదిక లో.. భాగం  బ్లాగ్ కూడా.. 

గుండు సూది తయారి నుండి.. అంతరిక్ష ప్రయాణంలో వరకు.. స్త్రీ పని భాగస్వామ్యం లేకుండా..ఏ పని జరగడం లేదు. అయినా.. ఇంట్లో మాత్రం ఆడవారు మాట్లాడటం ప్రశ్నించడం నిషిద్ధం. తాతల తరం నుండి,తండ్రుల తరం నుండి,సహోదరుల తరంలోనూ, ఆఖరికి కడుపున పుట్టిన బిడ్దల నుండి కూడా  ఆజ్ఞాపించడం హక్కుని చేసుకున్న వాళ్ళ తీరుని ప్రశ్నించడానికి.. నేను వ్రాస్తాను.

బయట మాత్రం సంస్కారం  ముసుగు వేసుకుని స్త్రీల అభివృద్ధిని నోటితో.. మెచ్చుకుని నొసటితో వెక్కిరించడం  చేసేవాళ్ళని చూస్తూ..భరించగలగటం ఎంత కష్టం . మీ మెదడు మోకాలిలో ఉంది .. మీ తెలివితేటలు ఇంతే! అని హేళన చేసినట్లు ఉండే వారికి సమాధానం చెప్పటానికే నేను వ్రాస్తాను.

చదుకుని ఇంటా-బయటా చాకిరీ చేసే మహిళలకి  ఎన్నెన్ని హర్ట్స్,పెయిన్స్ ఉంటాయో! ప్రపంచంలో.. మనిషికి మనిషికి ఉండాల్సిన  సంబంధం గురించి  కుటుంబ సభ్యుల మద్య  ఉన్న అనుబంధం  గురించి కన్నా ఎక్కువ ఆలోచించాలి. ఇల్లు ఆడవారికి.. భద్రతే కాదు ఇంకో కోణంలో జీవిత ఖైదు కూడా.. స్వేచ్చా భావన లేని నరక కూపంలో.. మగ్గే  స్త్రీలని చూసాక వాళ్ళ గురించి వ్రాయాలనుకోవడం తప్పు కాదే!?  ఆడవాళ్ళని భద్రత పేరిట సంప్రదాయాల పేరిట ఇతరులతో కలవనీయకుండా.. గిరి గీసి కూర్చోపెట్టే.. పెత్తందారితనం గురించి ప్రశించడం, అన్నీ తెలుసుకోవాలనుకోవడం తప్పు ఎలా అవుతుందీ? 

మన కన్నా ముందు ఎంతో మంది సహృదయులు  మహిళల పట్ల సానుభూతితోనో .. లేదా సమాజ అభ్యున్నతి  ఆకాంక్షించో.. స్త్రీల  తరపున  వకాల్తా  పుచ్చుకుని వ్రాసి.. ఒక బాట చూపారు. తర్వాత.. మనుషులుగా జీవించడం నేర్చుకున్న స్త్రీలు వాళ్ళ గురించే కాదు.. ప్రపంచంలో జరిగే అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకుని వ్రాయడం మొదలెట్టారు. అందుకే  కథ, కవిత, వ్యాసం , గల్ఫిక , నాటిక,నవల, పద్యమో,గద్యమో  ఏదో ఒకటి వ్రాస్తున్నప్పుడు వాళ్ళకి  వ్రాసే స్వేచ్చ కూడా లేని  వెనుకబాటుతనంని మనం ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుందో.? 

నాకు అర్ధం కానప్పుడు.. నా ఆలోచనలని.. కాగితాలపై.. వ్రాయడం తప్పు అయిందని  అన్నప్పుడు  నేను ప్రశ్నించాను. అరువు గొంతుకలు  తొ..జీవన పర్యంతం ఎలా బ్రతకగలం?. "'ఎదురు తిరిగితే పోయేది ఏమి లేదు ఎనకబాటుతనం తప్ప" అన్న డైలాగ్ గుర్తుకోస్తున్నప్పుడు.. వ్రాస్తూ ఉంటాను. ఇంకా ఏమి  వ్రాయనే లేదు.( ఎందుకు ఈ.. బ్లాగుల రాత? ఏముంది  అందులో.. అవహేళనకి  స్పందించి..)

నా.. కవితలు చూసినప్పుడు.. చాలా మంది.. స్త్రీల పక్షపాతిని అని తీర్మానించాక .. అలా  అన్నవారివి పాషాణ హృదయాలని నిర్ధారించుకుని.. సమస్యని.. స్త్రీ పురుషుల భేదంతో చూడకూడదు  ఇద్దరు సమానమే.. అలా చూడటమే మనిషి తనం +మానవత్వం కూడా  అనిపించుకుంటుంది.. అని చెప్పటానికి మళ్ళీ వ్రాసాను. అలాగే.. ఇప్పుడూ వ్రాస్తాను.

నా కోసమే కాదు నా ఆలోచనలని హర్షించేవారి  కోసం కూడా..నేర్చుకుంటూ.. వ్రాస్తాను.  ఇష్టం అయితే చూడండీ! లేదంటే  మానేయండీ!!! స్త్రీల తెలివితేటల మీద చిన్న చూపు ఉన్న వారికోసం వ్రాయాలి కనుక వ్రాస్తాను.అందుకే .. నా..ఈ.. వ్రాత.       

2 కామెంట్‌లు:

భారతి చెప్పారు...

వనజగారు!
"అంతరంగమాలిక" లో కొన్ని పోస్ట్స్ (ఐదు 'వ'కారముల చేత, ఐయాం నాట్ పర్ఫెక్ట్, హిత వాక్కులు నచ్చేనా?, మురికి మనసు, స్కెచ్ పెన్ - కక్షసాధింపు, సీతాకోకచిలుక... అందం.., ఐయాం ఎ కామెన్ వుమెన్, మా అ(త్త)మ్మ .... మాతృదేవోభవ, ఇన్నర్ లాంప్, నేను ఎందుకు వ్రాస్తున్నాంటే ...... ఇత్యాదులు)చదివానండి.
కొన్ని వాక్యాలు చదువుతుంటే నా అంతరాగాన్నే ఆవిష్కరించినట్లుగా ....
కొన్ని వాక్యాలు చదువుతుంటే నా ఆలోచనలను సరిచేస్తున్నట్లుగా .....
మరికొన్ని చదువుతుంటే స్ఫూర్తిదాయకంగా .....
అద్భుతంగా ఉన్నాదండి 'ఈ "మీ" మా అంతరంగమాలిక.
చక్కటి పోస్ట్స్ అందించినందుకు హృదయపూర్వక అభినందనలండి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భారతి గారు.. ఎంతో ఓపికగా నా బ్లాగ్ లో చాలా పోస్ట్ లు చదివినందుకు మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదములు.

మీ అభినందలకి మరీ మరీ ధన్యవాదములు.