బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మము తానెని పాదము
చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము
పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము
అన్నమాచార్య కృతి
స్వరార్చన: విదుషీమణి "భారత రత్న" ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి
ఇక్కడ వినండీ ..చూడండీ..
8 కామెంట్లు:
bagundandi photola kosam chala srama paddattuga unnaru. pata vinnapati kanna photola tho chusinappudu baga artham avutundi
మురళీ గారు.. ధన్యవాదములు.ఒక చిన్న అమ్మాయి ఆ కృతికి అర్ధం అడిగింది. నేను..నిజంగానే..పిక్స్ కస్టపడి సేకరించాను. తర్వాత వీడియోలో చూస్తే..ఆ పిక్సే ఉన్నాయి.బాగా సంతోషం...మీ ప్రశంస కూడా సంతోషం.
ఇటువంటి పాటలకి అర్ధాలు అందరికీ తెలియవు. ఈ చిత్రాలు చక్కగా తెలియచేస్తున్నాయి. అందమయిన కీర్తనకి మీ చిత్రాలు వన్నె తెచ్చాయి.
ఆడియో ఇస్తారో ఇవ్వరో అనుకున్నా..
సుబ్బులక్ష్మి గళం నుంచే వినాలీ పాటని!!
అన్నట్టు ఫోటోల అయిడియా బ్రహ్మాండంగా ఉందండీ..
రసజ్ఞ మీకు నచ్చినందుకు ధన్యవాదములు.
@మురళీ గారు ధన్యవాదములు. ఒకోసారి మాట కన్నా, వ్రాత కన్నాచిత్రం ఎక్కువ అర్ధం చెబుతుందని..ఇలా..వచ్చాను
ప్రయాసకోర్చి చేసిన ప్రయత్నం బాగుంది
ఇలాంటివే మరి కొన్ని చేసి అన్నమయ్య కీర్తనల సౌరభం అందరికీ పంచండి.
బాగుంది మీ picture concept. టైటిల్ చూడగానే ఎక్కడ నాతో పోటీబడుతున్నారో అనుకున్నా :)
మీరన్నట్లు, "ఒకోసారి మాట కన్నా, వ్రాత కన్నాచిత్రం ఎక్కువ అర్ధం చెబుతుంది". చిత్రసత్యం ఇది!
పాటకు పిక్స్ చాల బాగా పెట్టారు, చాల బాగుంది ,
కామెంట్‌ను పోస్ట్ చేయండి