నువ్వు వస్తానంటే..నేనొద్దంటానా !? అనేది ఈ తరం వారి ఆనవాయితీ ఏమో కానీ..
ఒకప్పటి ఈ పాట.. యెంత మంది నోళ్ళలో మధురంగా నాని.. ఏ చుట్టమో..ఆత్మీయులో ఇంటికి చెప్పా పెట్టకుండా విచ్చేస్తే..ఈ పాట ని గుర్తుకు తెచ్చుకునే విధంగా .. ఉంటుంది ఈ పాట. అత్యంత సహజాతి సహజంగా..వ్రాసిన ఈ పాట ..పాలగుమ్మి పద్మ రాజు గారి సాహిత్యం.
ఇప్పుడైతే ఓ.. ఫోన్ కాల్ చేసి రాకూడదూ..అంటాం. కాల్ చేయకుండా వచ్చేవారు..మర్యాద తెలియని వారు. వారికి జరపాల్సిన మర్యాదల విషయం అటుంచి.. మన పనులు అటకెక్కి కూర్చుంటాయని మనసులో పీకులాట. లేదా ఎక్కడికో వెళ్లాలనుకుని సిద్దం అయినాక అతిధి వస్తే.. పొమ్మనలేక పొగ పెట్టడానికి పొయ్యిలు ఎక్కడున్నాయి చెప్పండి?మహా అయితే కావాల్సి వస్తే. టీ వి పెట్టి.. తెగ చానల్స్ మార్చేయడం లేదా..పిల్లలని విసుక్కోవడం చేస్తే చాలు వచ్చిన వాళ్ళు పరారవుతారని ఒక శ్రేయాభిలాషి రహస్యం చెప్పారు లెండి.
సరే..ఈ పాటలో చూస్తే..ఆమె .. రాకోయి అనుకోని అతిధి... కాకితో కబురైనా పంపకుండా రాకోయి అతిధి అంటుంది.
ఓ..కన్నె పిల్ల మనసులోనికి అనుకోకుండా హటాత్తుగా ప్రవేశించే వాడు.. అనుకోని అతిధి లాటి వాడు. వాకిట తలుపులు తెరవలేదు..(మనసు తలుపులు కూడా అనుకోవచ్చు)ముంగిట ముగ్గులు తీర్చాను లేదు ..అంటుంది. ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు ఇల్లు-వాకిలి పరిశుభ్రంగా లేకుండా.. వాకిట్లో..అందమైన ముగ్గు లేకుండా ఉంటె ఏం బాగుంటుంది. అందులో..వచ్చే వాడు..మనసెరిగిన వాడు అయితే..అతనికి ఆహ్వానం పలుకుతున్నట్లు మనసులో మాటతో..మనోహరమైన రంగవల్లిక వేసి ఆహ్వానించాలని అనుకుంటుంది కదా!
అలాగే సిగలో పువ్వులు ముడవాలంటే మల్లెలు విచ్చుకోనేలేదు..ఇంత ప్రొద్దుటే వస్తానంటే ఎలా? కాస్త పూలు పెట్టుకుని అందంగా..పరిమళాలు పంచుతూ.. నిన్ను ఆహ్వానిన్చవద్దు.అని అంటూ.. కన్నులకి కాటుక అయినా దిద్దుకోవాలనుకున్నాను.కానీ కాటుక లాటి చీకటిలోనే.. ఇంకా నిదర నీడలాగే ఉంది .. పాలు,వెన్నలు తేనే ఇవేమీ లేకుండా.. పంచ భక్ష్య పరమాన్నములు చేయనూలేదు. వేళ కాని వేళ వస్తే అతిధి సత్కారాలుఎలా చేయను!?. మధురమైన పదార్ధాలు లేకుండా విందు ఎలా ఇవ్వను.?
అందుకే రాకోయి అనుకోని అతిధి అంటుంది.
దారిన పోతూ పోతూ.. ఊరికనే ఓ..మారు చూసి పోదామని వచ్చావా? లేక నీ నడకలో..పనులలో అలసి అలసి సేద తీరాలని వచ్చావా?
ఒకవేళ ఒంటరిగా ఉన్నానని తెలిసి కూడా వచ్చావా? నేను నిన్ను లోనికి రమ్మనుటకు సాహసించి పిలువలేను. వలదని చెప్పలేను. వద్దని చెప్పడం కూడా మర్యాద కాదు కదా!ఈ వేళ కాని వేళలో..త్వరపడి రాకోయి అనుకోని అతిది..అంటుంది.
ఈ అందమైన ముగ్ధ మనోహర రూపం ఎంత బాగుందో.. పాట కూడా..అంత బాగుంటుంది.చూడండీ!!

శ్రీ రాజ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్
రాకోయి అనుకోని అతిధి
కాకి చేత కబురైనా పంపక
రాకోయి అనుకోని అతిది
వాకిట తలుపులు తెరువనె లేదు
ముంగిట ముగ్గులు తీర్చనే లేదు
వేళకాని వేళ
ఈ వేళ కాని వేళ ఇంటికి.. రాకోయి అనుకోని అతిది
సిగలో పువ్వులు ముడవాలంటే
సిరిమల్లెలు వికసింపనేలేదు
కన్నుల కాటుక దిద్దాలంటే
నిద్దుర నీడలా వీడనే లేదు
పాలు వెన్నెలు తేనే లేదు
పంచ భక్ష్యములా చేయనే లేదు
వేళ కాని వేళ ఈ వేళ కాని వేళ
విందుకు రాకోయి అనుకోని అతిధి
ఊరక దారిన పోతూ పోతూ
అలసి వచ్చితివో
ఒంటరిగా ఉన్నానని తెలిసి వచ్చితివో
రమ్మను టకు సాహసం చాలదు
పొమ్మనుటా మరియాద కాదది
వేళ కానివేళ.. ఈ వేళ కాని వేళ త్వరపడి

పెండ్యాల నాగేశ్వర రావు గారు స్వరకల్పన లో.. సుశీలగారు పాడిన పాట ఇది. నాకు చాలా ఇష్టమైన పాట.
చాలా రోజులుగా వీడియో కోసం వెదుకుతున్నాను. ఇవాళే దొరికింది.చూసి బాగుంటే ఓ..ముక్క చెపితే..జయప్రదని ఎంతగానో అభిమానించే నేను సంతోషపడతాను. అందులో..ఆమె బాపు బొమ్మ కూడా.. ఈ చిత్రంకి బాపు దర్శకత్వం. ఈ చిత్రంలో..పాటలన్నీ ఆణిముత్యాలే!
9 కామెంట్లు:
!! వనజ వనమాలి !! గారు మంచి సాంగ్ పరిచయం చేశారు ధన్యవాదములు
హాయిగొలిపే పాటని, దృశ్యాన్ని జతచేసి మరీ గుర్తుచేశారు. కూడా ఉన్న మీ వ్యాఖ్యానం కూడా!
"రాకోయి అనుకోని అతిధి.." ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.
బాగుందండి....చాలా చక్కగా రాసారు .......good luck
మంచి పాటను మీ చక్కని వ్యాఖ్యానంతో పరిచయం చేశారు బాగుంది..
ఈ పాటలో జయప్రద చాలా బాగుంటుంది..
manchi song...anta kante teeyani parichayam....vahva
మంచి పాటని పరిచయం చేసారండీ.. దానికి మీ వ్యాఖ్యానం తోడై ఇంకా మధురంగా అనిపించింది.
రాకోయి అనుకోని అతిధి.. నచ్చినందుకు అందరికి ధన్యవాదములు
బాలు .. ఓ..మంచి పాట ని మర్చి పోకుండా ..ఇలా పరిచయం..
@నాగేస్రావు గారు పాట నచ్చినందుకు... నా వ్యాఖ్యానం మెచ్చినందుకు ధన్యవాదములు.
@శ్రేయాభిలాషి గారు.. ధన్యవాదములు.
@జ్యోతిర్మయి గారు.. ఆస్వాదన ..యెంత గొప్పదైతే..అన్ని మేలి ముత్యాలు దొరుకుతాయి కదా!
@శశి కళ.. మెచ్చినందులకు.. రెట్టింపు ధన్యవాదములు పుచ్చుకొనుడు.
@సుభ..గారు.. బోలెడన్ని థాంక్ యూలు
ఇలా చెప్పటానికి మీకు. కాస్త ఆలస్యంగా వస్తాను.. మన్నిస్తారుగా ?అర్ధం చేసుకొని..ప్లీజ్!!
రాజీ.. మీరు పరిచయం చేస్తున్న పాటల ముందు.. నేనెంత.. !? మీ బాటే..అప్పుడప్పుdu నా బాట. ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి